పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య తగ్గుతున్న ‘డిజిటల్‌ డివైడ్‌’ | Revealed in the NSS survey: Telangana | Sakshi
Sakshi News home page

పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య తగ్గుతున్న ‘డిజిటల్‌ డివైడ్‌’

Published Sat, Oct 12 2024 6:13 AM | Last Updated on Sat, Oct 12 2024 6:13 AM

Revealed in the NSS survey: Telangana

అందరికీ అందుబాటులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే కారణం  

భారత్‌లో 95.1 శాతం 

కుటుంబాలకు టెలిఫోన్‌/ మొబైల్‌  

ఇంటర్నెట్‌ వాడేస్తున్న పట్టణ యువత 92, గ్రామీణ యువత 82 శాతం  

ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న ‘డిజిటల్‌ డివైడ్‌ ’అనేది క్రమంగా తగ్గుతోంది. రోజువారీ జీవన విధానం, అలవాట్లలో వచ్చిన మార్పులుచేర్పులతోపాటు అందరికీ ఆధునిక సాంకేతిక పరిజాŠక్షనం అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం. డిజిటల్‌ విప్లవం అనేది వివిధ రూపాల్లో విస్తరించడంతో అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్‌ సౌకర్యాలు మెరుగుపడడంతోపాటు స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్‌ గాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి.

దీంతో ఆధునిక సాంకేతికతను పట్టణ, గ్రామీణ తేడాలు లేకుండా ఉపయోగించుకోగలుగుతున్నారు. 95.1 శాతం కుటుంబాలు (గ్రామీణ ప్రాంతాల్లో 94.2 శాతం, పట్టణాల్లో 97.1 శాతం) టెలిఫోన్‌/ మొబైల్‌ సౌకర్యాలు కలిగి ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. గతంతో పోలి్చతే..ఇది మెరుగైన పరిస్థితి కాగా, మొబైల్‌ టెక్నాలజీ వినియోగంలో రాబోయే రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్యఉన్న చిన్న వ్యత్యాసం కూడా చెరిగిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

79వ రౌండ్‌ నేషనల్‌ నేషనల్‌ శాంపిల్‌ సర్వే 
తాజాగా 79వ రౌండ్‌ నేషనల్‌ నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌)లో భాగంగా 2022 జూలై నుంచి 2023 జూన్‌ మధ్య కాలంలో మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించిన కాంప్రహెన్సివ్‌ అన్యూవల్‌ మాడ్యువల్‌ సర్వేలో అనేక అంశాలు, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండమాన్, నికోబార్‌లోని కొన్ని గ్రామాల్లో మినహా దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా మొత్తం 3,02,086 కుటుంబాలను (గ్రామీణ ప్రాంతాల్లో 1,73,096, పట్టణ ప్రాంతాల్లో 1,28,990) కలిశారు. మొత్తంగా 12,99,988 (గ్రామాల్లో 7,85,246 మంది, పట్టణాల్లో 5,14,742 మంది) మంది నుంచి వివరాలు సేకరించారు.

మొబైల్, ఇంటర్నెట్‌ వినియోగం, ఐసీటీ స్కిల్స్, ఔట్‌ ఆఫ్‌ ప్యాకేట్‌ మెడికల్‌ ఎక్స్‌పెండీచర్, విద్య తదితర అంశాలపై ఈ సర్వే జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా 95.7 శాతం గ్రామీణ యువత (పట్టణాల్లో 97 శాతం) మొబైల్‌ ఫోన్లు వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. 15–25 ఏళ్ల మధ్యనున్న గ్రామీణ యువత 82 శాతం (పట్టణాల్లో 92 శాతం) ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు.  

సర్వేలోని ముఖ్యాంశాలు  
 15–24 ఏజ్‌ గ్రూప్‌లో 78.4 శాతం యువత అటాచ్డ్‌ఫైల్స్‌తో మెసేజ్‌ పంపగలుగుతున్నారు. ఈ వయసులోని వారే 96.9 శాతం (వీరితో పురుషులు 97.8%, మహిళలు 95.9%) చదవడం, రాయడంతో పాటు సాధారణ 
 గణాంకాలు చేస్తున్నారు. 71.2 శాతం మంది కాపీ అండ్‌ పేస్ట్‌ టూల్స్‌ వినియోగిస్తున్నారు. 26.8 శాతం మాత్రమే ఆన్‌లైన్‌ సెర్చ్, 

ఈ–మెయిల్స్‌  పంపడం, ఆన్‌లైన్‌ బ్యాంక్‌ నిర్వహణ చేయగలుగుతున్నారు. దేశంలో 9.9 శాతం కుటుంబాలకు (పట్టణ ప్రాంతాల్లో 21.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతం) డెస్‌్కటాప్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు కలిగి ఉన్నారు. 
 18 ఏళ్లకు పైబడిన వారిలో 94.6 శాతం మందికి వ్యక్తిగత, ఉమ్మడి బ్యాంక్‌ ఖాతా, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూట్స్‌లో అకౌంట్, మొబైల్‌ మనీ సరీ్వస్‌ ప్రొవైడర్‌ ఖాతా కలిగి ఉన్నారు. 
  తాము నివసిస్తున్న ప్రాంతాల నుంచి 500 మీటర్లలోపు దూరంలోనే లోకెపాసిటీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (బస్సు,కారు, టాక్సీ, ఆటో వంటివి) సౌకర్యాలు 93.7 శాతం పట్టణ ప్రాంత జనాభాకు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement