గిరిజన వర్సిటీ కావాలని.. | Police Lathi Charge On Students During Maha Dharna In Adilabad District | Sakshi
Sakshi News home page

గిరిజన వర్సిటీ కావాలని..

Published Tue, Jan 4 2022 4:16 AM | Last Updated on Tue, Jan 4 2022 8:31 AM

Police Lathi Charge On Students During Maha Dharna In Adilabad District - Sakshi

కలెక్టర్‌ వాహనాన్ని అడ్డుకుంటున్న విద్యార్థి సంఘాల నాయకులు  

ఆదిలాబాద్‌టౌన్‌: గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆదిలాబాద్‌లో సోమవారం చేపట్టిన మహాధర్నాలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ధర్నాలో భాగంగా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ వాహనాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు.

పోలీసులు నచ్చజెప్పినా విద్యార్థి నేతలు మాట వినకపోవడంతో లాఠీచార్జికి దిగారు. అప్పటికే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నా రు. ఆయన ఆదేశాల మేరకు ఆందోళనకారులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement