షిర్డీ-కాకినాడ రైల్లో అర్ధరాత్రి అసలేం జరిగింది? బాధితులు ఏం చెప్పారంటే.. | Passengers Reacted To The Robbery In Shirdi Kakinada Train | Sakshi
Sakshi News home page

షిర్డీ-కాకినాడ రైల్లో అర్ధరాత్రి అసలేం జరిగింది? బాధితులు ఏం చెప్పారంటే..

Published Fri, Jul 26 2024 5:34 PM | Last Updated on Fri, Jul 26 2024 6:36 PM

Passengers Reacted To The Robbery In Shirdi Kakinada Train

సాక్షి, ఖమ్మం జిల్లా: దొంగల బీభత్సం సృష్టించిన  షిర్డీ సాయి నగర్ టూ కాకినాడ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకుంది. సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో  దోపిడీ జరిగినట్లు బాధితులు చెబుతున్నాయి. 30 మందికి పైగా బాధితుల లగేజీ బ్యాగ్‌లు, మని పర్సులు.. మొబైల్ ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 30 లక్షల విలువ చోరీ అయినట్టు సమాచారం.

బి3,బి4,బి5 ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు నిద్రలో  ఉండగా దోపిడీ జరిగింది. పర్భని దగ్గర జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు పర్ని బైదనాడ్ స్టేషన్ వద్ద ప్రయాణికులు తమ వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఒకటి తర్వాత ఒకరు తమ వస్తువులు పోయాయంటూ కోచ్‌లో ఆందోళన దిగారు..

రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. మరికొందరు ఖమ్మం జీఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement