అంపశయ్యపై | - | Sakshi
Sakshi News home page

అంపశయ్యపై

Published Mon, Apr 28 2025 12:37 AM | Last Updated on Mon, Apr 28 2025 12:37 AM

అంపశయ

అంపశయ్యపై

ప్రజారోగ్య పరిరక్షణను గాలికొదిలేసిన ప్రభుత్వం
● ఏడు నెలలుగా వేధిస్తున్న మందుల కొరత ● పూర్తిగా పడకేసిన పారిశుద్ధ్యం ● పట్టించుకోని అధికార యంత్రాంగం ● ఖాళీ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యం

సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

జిల్లా సమాచారం

జిల్లా ఆస్పత్రి రుయా

రోజువారీ ఓపీలు సుమారు 1,200

ఏరియా వైద్యశాలలు 2

ఓపీలు సుమారు 200

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు 26

ఓపీలు సుమారు 90

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు 60

ఓపీలు సుమారు 150

మందుల సరఫరా చేయాల్సిన సంస్థ

ఏపీఎమ్‌ఎస్‌ఐడీసీ

అందించాల్సిన మందుల రకాలు 713

ప్రస్తుతం సరఫరా చేస్తున్నవి 320

అరకొరగా వైద్యసేవలు.. అందుబాటులో లేని మందులు.. వివిధ విభాగాల్లో వేధిస్తున్న సిబ్బంది కొరత.. రోగులకు సకాలంలో అందని చికిత్సలు.. ప్రజారోగ్య పరిరక్షణను పట్టించుకోని అధికారులు.. చివరకు పేదల ప్రాణాలను గాలికివదిలేసిన సర్కారు తీరుతో ప్రభుత్వాస్పత్రులు అంపశయ్యపై చేరుకున్నాయి. నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమయ్యాయి. అపరిశుభ్ర వాతావరణంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో దయనీయంగా తయారయ్యాయి. చివరకు ప్రభుత్వాస్పత్రికి రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు దాపురించాయి.

నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌

తిరుపతి అర్బన్‌: కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌తోపాటు పలువురు జిల్లా అధికారులు గ్రీవెన్స్‌లో అందుబాటులో ఉండనున్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.

ఇండోనేషియా వర్సిటీతో ఎస్వీయూ ఒప్పందం

తిరుపతి సిటీ: ఇండోనేషియా బాండుంగ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యూనివర్సిటీతో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పలు అంశాలపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బోధన, పరిశోధన రంగాల్లో రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం అంది పుచ్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం వర్సిటీలో ఇండోనేషియా యూనివర్సిటీ ప్రతినిధులు డాక్టర్‌ మిత్ర డి జమల్‌ బృందంతో ఎస్వీయూ వీసీ, రిజిస్ట్రార్‌, అధ్యాపకులు సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు నేతృత్వంలో జూలైలో ఇండోనేషియాలో ఎస్వీయూ ప్రతినిధుల బృందం పర్యటించనుంది. మాజీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ సీకే జయశంకర్‌, ఫిజిక్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ బీ.దేవప్రసాదరాజు, ఇంటర్నేషనల్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.కిషోర్‌ బృందం ఇండోనేషియాలో పర్యటించనుంది.

నేటి నుంచి డిగ్రీ పరీక్షలు

తిరుపతి సిటీ: గత ఏడాది అటానమస్‌ హోదా పొందిన టీటీడీ కళాశాలల్లో సోమవారం నుంచి డిగ్రీ రెండవ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, పద్మావతి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో ప్రిన్సిపాళ్లు పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు మూడు వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు వచ్చే నెల 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

పలువురు సీఐల బదిలీ

తిరుపతి క్రైమ్‌ : జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గాజులమండ్యం సీఐ మురళీకృష్ణ, శ్రీకాళహస్తి టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు, రేణిగుంట సీఐ శరత్‌చంద్రను వీఆర్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి టూటౌన్‌కు నాగార్జున రెడ్డి, ఏర్పేడు సీఐ జయచంద్రను రేణిగుంట సీఐగా బదిలీ చేశారు. అలాగే డీఐజీ వీఆర్‌లో ఉన్న సీఐ మంజునాథను ఎస్పీ వీఆర్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తిరుపతి తుడా : జిల్లాలో పెద్దాస్పత్రి రుయాతో పాటు పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గడచిన ఏడు నెలలుగా ఇదే పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది. అవసరాలకు తగ్గట్టు మందులు సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చిన్న పాటి దగ్గు మందు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేవంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా 713 రకాల మందులను ఆస్పత్రులకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కేవలం 320 రకాల మందులను మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పపేదల రోగులకు మందుల కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. దీనికితోడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇటీవల పీఎం జన ఔషధి ద్వారా ఓ ఏజెన్సీకి మందుల సరఫరా బాధ్యతలు అప్పగించారు. సదరు సంస్థకు పూర్తిస్థాయిలో మందులు అందించే సామర్థ్యం లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఖాళీగా పోస్టులు

జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రధానంగా రుయాలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎస్వీ మెడికల్‌ కళాశాల పరిధిలో రుయా, చిన్నపిల్లల ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రులు నడుస్తున్నాయి. ఇందులో ప్రొఫెసర్లు 68మందికి గాను కేవలం 53మంది మాత్రమే ఉన్నాయి. 67మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు గాను, 59మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 223మంది అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లకు గాను 185మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే వంద మందికి పైగా నర్సుల అవసరముంది. రుయాలో హెడ్‌ నర్సు, స్టాఫ్‌ నర్సులు 517మందికి గాను ప్రస్తుతం కేవలం 382మంది మాత్రమే పనిచేస్తున్నారు. 135 నర్సింగ్‌ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాల్సి ఉంది. అలానే రోగుల సహాయార్థం పనిచేయాల్సిన ఎఫ్‌ఎన్‌ఓ, ఎమ్‌ఎన్‌ఓల కొరత తీవ్రంగా ఉంది. మరో 120 మందిని తీసుకోవాలని ప్రతిపాధనలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.

తరిమేస్తున్నారు

ఇంత పెద్ద రుయా ఆస్పత్రిలో థైరాయిడ్‌ పరీక్ష చేయలేమంటున్నారు. పదిరోజుల తర్వాత రమ్మని తరిమేస్తున్నారు. తిరుచానూరు నుంచి ఆటోలో రానుపోనూ రూ.300 ఖర్చు చేయాల్సి వచ్చింది. థైరాయిడ్‌ పరీక్షకోసం పరగడపున ఇంత దూరం వస్తే తీరా టెస్ట్‌ చేయకుండానే వెనక్కి పంపేశారు. మా అమ్మకు కాళ్లు వాచాయని వస్తే 5రకాల మందులు రాశారు. ఇందులో రెండు రకాలు బయట తీసుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు. – పి.రేఖ, తిరుచానూరు

బయట తీసుకోమంటున్నారు

మా అమ్మ పెరాలసిస్‌తో బాధపడుతోంది. గత ఏడాది నుంచి రుయాలోనే చూపించుకుంటున్నాం. వైద్యులు పరీక్షించి మందులు రాశారు. ఐదురకాల మందులు రాస్తే కేవలం రెండు రకాలు ఇచ్చి మరో రెండు బయట ప్రైవేటు షాపులో కొనుక్కోమన్నారు. అలానే నరాల వ్యాధికి మందులు కూడా లేవన్నారు. పేదవాళ్ల అంత డబ్బు పెట్టి మందులు ఎలా కొనుక్కోవాలో అర్థం కావడంలేదు. – చెంచయ్య, రోగి కుమారుడు

దారుణంగా ఉంది

రుయా ల్యాబ్‌లో ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌, రక్త పరీక్షల రిపోర్టులు సకాలంలో అందించడం లేదు. నా భర్తకు గుండెకు సంబంధించి ఎక్స్‌రే తీయించాం. త్వరగా ఇవ్వండి సారూ...అంటూ బ్రతిమలాడినా పట్టించుకోవడం లేదు. డాక్టర్లు రిపోర్టులు వచ్చాకా తీసుకుని రండి అంటున్నారు. అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాం. రిపోర్టులు వచ్చేందుకు ఇంకా రెండు రోజులు పట్టేటట్లు ఉంది. ఊరికి వెళ్లి మళ్లీ రావాల్సిందే. వ్యయప్రయాసలు తప్పడం లేదు. – సుబ్బమ్మ, రోగి భార్య

అధ్వాన్నంగా పారిశుద్ధ్యం

తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కళాశాల, రుయా, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులతోపాటు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. బయో మెడికల్‌ వేస్ట్‌ ప్రమాదకరంగా డంపింగ్‌ చేశారు. కార్మికుల చేత మాన్యువల్‌ గానే పనులు చేస్తున్నారు. బ్లీచింగ్‌ చల్లడమే వదిలేశారు. కలెక్టర్‌ సైతం ఇటీవల ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య లోపంపై కన్నెర్ర చేశారు.

వైద్యం కోసం రుయాలో బారులు తీరిన రోగులు

– 8లో

న్యూస్‌రీల్‌

నాడు సక్రమంగా సేవలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్యరంగాన్ని బలోపేతం చేసింది. కార్పొరేట్‌ ఆస్పత్రులతో సమానంగా గ్రామీణ వైద్య కేంద్రాలను సైతం పటిష్టం చేసింది. పూర్తిస్థాయిలో మందులు, వైద్యులను, సిబ్బందిని అందుబాటులో ఉంచింది. మందుల కొరత అన్నమాటే తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో ఇంటింటికీ వైద్యసేవలను అందించింది. ఈ క్రమంలోనే 3వేల వ్యాధులను ఆరోగ్య శ్రీలో చేర్చి రూ.25లక్షల వరకు ఖర్చును ప్రభుత్వమే భరించేలా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా కూటమి సర్కారు వ్యవహరిస్తోంది. కార్పొరేట్‌ హాస్పిటళ్లకు కొమ్ముకాసేలా కుట్రపూరితంగా నిర్ణయాలు తీసుకుంటోంది.

అంపశయ్యపై1
1/10

అంపశయ్యపై

అంపశయ్యపై2
2/10

అంపశయ్యపై

అంపశయ్యపై3
3/10

అంపశయ్యపై

అంపశయ్యపై4
4/10

అంపశయ్యపై

అంపశయ్యపై5
5/10

అంపశయ్యపై

అంపశయ్యపై6
6/10

అంపశయ్యపై

అంపశయ్యపై7
7/10

అంపశయ్యపై

అంపశయ్యపై8
8/10

అంపశయ్యపై

అంపశయ్యపై9
9/10

అంపశయ్యపై

అంపశయ్యపై10
10/10

అంపశయ్యపై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement