
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం 4570 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 18 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది.
ఒక్కరోజులో కరోనా నుంచి 13 కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 95 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు.