
సాక్షి, హైదరాబాద్: మాజీ జడ్జి, రచయిత మంగారి రాజేందర్ (జింబో) ‘పోలీసు అధికారాలు–సమన్యాయ పాలన– ఎన్‌కౌంటర్ మరణాలు’ అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీని ప్రకటించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన మంగారి రాజేందర్ జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు. కవిత్వం, కథలతోపాటు, యాభై వరకు ‘లా’ పుస్తకాలను తెలుగులో అనువదించారు. లా సంబంధిత వ్యాసాలు రాశారు. ప్రజలకు అర్థమయ్యేలా కోర్టు తీర్పులను తెలుగులో వెలువరించారు. ‘మా వేములవాడ కథలు, జింబో’ కథలతో తనదైన ముద్ర వేశారు.