Tirupati District News
-
ఆధునిక కాలానికి సంస్కృతం అవసరం
తిరుపతి సిటీ: ఆధునిక కాలానికి సంస్కృత భాష ఎంతో అవసరమని, భాష ఆవశ్యకతను భవిష్యత్తు తరాలకు పెద్ద ఎత్తున తెలియజేయాల్సిన అవసరం ఉందని అఖిల భారతీయ సంఘ కార్యవాహ్ సురేష్ సోని అభిప్రాయపడ్డారు. జాతీయ సంస్కృత వర్సిటీ, సంస్కృత భారతి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న స్ఫూర్తి సంఘమం కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సంస్కృతాన్ని ప్రతి ఒక్కరూ చదువుకుని, అందులోని జ్ఞానాన్ని పొందాలని సూచించారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడు తూ భవిష్యత్తులో సంస్కృత భాషను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృత భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు వర్సిటీ తన వంతు కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్కృత భారతి అఖిల భారతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపబంధు మిశ్రా, కేంద్రియ సంస్కృత వర్సిటీ వీసీ ప్రొఫెసర్ శ్రీవాస వార్కేడి, డాక్టర్ ఎంజీ నందన్‌రావు, డాక్టర్ ఎస్ఎల్ సీతారాం శర్మ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జిల్లా జడ్జి అరుణ సారిక ఉన్నారు.స్థానిక వర్సిటీల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం విదేశీవిద్యకు ఆంక్షలు విధించడంతో స్వదేశంలోనే ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్థు లు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది పీజీ సెట్లకు సైతం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మెరిట్ స్టూడెంట్లు స్వదేశీ విద్యనభ్యసిస్తే విద్యారంగంలో పరిశోధనలు కొత్త పుంతలు తొ క్కే అవకాశం ఉంటుంది. ఎస్వీయూలో కొత్తగా ప్రవేశ పెట్టిన ఎంఎస్ డేటా అనలాసిస్, ఏఐ వంటి కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏలోనూ అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. –సీహెచ్ అప్పారావు, వీసీ, ఎస్వీయూ ఎన్ఈపీతో ఉద్యోగావకాశాలు మెండు నూతన విద్యావిధానంతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. విదేశీ విద్య తో సమానంగా స్వ దేశంలోనూ పలు వర్సిటీల్లో ప్రొఫెషనల్ కోర్సుల్లో అంతర్జాతీయ స్థా యి సిలబస్ అమలులో ఉంది. రూ.లక్షలు ఖ ర్చు పెట్టి విదేశీ విద్య కోసం ప్రయత్నించడం కంటే ఎన్ఈపీ విధానం అమలులో ఉన్న వర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసించడం ఎంతో ఉత్తమం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మెరుగుపడడంతో విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎఫ్1 వీసా కఠినతరంతో ఈ ఏడాది వర్సిటీల్లో అన్ని పీజీ కోర్సులకు అడ్మిషన్లు పెరగనున్నాయి. –ప్రొఫెసర్ పద్మావతమ్మ, ప్రిన్సిపల్, సైన్స్ కళాశాల, ఎస్వీయూ – 8లో -
జలాశయం.. నిరాశమయం
అరణియార్ ఆధునికీకరణ పనులు ముందుకు సాగడం లేదు. జలాశయం అభివృద్ధి సాగక పోడంతో రైతుల్లో నిరాశ నెలకొంది.సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లో‘తిరుపతికి చెందిన రవిచంద్ర పేరొందిన ఇంజినీరింగ్ కళాశాలలో గత ఏడాది బీటెక్ పూర్తి చేశాడు. ఎలాగైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాలో పీజీ చేయాలన్న చిరకాల కోరికతో ఏడాది కాలం ఆర్థిక వనరులతోపాటు వీసా ప్రయత్నాలు చేసుకుని సన్నద్ధమయ్యాడు. ఈ ఏడాది ఽఎఫ్1 వీసాకు దరఖాస్తు చేసుకుని ఎంతో ఖర్చు పెట్టాడు. కానీ నిరాశ మిగిలింది. వీసాకు అనర్హుడంటూ ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది. దీంతో పీజీ సెట్‌కు దరఖాస్తు చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టాడు.’ విదేశీ విద్య నేటి విద్యార్థుల కల. ట్రంప్ కఠిన నిబంధనలు..వీసాలపై ఆంక్షలు.. అనర్హులని తిరస్కరణ.. పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశాలలేమి.. ఆర్థిక సమస్యలు.. ఇంత కష్టపడినా విద్యకు దక్కని భరోసాతో అది యువతకు ఎండమావిగా మారింది. వెరసి.. విద్యార్థిలోకం విదేశీ విద్య వద్దు... స్వదేశీ విద్యే ముద్దు అంటూ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పలు కోర్సులు చేయడానికి మొగ్గు చూపుతోంది. ఫలితంగా పలు ప్రవేశపరీక్షలకు దరఖాస్తుల సంఖ్య పదిరెట్లు పెరిగింది. తిరుపతి సిటీ: ట్రంప్ అన్నంత పని చేశాడు..స్టూడెంట్స్ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంతో పాటు యూఎస్ఏలో విద్యనభ్యసిస్తున్న ఇండియన్ విద్యార్థులపై ఆంక్షలు విధించి ఇంటికి పంపుతున్నాడు. దీంతో 2025–2026 విద్యాసంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కలలు కన్న తెలుగు విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. దీంతో స్వదేశీ విద్యకు డిమాండ్ పెరిగింది. ఇటీవల రాష్ట్రంలోని పలు వర్సిటీలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. దీంతో పీజీ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు విద్యార్థులు ఎగబడుతున్నారు. గత ఏడాదికంటే పీజీ సెట్లకు దరఖాస్తులు పదిరెట్లు పెరిగాయి. విదేశీ విద్యపై మొగ్గు చూపని విద్యార్థులు తిరుపతి జిల్లా నుంచి గత ఏడాది విదేశీ విద్య కోసం సుమారు 9,871 మంది ఎఫ్1 వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 6,245 మంది విద్యార్థులు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లోని పలు వర్సిటీలలో వీసా సాధించి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. కానీ ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా కేవలం ఇప్పటివరకు ఎఫ్1 వీసా కోసం కేవలం 761 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రొఫెషనల్ కోర్సులకు దరఖాస్తుల వెల్లువ అమెరికా ఆశలపై నీళ్లు చల్లారు తిరుపతిలో బీటెక్ పూర్తి చేశా. అమెరికాలో ఎంఎస్ చేయాలనే కోరిక ఉండేది. అమెరికా వెళ్లి ఎంఎస్ పూ ర్తి చేసి, అక్కడే గ్రీన్‌కార్డు సాధించాలనే కోరిక ఉండేది. కానీ ట్రంప్ విధించిన ఆంక్షలతో వీసాకు దరఖాస్తు చేసుకున్నా టోఫెల్‌తోపాటు ఇంటర్వ్యూ పూర్తి చేశా. కానీ ఎలిజిబిలిటీ రాలేదు. దీంతో ఎస్వీయూలో ఎంబీఏ చేసేందుకు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్నా. –ప్రదీప్‌కుమార్, విద్యార్థి, తిరుపతి – 8లోన్యూస్రీల్25 శాతం సీట్లు పేదలకు ఇవ్వాల్సిందే తిరుపతి అర్బన్: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు పేదలకు ఇవ్వా ల్సిందే డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉచిత నిర్భంధ విద్యాహక్కుచట్టాన్ని 2025–26 నుంచే అమ లు చేస్తున్నామన్నారు. 2009 సెక్షన్ 12(1)(ఇ) అనుసరించి 2025–26 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు అమలు చే యాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని స్పష్టం చేశారు. 25 శాతం సీట్లు కేటాయించా ల్సి ఉంటుందన్నారు. అనాథ పిల్లలు, హెచ్ఐ వీ బాధితులకు చెందిన పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం సీట్లు, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, మైనారిటీ, ఓసీలకు చెందిన పేదలకు 6 శాతం సీట్లు ఇవ్వాలన్నారు. గ్రా మీణప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.44 లక్షలలోపు ఉన్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆ మేరకు ప్రైవేటు స్కూళ్ల యా జమాన్యం ఈ నెల 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించారు. అలాగే ఉచిత నిర్బంధ విద్యాహక్కుచట్టం అర్హులైన తల్లిదండ్రులు ఈ నెల 28 నుంచి వచ్చే మే నెల 15 లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఫిజికల్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని టీచర్లు సాధారణ బదిలీల్లో మెడికల్ గ్రౌండ్స్‌లో ప్రెపరెన్షియల్ కేటగిరీకి దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజికల్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని చిత్తూరు డీఈఓ వరలక్ష్మి తెలి పారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రెపరెన్షియల్ కేటగిరీ టీచర్లు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు తిరుపతి జిల్లా కేంద్రంలోని రుయాలో నిర్వహించే ఫిజికల్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలన్నారు. ప్రెపరెన్షియల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకోవాలనుకునే టీచర్లు సంబంధిత డీడీఓలు నిర్ధేశించిన నమూనాలో తగి న ఆధారాలు జత చేసి తిరుపతి డీఈఓ కా ర్యాలయంలో ఈనెల 23వ తేదీలోపు అందజేయాలని కోరారు. విదేశీ విద్యపై మొగ్గు చూపని యువత ట్రంప్ కఠిన నిబంధనలతో విద్యార్థిలోకం బెంబేలు పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు దరఖాస్తుల వెల్లువ ఐసెట్, ఏపీఈసెట్‌కు పదిరెట్లు పెరిగిన అప్లికేషన్లు ఎఫ్1 వీసాల ఆంక్షలతో వెనుకడుగు ప్రధానంగా ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉన్నా ఆమెరికాలో ఎంఎస్, ఎంటెక్, మెడికల్, పీజీ కోర్సులు చేయాలనే ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ట్రంప్ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారు. కఠిన నిబంధనలు విధించడంతో జిల్లాలో ఈ ఏడాది విదేశాల్లో విద్యాభ్యాసానికి వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారు 40 శాతం కూడా లేదని అమెరికన్ రాయబార కార్యాలయం తేల్చిచెప్పడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న వారిలోనూ 50 శాతం మంది విద్యార్థులను పలు సాకులు చూపించి (ఎఫ్1) స్టూడెంట్ వీసాలకు అర్హులు కాదని ముద్ర వేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపి వీసా కచ్చితం అనుకున్న విద్యార్థులకు సైతం ఏదో రూపంలో వీసాకు అన్‌ఫిట్ అంటూ ముద్రవేస్తున్నారు. దీంతో విదేశీ విద్యపై విద్యార్థులు వెనుకడుగువేస్తున్నారు. జిల్లాలోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్ కో ర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఐసెట్, ఏపీఈ సెట్, పీజీసెట్లకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా యి. గత ఏడాది ఏపీఈసెట్‌కు 3వేలకు మించని దరఖాస్తులు ఈ ఏడాది 30 వేల పైచిలుకు వచ్చా యి. దీంతోపాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నిర్వహించనున్న ఐసెట్‌కు సైతం అదే తరహాలో దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత వి ద్యకు ఈ ఏడాది ఎస్వీయూ, మహిళా వర్సిటీల్లో పోటీ ఎక్కువగా ఉంటుందని, కటాఫ్ మార్కులు సైతం ఊహించని రీతిలో ఉంటాయని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. పీజీసెట్లకు పెరుగుతున్న దరఖాస్తులు పీజీ సెట్ పరీక్షలకు గత ఏ డాది కంటే ఈసారి దరఖాస్తు ల సంఖ్య పెరుగుతోంది. ట్రంప్ ఎఫెక్ట్ విదేశీ విద్యపై పెద్ద ప్రభావం చూపుతోంది. పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు ఇప్పటికే ఊహించని రీతిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఏపీ ఈ సెట్ గడువు ముగిసింది. గత ఏడాది 3,500 దర ఖాస్తులు రాగా ఈ ఏడాది 35 వేలకు మించడం ఊహించని పరిణామం. –ప్రొఫెసర్ సురేంద్ర బాబు, కో కన్వీనర్, ఏపీ పీజీసెట్, ఎస్వీయూ ఐసెట్‌కు దరఖాస్తు చేశా.. యూఎస్‌లో ఎంఎస్ చే యాలన్నది నా కల. కానీ ట్రంప్ ఆంక్షలతో భయమేస్తోంది. అక్కడ చదువుతు న్న మా బంధువుల పిల్ల లు సైతం ఇక్కడికి రావదని చెబుతున్నారు. దీంతో మా తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఎంసీఏ చేయడం కోసం ఐసెట్‌కు దరఖాస్తు చేశా. ఇక్కడే మంచి వర్సిటీలో ఎంసీఏలో చేరి పేరొందిన పరిశ్రమలో ఉద్యోగం సాధిస్తా. –ప్రియాంక, విద్యార్థిని, తిరుపతి -
క్షేత్రం..జన సంద్రం
● శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల ఆదివారం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. టీటీడీ కూడా దీనికి తగినట్టుగా ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం చోటు చేసుకోకుండా భక్తులకు పాలు, పులిహోర వంటివి నిరంతరం పంపిణీ చేస్తోంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 78,821 మంది స్వామివారిని దర్శించుకోగా 33,568 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.36 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. క్యూలో భక్తులకు కుచ్చుటోపీ శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు స్థానిక చిరువ్యాపారులు భక్తులకు తినుబండాలను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. క్యూలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిని అరికట్టాల్సిన విజిలెన్స్ సిబ్బంది మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం గమనార్హం. నారాయణగిరి షెడ్లలో అదనపు ఈఓ తనిఖీలు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ఉదయం తనిఖీ చేశారు. క్యూలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు రాజేంద్ర, హరీంద్రనాథ్, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు. -
● బాబు జన్మదిన కానుకగా నోటిఫికేషన్ ● దళితులకు, బీసీలకు ఇచ్చే ఉచిత శిక్షణపై మండిపాటు ● తొలిసారిగా సీబీటీ విధానంలో పరీక్షలంటూ మెలిక ● జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం ప్రాథమిక పాఠశాలలు 3,766ప్రాథమికోన్నత పాఠశాలలు 444 ఉన్నత పాఠశాలలు 705ఉమ్మడి జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చిత్తూరు కలెక్టరేట్ : అధికారంలోకి రాగానే డీఎస్సీ పరీక్షను నిర్వహిస్తామంటూ గత ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు మెగా డీఎస్సీ పరీక్ష ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అయితే పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయకుండా నెలల తరబడి సాగదీశారు. చివరికి క్షేత్ర స్థాయిలో నిరుద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. తాజాగా ఈనెల 20న చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్భాటంగా నోటిఫికేషన్‌ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. కాగా సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ మెలిక పెట్టడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. నిధులను కాజేసేందుకేనా.. సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించాలంటే అందుకు సరిపడే సౌకర్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో లేవు. ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ఇంజినీరింగ్, మరికొన్ని కంప్యూటర్ కేంద్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ కేంద్రాల్లో సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణకు రూ.కోట్ల కొద్ది బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. అదే పాత విధానంలో ఒకే రోజు డీఎస్సీ పరీక్షను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల కేంద్రాల్లో నిర్వహిస్తే ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో సరిపోయేది. అలా కాకుండా డీఎస్సీ పరీక్షను నెల రోజుల పాటు ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించి నిధులను నొక్కేసేందుకు ప్రణాళిక రచించినట్లు విమర్శలున్నాయి. మొక్కుబడిగా ఉచిత శిక్షణలు డీఎస్సీ పరీక్షకు ఉచిత కోచింగ్ హామీ ప్రకారం నోటిఫికేషన్‌కు కనీసం అయిదు నెలల ముందు శిక్షణ ఇచ్చి ఉంటే నిరుద్యోగులకు ఉపయోగం ఉండేది. ఉచిత కోచింగ్ అంటూ ప్రచారం చేసిందే తప్ప శిక్షణ ఇచ్చిన పాపాన పోలేదు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ప్రారంభించినప్పటికీ 5 మంది అభ్యర్థులు కూడా లేరు. ఎస్సీ అభ్యర్థులకు ఇటీవలే శిక్షణ ప్రారంభించారు. శిక్షణ కేంద్రాల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు లేకపోవడంతో అభ్యర్థులు ఉచిత శిక్షణ పై నమ్మకం లేక ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఉచిత శిక్షణ లోనూ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించింది. పరీక్షలు నెలరోజులా.. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో వివిధ కేడర్లలో 1,473 పోస్టులను భర్తీ చేయనున్నారు. అధికంగా ఎస్జీటీ పోస్టులు 979 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో 499 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దళితులను మోసగించింది ఉచిత డీఎస్సీ శిక్షణ ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం దళితులను మోసగించింది. దూర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి రొడ్డెక్కేలా చేసింది. ప్రణాళిక ప్రకారం ఎస్సీ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇప్పించడంలోప్రభుత్వం విఫలమైంది. – నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఇబ్బంది పెట్టడం సరికాదు డీఎస్సీ నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదు. మెగా డీఎస్సీ నిర్వహించడం హర్షణీయమే. ప్రమాణ స్వీకారం రోజున సంతకం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకు పది నెలలకు పైగానే సమయం పట్టింది. అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉచిత శిక్షణ సక్రమంగా ఇచ్చారా అంటే అదీ లేదు. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి డీఎస్సీ పరీక్షను ఈసారి తొలిసారిగా సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో తెలియజేశారు. సీబీటీ విధానం ప్రకారం పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. గతంలో ఒక్క రోజులోనే డీఎస్సీ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేవారు. ఉద్ధేశపూర్వకంగా ఏదో ఒక మెలిక పెట్టాలనే ఇలా నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. -
ఓం శుపథం మల్టీ స్పెషాలిటీ ఆసస్పత్రి ప్రారంభం
తిరుపతి తుడా: స్థానిక భవానీ నగర్లో ఆదివారం ఓం శుపథం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని అతిథులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డి, వన్నెకుల క్షత్రియ సంఘం చైర్మన్ సీఆర్ రాజన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్, మేయర్ డాక్టర్ శిరీష ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఎండీ డాక్టర్ టి విఠల్మోహన్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అర్థోపెడిక్, జనరల్ సర్జరీ, గైనిక్ మెటర్నటీ, జనరల్ మెడిసన్, ఫిజియోథెరఫీ తదితర సౌకర్యాలు ఆస్పత్రిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, డాక్టర్ కే సుభాషిణి, వైద్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. -
● స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు ● శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో రెచ్చిపోతున్న పచ్చనేతలు ● తమ పరిధి కాదంటూ తప్పుకుంటున్న తహసీల్దార్లు
రేణిగుంట/ శ్రీకాళహస్తి : టీడీపీ నేతల ధనదాహానికి స్వర్ణముఖి నది కుదేలవుతోంది. ఇసుకాసురుల చెరలో చిక్కి శల్యమవుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం శ్రీకాళహస్తి మండలం సుబ్బానాయుడు కండ్రిగ, ఏర్పేడు మండలం ముసలిపేడు పరిసరాల్లో ఫ్లై ఓవర్ వంతెన కింద స్వర్ణముఖి నదిలో తెల్లవారుజాము నుంచే జేసీబీలతో ఇసుకను తోడి ట్రాక్టర్లలో తరలించారు. టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతోనే స్థానిక నేతలు ఇసుకను తోడేస్తున్నట్లు గ్రామస్తులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో శ్రీకాళహస్తి, ఏర్పేడు తహసీల్దార్లు అది తమ పరిది కాదని కాలయాపన చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఇసుక అక్రమ రవాణా మాత్రం నిరాటంకంగా కొనసాగడం గమనార్హం. రెచ్చిపోతున్న పచ్చతోడేళ్లు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొంతకాలంగా తొట్టంబేడు మండలం పెన్నలపాడు, విరూపాక్షిపురంలో ఇసుక తరలించేవారు. అక్కడి ప్రజలు అడ్డుకోవడంతో అక్రమార్కులు ముసలిపేడు, సుబ్బానాయుడుకండ్రిగపై దృష్టి సారించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. శ్రీకాళహస్తి రూరల్, ఏర్పేడు పోలీసులు అయితే ఆదివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఇసుక తవ్వకాల వీడియోలు వైరల్ అవుతున్నా కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది. -
తుస్సుమంటున్న పోషణ్ వాటిక
పథకం సరే...పర్యవేక్షణ కరువు తిరుపతి అర్బన్: కేంద్ర సర్కార్ పోషణ్ వా టిక పథకం తుస్సుమంటోంది. ఈ పథకం ద్వారా ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి రూ.10 వేలు కేటాయించారు. ఆ నిధులతో అంగన్వాడీ పాఠశాల ప్రాంగణంలో ప్రకృతి సేద్యం ద్వారా ఆకుకూరలు, పలు కూరగాయలు సాగు చేసి, వాటిని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లల కు అందిస్తున్న ఆహారంలో వినియోగించా లని సూచించారు. జిల్లాలో 2,492 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అందులో గర్భిణు లు 12,788 మంది, బాలింతలు 11,007 మంది, ఆరునెలలు లోపు పిల్లలు 9,627 మంది, 6 నెలలపైన 3 ఏళ్ల లోపు 65,433 మంది, 3–6 ఏళ్ల లోపు పిల్లలు 47,814 మంది ఉన్నారు. అయితే 2,492 అంగన్వా డీ కేంద్రాల ప్రాంగణంలో ఖాళీ స్థలంతో పాటు నీటి సౌకర్యం కేవలం 475 కేంద్రాలను మాత్రమే పోషణ్ వాటిక పథకానికి ఎంపిక చేశారు. ఆ మేరకు మూడు నెలల క్రి తమే ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు వంతున 475 కేంద్రాలకు రూ.47.50 లక్షలు కేటాయించారు. ఆ నిధులతో అంగన్వాడీ వర్కర్లు కూరగాయల విత్తనాలు కొనుగో లు చేసి, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ ఎరువుల ద్వారా సాగు చేసి, కూరగాయలు పండించాల్సి ఉంది. అయితే నిధుల కేటాయింపుతో అధికారులు చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో నే పథకం ప్రారంభంలోనే తుస్సుమందని చర్చించుకుంటున్నారు. అధికారులు పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలువురు భావిస్తున్నారు. పర్యవేక్షిస్తున్నాం జిల్లాలో పోషణ వాటిక పథకంపై పర్యవేక్షిస్తున్నాం. కొందరు కూరగాయులు పండిస్తున్నారు. కొన్నిచోట్ల నీటి ఇబ్బందులతో సమస్యలున్నాయి. వాటిని అధిగమించి చక్కగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించేలా ఆదేశాలు ఇస్తాం. ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. –వంసత బాయి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ -
ఏర్పేడు దుర్ఘటనకు 8ఏళ్లు
రేణిగుంట: సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట ఇసుక అక్రమ రవాణాపై గళమెత్తిన గొంతులు శాశ్వతంగా మూగబోయిన దుర్ఘటన నేటికీ ఆ గ్రామస్తులకు పీడకలే.. ఏర్పేడు మండలం మునగలపాళెం గ్రామ శివారున ఉన్న స్వర్ణముఖి నదిలో ఇసుకను జేసీబీలు పెట్టి అక్రమ రవాణా చేస్తున్నారని, దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు దెబ్బతింటున్నాయని స్థానికులు, చిన్న, సన్నకారు రైతులు ధర్నా చేసేందుకు 2017, ఏప్రిల్ 21న మండల కేంద్రానికి వచ్చారు. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది బలయ్యారు. ఈ ఘటనకు అప్పట్లో టీడీపీ మండల నాయకులు పేరం ధనంజయులునాయుడు, పేరం నాగరాజునాయుడు, చిరంజీవులునాయుడు మరి కొంత మందిపై నామమాత్రపు కేసులు పెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే కొంతకాలానికి వారు మళ్లీ పార్టీలో చేరి మండలాన్ని ఏకఛత్రాధిపత్యం కింద ఏలుతున్నారు. నేడు స్మారక స్థూపం వద్ద నివాళులు ఇసుక ప్రమాద ఘటనలో అశువులు భాసిన రైతుల స్మారక చిహ్నాన్ని మునగలపాళెం గ్రామం వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ సోమవారం బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, ప్రజాసంఘాలు నివాళులర్పించనున్నారు. -
సంస్కృతం..గర్వకారణం
తిరుపతి సిటీ: సంస్కృత భాష దేశానికి గర్వకారణమని ఎస్పీ విష్ణువర్దన్రాజు కొనియాడారు. జాతీయ సంస్కృత వర్సిటీ, సంస్కృత భారతి సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలో రెండు రోజుల పాటు జరిగే స్ఫూర్తి సంఘం కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యం కలిగిన సంస్కృత భాషను సమాజంలోని అన్నివర్గాల వారికి అందించే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సంస్కృత భారతి అఖిల భారతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ గోపబంధు మిశ్రా మాట్లాడారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సంస్కృతాన్ని చేర్చాలనే లక్ష్యంతో సంస్కృత భారతి పనిచేస్తోందన్నారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ బట్, డాక్టర్ ఎంజీ నందన్‌రావు, డాక్టర్ ఎస్ఎల్ సీతారమశర్మ పాల్గొన్నారు. -
ఏటా దిగుబడి 5,47,320 టన్నులు
రుచికి, పోషకాలకు మామిడి పెట్టింది పేరు. అందుకే ఇది పండ్లల్లో రారాజుగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏటా మామిడి వినియోగం తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ మోజులో పడి యువత మామిడి రుచిని ఆశ్వాదించలేకవడం ఒక విధంగా అవగాహనా రాహిత్యమేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల స్థాయి నుంచే మామిడి వినియోగంపై అవగాహన పెంచాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రైతుల సంఖ్య 80 వేల మందిమామిడిని ట్రేలకు ఎత్తుతున్న వ్యాపారులు కాణిపాకం: మామిడి సాగు సంక్షోభంలో చిక్కుకుపోయింది. మామిడి గుజ్జుకు డిమాండ్ పడిపోయింది. పరిశ్రమల్లో నిల్వలు పేరుకుపోయాయి. గత ఏడాది వివిధ ఫ్యాక్టరీలు 2.75 లక్షల టన్నుల మామిడి గుజ్జును తయారు చేసి నిల్వ చేశాయి. ఈ గుజ్జు అత్యధికంగా యూరఫ్ దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. కానీ అక్కడ యుద్ధాల కారణంగా గతేడాది నుంచి గుజ్జు ఎగుమతులు స్తంభించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 40 శాతం మేర గుజ్జు ఎగుమతి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మామిడి గుజ్జు కిలో రూ.60 నుంచి రూ.65 వరకు అమ్ముడు పోవాల్సి ఉండగా ప్రస్తుతం రూ.36 పలుకుతోంది. దీంతో ఏంచేయాలో తెలియక రైతులు.. పరిశ్రమల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మామిడిలో అధిక పోషకాలు ఉన్నాయని, దీని వినియోగం పెరిగితే అటు రైతుకు.. ఇటు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌తో ప్రమాదం కూల్‌డ్రింక్స్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. చిన్న పాటి ఫంక్షన్ నుంచి పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాల వరకు భారీ స్థాయిలో కూల్‌డ్రింక్స్ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కూల్‌డ్రింక్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఇదే అదునుగా పెద్దపెద్ద మాల్స్‌లో కూల్‌డ్రింక్స్‌ను ఆఫర్ల పేరుతో అమ్మేస్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందని చాలా మంది కూల్‌డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి తాగడం వల్ల అజీర్ణం, వాంతులు, అధిక బరువు, డయాబెటిక్, ఫ్యాటీ లివర్, గుండె, కీళ్ల సమస్యలు, పంటి సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడితో ఉపయోగాలెన్నో మామిడి పండ్లు, జ్యూస్‌లో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటు సమస్యను నివారిస్తాయి. విటమిన్–సీ, పైబర్ శరీరంలోని హానిచేసే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలను, చిగుళ్ల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దంతాలు శభ్రపడుతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది. మామిడి మంచి జీర్ణకారి. సహజమైన బరువు పెంచేందుకు దోహదం చేస్తోంది. మామిడి రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బు రాకుండా కాపాడుతాయి. వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ● జిల్లాలో విస్తారంగా మామిడి సాగు ● యూరప్‌లో యుద్ధాల కారణంగా అమ్ముడుపోని గుజ్జు ● ఆపసోపాలు పడుతున్న అన్నదాతలు ● స్థానికంగానే వినియోగం పెంచాలంటున్న వైద్య నిపుణులు మామిడిని గ్రేడింగ్ చేస్తున్న సిబ్బందిమామిడి ఆరోగ్యానికి మంచిది మామిడి రసం, పండ్లల్లో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే బీట కెరాటిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ కావాల్సినంత ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎనర్జీ పెంచుతుంది. బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఎక్కువగా తీసుకోవచ్చు. కంటి చూపునకు మేలు చేసే గుణాలు మ్యాంగోలో అధికం. –సునీతాదేవి, చీఫ్ డైటీషియన్, స్విమ్స్, తిరుపతి ఎనర్జీ డ్రింక్‌ల మోజులో పడొద్దు యువత ఎక్కువగా ఎనర్జీ డ్రింక్‌ల మోజులో పడుతోంది. కిక్ అంటూ వెంటపడుతున్నారు. అయితే దాని వల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించలేకపోతున్నారు. కాలేజీలు, పాఠశాలల్లో పండ్ల రసాల వినియోగంపై అవగాహన పెంచాలి. ఎనర్జీ డ్రింక్స్‌లు తాగితే వచ్చే అనర్థాలను వివరించాలి. –గోవర్దన్‌బాబి, మామిడి పండ్ల గుజ్జు పరిశ్రమలశాఖ జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు -
ముక్కంటి సేవలో సినీనటి సమంత
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శనివారం ప్రముఖ సినీ నటి సమంత దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు దక్షి ణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తదనంతరం ఆమె ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. తాను నిర్మాతగా మారి తీసిన శుభం సినిమా విజయవంతం కావాలని స్వామి, అమ్మవార్లను ప్రార్థించినట్టు తెలిపారు. -
● అమెరికా సుంకాలు వెనక్కి తీసుకున్నా పెరగని రొయ్య ధరలు ● రోజుకు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గింపు ● కూటమి ప్రభుత్వంలో భారంగా ఆక్వా సాగు ● జిల్లాలో సగానికిపైగా పడిపోయిన సాగు విస్తీర్ణం
చిల్లకూరు: రొయ్య ధరలు రోజురోజుకీ పతనమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అమెరికా సుంకాల పేరుతో రొయ్య ధరలు తగ్గించిన దళారులు.. ఇప్పుడు సుంకాలు వెనక్కి తీసుకున్నా రొయ్య ధరలు పెరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనికితోడు విద్యుత్ బిల్లులు, మేత ఖర్చు పెరిగిపోవడం, దళారులు కుమ్మకై ్క ధరలను శాశిస్తుండడం అన్నదాతకు శాపంగా మారింది. సాగు విస్తీర్ణం సైతం సగానికి పైగా పడిపోయింది. అమెరికా సుంకాల పేరుతో తగ్గిన ధరలు ఇటీవల అమెరికా రొయ్యల ఎగుమతులపై సుంకాలు విధించింది. దీంతో ఒక్కసారిగా రొయ్య ధరలు పతనమయ్యాయి. ఆ తర్వాత అమెరికా వెనక్కి తగ్గడంతో యథావిధిగా ధరలు వస్తాయని ఆక్వా రైతులు ఆశించారు. కానీ ఇక్కడ ఉన్న దళారులు దీనిని ఆసరాగా తీసుకుని రోజుకు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గిచేస్తున్నారు. బయట నుంచి కొనుగోలుదారులు రాకుండా ఫీడ్ షాపుల యజమానుల నుంచి ఒత్తిడి తెస్తున్నారు. తమకే రొయ్యలు విక్రయించాలని పట్టుబడుతున్నారు. దీంతో సాగుదారులు నష్టాలను చవిచూస్తున్నారు. జిల్లాలో సగానికి పడిపోయిన రొయ్యల సాగు తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో మాత్రమే రొయ్యల సాగు చేపడుతున్నారు. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎక్కువగా రొయ్యలు సాగుచేస్తున్నారు. చిల్లకూరు మండలంలో కండలేరు క్రీక్ వెంబడి టైగర్, వెనామీ రొయ్యలు సాగుచేస్తున్నారు. ధరలు పతనమవుతుండడంతో రైతులు ఈ ఏడాది సాగును సగానికి తగ్గించేశారు. భారంగా విద్యుత్ చార్జీలు ఆక్వా జోన్లు ఏర్పాటు చేసి గత ప్రభుత్వం విద్యుత్ రాయితీలు ఇచ్చేలా ప్రోత్సహించింది. దీనిని కొనసాగించేలా కూటమి ప్రభుత్వం ఇంకా విద్యుత్ చార్జీలు తగ్గించేలా ఆదేశాలిచ్చింది. అయితే విద్యుత్ శాఖ మాత్రం గతంలో రాయితీ ఇచ్చిన సొమ్మును తిరిగి కట్టించుకునేలా వ్యవహరిస్తోంది. టారిఫ్‌ల పేరుతో ప్రతి బిల్లులో ట్రూ ఆఫ్ చార్జీలను వసూలు చేస్తోంది.జిల్లా సమాచారం వెనామీ ధరలు కౌంట్ గత వారం ప్రస్తుతం 100 కౌంట్ రూ.245 రూ.225 90 కౌంట్ రూ.240 రూ.230 80 కౌంట్ రూ.255 రూ.240 70 కౌంట్ రూ.280 రూ.270 60 కౌంట్ రూ.300 రూ.285 50 కౌంట్ రూ.320 రూ.300మండలం గత ఏడాది ప్రస్తుతం ఆక్వా సాగు ఆక్వా సాగు (ఎకరాలలో) చిల్లకూరు 4,850 2,444 కోట 2,875 1,230 వాకాడు 1,280 280 చిట్టమూరు 3,200 2,941సాగు కష్టంగా ఉంది గతంలో ఆక్వా సాగుకు ప్రోత్సహం ఉండేది. నేడు రాయితీలు లేవు. ధరలు కూడా నిలకడగా లేక పోవడంతో సాగు చేయలేక పోతున్నాం. ఒక వైపు వైరస్లు, మరో వైపు మేత ధరలు అధికం కావడం, విద్యుత్ చార్జీల భారంతో నలిగిపోతున్నాం. అమెరికా సుంకాల పేరుతో ధరలు తగ్గించేస్తున్నారు. – మదన్‌కుమార్‌రెడ్డి, తిక్కవరం, ఆక్వా సాగుదారుడు, చిల్లకూరు మండలం సాగు ఆపేశా ఆక్వా సాగు చేసుకుని ఆదాయం పొందుదామని చిట్టమూరు మండలం, పిట్టువాని పల్లి వద్ద ఏడు ఎకరాలు లీజుకు తీసుకున్నా. గత ఏడాది పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది కూడా సాగు చేద్దామంటే ధరలు నిలకడలేవు. వైరస్ తెగుళ్లు ఎక్కువ. చేసేది లేక సాగుకు పూర్తిగా దూరమైనా. చిన్న పాటి వ్యాపారం చేసుకుంటున్నా. – పాకం చెంగయ్య, కల్లూరుపల్లిపాళెం -
బలవంతపు భూసేకరణ వద్దు
సత్యవేడు: బలవంతపు భూసేకరణ వద్దని, ఏపీఐఐసీ భూసేకరణకు అధికారులు వస్తే అడ్డుకొని తీరుతామని మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటిపాకం, రాళ్లకుప్పం గ్రామాల రైతులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం సత్యవేడు తహసీల్దారు రాజశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రయివేటు సంస్థ వ్యాపారం కోసం తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. 2007లో సత్యవేడు మండలంలో ఏర్పాటు చేసిన శ్రీసిటీకి నాలుగు గ్రామాల పరిధిలోని రైతులు 1000 ఎకరాలుకుపై భూనిచ్చారని, అప్పుడు సేకరించిన భూమిలో ఇంకా 200ల ఎకరాలకు పైగా ఖాళీగా ఉందన్నారు. ఆ స్థలంలో ప్రస్తుతం ఎల్జీ కంపెనీకి భూమిని ఇచ్చుకోవాలని సూచించారు. జీఓఎంఎస్ నెం.39ని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కే.విజయశంఖర్ రెడ్డి, కేవీ.నిరంజన్‌రెడ్డి, కే.సుశీల్‌కుమార్‌రెడ్డి, శ్రీరామచంద్రారెడ్డి, జయశంకర్, కే.ప్రతాప్‌రెడ్డి, బీబీఎస్ రెడ్డి, రఘునాథరెడ్డి, రవిరెడ్డి, కే.మురళీనాయుడు, కే.బాలాజీ, రామ్మూర్తిశెట్టి, దయాకర్ రెడ్డి, రజనీకాంత్, కేవీ. రామన్, సరవనన్, పీ.శ్రీనయ్య, జీ.మురళి పాల్గొన్నారు. -
గంగ కాలువలో మహిళ మృతదేహం
డక్కిలి: కండలేరు–పూండి కాలువలో శనివారం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎస్ఐ శివశంకర్ కథనం.. డక్కిలి సమీపంలోని తెలుగుగంగ కాలువలో ఓ మహిళ మృతదేహం వెళ్తున్నట్టు స్థానికులు సమాచారం అందించారన్నారు. అయితే ఆ మృతదేహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడంలేదన్నారు. మృతదేహం వెంకటగిరి లేదా బాలాయపల్లి మండలం, ఊట్లపల్లి గేటు దగ్గర లభ్యం కావొచ్చని తెలిపారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. లీగల్ సెల్ కమిటీ చైర్మన్‌గా సునీల్ కుమార్ తిరుపతి లీగల్ : ఇండియన్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ సెల్ అనుబంధ తిరుపతి జిల్లా లీగల్ సెల్ కమిటీ చైర్మన్‌గా న్యాయవాది ఎన్ఎన్ సునీల్ కుమార్ ఎంపికయ్యారు. తిరుపతిలోని ఆ సంస్థ కార్యాలయంలో శనివారం కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ చైర్మన్లను ఎంపిక చేశారు. తిరుపతి జిల్లా లీగల్ సెల్ చైర్మన్‌గా ఎన్ఎన్ సునీల్ కుమార్, మహిళా లీగల్ సెల్ చైర్మన్‌గా మహిళా న్యాయవాది జి.రమణి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కాణిపాకం మురళీ మాట్లాడుతూ ప్రజల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడానికి తమ సంస్థ న్యాయ సలహాదారులు కృషి చేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ జనరల్ సెక్రటరీ ఎం.హరిబాబు, జిల్లా అధ్యక్షుడు మునిరెడ్డి, నగర అధ్యక్షుడు ఎస్.దేవిప్రసాద్, ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
మట్కా నిర్వాహకుల అరెస్ట్
వెంకటగిరి రూరల్: పట్టణంలో మట్కా నిర్వాహకులను స్థానిక ఎస్ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను సీఐ ఏవీ రమణ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు మట్కాపై ఆశజూపి, అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ రూ.10 కటితే లాటరీ రూ.800 వస్తుందని మభ్యపెట్టి దోచుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో ఆటో డ్రైవర్లు, కూలీలు అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడుల్లో పట్టణానికి చెందిన 8 మంది మట్కా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.26,200 నగదు, 51 స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు తెలిపారు. -
హక్కుల సాధనే లక్ష్యం
తిరుపతి కల్చరల్: బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా జూన్ 6న తిరుపతిలో భారీ స్థాయిలో బీసీల ఆత్మీయ సభ నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. శనివారం తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్లో బీసీ ముఖ్యనేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీల పట్ల పాలకులు అవలంభిస్తున్న వివక్షత, నిర్లక్ష్య వైఖరిపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపుతూ దగా చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లూరు నాగరాజగౌడ్, దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం నేత ఆల్మెన్రాజు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు క్రాంతికుమార్, నాయకులు నంజుండప్ప, రెడ్డెప్ప, జెల్లి మధుసూదన్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీ.స్రవంతి, జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి పాల్గొన్నారు. -
పరిశుభ్రతకు ప్రాధాన్యం
గూడూరు రూరల్: జిల్లాలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శనివారం గూడూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అర్ధంతరంగా ఆగి పోయిన ఆర్ఓబీని రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు. గూడూరు చెరువు మీద ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. తెలుగు గంగ నీటిని అన్ని చెరువులకు అందించేలా మంత్రితో చర్చించి చర్యలు చేపడుతామన్నారు. అనంతరం టవర క్లాక్ వద్ద నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సబ్ కలెక్టర రాఘవేంద్ర మీన, డీఎస్పీ గీతాకుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎవరు తవ్వుకుంటున్నారో తెలియదు కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తెల్లరాయి, సిలికా, ఇసుక పుష్కలంగా దొరకడంతో నిధులు కూడా పుష్కలంగా ఉంటాయనుకుంటారని, అయితే ఈ ఖనిజ సందపను ఎవరు తవ్వుకుంటునారో మాత్రం తెలిదని చెప్పారు. నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్‌ను కోరారు. -
ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌లో శ్రీచైతన్య విజయ ఢంకా
తిరుపతి ఎడ్యుకేషన్ : ఐఐటీ–జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు వివిధ కేటగిరిల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థ ఏజీఎం బీవీ.ప్రసాద్ తెలిపారు. ఈ ఫలితాల్లో పీ.కృష్ణవంశీ 331వ ర్యాంకు, ఈ.జశ్వంతి 458, సీ.ద్వారక్ 723, ఎంజీ.సూర్య 818, బీఏ.రెడ్డి 1000, బీ.అన్విత్ 1,214, ఎం.మునికృష్ణ 1,329, సి.సహస్త్ర 1,742, కె.అభిరామ్ 1,885, కె.సతీష్ 1,968, ఓ.మోక్షిత్ 2,622, సి.వరుణ్‌తేజ 3,642, కె.మంజునాథమహర్షి 5,001, వి.నిఖిలేశ్వర్ రెడ్డి 5,268, ఎం.హర్షిణి 5,315, వి.హర్షిత బ్రైటి 5,361, యు.ఉజ్వల్ సాయిరెడ్డి 5,527వ ర్యాంకులు సాధించారని తెలిపారు. అలాగే వీరితో పాటు సుమారు 85మందికిపైగా విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించే అర్హత పొందారని తెలిపారు. అలాగే తమ విద్యార్థులు 450మందకిపైగా మే 18వ తేదీన ఎన్టీఏ నిర్వహించనున్న ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. అనంతరం ప్రతిభకనబరిచిన విద్యార్థులను ఆ విద్యాసంస్థ డీన్లు కేఎల్‌జీ.ప్రసాద్, రామమోహనరావు, శ్రీనివాసరాజులు అభినందించారు. -
రంగులేస్తే ఏమొస్తుంది.. అభివృద్ధి చేయండి సారూ!
● తుడా బెంచీలకు పసుపు రంగులొద్దని అడ్డగింపు ● అభివృద్ధి పనులు చేయాలన్న ఉప్పరపల్లి వాసులు ● అదే బెంచీలకు బులుగు రంగు కొట్టి జై భీమ్ అని రాసుకున్న గ్రామస్తులు ● తోక ముడిచిన టీడీపీ అల్లరిమూకలు ● 10 మందిపై అక్రమ కేసులకు యత్నం పాకాల: ‘సారూ.. బెంచీలకు ఇష్టమొచ్చిన రంగులద్దితే ఏమొస్తుంది.. గ్రామంలో సవాలక్ష సమస్యలున్నాయి. ముందు వాటికి పరిష్కారం చూపండి’ అంటూ మండలంలోని ఉప్పరపల్లి వాసులు అధికారులకు ఎదురుతిరిగారు. రెండు రోజుల క్రితం గ్రామ కార్యదర్శి తుడా నిధులో వేసిన బెంచీలకు పసుపు రంగులు కొట్టేందుకు గ్రామానికి వెళ్లారు. రంగులద్దేటందుకు ప్రయత్నించగా.. గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. గ్రామంలో దారి సమస్య ఉందని, మురికి కాలవులు శుభ్రం చేయలేదని, పారిశుద్ధ్య అధ్వాన్నంగా ఉందని సదరు పంచాయతీ కార్యదర్శికి సమస్యలు ఏకరువు పెట్టారు. అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి పంచాయతీ కార్యదర్శి మొహం చాటేశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎలాగైన ఆ గ్రామంలో బెంచీలకు పసుపు రంగులు వేయాలని ప్రణాళిక రచించారు. దీన్ని పసిగట్టిన గ్రామస్తులు తామే సొంతంగా బులుగు రంగు తెచ్చుకుని బెంచీలకు అద్ది.. జై భీమ్ అని రాసి తమ విజ్ఞతను చాటుకున్నారు. అక్రమ కేసులకు యత్నం బెంచీలను తాకే ధైర్యం లేక అధికార మదంతో కొందరు టీడీపీ అల్లరిమూకలు రెచ్చిపోయాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని చెలరేగిపోయాయి. గ్రామానికి చెందిన పది మంది యువకుల పేర్లు రాసుకుని ‘మీపై అక్రమ కేసులు బనాయిస్తాం’ అని బెదిరించినట్లు సమాచారం. అసలు ఈ విషయంలో పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నారో అర్థం కాని పరిస్థితి. స్థానిక గ్రామానికి చెందిన యువతను పోలీస్టేషన్‌కి పిలిపించి విచారించినట్లు సమాచారం. -
జేఈఈ మెయిన్స్‌లో శ్రీధర్స్ అకాడమీ విజయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఐఐటీ–జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షా ఫలితాల్లో తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని శ్రీధర్స్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆ అకాడమీ చైర్మన్ మద్దినేని శ్రీధర్ తెలిపారు. ఈ ఫలితాల్లో వివిధ కేటగిరిల్లో ఎం.మహేష్ 298వ ర్యాంకు, ఎస్.వంశీ కృష్ణారెడ్డి 756(వీడబ్ల్యూ ఎస్‌లో ర్యాంక్–98), టి.హరజిత్ 1,477, నిఖిలేశ్వర్‌రెడ్డి 4,260, ఈ.మంజుశ్రీ 6,103, పి.మహమ్మద్ అబుతాలిబ్ 7,843, ఎస్.మహమ్మద్ ఇమ్రాన్ 8,240, డి.పోషిత 15,891వ ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. వీరితో పాటు మెయిన్స్‌కు హాజరైన తమ విద్యార్థులు 108 మందిలో 42 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఆయన అభినందించారు. -
గోవులంటే చులకనెందుకో?
ఎప్పుడు ఏం జరిగిందంటే.. సాక్ష్మి, టాస్క్‌ఫోర్స్: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోమాతల మృతిపట్ల కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు గోవుల మృతిని సీరియస్‌గా తీసుకోకపోగా.. మరణాలను బయటపెట్టిన వారిపై కేసులు పెట్టించడాన్ని హిందువులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇంతజరుగుతున్నా హిందూ సంఘాలు ఏమయ్యాయని జనం ప్రశ్నిస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పిన విషయాలు నిజమా? కాదా? అనే విషయాన్ని నిగ్గుతేల్చేందుకు యత్నించాల్సిన బీజేపీ నేతలు తలోమాట మాట్లాడడంపై మండిపడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి గోవుల మృతిపై తీవ్రంగా స్పందించడంతో పాటు.. ఈ విషయంపై త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేయడంతో కూటమి నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఎందుకు స్పందించడంలేదో? టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు కూటమి నేతలు, టీటీడీ చైర్మన్, ఈఓ తలోమాట.. తలోరకంగా ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ నేతలు టీటీడీ గోవుల మృతి ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. హిందూ సంఘాలు అని చెప్పుకునే వారు సైతం గోవుల మృతి ఘటనపై స్పందించకపోవడంపై విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా అన్ని గోవులు మృతి చెందుతాయా? టీటీడీ గోశాలలో 1,800 గోవులు ఉన్నట్లు సమాచారం. వృద్ధాప్యం కారణంగా ప్రతి నెలా గోవులు మృతి చెందుతున్నాయని కూటమి నేతలు, టీటీడీ ఈఓ ప్రకటించారు. వృద్ధాప్యం కారణంగా ప్రతినెలా 15 గోవులు మరణించడం ఏమిటని ‘గో’ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన పదేళ్లలో గోశాలలోని గోవులన్నీ మరణించి ఉండాలి కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పశువైద్యుల అంచనా ప్రకారం వాటి సహజ మరణాల రేటు 3 శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన వెయ్యి పశువులు ఉంటే.. అందులో వృద్ధాప్యం వల్ల ఏడాదికి 30 మాత్రమే మరణిస్తాయని వివరించారు. ఆ లెక్కన గోశాలలో మరణించే పశువుల సంఖ్య ఏడాదికి 60కి మించే ప్రసక్తిలేదంటున్నారు. మూడు నెలల కాలంలో 43 గోవులు మృతి చెందినట్లు ఈఓ ప్రకటించడం ఆందోళన కలిగించే విషయమని చెబుతున్నారు.అదే రోజు అర్ధరాత్రి నుంచి పోలీసులను రంగంలోకి దింపి వైఎస్సార్సీపీ శ్రేణులందరినీ హౌస్ అరెస్ట్ చేసి గోశాలకు రాకుండా నిర్బంధించారు. ఆపై తమ ఎల్లో మీడియా ద్వారా వైఎస్సార్సీపీ శ్రేణులపై విషప్రచారం చేయడం ప్రారంభించారు. గోవుల మృతిని సీరియస్‌గా తీసుకోని బీజేపీ గోవులు మృతి చెందాయన్న వారిపై ఎదురుదాడి సుబ్రమణ్యంస్వామి హెచ్చరికలతో ఆత్మరక్షణలో కూటమి నేతలు గోవుల మృతిపై హిందూ సంఘాలు ఎందుకు స్పందించడం లేదో? టీటీడీ గోశాలలో వందకుపైగా గోవులు మృతి చెందాయి. (ఈనెల 11న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపణ) గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం (ఈనెల 11న టీటీడీ విడుదల చేసిన ప్రకటన) తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని అపద్దాలు చెబుతున్నారు. (ఈనెల 14న గుంటూరు జిల్లా పొన్నేకల్లులో సీఎం చంద్రబాబునాయుడు ఉద్ఘాటన) ప్రతి నెలా సగటున 15 గోవులు మరణిస్తుంటాయి. మూడు నెలల్లో 43 గోవులు మృతి చెందాయి. అన్నీ సహజ మరణాలే. (టీటీడీ ఈఓ శ్యామలరావు ఈనెల 14న మీడియా సమావేశంలో వెల్లడి) టీటీడీ గోశాలలో 20 నుంచి 22 గోవులు మృతి చెంది ఉండొచ్చు. వృద్ధాప్యం కారణంగానే మృతి చెందాయి. (టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈనెల 13న ఎస్వీ గోశాల మీడియా సమావేశంలో..) ఎస్వీ గోశాలలో 40 గోవులే మృతి చెందాయి. అయితే అవన్నీ అనారోగ్యంతోనే మృతి చెందాయి. (తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈనెల 12న మీడియా సమావేశంలో..) వైఎస్ జగన్మోహన్రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి గోశాలకు వచ్చి గోవులు మృతిచెందాయని నిరూపించాలి (ఈనెల 16న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ట్వీట్) మీ సవాల్‌ని స్వీకరిస్తున్నా. 17న ఉదయం 10 గంటలకు టీటీడీ గోశాలకు కచ్చితంగా వస్తున్నా. మీరూ రండి. (టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఈనెల 16న రీ ట్వీట్)సరిచేసుకోవడం మాని..! టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయని భూమన చెప్పిన విషయంలో నిజమో? కాదో? విచారించాలి. నిజమే అయితే వెంటనే గోవులు మృతి చెందకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అది మానేసి.. నిజాలు చెప్పిన వారిపై ఎదురుదాడి చేయడం, తలో ప్రకటన చేసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. సవాల్ విసిరి.. వస్తామన్న వారిని పోలీసుల చేత అడ్డుకోవడం.. ఆ తరువాత వైఎస్సార్సీపీ వాళ్లే రాలేదని అసత్య ప్రచారం చేయడంపై కూటమి నేతలే అసహ్యించుకుంటున్నారు. గోవుల మృతి విషయంలో తమ పార్టీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడి అభాసుపాలయ్యారని కూటమి శ్రేణులు చర్చించుకుంటున్నారు. -
యువకుడి ఆత్మహత్య
వాకాడు: మండలంలోని వెంకటరెడ్డిపాళెంకు చెందిన యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెరుకూరు రామారావు(35) భార్య వివిధ కారణాలతో పిల్లలను తీసుకుని రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. రామారావు పలుమార్లు పిలిచినా భార్య కాపురానికి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన అతను గురువారం రాత్రి విషపు గుళికలు తిన్నాడు. అస్వస్థతకు గురైన అతన్ని కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ ● వ్యక్తికి తీవ్ర గాయాలు రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : రేణిగుంట మండలం కేఎల్ఎం హాస్పిటల్ కూడలిలో శుక్రవారం రాత్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పరారు కాగా లారీని, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయాలైన వ్యక్తిని విమానాశ్రయం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీటీడీకి పది టన్నుల కూరగాయలు పలమనేరు: పట్టణానికి చెందిన మార్కెట్ మండీ యజమాని ఓకేఆర్ రెడ్డెప్పరెడ్డి టీటీడీ నిత్యాన్నదాన సత్రానికి పది టన్నుల వివిధ రకాల కూరగాయలను టీటీడీ ప్రత్యేక వాహనంలో స్థానిక మార్కెట్ నుంచి శుక్రవారం పంపించారు. ఈ సందర్భంగా ఆ వాహనంలో కూరగాయలు నింపి, పూజలు చేసి, గోవిందనామ స్మరణల నడుమ వాహాన్నిన్ని తిరుమలకు పంపారు. ఇందులో స్థానిక శ్రీవారి సేవకుడు కాబ్బల్లి రవీంద్రారెడ్డితోబాటు ఆయన మిత్రబృందం పాల్గొన్నారు. కాణిపాకంలో పోటెత్తిన భక్తులు కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం భక్తులు పోటెత్తారు, సెలవు దినం కావ డంతో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్రదర్శనంతో పాటు వీఐపీ దర్శన క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. దర్శన ఏర్పాట్లను ఆలయాధికారులు పర్యవేక్షించారు. ప్రబంధకారణి కమిటీ ఎంపికశ్రీకాళహస్తి: పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో నూతన ప్రబంధకారిణి కమిటీని శుక్రవారం ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడు గల్లా సురేష్, కార్యదర్శి రవికుమార్ పాఠశాల నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. కమిటీ మూడేళ్ల పాటు కొనసాగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధికి ఈ కమిటీ సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు మంగిరెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, ఉమాశంకర్, ప్రకాష్, సోమశేఖర్‌రెడ్డి, పద్మావతి, పుష్పలత, డాక్టర్ లక్ష్మీనారాయణ, రాజేష్, నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, మాతాజీ (ఉపాధ్యాయులు) పాల్గొన్నారు. -
26,315
ఉపాధికి షార్ట్ కట్ పాలిటెక్నిక్ కోర్సులు ఉపాధికి బాటలు వేస్తున్నాయి. అంతరీక్ష పరిశోధన సంస్థ షార్‌లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. టీటీడీకి పది టన్నుల కూరగాయలు పలమనేరు మార్కెట్ మండీ యజమాని టీటీడీకి పది టన్నుల కూరగాయలను వితరణగా అందజేశారు. వైఎస్సార్సీపీ పాలనలోనే విద్యకు అధిక ప్రాధాన్యం సన్‌షైన్ అవార్డులు స్వీకరించిన జిల్లా విద్యార్థులు శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 10లోజిల్లా సమాచారం 2019–24 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేశారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యనందించాలని పరితపించారు. ఈ క్రమంలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. విద్యాభివృద్ధితోనే వ్యక్తిగత, సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని బలంగా విశ్వసించారు. నాటి సంస్కరణల ఫలితంగానే నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్లో అద్భుత ప్రతిభ కనబరిచి సన్‌షైన్ అవార్డులకు ఎంపికై న విద్యార్థుల మనోగతంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు (జనరల్ + ఒకేషనల్)తండ్రి కష్టాన్ని గుర్తుచేసుకుంటూ.. నారాయణవనంకు చెందిన ఎంపి.మదనాచారి, ఎం.భువనేశ్వరి దంపతుల కుమార్తె కమలశ్రీ. పుత్తూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇం.ఇజినీరింగ్ (సీఎస్ఈ) ఒకేషనల్ విద్యనభ్యసించి 987 మార్కులు సాధించి సన్‌షైన్ అవార్డుకు ఎంపికై ంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించింది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదరికం వారిది. తండ్రి కూలి పనిచేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తన తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగిన కమలశ్రీ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. బీకాం కంప్యూటర్స్ లేదా బీసీఏ డిగ్రీ కోర్సు చదివి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలన్నదే తన ఆకాంక్ష అని చెబుతోంది. ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం బుచ్చినాయుడుకండ్రిగ మండలం, పార్లపల్లి గ్రామానికి చెందిన ఎన్.ఆనందయ్య, ఎన్.బుజ్జమ్మ దంపతుల కుమార్తె నక్కబోయిన లహరి దొరవారిసత్రం కేజీబీవీలో ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్ ఒకేషనల్ కోర్సును పూర్తిచేసింది. ఇంటర్లో 969 మార్కులు సాధించి, సన్‌షైన్ అవార్డు స్వీకరించింది. తల్లిదండ్రులు కూలినాలి చేసుకుంటూ వచ్చే సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. వీరిలో మొదటి వాడు శ్రీకాళహస్తిలో డిగ్రీ, రెండో అమ్మాయి లహరి ఇంటర్లో ప్రతిభ చాటగా, మూడవ అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. బీఏ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌కు సిద్ధమవ్వడమే లక్ష్యమని చెబుతోంది. 20ఇంటర్లో ప్రతిభ చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు గత ప్రభుత్వ సంస్కరణలతోనే నేడు ఉత్తమ ఫలితాలు మొత్తం విద్యార్థులుuతిరుపతి ఎడ్యుకేషన్ : గత ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఒక్క చదువుతోనే పేదరికాన్ని అధిగమించగలమని బలంగా నమ్మింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ విద్యారంగాన్ని గాడిలో పెట్టింది. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అమ్మఒడి, విద్యాకానుక, నాడు–నేడు పథకాలను అమలుచేసి ఉన్నత చదువులకు బాటలు వేసింది. నాటి సంస్కరణలతోనే.. వైఎస్సార్సీపీ పాలనలో అమలు చేసిన సంస్కరణలే నేడు ఇంటర్మీడియెట్ ఉత్తమ ఫలితాలకు దోహదం చేశాయి. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో 70 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేపట్టారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్లు పరిష్కరించారు. బూజుపట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలను నాడు–నేడు పథకం ద్వారా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. సన్‌షైన్ అవార్డులు కోట హైస్కూల్ ప్లస్‌కు చెందిన యనమల శివాని ఎంపీసీలో 978 మార్కులు సాధించింది. పుత్తూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఒకేషనల్ సీఎస్ ఈ చదివిన కమలశ్రీ 987, ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ బాలు ర జూనియర్ కళాశాలలో మెకానికల్ ఆటో మొబైల్ టెక్నీషియన్ (ఎం అండ్ ఏటీ) ఒకేషనల్ కోర్సు చదివిన ఎ.ఎ.ప్రేమ్‌కుమార్ 977, దొరవారిసత్రం కేజీబీవీలో పీఎస్టీటీ ఒకేషనల్ కోర్సు చదివిన నక్కబోయిన లహరి 969 మార్కు లు సాధించారు. వీరందరూ ఈ నెల 15న విజయవాడలో మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు అందుకున్నారు.– 10లోన్యూస్రీల్తండ్రి కష్టం వృథాపోకూడదని..! చిత్తూరు జిల్లా, నగరి మండలం, సత్రవాడ గ్రామానికి చెందిన ఎకె.ఆరస్వామి, ఎకె.త్యాగవల్లి కుమారుడు ఎకె.ప్రేమ్‌కుమార్ పూత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మెకానికల్ ఆటో మొబైల్ టెక్నీషియన్ (ఎం అండ్ ఏటీ)లో ఒకేషనల్ విద్యనభ్యసించాడు. ఇంటర్లో 977 మార్కులు సాధించి సన్‌షైన్ అవార్డు అందుకున్నాడు. తండ్రి మగ్గం కార్మికుడు. చిన్న పరిశ్రమలో దినసరి కూలీ. వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ తన ముగ్గురు కుమారులను చదివించాడు. చిన్న కుమారుడైన ప్రేమ్‌కుమార్ తండ్రి కష్టం వృథా పోకూడదన్న సంకల్పంతో చదువుకుంటున్నాడు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడి తల్లిదండ్రుల కష్టానికి ఫలితమివ్వాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు.పేదింట మెరిసిన విద్యాకుసుమం కోట: కోట మండలం, కేసవరం పంచాయతీ, సిద్ధమ్మకండ్రిగ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, రాధ కుమార్తె శివానీ. కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్లస్ టూలో ఎంపీసీలో చేరింది. వెయ్యి మార్కులకు గాను 978 మార్కులు సాధించి సన్‌షైన్ అవార్డు సొంతం చేసుకుంది. గతంలో చిట్టేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 527 మార్కులు సాధించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470కి 456 మార్కులు సాధించింది. -
● పది తర్వాత కొలువుకు దగ్గర మార్గంలా పాలిటెక్నిక్ కోర్సులు ● డీసీసీపీ కోర్సుతో ఉద్యోగ అవకాశాలు మెండు ● శ్రీహరికోట షార్‌లో మంచి డిమాండ్ ● అప్రెంటిస్‌షిప్ పూర్తితో ప్రైవేటు రంగాల్లో ఆఫర్లు
షార్‌లో ట్రైనింగ్.. ప్రొఫైల్ చూసి అసెంచూర్లో జాబ్ పలమనేరులోని పాలిటెక్ని క్ కళాశాలలో డీసీసీపీ కో ర్సు చదివి శ్రీహరికోటలో ఏడాది పాటు అప్రెంటిస్షి ప్ చేశా. నా ఈ ఫ్రొఫైల్ చూడగానే ఇంటర్వ్యూలో బెంగళూరులోని అసెంచూర్ సంస్థలో ఉద్యోగం దక్కింది. పీ2పీ (ప్రొక్యూర్మెంట్ టు పే న్యూ అసోసియేషన్)గా మంచి ప్యాకేజీతో జాబ్ చేస్తున్నా. పలమనేరులో ఇలాంటి కోర్సులున్నాయని చాలామందికి తెలియదు. – హేమావతి, బెంగళూరు డీసీసీపీ కోర్సులో కంప్యూటర్ ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థినిలు విద్యార్థినిని అభినందిస్తున్న కళాశాల అధ్యాపక బృందం(ఫైల్)పలమనేరు: పాలిటెక్నిక్ కోర్సులు పదో తరగతి తరువాత తక్కువ ఖర్చు, సమయంలో ఉపాధి అవకాశాలు పొందడానికి దోహదపడతాయి. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పూర్తయ్యాక పాలిసెట్ రాసే విద్యార్థులు.. పాలిటెక్నిక్ అంటే బీటెక్‌కు సులభమైన దారిగానే భావిస్తుంటారు. చాలామంది ఈ కోర్సులో బ్రాంచ్‌లైన సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ వైపే చూస్తుంటారు. స్పెషల్ కోర్సులను పట్టించుకోరు. కానీ, ఇవే త్వరగా ఉపాధి పొందేందుకు సోపానాలు అని తెలుసుకోవడం లేదు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి మంచి అవకాశాలుంటాయి. ఇప్పటికే ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ నెల 30వ తేదీన పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ర్యాంకు వచ్చిన బాలికలు పలమనేరు, నెల్లూరులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లోని కొన్ని కోర్సులు చేస్తే 19 ఏళ్లకే షార్‌లో ఉద్యోగం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డీసీసీపీ అంటే ఏమిటి? డీసీసీపీ.. కామర్స్‌తోపాటు పూర్తిస్థాయి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పే మూడేళ్ల డిప్లొమా కోర్సు. ఇందులో కామర్స్, డిగ్రీ మొదటి సంవత్సరం ఇంగ్లిష్, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, హయ్యర్, మోడరన్ ఆఫీస్ మేనేజ్మెంట్, బిజినెస్ కరస్పాండెన్స్, స్టాటిటిక్స్, బిజినెస్ లా, మార్కెటింగ్ ప్రిన్సిపుల్స్, అనలటికల్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, డీటీపీసీ, టాలీ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. కోర్సులో ఏడాది అప్రెంటిస్‌షిప్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విస్తృత అవకాశాలున్నాయి. కోర్సు పూర్తి చేసిన వారు బీకాం కంప్యూటర్స్ డిగ్రీలో లేటరల్ అడ్మిషన్ కింద సెకండ్ ఇయర్లో చేరవచ్చు. ఆపై ఎంబీఏ, సీఏ, సీఎస్ లాంటి ఉన్నత కోర్సులు చదవచ్చు. ● తల్లిదండ్రులు ఇలాంటి కోర్సులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.బాలికలకు ప్రత్యేక పాలిటెక్నిక్ చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరులో ప్రత్యేకించి మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిలో డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (డీసీసీపీ) కోర్సు చేసినవారు ఏటా తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌లో కంప్యూటర్ అనలిస్ట్‌గా అప్రెంటిస్‌షిప్‌నకు ఎంపికవుతున్నారు. షార్‌లోనే కాక ఎన్ఆర్ఎస్సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్) హెచ్ఏఎల్ (హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్) వంటి పేరుగాంచిన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. వీటిలో అప్రెంటిస్‌షిప్‌తో నైపుణ్యం సాధించినవారికి ప్రైవేట్ రంగంలోని ప్రముఖ కంపెనీలు భారీ వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. పలమనేరులోని కళాశాలలో డీసీసీపీ కోర్సు పూర్తి చేసుకున్న 90 శాతం మందికి ఏటా వెంట నే ఉపాధి లభిస్తోంది. పదేళ్లలో వివిధ కోర్టులు, రాష్ట్ర సచివాలయం, పోస్టల్, ప్రైవేటు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 400 మంది దాక ఉద్యోగాలు పొందడం విశేషం. టెన్త్ తర్వాత మంచి కోర్సు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు ఆధారంగా పలు కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు పాలిటెక్నిక్ విద్య ఎంతో మేలు. తద్వారా బీటెక్‌లోనూ ప్రవేశించి ఉన్నత విద్య అభ్యసించవచ్చు. – డా.బెహరా శ్రీనివాస్, ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పలమనేరు ఇక్కడ చదివితే జీవితంలో సెటిల్ కోర్ బ్రాంచ్లే కాదు స్పెషల్ బ్రాంచ్‌ల్లో చదివినవాళ్లూ మంచి ఉపాధి అవకాశాలను పొందవచ్చు. డీసీసీపీ కోర్సు చేసిన చాలామంది షార్ లాంటి గొప్ప సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్నారు. కొందరు ఉన్నత చదువులకు వెళుతున్నారు. పాలిటెక్నిక్‌లోని ఇలాంటి కోర్సుల గురించి చాలామందికి తెలియదు. – మహమూద్, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్, పలమనేరు ఏటా పది మందిపైనే షార్‌లో శిక్షణకు.. ఏటా షార్కు ఇక్కడినుంచి పదిమంది పైగా విద్యార్థినులు శిక్షణకు వెళుతున్నారు. ఆపై ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈసారి సైతం ఇక్కడ చదివిన సిమ్రాన్ (సదుం), డిల్లీ (బంగారుపాళెం), శశిప్రియ (నిమ్మనపల్లి), భవాని (గుడుపల్లి) పలువురు షార్‌లో పనిచేస్తున్నారు. – శ్రీవిద్య, డీసీసీపీ డిపార్ట్మెంట్ హెడ్, పలమనేరు -
నీటి గుంతలో పడి విద్యార్థిని మృతి
వరదయ్యపాళెం: పశువుల కాపరిగా వెళ్లిన ఇంటర్ విద్యార్థిని ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కువ్వాకొల్లి పంచాయతీ, లక్ష్మీపురం.కే గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. లక్ష్మీపురం.కే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, కామేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె శ్రీవల్లి (16) గూడూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతోంది. ఇటీవల ఫలితాల్లో ఆ విద్యార్థిని 345 మార్కులతో పాసైంది. గురువారం తమ పశువులను మేతకు తీసుకెళ్లింది. అయితే గ్రామ సమీపంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత ఏడాది పనులు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో నీరు నిల్వ చేరడంతో పశువులు ఆ గుంతల్లోకి దిగగా వాటిని బయటకు తోలేందుకు అటుగా వెళ్లిన విద్యార్థిని శ్రీవల్లి కాలుజారి గుంతలో పడిపోయింది. తల్లిదండ్రులు యువతి ఆచూకీ కోసం ఆ ప్రాంతమంతా గాలించారు. చీకటి పడడంతో విద్యార్థిని ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం నీటి గుంతలో శవమై తేలి ఉండడాన్ని స్థానికులు గుర్తించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రులను ఓదార్చారు. -
టీటీడీపై రాజకీయం తగదు
తిరుపతి కల్చరల్ : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసించే టీటీడీపై రాజకీయం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్లో ఆయన మాట్లాడారు. ఎస్వీ గోశాలను రాజకీయ వేదికగా మార్చవద్దని కోరారు. ఈ క్రమంలోనే న్యాయవ్యవస్థను ధ్వంసం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను గవర్నర్లుగా నియమించి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు గవర్నర్ తీరుని సుప్రీం కోర్టు సైతం తప్పు పట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌ను కాపాడేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ నేతలు రామానాయుడు, శివారెడ్డి, మురళి, చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, విశ్వనాథ్ పాల్గొన్నారు. -
మురిపించే వర్ణం.. వకుళామాత పరవశం!
తిరుపతి జిల్లాలో గత రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండిపోతోంది. ఆ తర్వాత ఆకాశం మేఘావృతమవుతోంది. మబ్బుల మాటున సూరీడి కిరణాలు విభిన్న వర్ణాలతో ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం చంద్రగిరి రూరల్ పరిధిలోని పేరూరు బండపై వెలసిన శ్రీవకులామాత ఆలయం ఎర్రటి మబ్బుల నీడలో శోభాయమానంగా వెలుగొందుతూ భక్తులను ఆకట్టుకుంది. ఈ సుందర దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి -
నేడు ఈ–వేస్ట్ సెంటర్ల ఏర్పాటు
తిరుపతి అర్బన్: జిల్లాలోని పంచాయతీల పరిధిలో ఈ–వేస్ట్ (ఎలక్ట్రానికి వ్యర్థాలు)సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి శుక్రవారం తెలిపారు. శనివారం నుంచి ఇవేస్ట్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అయితే మండల కేంద్రాలుగా ఉన్న పంచాయతీలు, 10 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ పరీక్షల్లో తిరుపతి రచయితపై ప్రశ్న తిరుపతి కల్చరల్: ఏపీపీఎస్సీ ఈనెల 4వ తేదీ నిర్వహించిన పరీక్షల్లో తిరుపతి జిల్లాకు చెందిన రచయిత ఆర్సీ.కృష్ణస్వామి రాజుపై ఒక ప్రశ్న రావడం విశేషం. పేపర్ –1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రశ్నపత్రంలో 31వ ప్రశ్నలో ఆయన రచించిన ‘జక్కదొన’ పుస్తక రచయిత ఎవరు? అని బహుళైచ్చిక ప్రశ్నగా అడిగారు. ఈ పుస్తకంలోని జక్కదొన కథ పాత చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం, జక్కదొన గ్రామం ప్రధానాంశంగా సాగుతోంది. ఆ ఊరు పులికంటి కృష్ణారెడ్డి సొంత ఊరు కావడం గమనార్హం. ఆయనకు ఈ పుస్తకాన్ని రచయిత రాజు అంకితమిచ్చారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ పుస్తకాన్ని ఎస్వీయూ సెనేట్ మందిరంలో ఆవిష్కరించారు. మొత్తం 21 కథల సంకలనమైన ఈ పుస్తకంలో అన్ని వర్గాలకు చెందిన వారిని పరిచయం చేశారు రచయిత. నేడు తిరుమలలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర తిరుమల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని టీటీడీ నిర్వహించనుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అలిపిరి నడక దారిలోని కుంకాల పాయింట్ (ఆఖరి మెట్టు) వద్ద నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కళ్యాణ కట్టలో టీటీడీ చైర్మన్ తనిఖీలు తిరుమల : తిరుమల శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట, నందకం మినీ కళ్యాణ కట్టలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తుల తలనీలాల సమర్పణను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్షురకుల ప్రవర్తనపై అభిప్రాయాలను భక్తుల నుంచి తెలుసుకున్నారు. ఒక ప్రాంతంలోని కళ్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీ తక్కువగా ఉండే కళ్యాణకట్టకు భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 16వ ఆర్థిక సంఘం బృందానికి సాదర వీడ్కోలు రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ఢిల్లీకి తిరుగు పయనమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డా.అరవింద్ పనగారియా, సభ్యులు అన్నే జార్జ్ మ్యాథ్యూ, డా.మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్ తదితర సభ్యులతో కూడిన బృందానికి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్) పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి , సంబంధిత అధికారులు 16వ ఆర్థిక సంఘం బృందానికి సాదర వీడ్కోలు పలికారు. -
గుర్తుతెలియని వాహనం ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు
చంద్రగిరి : గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారి భాకరాపేట కనుమలో చోటు చేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు.. సుమారు 25 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని యువకుడు శుక్రవారం రాత్రి తన ద్విచక్ర వాహనంలో భాకరాపేట నుంచి తిరుపతికి వెళ్తుండగా పెద్ద మలుపు వద్ద గుర్తు తెలియని కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వస్తున్న తోటి ప్రయాణికులు గుర్తించి 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ క్షతగాత్రుడిని తిరుపతి రుయాకు తరలించారు. అయితే యువకుడు భాకరాపేట పరిసర ప్రాంతానికి చెందినట్లుగా తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. -
మత్తు ఇంజక్షన్ ఇచ్చిన నిందితుడి అరెస్ట్
కోట: కోట ఎన్సీఆర్ నగర్లో ఈ నెల 10న సోలా ప్రమీలకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంగారు గాజులు అపహరించిన కేసులో నిందితుడు నిజమాల సంపత్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. డయాబెటిక్ వల్ల ఏర్పడిన గాయాలతో బాధపడుతున్న కోట మండలానికి చెందిన సోలా ప్రమీలకు నెల్లూరు అపోలో ఆస్పత్రి డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేసే సంపత్‌కుమార్ వైద్యం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన ఆమె ఇంటి వద్దకు వచ్చి చికిత్స చేసిన అనంతరం మత్తు ఇంజెక్షన్ వేశాడని చెప్పారు. ఆమె స్ఫృహ కోల్పోయిన తర్వాత సుమారు రూ.2.9 లక్షల విలువైన బంగారు గాజులను అపహరించాడని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని ఊనుగుంటపాళెం రోడ్డు వద్ద గురువారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇండియన్ హ్యూమన్ రైట్స్ నూతన కమిటీ తిరుపతి కల్చరల్: ఇండియన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటి కరప్షన సెల్ రాష్ట్ర, జిల్లా, నగర నూతన కమిటీ ప్రతినిధులను ఎంపిక చేసినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాణిపాకం మురళి తెలిపారు. గురువారం సంస్థ కార్యాలయంలో కమిటీ ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.హరిబాబు, జిల్లా అధ్యక్షుడుగా ఆవుల మునిరెడ్డి, తిరుపతి నగర కమిటీ అధ్యక్షుడుగా ఎస్.దేవిశ్రీ ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా భవనశ్రీ రమేష్‌ని ఎంపిక చేసినట్టు తెలిపారు. -
శ్రీసిటీ డైకిన్ ప్లాంట్ సందర్శన
శ్రీసిటీ (వరదయ్యపాళెం): డైకిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నౌఫుమీ టకేనాక గురువారం శ్రీసిటీలోని డైకిన్ ఇండియా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. డైకిన్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.జె.జావా ఆయనకు ఆహ్వానం పలికారు. ప్లాంట్ పనితీరుపై సమీక్ష జరిపిన టకేనాక, ప్లాంట్ నిర్వహణ, సాంకేతిక నైపుణ్యం, దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళిక తదితర అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా టకేనాక, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కొద్దిసేపు సమావేశమయ్యారు. -
పేదలపై ఎందుకింత కక్ష్య
● భూములకు పరిహారం అడిగితే బెదిరింపులా? ● బాధితులను అడ్డుకున్న పోలీసులు ● పంతం నెగ్గించుకున్న అధికారులు చిల్లకూరు: ‘పేదలపై ఎందుకింత కక్ష్య. మేము ఆ భూములనే నమ్ముకని జీవిస్తున్నాము. తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు భూములు లాక్కుని పరిహారం ఇవ్వమంటే ఇలా నిర్బంధించడం మంచిదేనా.. మా భూములు లాక్కుని మాకిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ తీర ప్రాంతంలోని తమ్మినపట్నం రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్ సిటీ అభివృద్ధి పనుల కోసం వచ్చిన యంత్రాలను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చేవరకు కదలనివ్వమని భీష్మించుకున్నారు. పరిహారం ఎందుకివ్వరు? తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 980 ఎకరాల భూములను క్రిస్ సిటీ కోసం ఏపీఐఐసీ ద్వారా సేకరించారు. ఇందులో సాగులో ఉన్న భూములకు త ప్ప బీడుగా ఉన్న సుమారు 297 ఎకరాలను పరిహా రం జాబితాలో చేర్చకుండా వదిలేశారు. దీంతో తమ్మినపట్నం, లింగవరం, తీగపాళెం, మన్నేగుంట పల్లెవానిదిబ్బ గ్రామాల రైతులు నిరసనలు చేపట్టారు. అడ్డుకుంటూ..అరెస్ట్‌లు చేస్తూ బీడు భూములకు పరిహారం రాకుండా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనన్, తహసీల్దార్ శ్రీనివాసులు అడ్డుకుంటున్నారని ఆయా గ్రామాల రైతులు ఆరోపించారు. ఆపై పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఆపై కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. పరిహారం అడిగితే ఎందుకంత కక్ష్య అంటూ గ్రామస్తులు మండిపడ్డారు. -
ఆదర్శ పంచాయతీని సందర్శించిన పంచాయతీరాజ్ కమిషనర్
తిరుపతి రూరల్: చెర్లోపల్లి సర్పంచ్ బొల్లినేని సుభాషిణి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదర్శ పంచాయతీ అవార్డును దక్కించుకోవడంతో ఆ పంచాయతీని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ గురువారం సందర్శించారు. చెర్లోపల్లి పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయనకు సర్పంచ్ సుభాషిణి సాదర స్వాగతం పలికారు. అనంతరం గ్రా మ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సేవల గురించి ఫొటోలు ఆధారంగా ఆయనకు వివరించారు. అనంతరం పంచాయతీ శాశ్వత ఆదాయానికి తీసుకున్న నిర్ణయాలు, పూర్తి చేసిన పనుల గురించి తెలుసుకున్న ఆయన సర్పంచ్‌ను అభినందించారు. అలాగే పంచాయతీ కార్యాలయంతో పాటు అక్కడ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో చేసిన అభివృద్ధి పనులను మిగతా పంచాయతీల వారికి చూపించి ఆదర్శంగా తీసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ సుశీలాదేవి, డీఎల్పీఓ సురేష్ నాయుడు, ఎంపీడీఓలు రామచంద్ర, రమేష్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు. -
2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ఏర్పేడు(రేణిగుంట): 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్, తొలి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.అరవింద్ పనగారియా అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని ఆయన గురువారం సందర్శించారు. ‘భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం’ అనే అంశంపై ఆయన ఐఐటీ హ్యూమానిటీస్ – సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఆయనకు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్.సత్యనారాయణ స్వాగతం పలికి 3వ జనరేషన్ ఐఐటీగా తిరుపతి ఐఐటీ ప్రస్థానం గురించి, పదేళ్లలో ఐఐటీ సాధించిన ప్రగతిని గురించి ఆయనకు వివరించారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు, ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ పాండా, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రొఫెసర్ అరవింద్ పనగరియా మాట్లాడుతూ రెండు దశాబ్దాలలో భారత్ ఎన్నో సంక్షోభాలను అధిగమించి 8–9 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వెల్లడించారు. అటల్ సేతు, కొత్త పార్లమెంట్ భవనం వంటి ప్రాజెక్టులు దేశ సామర్థ్యాన్ని చూపిస్తున్నాయని అన్నారు. రాబోయే దశాబ్దంలో భారతదేశంలో 9–10 ట్రిలియన్ ఎకానమీగా మారే అవకాశం ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో జరుగుతున్న మార్పులు, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకున్న మూడవ తరం ఐఐటీ పురోగతిని వివరించారు. విద్యార్థులలో మూడవ వంతు మంది పీహెచ్డీ ప్రోగ్రాములలో ఉన్నారని, అధ్యాపకులు 200 కి పైగా పరిశోధన ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని తెలిపారు. -
అమ్మా..ఊపిరాడలేదు!
కారులో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. – 10లో●దమ్ముంటే గోశాలకు అనుమతించాలి టీడీపీ అధ్యక్షుడు ఎక్కడో కూర్చొని సవాల్ విసరడం కాదని, దమ్ముంటే సవాల్‌ను స్వీకరించిన భూమన కరుణాకరెడ్డిని గోశాలకు పిలిపించుకుని నిజాలు నిగ్గుతేల్చాలి. టీటీడీ నిర్లక్ష్యం లేకుంటే మమ్మల్ని ఎందుకు గోశాలకు రానివ్వలేదు. చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్‌కళ్యాన్ కూడా టీటీడీలో జరుగుతున్న అపచారాలను ఎందుకు ప్రశ్నించడం లేదు. తప్పులను సరిదిద్దుకోకుండా తిరిగి వైఎస్సార్సీపీ నాయకులతో పాటు జగనన్నపై ఎదురుదాడులకు దిగడం సిగ్గుచేటు. – ఆర్కే.రోజా, మాజీ మంత్రి స్వామితోనే రాజకీయమా బాబు? సాక్ష్యాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చేసిన రాజకీయం కార ణంగానే తిరుమలలో ఇ న్ని అపచారాలు జరగుతున్నాయి. శ్రీవారి లడ్డూ లో ఆవు, పంది కొవ్వు కలిసిందని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టిక్కాయలు వేసింది. అయినప్పటికీ చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఇప్పుడు గోశాలలో గోవులు మృతి చెందితే ఒక్క ఆవు కూడా చనిపోలేదని అబద్ధాలు చెబు తున్నారు. – కే.నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం వందకుపైగా గోవులు మృతి గత పది నెలలుగా టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయి. దీనిపై టీడీపీ అధ్యక్షుడు సవాల్ విసిరి నిజాలు నిగ్గు తేల్చకుండా అడ్డుకోవడం దారుణం. ఆయన సవాల్‌ను తమ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి స్వీకరించి గోశాలకు బయలు దేరితే పోలీసులచేత అడ్డుకోవడం ఏంటి?. సవాల్‌ను ఎదుర్కొనే దమ్ములేదా?. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. తప్పిదాలను సరిదిద్దుకునే పరిస్థితి కనిపించడంలేదు. – భూమన అభినయ్‌రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వకర్త హిందువుల మనోభావాలతో ఆటలా? హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం, టీటీడీ వ్యవహరిస్తోంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారు తప్ప వాటిని సరిదిద్దుకోవడంలేదు. గోశాలలో గోవుల మృతిపై సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్, ఈవో, స్థానిక ఎమ్మెల్యేలు వారికి తోచినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాలు మానుకుని గోశాలలో గోవుల మృతిపై నిజాలు అందరికీ తెలియజేయాలి. – చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వకర్త -
ఎస్వీయూ సిగలో మరో ఆభరణం
తిరుపతి సిటీ: అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్–పార్ట్నర్షిప్స్ ఫర్ ఆక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నేతృత్వంలోని స్పోక్ సంస్థగా ఎస్వీయూ ఎంపికై ంది. అంతర్జాతీయస్థాయి పరిశోధనలకు బాటలు వేసే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వర వర్సిటీ అందిపుచ్చుకుంది. వీసీ ప్రొఫెసర్ అప్పారావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏఎన్ఆర్ఎఫ్–పీఏఐఆర్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల మధ్య పరస్పర సహకార పరిశోధనను ప్రోత్సహించేందుకు హబ్అండ్స్పోక్ మోడల్‌ను అమల్లోకి తెచ్చిందన్నారు. దేశంలోని 30 ప్రఖ్యాత సంస్థలు ఈ గ్రాంట్‌కు దరఖాస్తు చేయగా వాటిలో ఏడు ప్రధాన హబ్ సంస్థలు ఎంపికయ్యాయని తెలిపారు. అందులో ఎస్వీయూకు స్థానం లభించడం గర్వంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మధుమేహం, ఫ్యాటీ లివర్ వ్యాధి, డెంగీ, మలేరియా, బ్రెస్ట్, బ్లడ్ కాన్సర్ వంటి ప్రధాన ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వర్సిటీ పరిశోధనలు చేస్తుందని అన్నారు. ఈసందర్భగా ప్రాజెక్ట్ బృందానికి వీసీ, రిజిస్ట్రార్ భూపతినాయుడు అభినందనలు తెలిపారు. -
మౌలిక వసతులకు ప్రాధాన్యం
తిరుపతి అర్బన్: మౌలిక వసతుల ప్రాధాన్యతకు.. అ భివృద్ధికి సంబంధించిన అంశాలకు మొదటి స్థానం ఉంటుందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు అధికారులతో కలసి సమీక్షించారు. సంఘం చైర్మన్ మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన అంశాల కు కేంద్రం నుంచి నిధుల విడుదలకు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. స్థానిక సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి చేపట్టాల్సిన అంశాలను తెలియజేశారు. దీంతో స్పందించిన ఆయన ప్రాధాన్యత అంశాలకు మొదటి స్థానం ఉంటుందని చెప్పారు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పరిశీలన రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట మండలం, తూకివాకం పంచాయతీలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ (చెత్త నుంచి సంపద కేంద్రం)ను గురువారం 16వ ఆర్థిక కమిషన్ బృంద సభ్యులు రిత్విక్ పాండే, అన్నే జార్జ్ మ్యాథ్యూ, కేకే మిశ్రా, అభయ్ మీనన్, ఆదిత్య పంత్, అమృత తదితరులు పరిశీలించారు. సదరు ప్లాంట్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ, కంపోస్టు, బయో మెథనైజేశన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ నగరంలో రోజూ సుమారు 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను ఆరు రకాలుగా మారుస్తారని, ఇలా ఉత్పత్తయిన ఇసుక, గుల్లతో పేవర్స్ తయారు చేస్తారని తెలిపారు. ప్రతిరోజూ తడి చెత్త 150 టన్నులు, 75 టన్నులు పొడి చెత్త నిర్వహణ చేస్తున్నట్టు తెలిపారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్, జే.నివాస్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్‌రెడ్డి, అదనపు కమిషనర్ చరణ్‌తేజ్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, లైజన్ అధికారులు పాల్గొన్నారు. -
వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన
తిరుపతి అర్బన్: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు విసృత్తంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్‌తోపాటు జేసీ శుభం బన్సల్, జిల్లా జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి జీవీ నారాయణరెడ్డి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పీవీ జగదీశ్‌తో కలిసి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ వినిగించుకునేలా అవగహన కల్పించాలని తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రతి ఇంటికి మన మిత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడి ఫోనులో 9552300009 నంబరు సేవ్ చేయించాలని సూచించారు. మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 210 సేవలు కల్పిసుందని, మరో వారంలో రోజుల్లో ఈ సంఖ్య 250కి పెంచుతున్నామని, పక్షం రోజుల్లో 350 సేవ లు అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దాదాపు వెయ్యి రకాల సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఆశయంగా పేర్కొన్నారు.చట్టబద్ధమైన దత్తతను స్వాగతించండిపిల్లల దత్తతకు సంబంధించి చట్టబద్ధతను స్వాగతించడం ద్వారా భవిష్యత్‌లోను సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంగళ, బుధవారాల్లో ఇద్దరు పిల్లల దత్తత అంశాన్ని గుర్తు చేశారు. పిల్లలు లేని తల్లిదండ్రులు cara.wcd. gov.ivలో నమోదు చేసుకోవడంతోపాటు మహిళా పోలీసు లు, అంగన్వాడీలు, బాలల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో దత్తత తీసుకోవడం ద్వారా చట్టబద్ధత ఉంటుందన్నారు.హోమ్‌స్టేల మూల్యాంకనం సమర్పణజిల్లాలోని హోమ్‌స్టేలపై వివరణాత్మక మూల్యాంకన నివేదికను కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వెంకటేశ్వర్‌కు సమర్పించారు. ఈ నివేదికను శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ తిరుపతి నుంచి ఎంబీఏ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎం.నీరజ, ప్రొ ఫెసర్ ఎస్.గౌతమి తయారు చేసి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.రమణప్రసాద్ వారితో ఉన్నారు. పర్యాటక విధానాన్ని మార్గనిర్దేశం చేయడం, సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం, హోమ్‌స్టేల ద్వారా స్థిరమైన, కమ్యూనిటీ ఆధారిత పర్యాటకాన్ని ప్రో త్సహించడం ఈ నివేదిక లక్ష్యంగా కలెక్టర్‌కు వారు వివరించారు. -
510 సెల్ఫోన్లు స్వాధీనం
తిరుపతి క్రైం : చోరీకి గురైన రూ.1.12 కోట్లు విలువ చేసే 510 సెల్ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లాలో పోగొట్టుకున్న వారి సెల్ఫోన్ల కోసం ప్రత్యేకంగా జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ‘మొబైల్ హంట్’ (పోలీస్ వాట్సాప్ నంబర్ 9490617873) అప్లికేషన్‌కు వచ్చిన ఫిర్యాదులపై గతంలో రూ.7.56 కోట్ల వి లువ చేసే 4,275 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామ న్నారు. తాజాగా 13 విడతలో 510 సెల్ఫోన్లను సైబ ర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారన్నారు. ప్రధానంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సెల్ఫోన్లు పోగొట్టుకుంటున్నారని, అలాగే కొన్ని చోరీకి గురవుతున్నాయ ని తెలిపారు. అలాంటి వారంతా ‘మొబైల్ హంట్’కు హాయ్ అని మెసేజ్ చేస్తే లింకు వస్తుందని, అందులో వారి వివరాలను పూర్తి చేయాలన్నారు. సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)లో ఇది నమోదవుతుందన్నారు. సెల్ఫోన్లో సమాచారం దు ర్వినియోగం కాకుండా ఆ ఫోన్ బ్లాక్ అవుతుందన్నా రు. దాని ద్వారానే సెల్ఫోన్లను రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. రికవరీ చేసిన ఫోన్లన్నీ ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చామన్నారు. కేసును ఛేదించడంలో సైబర్ సీఐ వినోద్ కుమార్, సిబ్బంది ఎంతగానో కృషి చేశారన్నారు. అనంతరం సైబర్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి, అభినందించారు. -
కొనుగోళ్లు సరే..
టోల్గేట్లో ఆకస్మిక తనిఖీలు అలిపిరి టోల్గేట్లో జిల్లా ఎస్పీ, టీటీడీ ఇన్చార్జ్ సీవీఎస్వో హర్షవర్ధన్‌రాజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.రుయాలో అరుదైన శస్త్రచికిత్స వెన్నెముక విరిగి బాధ పడుతున్న రోగికి తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.గంగ జాతర వేడుకగా నిర్వహిద్దాంఇదేం నాటకం నానీ గారు..!● టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమ్మంటారు.. మీరేమో అడ్డుకుంటారు ● తప్పు జరిగిందనా..? జరిగిన తప్పును కప్పిపుచ్చడానికా..? ● అసలు తిరుపతి గోశాల వద్ద రేపు ఏం జరగబోతోంది..? గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోఆరుగాలం చమటోడ్చి పంట పండించిన అన్నదాతలను ధాన్యలక్ష్మి కరుణించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మద్దతు ధరకు విక్రయించి, అప్పులు తీర్చుకుందామని ఈ కేంద్రాలకు వస్తున్న కర్షకులకు నిరాశే ఎదురవుతోంది. తరుగులు పేరుతో దోపిడీ ఒక ఎత్తైతే.. నగదు రావడం గగనంగా మారింది. ఇదే అదునుగా ధాన్యపు రాశులపై దళారులు వాలేస్తున్నారు. ధాన్యం కళ్లాలను దాటనీయకుండా సన్న, చిన్నకారుల రైతులను దోచేస్తున్నారు. లారీలో లోడ్ చేస్తున్న ధాన్యం (ఫైల్) గిట్టుబాటు ధర లేదు రైతులను అదుకుంటామని చెప్పి నడ్డి విరిచేస్తున్నారు. ధాన్యం అమ్ముకుందామంటే దళారులు, మిల్లర్లు మోసం చేస్తారు.ఽ ధాన్యం కోనుగోలు కేంద్రాల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోంది. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు జమ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా పెట్టుబడి సాయం ఇవ్వకపోగా అరుగాలం పండించిన ధాన్యానికి కూడా ధరలు లేకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – మందా దేవేంద్రరెడ్డి, సుగ్గుపల్లి చేతికందేదీ సున్నా ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ రూ. 2320, బీ గ్రేడ్ ధాన్యం రూ. 2300 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఏ గ్రేడ్ ధాన్యం బస్తాకు 79 నుంచి 82 కిలోలు వరకు తడి, చెత్తా చెదారం పేరుతో లాక్కుంటున్నారు. ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. బ్యాంక్ ఖాతాల్లో ఆధార్ లింక్ లాంటి సాంకేతిక పరమైన కారణాలతో కాలయాపన చేస్తున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. అక్కడ ఇచ్చిన గిట్టుబాటు ధర ఇక్కడ వడ్డీలకు సరిపోతుంది. చేతికి అందేది మాత్రం సున్నానే. – సీ సుధాకర్, సీపీఐ నాయకులు, తడకండ్రిగ 90 శాతం మందికి పేమెంట్ చేశాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటికే 90 శాతం పేమెంట్లు ఇచ్చేశాం. మరో వారం పదిరోజుల్లోనే మిగిలిన 10 శాతం పేమెంట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్లు ఇచ్చాం. – సుమతి, జిల్లా సివిల్ సఫ్లయిస్ మేనేజర్, తిరుపతి డిజిటల్ సేవలపై అవగాహన కల్పించండి తిరుపతి అర్బన్: బ్యాంక్ డిజిటల్ సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం నాబార్డు రుణప్రణాళిక పోస్టర్‌ను కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్‌తో కలిసి బ్యాంక్ అధికారులు ఆవిష్కరించారు. రూ.18,032 కోట్లతో నాబార్డు రుణ ప్రణాళికలను శాఖల వారీగా కేటాయింపుల ను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు సూచనల మేరకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్తృతం చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డిజిటల్ లావాదేవీల్లో పిన్, పాస్వర్డ్, సీవీవీ విషయంలో గోప్యత పాటించాలని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ యాప్ లు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంక్, డిజిటల్ సేవలపై అన్నీ బ్యాంకుల ఆధ్వర్యంలో అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నాబా ర్డు జిల్లా మేనేజర్ సునీల్, ఎల్డీఎం విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్జిల బదిలీ చిత్తూరు అర్బన్: చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎస్పిడి.వెన్నెలను గుంటూరు జిల్లా రేపల్లెకు, ఈమె స్థానంలో పీలేరులో పనిచేస్తున్న కె.రవిను చిత్తూరుకు బదిలీ చేశారు. మదనపల్లె ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి.వెంకటేశ్వర్లును అనంతపురం జిల్లా హిందూపురానికి , ఈయన స్థానంలో కృష్ణా జిల్లా గన్నవరంలో పనిచేస్తున్న కె.జయలక్ష్మిను నియ మిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. డ్రోన్లను సద్వినియోగం చేసుకోండి తిరుపతి అర్బన్: రైతులకు అందిస్తున్న డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్‌రావు వెల్లడించారు. బుధవా రం తిరుపతి రూరల్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో డ్రోన్లకు చెందిన కిసాన్ డ్రోన్ ఫామ్ మిషనరి బ్యాంక్ గ్రూపుల కన్వీనర్, కో కన్వీనర్లకు వాడకంపై అవగాహన కల్పించారు. జిల్లాకు 36 డ్రోన్లు మంజూరైన నేపథ్యంలో వాటిని త్వరలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో డ్రోన్ రూ.10 లక్షలు విలువ చేస్తోందని వెల్లడించారు. అందులో 80 శాతం రాయితీ ఉంటుందని స్పష్టం చేశారు. ఓ క్రమపద్ధతిలో డ్రోన్లు వాడుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఈ కార్యక్రమలలో లీడ్ బ్యాంక్ మేనేజర్ విశ్వనాథరెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆర్‌ఏఆర్‌ఎస్ సుమతి, ఎస్సీ వెల్పేర్ జిల్లా అధికారి విక్రమకుమార్‌రెడ్డి, ఎస్టీ వెల్పేర్ జిల్లా అధికారి రాజ్సోము తదితరులు పాల్గొన్నారు.కళ్లాల్లోనే విక్రయం రైతులు ధాన్యాన్ని కళ్లాల్లో అరబెట్టుకుని స్టాక్ చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ, ధరలు తగ్గిపోతాయన్న భయంతో ఎంతోకొంత నష్టపోయినా పరవాలేదని కళ్లాల్లోనే ధాన్యం విక్రయిస్తూ, నష్టాలను మూటగట్టుకుంటున్నారు. యంటీయూ–1010, ఎన్‌ఎల్‌ఆర్–145, ఆర్ఎన్ఆర్ఎం–7, ఎన్‌ఎల్‌ఆర్ 34449, బీపీటీ–5240, ఎన్‌ఎల్‌ఆర్–33358, ఎన్‌ఎల్‌ఆర్ 33057 రకాల ధాన్యం గ్రేడ్–ఏ రకంగా గుర్తించి క్వింటాల్ రూ.2,320 మద్దతు ధరను అధికారులు ప్రకటించారు. అలాగే యంటీయూ–1001, సీఆర్–1009, ఎన్‌ఎల్‌ఆర్–34242, ఏడీటీ–37, ఎన్‌ఎల్‌ఆర్–286000 రకాలను సాధారణ రకంగా గుర్తించి క్వింటాల్ రూ.2,300 మద్దతు ధర ప్రకటించారు. నెమ్ము కింద ఒక కిలో, గోనెసంచె కింద మరో కిలో, తరుగుల కింద మరో రెండు కిలోలు తీసేసి, బస్తాకి 79 కేజీలు ధాన్యం తీసుకుంటామని కొనుగోలు కేంద్రాల్లో చెప్పడంతో అదేదో మిల్లర్లకే ఇచ్చేస్తే అక్కడికక్కడే డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో సన్న, చిన్న కారు రైతులు కళ్లాల్లోనే ధాన్యం అమ్మేశారు. పెద్ద రైతులు సొంత గోదాములు తమ ధాన్యం నిల్వ చేసుకున్నారు. మరికొంతమంది రైతులు ఏఎంసీ గోదాముల్లో అద్దె చెల్లించి ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 34,300 మెట్రిక్ టన్నులు ధాన్యం గోదామ్ల్లో పూర్తిస్తాయిలో నిల్వ చేసుకున్నారు. సూళ్లూరుపేట: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు నామామాత్రంగా మారాయి. కర్షకులు పండించిన ధాన్యం కొండంత కాగా ఈ కేంద్రాల్లో కొనుగోలు చేసింది గోరంత మాత్రమే. గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి, రైతులకు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు నగదు ఇవ్వకపోగా ఈ ఏడాది జనవరి చివరి వారం నుంచి వరి కోతల సీజన్ ప్రారంభమైనప్పటికీ మార్చి మొదటి వారం వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేసిన ధాఖలాల్లేవు. దీంతో మిల్లర్లు దళారులను రైతుల వద్దకు పంపి, తక్కువ ధరలకు ధాన్యం కోనుగోలు చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. అందని ధాన్యం నగదు? పలువురు రైతులకు ఇంకా గత ఏడాది విక్రయించిన ధాన్యానికి సంబంధించి నగదు అందలేదు. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో 16 మార్కెటింగ్ కమిటీల పరిధిలో 213 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 774 పంచాయతీల్లో ఈ ఏడాది జిల్లాలో 2.07 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఎకరానికి సరాసరిన 30 బస్తాల దిగుబడిని వచ్చినా 4.90 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. అయితే మండలానికి రెండు వేల నుంచి 2,500 టన్నుల ధాన్యం మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేశారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లోని 7,384 మంది రైతుల నుంచి 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంఽధించి రైతుల నుంచి రూ.152 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 6,368 మంది రైతులకు రూ.120.52 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. మరో 634 మంది రైతులకు రూ.12.76 కోట్లు బిల్లులు ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా 832 మంది రైతులకు రూ.18.72 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన మొత్తం విడుదల వారీగా జమ చేస్తున్నారు. ఇందులో చాలామంది రైతులకు బ్యాంకుల్లో జీరో ఖాతాలు అయినందున వాటి పరిమితి రూ.2 లక్షల వరకే ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం విక్రయించిన రైతులు బ్యాంక్ ఖాతాలు తెరవడంలో ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని వివరాలు సక్రమంగా ఉంటే నగదు జమ అవుతోందని, బ్యాంక్ ఖాతాల్లో ఏవైనా సాంకేతిక పరమైన సమస్యలున్న వారికి ఇంకా డబ్బులు పడలేదని వ్యవసాయాఽధికారులు చెబుతున్నారు. కళ్లాల్లోనే ఆరబెట్టిన ధాన్యం(ఫైల్) తిరుపతి అర్బన్: తాతయ్యగుంట గంగమ్మ జాతరను వేడుకగా నిర్వహిద్దామని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం తిరుపతి కమిషనర్ నారపురెడ్డి మౌర్య, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలసి అధికారులతో సమావేశం అయ్యా రు. మాట్లాడుతూ తిరుపతి గంగమ్మజాతర రాష్ట్ర పండుగ అయిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించడానికి అధికారులు అంతా సమష్టిగా ఓ ప్రణాళికాబద్దంగా పనిచేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మే 6 నుంచి 14వ తేదీ వరకు జాతర జరుగుతుందని చెప్పారు. భకు లు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో తాగునీటి వసతి, క్యూలైన్ నియంత్రణ, కంట్రోల్ రూం ఏర్పాటు, పా ర్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు, అంబులెన్స్‌లు, విద్యుత్తు సరఫరా, ఫైర్ సే ఫ్టీ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మా ట్లాడుతూ ఇప్పటి నుంచే పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవిమనోహరాచారి, ఆర్డీఓ రామమోహన్,గంగమ్మ ఆలయ ఈఓ జయకుమార్, జిల్లా దేవాదాయశాఖ అధికారి వెంకటకృష్ణారెడ్డి, అగ్నిమాపక అధికారి రమణయ్య, సెట్విన్ సీఈఓ వె ూహన్కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వే ష్, ట్రాన్స్‌కో ఈఈ చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. నిబంధనల మేరకే ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రభుత్వ భూములైనప్పటికీ జీఓ నంబర్ 30 ప్రకా రం పేదల ఆధీనంలో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ నిబంధనల మేరకే చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన జేసీ శుభం బన్సల్‌తో కలసి ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మాట్లాడారు. జీఓ నంబర్ 30 నిబంధనలు అమలు చేయాలని తహసీల్దార్లకు ఇ ప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చామని చెప్పారు. 2019 అక్టోబర్ 15వ తేదీకి ముందు తమ అధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలను పేదలకు అందించడానికి నామమాత్రపు ధరలు కట్టించుకుని, వారికి శాశ్వతంగా అప్పగిస్తామన్నారు. ఆమేరకు వారు ఆ స్థలాలను రిజిస్ట్రేషన్లు సైతం చేయించుకోవచ్చని చెప్పారు. రిజిస్ట్రేషన్ల చేయించుకున్న రెండేళ్ల తర్వాత ఆ స్థలాలు విక్రయించుకునే హక్కు వారికి వస్తుందన్నారు. సాక్షి టాస్క్‌ఫోర్స్: ఓ పక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏమో గోశాల సందర్శనకు రండి అంటూ భూమన కరుణాకరరెడ్డికి ఛాలెంజ్ విసిరారు.. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన భూమన రేపు వారు కోరిన విధంగా ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాల వద్దకు వస్తానని అంగీకరించారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో.. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గోశాల వద్ద నిరసన చేపట్టడానికి పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఉదయం 9 గంటలకు గోశాల వద్దకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇదేం నాటకం నానీ గారు.. మీ అధ్యక్షుడు రమ్మంటారు..? మీరేమో అడ్డంకులు సృష్టిస్తారు..? ఇంకో పక్క తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరులతో వైఎస్సార్ సీపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఉదయం 8 గంటలకు తమ కార్యకర్తలను గోశాల వద్ద మోహరింపజేసి అక్కడ అడ్డుకుని రసాభాస చేయాలని పక్కా ప్లాన్ కూడా వేసుకున్నట్టు తెలుస్తోంది. నిజం మీ వైపు ఉంటే భయమెందుకు..? ఇన్ని కుట్రలు ఎందుకు..? కూటమి నాయకులారా చెప్పండి..? కూటమి పార్టీల కుటిల రాజకీయం చూస్తున్న ఎవరికై నా నిజం ఎవరివైపు ఉందో అర్థమైపోతుంది. మీలో నిజాయితీ ఉంటే నిజాన్ని నిర్భయంగా భూమన కరుణాకరరెడ్డితో చర్చించడానికి ఎందుకు జంకుతున్నారు? ఎందుకు గురువారం రసాబాసా చేయాలని మీ కార్యకర్తలను పోగేస్తున్నారు..? ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే అసలు గోశాలలో రేపు ఏం జరగబోతుందోనన్న భయం పోలీసులను వెంటాడుతోంది. మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్వర్ – 8లో– 8లోన్యూస్రీల్కొనుగోలు కేంద్రాలున్నా ప్రయోజనమేదన్నా.. నామమాత్రంగా ధాన్యం కొనుగోలు రైతులకు ఇంకా అందని నగదు దళారులు, మిల్లర్లకు ప్రయోజనం చేకూర్చిన కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో అన్నదాతలు -
ఎన్‌ఎస్‌యూలో యూజీసీ బృందం పర్యటన
తిరుపతి సిటీ:జాతీయ సంస్కృత వర్సిటీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రాజభాషా సమితి బృందం బుధవారం విస్తృత పర్యటన చేపట్టింది. ఇందులో భా గంగా వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, అధికారుల తో బృందం సభ్యులు డాక్టర్ కిశోర్ కుమార్, వీకే సుదర్శన దేవి సమావేశమయ్యారు. వర్సిటీలో రాజభాషగా ఉన్న హిందీ భాషను కార్యాలయ ఆదేశాలలో ఎంత వరకు అమలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ వర్సిటీలో రాజభాష హిందీ అమలు తీరు సంతృప్తి కరంగా ఉందన్నారు. రాజభాషా సమితి ద్వారా హిందీ భాష అమలులో భాగంగా విశ్వవిద్యాలయానికి రాజభాషా నాయక్ పురస్కారం లభించడం విశ్వవిద్యాలయ పనితీరుకు తార్కాణమని తెలిపారు. అకడమిక్ డీన్ రజనీకాంత శుక్లా, పరీక్షల నియంత్రణాధికారి సాంబశివ మూర్తి, ప్రొఫెసర్ సీ రంగనాథన్, రాజభాష విభా గం అధ్యక్షుడు డాక్టర్ లతా మంగేష్, సభ్యులు చారుకేశ్, వేద ప్రకాష్, బాలాజీ, హరినారాయణ పాల్గొన్నారు. -
ఎన్బీకేఆర్ ఐఎస్టీలో జపాన్ బృందం పర్యటన
కోట:విద్యానగర్ ఎన్బీకేఆర్ ఐఎస్టీలో బుధవారం జపాన్‌కు చెందిన మెడిన్‌షా కార్పోరేషన్ కంపెనీ ప్రతినిధుల బృందం పర్యటించింది. ఎన్బీకేఆర్ ఐఎస్టీకి 2018 నుంచి మెడిన్‌షా కంపెనీతో నైపుణ్య బదలాయింపుపై ఒప్పందం ఉంది. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు విచ్చేశారు. కళాశాల డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి వారికి సాదరంగా స్వాగతం పలికారు. ఎన్బీకేఆర్ ఐఎస్టీకి వారు అందిస్తున్న స్కిల్ ట్రాన్స్ఫర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ వకూయి మాట్లాడుతూ జపాన్ సాయంతో బుల్లెట్ ట్రైయిన్ అహ్మదాబాద్ టూ ఢిల్లీ ఏర్పాటు కానున్న క్రమంలో అందులో తమ కంపెనీ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. రానున్న పది సంవత్సరాల్లో తమ కంపెనీ ద్వారా అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్బీకేఆర్ ఐఎస్టీలో ఈ ఏడాది మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ కిషంధర్ పాల్గొన్నారు. మహిళా వర్సిటీలో ఐఎస్ఓ బృందం తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీలో ఐఎస్ఓ బృందం బుధవారం పర్యటించింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో తొలిరోజు బుధవారం వర్సిటీలో పలు విభాగాలలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధానంగా వర్సిటీలో ఆధునాతన సౌకర్యాలు, నాణ్యతా ప్రమాణాలు, అకడమిక్ విద్య, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆరా తీశారు. పలు విభాగాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను, విద్యాప్రమాణాలను, రికార్డులను పరిశీలించారు. గురువారం వర్సిటీ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఐఎస్ఓ సర్టిఫికేషన్‌ను అందించే అవకాశం ఉంది. గాలీవాన బీభత్సం కలువాయి(సైదాపురం): కలువాయి మండలంలో పలు గ్రామాల్లో బుధవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. గాలీవానకు తెలుగురాయపురం నుంచి కోటితీర్థం గ్రామానికి వెళ్లే దారిలో తాటిచెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో ఈ మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 13 కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ టీబీసీ వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,543 మంది స్వామివారిని దర్శించుకోగా 21,346 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది. -
అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయండి
చిల్లకూరు: గూడూరు నియోజకవర్గంలో అక్రమ మై నింగ్ అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుందని, దీ నికి అడ్డుకట్ట వేయాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనను ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కో రారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సబ్ కలెక్టర్‌ను ఆయన కలిశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఐదు రోజుల కిందట గూడూరు మండలం చెన్నూరు రెవెన్యూ పరిధిలోని తుంగపాళెం సమీపంలో ఉన్న శ్రీనివాసమైనింగ్లో తెల్లరాయి అక్రమంగా తవ్వి, తరలిస్తున్నా రని తెలిసి, అక్కడ మైన్‌ను పరిశీలించేందుకు బయలుదేరామన్నారు. దీనికి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకుని గృహ నిర్భందం చేశారని తెలిపారు. శ్రీనివాసమైన్లో అక్రమ మైనింగ్ కొనగసాగుతుందనడానికి పలు నిదర్శనాలున్నాయని, దీనిపై గనుల శాఖ మ్నికుండి పోవడంతోనే ప్రభుత్వ ఆదాయానికి గండి పడి అక్రమమార్కుల జేబులు నిండుతున్నాయన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని కోరారు. రోజూ టన్నుల కొద్ది తెల్లరాయి తరలించేస్తున్నారని తెలిపారు. అ క్రమ తవ్వకాలకు ఊతమిస్తూ రెవెన్యూ, పోలీస్, గనులశాఖాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని తెలిపారు. ఎప్పుడో మూత పడిన మైన్‌కు అనుమతులు ఎలా ఉన్నాయని గనులశాఖాధికారులను అడిగితే గతంలో మైన్‌లో నిలిచి పోయి ఉన్న మెటీరియల్‌ను తరలించుకునేందుకు వారికి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారన్నారు. దీంతో సబ్‌కలెక్టర్ గనులశాఖ ఏడీ శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మైన్‌కు సంబంధించిన అనమతి పత్రాల ను తనకు ఇవ్వాలని చెప్పడంతో గనులశాఖ ఏడీ నీళ్లునములుతూ ముక్తసరిగా సమాధానం ఇవ్వడంతో సబ్ కలెక్టర్ కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వివరాలు తెలుసుకుని, చర్యలు చేపడతామన్నారు. చేవూరు విజయమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇస్రో ఆధ్వర్యంలో ఆర్ఎల్వీ అభివృద్ధి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆర్బిటల్ రీ–ఎంట్రీ ఎక్స్పరిమెంట్ డిప్లాయిబుల్ లాండింగ్ గేర్(ఆర్ఎల్వీ)ను అభివృద్ధి చేస్తోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్, విక్రమ్ సారాభాయ్ స్సేస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్, ఐఐఎస్‌యూ డైరెక్టర్ పద్మకుమార్ సమక్షంలోని ల్యాండింగ్ గేర్ డ్రాప్ టెస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. విమానం తరహాలో రెక్కలు కలిగిన పునర్వినియోగ లాంచింగ్ వెహికల్ పుష్పక్ కోసం డిప్లాయిబుల్ ల్యాండింగ్ గేర్ సిస్టం పరీక్ష అర్హత కోసం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)లో అత్యాధునిక ల్యాండింగ్ గేర్ డ్రాప్ట్ టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు. అయితే పుష్పక్ వాహనం ఆరోహణ క్రమంలో కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కొన్ని కక్ష్యల తరువాత పుష్పక్ వాతావరణంలోకి ప్రవేశించి డిప్లాయిబుల్ ల్యాండింగ్ గేర్ సిస్టంను ఉపయోగించి రన్‌వేపై ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్ గేర్ డ్రాప్ సౌకర్యానికి టెలిస్కొపిక్, ఆర్టిక్యులేటెడ్, సెమీ ఆర్టిక్యులేటెడ్ వంటి వివిధ రకాల ల్యాండింగ్ గేర్లను పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. తారు, కాంక్రీట్, పొడి, తడి, మంచుతో నిండిన ఉపరితలాల వంటి విభిన్న రన్‌వేలపై ల్యాండింగ్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే భవిష్యత్తులో చంద్రుడిపై వ్యోమగాములను పంపి, తిరిగి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగానే ఈ ప్రయోగాత్మక పరీక్షలను చేస్తున్నామని కూడా ఇస్రో తెలియజేసింది. అధునాతనమై ఆర్ఎల్వీలు, విమాన సాంకేతికతల అభివృద్ధి అర్హతను వేగవంతం చేసే సామర్థ్యాన్ని ఇస్రో కలిగి వుంది. -
న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం
● తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి రేణిగుంట: శ్రీకాళహస్తి మండలం పోలి భీమవరానికి చెందిన చిన్నమనాయుడు భార్య సంధ్య కుటుంబానికి అండగా నిలబడి, న్యాయం కోసం న్యాయస్థానం ఆశ్రయిస్తామని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు. పోలి భీమవరం గ్రామానికి చెందిన సంధ్య అనే మహిళ, ఆమె భర్త చిన్నమనాయుడితో శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహరావు అవమానకరంగా ప్రవర్తించి, దాడి చేసినా చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై వారు బుధవారం తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీని కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమనే కక్షతో పోలీసులు తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని, ఈనెల 11వ తేదీన ఉదయం ఎస్ఐ నరసింహరావు నేరుగా ఇంటికి వచ్చి సంధ్యను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి వారి ప్రత్యర్థులతో కొట్టించారని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీ మాట్లాడుతూ ఇది అత్యంత దుర్మార్గపు చర్య అన్నారు. శాంతి,భద్రతలను కాపాడాల్సిన స్థాయిలో ఉన్న పోలీసులే గ్రామాల్లో వర్గ, వైషమ్యాలను రెచ్చగొట్టి, మహిళపై పరుష పదజాలంతో దూషిస్తూ, ఆమైపె దాడికి దిగడం దౌర్భాగ్యమన్నారు. ఇంత జరిగినా ఆయనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ఎటుబోతోందని ప్రశ్నించారు. న్యాయం జరగకపోతే వైఎస్సార్ సీపీ బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బాధిత మహిళ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక, తమపై కక్ష కట్టి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తన భర్త వైఎస్సార్ సీపీ కార్యకర్త కావడంతోనే తమ కుటుంబంలో అందరిపైనా తప్పుడు కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇంటర్ చదివే తన కుమారుడిపైనా కేసు పెట్టి భవిష్యత్తును నాశనం చేశారని ఆమె ఎంపీ ముందు వాపోయింది. దీంతో ఆయన వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. -
● అలంకారప్రాయంగా 80 శాతం ఏటీఎంలు ● డిపాజిట్ మిషన్లూ పనిచేయడం లేదు ● నగరవాసులకు నగదు పాట్లు వర్ణనాతీతం ● లబోదిబోమంటున్న ఖాతాదారులు
శ్రీనివాసపురంలో పనిచేయని ఏటీఎం ఆర్టీసీ బస్టాండ్‌లో ఏటీఎం వద్ద నో క్యాష్ బోర్డు తిరుపతి అర్బన్: ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం తప్పనిసరయ్యాయి. ఉద్యోగులు, వ్యాపారులు, పెన్షనర్లు, విద్యార్థులు ఇలా అందరూ నేడు బ్యాంకులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో అన్ని వేళలా ఉపయోగపడాల్సిన ఏటీఎంల సేవలు మృగ్యమయ్యాయి. ఎక్కడ ఏటీఎంకు వెళ్లినా ‘అవుట్ ఆఫ్ సర్వీస్’ అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నారు. పనితీరు అధ్వాన్నం జిల్లాలో ఏటీఎంల పనితీరు అధ్వాన్నంగా ఉంది. నిత్యం బ్యాంకుల్లో రద్దీ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఖాతాదారుడికి ఏటీఎంతోపాటు చెక్‌బుక్‌లు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల యుగంలో ఏటీఎంల వాడకం ఎంతో సౌలభ్యమే. తిరుపతి నగరంలోనే 200కు పైగా ఏటీఎంలున్నాయి. అయితే అందులో 80 శాతం ఏటీఎంలు సక్రమంగా పనిచేయడం లేదు. గుర్తింపు పొందిన బ్యాంకుల ఏటీఎంలు సైతం అలంకారప్రాయంగా మిగిలిపోతున్నయనే చర్చసాగుతోంది. ఈ ఏటీఎంల కన్నా బ్యాంకులే నయమంటూ పలువురు ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో 20 వరకు ఏటీఎం నగదు డిపాజిట్ మిషన్లు ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారిందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా వరుసగా సెలవుదినాలు వచ్చి సందర్భంగా ఓ వైపు బ్యాంక్‌లు లేక...మరోవైపు ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఖాతాదారులు తిప్పులు పడుతున్నారు. ప్రధానంగా డిపాజిట్ మిషన్లు పనిచేయకపోవడంతో తంటాలు తప్పడం లేదు. జిల్లా సమాచారం జిల్లాలో బ్యాంకులు 521 జిల్లాలో ఏటీఎంలు 318 జిల్లాలో పనిచేయని ఏటీఎంలు 80 శాతం ఎప్పుడూ నగదులేని ఏటీఎం 20 శాతంసమర్థవంతంగా పనిచేయలేదు ఏటీఎంలు సమర్థవంతంగా పనిచేయడం లేదు. ఒక రోజు పనిచేస్తే నాలుగు రోజులు పనిచేయడం లేదు. పనిచేసేనా నగ దు ఉండడం లేదు. ఒక్కొక్కసా రి నగదు కోసం పది ఏటీఎంలకు తిరిగిన సందర్భాలున్నాయి. అయినా ప్రయోజనం ఉండడం లేదు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎంలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఖాతాదారుల కష్టాలను గుర్తించాల్సి ఉంది. – నరేంద్రయాదవ్, బ్యాంక్ ఖాతాదారుడు, రేణిగుంట గూడూరులోనూ అలంకారప్రాయమే గూడూరులోనూ ఏటీఎంలు అ లంకారప్రాయంగానే మారా యి. నగదు ఉండడం లేదు. ఓ ప్లానింగ్ ప్రకారం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగదును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే కొందరు పట్టించుకోవడం లేదు. ఖా తాదారులను అవసరాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. బ్యాంక్ వద్దకు వెళ్లి నగదు డ్రా చేస్తున్నారు. డిపాజిట్ చేయాలన్నా బ్యాంక్‌కు వెళ్లుతున్నారు. –హేమంత్ కుమార్, బ్యాంక్ ఖాతాదారుడు, గూడూరు ఎక్కడికెళ్లినా నోక్యాష్ ఏ ఏటీఎంకు వెళ్లినా నోక్యాస్ బోర్డులు పెట్టి ఉన్నారు. తిరుపతిలో మంగళవారం పలు ఏటీఎంలకు వెళ్లాం. అయితే పలు ఏటీఎంలు పనిచేయడం లేదు. కొన్ని ఏటీఎంలు నగదు లేదు. దీంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. కనీసం తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఏటీఎంల్లోనూ నగదు ఉండడం లేదు. – జనార్థన్‌రెడ్డి, బ్యాంక్ ఖాతాదాడురు, తిరుపతి -
పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?
అధిక శాతం బ్యాంకులు ఏటీఎం నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. ఎక్కువ బ్యాంకులు ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ల నిర్వహణను నెట్వర్క్ సంస్థలకు అప్పగించాయి. వీటిలో నగదు నింపడం, మరమ్మతులు నెట్వర్క్ సంస్థలే చూస్తున్నాయి. ఆ సంస్థలు పట్టించుకోకపోవడంతోపాటు ఏటీఎంలు పని చేయని విషయాన్ని వినియోగదారులు బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లితే.. అధికారులు నెట్ వర్క్ సంస్థలకు సమాచారమందించి మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. ఫలితంగా ఏటీఎంపై బ్యాంకుల పర్యవేక్షణ కొరవడి, వాటి పనితీరు అధ్వాన్నంగా మారుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
త్వరలో పారదర్శకంగా బదిలీలు
తిరుపతిలో స్పోక్స్ మోడల్ హబ్ తిరుపతిలో స్పోక్ మోడల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అందుకు స్థల పరిశీలన చేశారు.అరాచక శక్తులపై చర్యలు ఐటీడీపీ అరాచక శక్తులపై చర్యలు తీసుకోవాలని పెళ్లకూరు జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా కోరారు.బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోపది నెలలుగా అన్నీ అపచారాలే.. ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి. వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. తిరుమలలో మద్యం మత్తులో వీరంగం చేస్తున్న యువకుడు(ఫైల్)అపచారాలకు అడ్డుకట్ట వేయలేరా? కొన్ని నెలలుగా తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న దారుణమైన ఘటనలకు టీటీడీ అధికారులు అడ్డుకట్ట వేయకపోవడం విచారకరం. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మద్యం, మాంసం, బహిరంగంగా దొరకడం అపచారం. తిరుమలలో అకతాయితీలు మద్యం సేవించి గొడవలు పడిన సంఘటన బాధించే అంశం. టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై వస్తున్న వార్తలు గో ప్రేమికులు, శ్రీవారి భక్తులను మరింత క్షోభకు గురిచేశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు చేపట్టాలి. లోపాలను ఎత్తి చూపడం భక్తుల బాధ్యతగా అధికారులు గుర్తించాలి. – తుమ్మ ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమతి అధ్యక్షులు, తిరుపతి వివరణ కాదు.. విచారణ జరపాలి టీటీడీ అధికారుల నిర్ల క్ష్యం కారణంగా గోశాల లో గోవులు అధిక సంఖ్య లో మరణించాయని వస్తు న్న ఆరోపణలపై టీటీడీ అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇవ్వడం దారుణం. వాటి పై వాస్తవాలను వెలికితీసేందుకు విచారణ చేప ట్టి నిజాలను నిగ్గు తేల్చాలి. మూగజీవులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడం, అనారోగ్యానికి గురికావడం భక్తుల, జంతు ప్రేమికుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తక్షణం అఖిలపక్షం ఆధ్వర్యంలో పరిశీలన జరపాలి. నిర్లక్ష్యం కారణమైతే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి గొంతు నొక్కడం భావ్యమా? టీటీడీలో ప్రతినిత్యం ఏ దో ఒక అపచారం జరగ డం బాధించే అంశం. అధికారులు బేషాజాలకు పోకుండా భక్తుల మనోభావాలను కాపాడాలి. నిషేధి త వస్తువులను తిరుమలకు చేరకుండా పటిష్ట తనిఖీలు నిర్వహించాలి. పార్టీలకతీతంగా శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగితే లోపాలను ఎత్తి చూపడం భక్తుల హక్కు, కర్తవ్యం కూడా. అలాంటి లోపాలు జరిగినప్పుడు వెంటనే అధికారులు వాటిని సరిదిద్దేందుకు సిద్ధపడాలే తప్ప, గొంతు నొక్కడం, కేసులు బనాయించడం విచారకరం. – నరసింహులు, స్థానిక భక్తుడు, తిరుపతినేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అసెంబ్లీ పద్దుల కమిటీ రాక– జిల్లాలో రెండు రోజుల పర్యటన తిరుపతి అర్బన్: రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా అసెంబ్లీ పద్దుల కమిటీ బుధవారం తిరుపతి జిల్లాకు రానుందని తిరుపతి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావుతోపాటు 11 మంది సభ్యులతో కూడిన పద్దుల కమిటీ సభ్యులు బుధవారం తెల్లవారుజామున 5.15 గంటలకు తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారని చెప్పారు. అనంతరం 11 గంటలకు బయలుదేరి చిత్తూరు జిల్లా సమీక్ష ముగించుకుని, సాయంత్రం 5.30 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7.30 గంటలకు తిరుమల చేరుకుని రాత్రి బస చేిస్తారని చెప్పారు. 17వ తేదీ గురువారం ఉదయం శ్రీ వారి దర్శనం చేసుకుని, 10 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని 11.30 గంటలకు టీటీడీ ఈఓ శ్యామలరావుతోపాటు పలువురు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5.15 గంటలకు రైలులో విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని పేర్కొన్నారు. మానవ సేవే లక్ష్యం కావాలి తిరుపతి తుడా: వైద్య విద్యార్థులకు మానవ సేవే మాధవసేవ అనే దృక్పథంతో పని చేయాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్విమ్స్ ఆస్పత్రిలో నూతనంగా పీజీ అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షలో ప్రతిభ కనబరచిన ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని నీట్లో ప్రతిభ చూపి పీజీ కోర్సులు అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు అభినందనలు తెలిపారు. భగవంతుని స్వరూపమైన టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో పీజీ చదవడం దేవుని వరమని తెలిపారు. విద్యనభ్యసిస్తూ పేదలకు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ యర్రం రెడ్డి, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. కలియుగ వైకుంఠం.. పరమ పవిత్రం..ఆధ్యాత్మిక నిలయం..భక్తులకు అది అపురూపం.. అంతటి తిరుమల క్షేత్రం నేడు అపవిత్రం.. మద్యం, మాంసం, పాదరక్షలతో ఆలయ ప్రవేశ యత్నం.. గోశాలలో గో మరణ మృదంగం.. శ్రీవారి ఆలయంపై డ్రోన్ల సంచారం ఒకటేమిటీ వరుస సంఘటనలు చోటు చేసుకోవడం మహా అపచారం.. వెరసి భక్తుల దెబ్బతిన్న మనోభావం.. ప్రశ్నించిన గొంతు నొక్కే ప్రయత్నం.. ఎదురుదాడి.. తమ పాపం ఎదుటి వారిపై నెట్టే ప్రచారం జరుగుతోంది. ఏడుకొండలపై అసలేం జరుగుతోంది.. ఏమై పోతోంది.. అంతా సత్యం వధ.. ధర్మం చెరేనా? అని భక్తులు మదనపడుతున్నారు. ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా? ● లోపాలను ఎత్తి చూపితే.. పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే ● భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి ● ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం దారుణం ● తిరుమలలో అపచారాల కట్టడికి చర్యలు తీసుకోలేరా? ● 10 నెలలుగా సాక్షాత్తు తిరుమలలో జరిగిన ఘటలకు బాధ్యులెవరు? ● ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం అపచారాలను అడ్డుకోవాలి ● టీటీడీ అధికారులకు స్థానికులు, భక్తులు, మేధావుల హితవు తిరుపతి సిటీ: కలియుగ వైకుంఠంలో గత పది నెలలుగా సత్యం వధ.. ధర్మం చెరగా పాలన సాగుతోంది. దీన్ని ప్రశ్నించే గొంతుకలపై ఎదురుదాడి జరుగుతోంది. ఆధ్యాత్మిక సంస్థలో జరిగే లోటుపాట్లు సున్నిత పరిష్కారానికి చర్యలు లేకపోగా.. టీటీడీలో పచ్చపాలకులు, ఏజెంట్లు, అల్లరి మూకలు చేస్తున్న తప్పిదాలను రాజకీయకోణంలో చూపుతూ ప్రత్యర్థులపై నెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తే అసలు తిరుమల, తిరుపతి దేవస్థానంలో ఏమి జరుగుతోంది.. అసలు తిరుమల.. ఆధ్యాత్మిక క్షేత్రమా.. పచ్చ పాపాలకు వ్యాపార నిలయమా?.. అని భక్తులు మనోవేదనకు గురికావాల్సిన దుస్థితి నెలకొంటోంది. రాజకీయ ఏజెంట్లుగా అధికారులు టీటీడీలో జరుగుతున్న అపచారాలను కప్పిపుచ్చేందుకు పచ్చనేతలు ఆ ధార్మిక సంస్థలో అధికారులనే రాజకీయ ఏజెంట్లుగా మార్చుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే వారు పవిత్ర పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అపచారాలను ఎత్తి చూపితే.. వాటిని పక్కదారి పట్టించేందుకు సాక్షాత్తు కార్యనిర్వాహణాధికారి స్థాయి అధికారులే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అలాగే వారు చేసిన నేరాలు ప్రశ్నించే వారిపై నెట్టేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తూ వారికి అనుకూల మీడియాల్లో ప్రచారం చేస్తూ టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. పనులు అడ్డుకున్న గ్రామస్తులు చిల్లకూరు: తీర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న క్రిస్ సిటీ కోసం సేకరించిన భూములకు పరిహారం అందివ్వకుండా రోడ్డు పనులు చేస్తుండడంతో మంగళవారం తమ్మినపట్నం గ్రామస్తులు అక్కడకు చేరుకుని పనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్ సిటీ కోసం తాము సాగు చేసుకునే భూములను సేకరించి పరిహారం ఇవ్వకనే పనులు చేపట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. దీంతో ఆ ప్రాంతానికి తహసీల్దార్ శ్రీనివాసులు, వీఆర్ఓ బాలాజీ చేరుకుని గ్రామస్తులకు సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్ టీబీసీ వద్దకు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 73,078 మంది స్వామివారిని దర్శించుకోగా 25,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుపతి క్రైమ్: తిరుపతి జిల్లా పరిధిలో ఐదేళ్లు దాటిన ప్రతి సిబ్బందికి త్వరలో పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జిల్లా పురోగతిపై అదనపు ఎస్పీలు, సబ్ డివిజన్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాటు ఒకే స్టేషన్లో పని చేసిన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా బదిలీలు చేపడతామన్నారు. సిబ్బంది పనితీరు ఆధారంగా బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే రాత్రి సమయంలో బీట్లు తిరిగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. ఎలాంటి అసాంఘిక శక్తులకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. వేసవికాలంలో దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రజలకు భద్రత కల్పించాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు. ప్రతి దేవాలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి, వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు వెంకటరావు, రవి మనోహరాచారి, డీఎస్పీలు సిఐలు పాల్గొన్నారు. – 8లో– 8లోన్యూస్రీల్అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడేనా? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు అపకీర్తి తీసుకువచ్చే చ ర్యలను అధికారులు అడ్డుకో వాలి. మందు, మాంసం, డ్రోన్ కెమెరాల హల్చల్, అ కతాయితీల వికృత చేష్టలను ప్రశ్నించే హక్కు ప్రతి భక్తునికీ ఉంటుంది. వాటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అప చారం జరిగిన ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి పున రావృతం కాకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలి. గోవుల మృతి వార్తలు భకులు, జంతు ప్రేమికులను బాధించాయి. –మహాలక్ష్మి, శ్రీవారి భక్తురాలు, శ్రీకాళహస్తి అధికారుల అప్రమత్తత అవసరం టీటీడీలో తరచూ జరుగుతు న్న ఘటనలు భక్తులను బా ధిస్తున్నాయి. శ్రీవారి సన్నిధి లో ఇలాంటి అపచారాలు జరగకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండి, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. డ్రోన్ కెమెరాలతో ఫొటోషూట్ చేయడం ఎంత అపచారం. డ్రోన్ కెమెరాను ఎలా అనుమతించారో? అధికారులే సమాధానం చెప్పాలి. తిరుమలలో అభద్రతాభావం నెలకొంటే ప్రమాదమే. అధికారులు మేలుకోవాలి. –సెల్వకుమార్, తమిళ భక్తుడు, వేలూరు -
కాల్షియం కార్బైడ్ వాడితే కఠిన చర్యలు
తిరుపతి అర్బన్: మామిడి కాయలు మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్‌ను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆయన మంగళవారం మామిడి జిల్లాస్థాయి అధికారుల కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి కాయలు సహజ సిద్ధంగా మాగడానికి వరిగడ్డిని వాడడంతోపాటు పేపర్ బాగ్స్, నాచురల్‌గా సహజ హార్మోన్ ఎతిలీన్ గ్యాస్ స్ప్రే చేయడం, రిపెనింగ్ ఛాంబర్లో ఎతిలీన్ హార్మోన్ ఉపయోగించి మగ్గబెట్టడం శీతల గిడ్డంగుల్లో కూడా ఎతిలీన్ హార్మోన్ ఉపయోగించి మామిడి పండ్లు మగ్గబెట్టవచ్చని చెప్పారు. మానవులకు ప్రమాదం లేకుండా ఉండే వాటిని మాత్రమే మగ్గబెట్టడానికి వినియోగించాలని ఆదేశించారు. అంతేతప్ప ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే వారికై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పదేపదే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధికారులు శాంపిళ్లు తీసి, పరిశీలించాని స్పష్టం చేశారు. కమిటీలోని ఏడు విభాగాలైన ఫుడ్ సేప్టీ, మార్కెటింగ్, మున్సిపల్, మెడికల్, పంచాయతీ, ఉద్యానశాఖ, ట్రాన్స్పోర్ట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, డీపీఓ సుశీలాదేవి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర్రావు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి, ఫుడ్ సేఫ్టీ అధికారులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
కొండకు ట్రిప్పులు పెంచుదాం
తిరుపతి అర్బన్: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల కొండకు భక్తులు పెరుగుతున్నారు, మరింత పెరిగే అవకాశాలున్నాయని, కొండకు బస్సు ట్రిప్పులు పెంచుదామని డీపీటీఓ నరసింహులు, డిప్యూటీ సీటీఎం విశ్వనాథం మంగళవారం డీపీటీఓ కార్యాలయంలో చర్చించుకున్నారు. ఈ నెల 16 నుంచి అదనపు ట్రిప్పులు తిప్పడానికి నిర్ణయించారు. ప్రస్తుతం 405 సర్వీసులు రోజుకు 1,650 ట్రిప్పులు నడుపుతున్నారు. బుధవారం నుంచి అదనంగా సత్యవేడు డిపోకు చెందిన 9, పుత్తూరు డిపోకు చెందిన 9, శ్రీకాళహస్తి డిపోకు చెందిన 25 సర్వీసులను తిరుమల కొండకు నడపనున్నారు. దీంతో రోజుకు 1950 ట్రిప్పులు తక్కువ లేకుండా కొండకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రస్తుతం తిరుప తి ఏడుకొండల బస్టాండ్‌లో టిక్కెట్ కౌంటర్ ఒక్కటి మాత్రమే ఉందని, భక్తుల రద్దీని బట్టి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత సర్కార్‌లో ఏర్పాటు చేసిన 100 విద్యుత్ బస్సుల్లో 85శాతం సర్వీసులు మాత్రమే వాడుకలో ఉన్నాయి. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యుత్ సర్వీసుల నిర్వాహణాధికారి జగదీష్, అలిపిరి డీఎం హరిబాబుతో మాట్లాడి 85 శాతం నుంచి 95 శాతానికి సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని చర్చించారు. ఈ విషయంపై డీపీటీఓ నరసింహులు మాట్లాడుతూ వేసవి నేపథ్యంతోపాటు విద్యార్థులకు ఏప్రిల్ 23 నుంచి సెలవులున్న క్రమంలో తిరుమల కొండకు అదనపు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే వందశాతం విద్యుత్ బస్సులను వాడుకలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. -
తిరుపతిలో స్పోక్స్ మోడల్ హబ్
● ఏర్పాటుకు ఐఐటీ, ఏపీఐఐసీ భవనాల పరిశీలన తిరుపతి అర్బన్: నగరంలో స్పోక్స్ మోడల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తాత్కాలిక భవనాల కోసం కలెక్టర్‌తోపాటు పలు విభాగాలకు చెందిన అధికారులు మంగళవారం తిరుపతిలో పలు ప్రాంతాలను పరిశీలించారు. తిరుపతిలోని ఐఐటీ, ఏపీఐఐసీకి చెందిన పలు భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌కు అనుసంధానంగా స్పోక్స్ మోడల్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో ఐదు హబ్‌లను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. అందులో తిరుపతి ఒకటని పేర్కొన్నారు. స్పోక్స్ మోడల్ హబ్ విద్యార్థుల నూతన అలోచనలకు దోహదపడుతుందని తెలిపారు. ఆదానీ, అమరరాజా, నవయుగ పరిశ్రమల సహకారంతో ఐఐటీ తిరుపతి సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలతో స్పోక్స్ మోడల్ హబ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీఈసీఓఎస్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీప్తి, ఐఐటీ ఏర్పేడు డైరెక్టర్ సత్యనారాయణ, అమరాజా ఆదోని కంపెనీ ప్రతినిధులు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, చీఫ్ ఆర్కిటెక్చర్ మణి సందీప్, సిఓఓ ఆదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ రాజన్‌బాబు, నవయుగ సీఈఓ సుబ్బారావు, పీడీలు డీఆర్డీఏ, మెప్మాలకు చెందిన శోభన్ బాబు, రవీంద్ర, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సుధాకర్ రావు, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి, డీటీ మాధురి పాల్గొన్నారు. -
ఆడబిడ్డల కష్టాలను చూశా
తిరుపతి అర్బన్: ఆడ బిడ్డల కష్టాలను చూశానని, అందుకే బస్‌పాస్ కేంద్రం మార్పునకు చర్యలు తీసుకున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి నరసింహులు తెలిపారు. ఏడుకొండల బస్టాండ్ వద్ద బస్సుపాస్ కేంద్రాన్ని పునః ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో ఇలా మాట్లాడారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక రోజు ఏడుకొండల బస్టాండ్ వద్ద ఉత్తరం వైపున ఎండలో ఆడబిడ్డలు బస్సుపాస్‌ల కోసం క్యూలో ఉండడాన్ని గుర్తించానన్నారు. ఆ మేరకు మంగళవారం ఏడుకొండల బస్టాండ్‌లోనే దక్షిణం వైపు బస్సుపాస్ కేంద్రాన్ని పునఃప్రారంభించామని వెల్లడించారు. ఈ నెల 30న తాను ఉద్యోగ విరమణ పొందుతున్నామని చెప్పారు. డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథం, ఏటీఎం డీఆర్ నాయుడు, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లాచంద్రయ్య, తిరుపతి డిపో నేత నరసింహులు పాల్గొన్నారు. -
మహిళలపై గౌరవం లేదు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై ఐటీడీపీ అసభ్యకరమైన పోస్టులు పెట్టడం దారుణం. మహిళల మాన,ప్రాణాలకు పూర్తి భద్రత అంటూ ప్రగల్భాలు పలికిన పవన్‌కల్యాణ్‌కు మహిళలపై గౌరవం లేదు. – ఇలకా సుధారాణి, వైస్ ఎంపీపీ, పెళ్లకూరు వలంటీర్లను మోసం చేశారు వలంటీర్ వ్యవస్థను కొనసాగించడమే కా కుండా వేతనం రూ.10 వేలకు పెంచి అండగా నిలుస్తామ ని అబద్దాలు చెప్పి మోసం చేశారు. వలంటీర్ వ్యవస్థను కొనసా గించేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ జీ ఓ లేదని అబద్దాలు చెప్పడం అన్యాయం. వ చ్చే ఎన్నికల్లో సత్తా ఏమిటో కచ్చితంగా చూపిస్తాం. – బిందు, మాజీ వలంటీర్, చిల్లకూరు -
విద్యుదాఘాతంలో పాడి పశువు మృతి
నాగలాపురం: విద్యుత్ షాక్‌కు గురై రెండు పాడి ఆవులు మృతి చెందాయి. బాధితుల కథనం మేరకు.. పిచ్చాటూరు మండలంలోని రెప్పాలపట్టు సమీపంలో తెగి కింద పడి ఉన్న అరణియార్ ప్రాజెక్టు విద్యుత్ తీగలు తగిలి ఆ మార్గంలో మేతకు వెళ్లే పాడి పశువు సంఘటన స్థలంలోనే మృతి చెందింది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. నారాయణ స్కూలుకు షోకాజు నోటీసు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి న్యూబాలాజీ కాలనీలోని నారాయణ స్కూలుకు డీవైఈఓ బాలాజీ మంగళవారం షోకాజు నోటీసు ఇచ్చారు. సరైన అనుమతి పత్రాలు లేకుండా పాఠశాలను నడుపుతున్నట్లు విద్యార్థి సంఘాలు డీఈఓ కేవీఎన్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో డీఈఓ ఆదేశాల మేరకు డీవైఈఓ ఆ పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సరైన రికార్డులు లేకపోవడంతో షోకాజు నోటీసు అందించారు. కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లా వ్యాప్తంగా పలు విద్యాసంస్థలు అనుమతు లు లేకుండా పాఠశాలలను నడుపుతున్నాయని ఎన్‌యూఐ, జీఎన్ఎస్, ఎన్ఎల్ఎస్ఏ విద్యాసంఘాల నాయకులు ఆరోపించారు. నారాయణ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో అనేక పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా టెక్నో, ఈటెక్నో, ఒలంపియాడ్, ఐఐటీ ఫౌండేషన్, సీఓ తదితర పేర్లతో పాఠశాలను నిర్వహిస్తూ లక్షలాది రూపాయలను దండుకుంటున్నారని ఆరోపించారు. తిరుపతి నగరంలో నారాయణ విద్యాసంస్థ కమర్షియల్ భవనంలో అనుమతులు లేకుండా గత 6 నెలల నుంచి పాఠశాలను నిర్వహిస్తుండడం దుర్మార్గమన్నారు. సొంతంగా పుస్తకాలను ముద్రించి, వాటిని అధిక ధరలకు అమ్ముకుంటూ తల్లిదండ్రులను దోచు కుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు జెన్నె మల్లికార్జున, సుందరరాజు, బాలాజీ, చంద్రనాయక్, కుమార్, బాలు పాల్గొన్నారు. -
శ్రీసిటీలో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ క్యాబిన్లు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీలోని బీఎఫ్జీ ఇండియా పరిశ్రమ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల క్యాబినన్లను తయారు చేస్తూ సత్తా చాటుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో 16–కోచ్‌ల రైలు కోసం ఇంటీరియర్స్, మాడ్యులర్ టాయ్‌లెట్ క్యాబిన్లు, ఏరోడైనమిక్ ఫ్రంట్ ఎండ్ల రూపకల్పన, తయారీ, ఇన్స్టాల్ చేయడం లాంటివి చేపడుతోంది. రైలులో 823 బెర్త్‌లు, 51 టాయ్లెట్లు ఉంటాయని బి.ఎఫ్.జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కె.ప్రేమమూర్తి తెలిపారు. మెట్రో ప్రాజెక్టుల్లో కీలకం భారతదేశ మెట్రో రైలు ప్రాజెక్టుల అభివృద్ధిలో బీ.ఎఫ్.జీ కీలక పాత్ర పోషించిందని శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. భారతీయ ప్రతిష్టాత్మక రైల్వే, సముద్ర రవాణాతో సహా బహుళ రంగాలలో శ్రీమేడ్ ఎట్ శ్రీసిటీశ్రీ ఉత్పత్తులను ఉపయోగించడం గర్వంగా ఉందన్నారు. ఫెర్రీ–ఆధారిత పట్టణ రవాణా అయిన కొచ్చి వాటర్ మెట్రోకు కూడా బీ.ఎఫ్.జీ భాగస్వామ్యాన్ని అందించినట్టు ఆయన పేర్కొన్నారు. రేణిగుంటలో మహారాష్ట్ర అధికారుల పర్యటన రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రాష్ట్రంలో రైతుల భూముల రీసర్వే విధానంపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ చొక్కా లింగం సేతులింగం మంగళవారం రేణిగుంట మండలంలో పర్యటించారు. మండలంలోని, గుత్తివారిపల్లి సచివాలయంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్, రేణిగుంట మండల తహసీల్దార్ సురేష్ బాబు వివిధ కేటగిరీల సర్వే అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ముందుగా సర్పంచ్ మంజుల, స్థానిక నాయకులు మునస్వామి నాయుడు, అధికారులకు సాదరంగా స్వాగతం పలికారు. రైతులు పలు భూ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, భూముల రీ సర్వేలో చిన్న చిన్న లోపాలను కూడా పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. అనర్హత వేటుకు సిఫార్సు చేయండి చిల్లకూరు: ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ పార్టీ ఇచ్చిన విప్‌ను ధిక్కరించి, మరో పార్టీకి మద్దతు ఇస్తున్న కౌన్సిలర్లపై అనర్హత వేటు వేసేందుకు సిఫార్సు చేయాలని వెంకటగిరి మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి మంగళవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ శిరీషాను కలిసి విప్‌ను ధిక్కరించిన ముగ్గురు కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు వైఎస్సార్ సీపీ బీఫామ్‌పై గెలిచారన్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో ముగ్గురు కౌన్సిలర్లు పార్టీ విప్‌ను ధిక్కరించి అధికార టీడీపీకి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. విప్‌ను ధిక్కరించిన క్రమంలో పట్ణణంలోని 3,5,7 వార్డులకు చెందిన కౌన్సిలర్లు పీ పద్మావతి, నారి శేఖర్, కే చంద్రశేఖర్‌రెడ్డిపై ప్రభుత్వ పరంగా అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీకి పెట్టని కోటలా ఉందని, ప్రస్తుతం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అండతో పటిష్టంగా ఉండి, భవిష్యత్తులో పట్టణాభివృద్ధికి సహకారం అందించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు. -
రూ.150 కోట్ల భూముల దురాక్రమణకు రంగం సిద్ధం
● అవిలాల వద్ద 17 ఎకరాల భూ ఆక్రమణకు పక్కా స్కెచ్ ● స్థానిక టీడీపీ ముఖ్యనేత అండతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ● అయినా కన్నెత్తి చూడని మఠం అధికారులు ● రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్‌పై గ్రామస్తుల ఆగ్రహం ● ఆందోళనలకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సాక్షి, టాస్క్‌ఫోర్స్: అసలే గద్దలు.. వాటికి ‘అధికార’ రాబందులు తోడయ్యాయి. ఇంకేముంది.. అన్నీ కలిసి ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై వాలిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు కోట్ల రూపాయల విలువైన మఠం భూములను మాయం చేస్తున్నాయి. అభ్యంతరం చెప్పిన హథీరాంజీ మఠం అధికారులపై విరుచుకుపడుతున్నాయి. అసలేం జరిగిందంటే? తిరుపతికి ఆనుకుని ఉన్న అవిలాల, లింగేశ్వర నగర్ ప్రాంతాల్లో 147/1, 148/2 సర్వే నంబర్లలో 17 ఎకరాల భూమి శ్రీహథీరాంజీ మఠానికి చెందినట్టుగా ఆన్లైన్ రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ భూమిని ఆక్రమణదారులు కబ్జాకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఈ భూమి విలువ రూ.150 కోట్లకు పైమాటే. గతంలో ఆ భూమి తమదేనంటూ నరసింహారెడ్డితోపాటు మరికొందరు స్వాధీనం చేసుకోవడానికి పలుమార్లు ప్రయత్నించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. హథీరాంజీ మఠం ఆధీనంలో ఉన్న ఆ భూమిపై పలు కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత స్థానిక టీడీపీ ముఖ్య నేత సహకారంతో ఆ మఠం భూములను కొట్టేయడానికి తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే నరసింహారెడ్డి పేరిట అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. రంగంలోకి చిత్తూరు గ్యాంగ్ ఇప్పటికే ఆక్రమణదారులు, స్థానిక టీడీపీ ముఖ్యనేత మధ్య ఒప్పందం కుదరడంతో చిత్తూరు గ్యాంగ్ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఆ గ్యాంగ్‌ను అడ్డంపెట్టుకుని అతి త్వరలో ఆ మఠం భూములకు కూడా ప్రహరీ నిర్మాణం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే గతంలో రూ.100 కోట్ల విలువైన మఠం భూమి కబ్జాకు గురవగా మరో రూ.150 కోట్ల విలువైన మఠం భూమి ఆక్రమణదారుల పరమవుతుందని అవిలాల వాసులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఉదాసీనత తిరుపతి పరిసరాల్లోని మఠం భూముల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతను, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారుల తీరుపై స్థానిక ప్రజల నుంచి ఆగ్రహం వ్య క్తమవుతోంది. ఇందుకేనా టీడీపీకి ఓటు వేసింది.. అంటూ మండిపడుతున్నారు. మఠం భూముల ఆక్రమణలను కొనసాగిస్తే ఆందోళనలకు సిద్ధమవుతామని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మఠం భూమిలో హెచ్చరిక బోర్డు ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల ప్రకారం 147/1లో 48.60 ఎకరాలు, 148/2లో 13.35 ఎకరాలు శ్రీ పరకాల స్వామి (హథీరాంజీ మఠం భూములుగా) పేరిట నమోదైనప్పటికీ ఆ భూమి నరసింహారెడ్డికి చెందినట్టుగా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు నివ్వెర పోతున్నారు. అంతేకాకుండా ఈ మఠం భూముల దురాక్రమణలో స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని పార్టీల ముఖ్యనేతలకు ఆక్రమణ దారుల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున ముడుపులు చేరాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు ఎకరాలు నాకు.. మిగతా మీకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మఠం భూములపై కన్నేసిన స్థానిక టీడీపీ ముఖ్యనేత గతంలో అవిలాల గ్రామానికి వెళ్లే దారిలోని మఠం భూములను అడ్డగోలుగా దోచేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చిత్తూరు నుంచి గ్యాంగ్‌ను తీసుకొచ్చి మఠం అధికారులపై భౌతిక దాడులకు తెగబడి ప్రహరీ నిర్మాణం పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ భూములకు ఆనుకుని ఉన్న మిగతా మఠం భూములపై కన్నేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మఠం భూములను దోచేసేందుకు పోటీ పడుతున్న నరసింహారెడ్డితో పాటు మరికొందరిని తన వద్దకు పిలిపించుకుని తనకు నాలుగు ఎకరాలు కేటాయించి మిగతా మీరు తీసుకోవచ్చన్న ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఆ మేరకు మఠం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందీ రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ భూములన్నీ మఠానికి చెందినవే తిరుపతి రూరల్ మండలం, అవిలాల గ్రామ రెవెన్యూ లెక్కదాఖలా సర్వే నం.145, 147/1, 148 ఉన్న భూములు శ్రీపరకాల స్వామి హథీరాంజీ మఠానికి చెందినవే. గతంలో మఠాధిపతుల నుంచి జీపీఏలు చేసుకుని కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో నరసింహారెడ్డి వంటి ప్రయివేటు వ్యక్తులు కొందరు మా భూమి అంటూ ముందుకు వస్తున్నారు. అవిలాల దగ్గర ఉన్న భూములు సర్వే చేయించాలని రెవెన్యూ అధికారులకు మఠం తరఫున లెటరు కూడా పెట్టాం. సర్వే చేయడంలో జాప్యం జరుగుతోంది. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయించి భూమిని స్వాధీనం చేసుకుంటాం. – కేశవులు, ఇన్చార్జి సూపరింటెండెంట్, హథీరాంజీ మఠం -
ఐటీడీపీ అరాచక శక్తులపై చర్యలు తీసుకోండి
– జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా పెళ్లకూరు: కూటమి ప్రభుత్వం అండతో మానవ విలువలను విస్మరించి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న ఐటీడీపీ అరాచక శక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పెళ్లకూరు జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ సీపీ మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని స్థానిక ఎస్ఐ నాగరాజును కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో ఐటీడీపీ చేస్తున్న అసభ్యకరమైన పోస్టులను ఖండిస్తూ నిందితులను వెంటనే శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న ఐటీడీపీ నిర్వాహకులకు కూడా అక్కాచెల్లెళ్లు ఉంటారని మహిళలను కించపరిచేలా వైఎస్సార్ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్న వారిని వెంటనే శిక్షించాలన్నారు. ఐటీడీపీని వెనుకుండి నడిపిస్తున్న మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత స్పందించి నిందితులను శిక్షించాలన్నారు. రాజ్యాంగ చట్టాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ సమానమని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధారాణి, ఎంపీటీసీ సభ్యులు సుజాత, సునీత, సర్పంచ్‌లు లక్ష్మి, కల్పన, చిత్ర, పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు శైలజ, ఎంపీటీసీ మాజీ సభ్యులు శ్రీదేవి పాల్గొన్నారు. -
వక్ఫ్‌బోర్డు బిల్లును రద్దు చేయండి
తిరుపతి మంగళం : దేశంలో ముస్లిం, మైనారిటీలను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇందులో భాగంగానే వక్ఫ్‌బోర్డ్ బిల్లును తీసుకొచ్చిందని వైఎస్సార్సీపీ ముస్లిం నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్‌ఖాదరీ, మహ్మద్కాసీమ్బాషా, షేక్ ఇమ్రాన్ బాషా ఆరోపించారు. వక్ఫ్‌బోర్డ్ బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ తిరుపతి మహతి ఆడిటోరియం వద్ద ఉన్న పెద్ద మసీదు వద్ద సోమవారం వైఎస్సార్సీపీ ముస్లిం, మైనారిటీ నగర అధ్యక్షులు మహ్మద్ కాసీమ్బాషా(చోటాబాయ్) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున వక్ఫ్‌బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టినట్టు తెలిపారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది ముస్లింల భూములను కొట్టేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలతో వక్ఫ్‌బోర్డ్ బిల్లును ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు టీడీపీ జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దుతు ఇచ్చి ముస్లింలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు వక్ఫ్‌బోర్డు బిల్లును వ్యతిరేకించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. నిత్యం ముస్లింల సంక్షేమాన్ని ఆకాంక్షించే మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి వక్ఫ్‌బోర్డ్ బిల్లును వ్యతిరేకించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముస్లిం నాయకులు ఖాదర్‌బాషా, గఫూర్, కజీర్, ఇస్మాయిల్, ముజాబింద్, జారీద్, మొదిసీన్, చాన్‌బాషా, అన్వర్, హాజి షేక్ ఫరీతాప్, షేక్ సలీమ్, ఎస్కె.కలీమ్, ఎస్. అమీర్‌బాషా పాల్గొన్నారు. ● ముస్లింల నిరసన -
ఖనిజాన్ని గ్రహించలేరా?
● కాలం చెల్లిన మైన్‌ను అడ్డుపెట్టుకుని తవ్వకాలు ● చెలరేగిపోతున్న నెల్లూరుకు చెందిన ప్రజాప్రతినిధి ● గతంలో ఉన్న మెటీరియల్ పేరుతో అనుమతులు ● బయట తవ్వి అదే పర్మిట్లతో తరలింపు ● గుర్రుమంటున్న స్థానిక కూటమి నేతలు ● కన్నెత్తి చూడని అధికారులు సాక్షి, టాస్క్‌పోర్సు: గూడూరు మండలం, చెన్నూరులో మూతపడ్డ శ్రీనివాస మైన్‌ని అడ్డం పెట్టుకుని నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు. స్థానిక కూటమి నేతలను పక్కకు నెట్టి తన రాజకీయ పలుకబడితో దందా సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా మైన్‌లో ఉన్న ఖనిజాన్ని తరలించేందుకు పర్మిట్లు పొందారు. ఆపై ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి అక్కడ సేకరించే తెల్లరాయిని సదరు మైన్‌కి తరలించి గ్రేడింగ్ చేస్తున్నారు. తర్వాత ఎంచక్కా ట్రిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా కొన్నివేల టన్నుల క్వార్ట్జ్ ఖనిజం తరలిస్తున్నా అటువైపు కన్నెత్తి చూసేందుకు ఏ ఒక్క అధికారీ సాహసించకపోవడం గమనార్హం. అధారాలిచ్చినా అడ్డుకోవడమేనా? శ్రీనివాస మైన్‌ను అడ్డంపెట్టుకుని అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని, దీనికి సబంధించిన ఆధారాలను నాలుగు రోజుల క్రితం గూడూరు డీఎస్పీ, సబ్ కలెక్టర్‌కు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అందించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు తమకు అనుమతులు ఇవ్వాలని ఆయన అధికారులను అభ్యర్థించారు. దానికి అప్పట్లో సదరు అధికారులు ఒప్పుకున్నట్టుగా మిన్నకుండిపోయారు. ఆపై మైన్ వద్దకు మేరిగ బయలుదేరే సమయంలో అనుమతులు లేవంటూ మెలిక పెట్టి హౌస్ అరెస్ట్‌కు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న అక్రమార్కులు మైన్‌లో ఉన్న చిన్నచిన్న వాహనాలను సైతం రాత్రికి రాత్రే తరలించేశారు. బ్లాస్టింగ్ సైతం ఆపేశారు. అక్రమ తవ్వకాలకు పోటాపోటీ శ్రీనివాసా మైన్‌ని సాకుగా చూపి క్వార్ట్ ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు కూటమి నేతలు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే సదరు మైన్‌కు సంబంధించి ఓ భాగస్వామిని పక్కకు నెట్టి అందులో ఉన్న మెటీరియల్‌ను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆ భాగస్వామి కోర్టును ఆశ్రయించినా అతన్ని కాదని స్థానిక ప్రజాప్రతినిధి అండతో కొందరు కూటమి నేతలు తవ్వకాలకు తెగబడ్డారు. విషయం తెలుసుకున్న నెల్లూరుకు చెందిన ఓ పెద్ద ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తన అనుచర గణంతో అక్కడ పాగా వేశారు. ముందుగా సదరు మైన్‌లో ఉన్న మెటీరియల్‌ను తరలించేందుకు రాష్ట్ర స్థాయిలో పైరవీలు చేసి అనుమతులు పొందారు. ఆపై మైన్‌కు దగ్గరగా ఉన్న ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేపట్టి అక్కడ సేకరించిన తెల్లరాయిని అదే మైన్‌కి తరలించి గ్రేడింగ్ చేస్తున్నారు. పాత మెటీరియల్ కింద ప్రతి రోజూ కనీసం పది టిప్పర్లకు తక్కువ లేకుండా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా ఈ దందా సాగుతోంది. ఇది తప్పుకాదా రాజా? గతంలో తవ్వకాలు జరిపారంటూ నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిపై అక్రమ కేసులు బనాయించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే తాజాగా అదే కూటమికి చెందిన ఓ నేత అందరి కళ్లెదుటే తవ్వకాలు జరుపుతున్నా ఆయనపై ఎలాంటి చర్యలకు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
డంపింగ్ కేంద్రంలో మంటలు
సూళ్లూరుపేటలోని కాళంగి నది ఒడ్డున జాతీయ రహదారికి పక్కనే ఉన్న డంపింగ్ యార్డుకు మంటలంటుకున్నాయి. ● బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ టెంపో బోల్తా పడింది. 20 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోతిరుపతి జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూల మాలలు వేసి ఆత్మీయంగా నివాళి అర్పించారు. ఆదర్శనీయుడు అంబేడ్కర్ అని వక్తలు కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. ఆయన స్ఫూర్తితో అడుగులు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. పలు నియోజకవర్గాల్లో ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు అన్నదానం నిర్వహించారు. జయహో అంబేడ్కర్.. జై భీమ్ అంటూ నినాదాలు మిన్నంటించారు. – తిరుపతి మంగళం– 8లో– 8లోన్యూస్రీల్ -
ఎస్వీబీసీ మాజీ ౖచైర్మన్‌ను కలిసిన ఎంపీ
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి రాజా కుటుంబీకులు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ డాక్టర్ వీబీ.సాయికృష్ణ యాచేంద్రను తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సోమవారం వెంకటగిరిలోని రాజా ప్యాలెస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సాయికృష్ణ యాచేంద్ర ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వెంట వైఎస్సార్సీపీ నాయకులు ఎంఏ నారాయణ, యస్థాని, కే.రమేష్, జలగం కామాక్షి, గురుస్వామినాయుడు ఉన్నారు. సముద్రంలోకి 440 తాబేళ్ల పిల్లలు వాకాడు: మండలంలోని నవాబుపేట సముద్ర తీరంలో సోమవారం ఫారెస్టు అధికారుల సమక్షంలో పిల్లలు ఉత్పత్తి చేసే ఆలీవ్‌రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలో విడిచి పెట్టారు. ఈ ఏడాది మూడో దఫా నవాబుపేట వద్ద ఉన్న తాబేళపిల్లల సంరక్షణా కేంద్రం(హేచరీ)లో దాదాపు 475 గుడ్లను సేకరించి పొదిగించారు. అందులో 440 పిల్లలు ఆరోగ్యంగా బయటకు రావడంంతో వాటిని సముద్రంలో విడిచి పెట్టారు. తాబేళ్లను చంపినా, వేటాడినా చట్టరీత్యా నేరమని ఫారెస్టు అధికారులు తెలిపారు. వేటకు వెళ్లొద్దు వాకాడు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిసేధించారని, వేటకు ఎవ్వరూ వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యశాఖ నిషేధ ఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎపీ ఎంఆర్ఎఫ్ 1994 సెక్షన్(4)ను అనుసరించి శిక్షార్హులు అవుతారని, అలాగే వారి బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని, జరిమానా విధించి, రాయితీలు రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
టీడీపీ పతనం ఖాయం
● రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన వెంకటగిరి మున్సిపల్ అవిశ్వాస తీర్మానం ● 2027లో జమిలీ ఎన్నికలు రావడం ఖాయం వెంకటగిరి(సైదాపురం): మున్సిపల్ చైర్పర్సన్ నక్కాభానుప్రియ పై కూటమి ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానం రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించిందని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో సోమవారం ఆయన మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికార మదంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడినట్లు ఆరోపించారు. అధికారులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరింపులు, ఒత్తిళ్లకు గురిచేశారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతో 19 మంది కౌన్సిలర్లు ప్రలోభాలకు గురికాకుండా అవిశాస తీర్మానంలో దీటుగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం బలం లేక చతికిల పడిందన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయిందని చెప్పారు. ఈ విజయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి కానుకగా ఇచ్చినట్టు తెలిపారు. 2027లో జమిలీ ఎన్నికలు రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, విప్ పుజారి లక్ష్మి, వైస్‌చైర్మన్ చింతపట్ల ఉమామహేశ్వరి, కౌన్సిలర్లు ధనియాల రాధ, తంబా సుఖన్య, కళ్యాణి, వహిద, సుబ్బారావు, శివయ్య, పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, జిల్లా సంయుక్త సహాయక కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఏపీ జీఈఏ ఐక్యవేదిక కోచైర్మన్‌గా బాలాజీ
చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక (ఏపీ జీఈఏ ఐక్యవేదిక) కోచైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు శవన్న గారి బాలాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 13 న విజయవాడలోని విద్యాధరపురంలో ఏపీ జీఈఏ చైర్మన్ సూర్యనారాయణ అధ్యక్షన ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంలో మండల స్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం బాలజీ సేవలందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని తెలిపారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని టీచర్లు హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజేహెచ్ వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,100 మంది స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. -
విన్నమాల అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి
నాయుడుపేట టౌన్ : చైన్నె – కలకల్తా 16వ నంబర్ జాతీయ రహదారి విన్నమాల వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి తనవంతు కృషిచేస్తానని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. విన్నమాల గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు సోమవారం విన్నమాల జాతీయ రహదారి కూడలి ప్రాంతాన్ని ఎంపీ పరిశీలించారు. విన్నమాల జాతీయ రహదారి కూడలి వద్ద ఐదు గ్రామాలకు పైగా రోజూ రాకపోకలు సాగిస్తుంటారని, రోడ్డు దాటుతూ అనేక మంది మరణించిన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు ఎంపీకి వివరించారు. స్పందించిన ఎంపీ వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఈ సమస్యను కేంద్ర మంత్రి, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. విన్నమాల జాతీయ రహదారి కూడలి వద్ద అండర్ పాస్ బ్రిడ్జితో పాటు సాగరమాల జాతీయ రహదారికి సంబంధించి రైతుల పొలాలు సాగుచేసుకునేందుకు సర్వీస్ రోడ్లు నిర్మించే విధంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. సాగరమాల జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులను సైతం స్వయంగా కలిసి విన్నవించినట్లు ఎంపీ వెల్లడించారు. ప్రజాసంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు. ఎంపీ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగిరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, తిప్పలపూడి నాగరాజు, మీజూరు సుబ్రమణ్యం, విన్నమాల గ్రామస్తులు ఉన్నారు. -
తల్లిదండ్రుల నిర్ణయాలు.. పిల్లలకు కష్టాలు
● గ్రూపుల ఎంపికలో పిల్లలకే స్వేచ్ఛనివ్వాలి ● ఇంటర్ ప్రవేశంపై సలహా తప్ప నిర్ణయం వద్దంటున్న నిపుణులు ● గూడూరుకు చెందిన రాజేష్‌కు ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషియల్పై మంచి పట్టుసాధించాడు. గ్రూప్సు రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. అయితే ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. ఇష్టం లేని గ్రూపును సరిగా చదవలేక ఫెయిలయ్యాడు. ● తిరుపతికి చెందిన విద్యాసాగర్‌కు చిన్నతనం నుంచే చార్టెడ్ అకౌంటెంట్ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో తమ కొడుకును ఇంజినీరుగా చూడాలనుకున్నారు. తమ అభిప్రాయాన్ని పిల్లాడిపై రుద్ది బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతోనే ఎంపీసీ పాస్ మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్‌లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ గ్రూపును తీసుకున్నాడు. ● పుత్తూరుకు చెందిన దీపికకు చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ అంటే ఇష్టం. ఇంజినీరింగ్ చేయాలన్నది ఆమె కోరిక. తల్లిదండ్రులకేమో తన కుమార్తెను డాక్టరుగా చూడాలనుకున్నారు. డాక్టరును చేయాలనే తపనతో బైపీసీలో బలవంతంగా చేర్పించారు. పాస్‌మార్కులతో గట్టెక్కెడంతో మెడిసిన్‌లో సీటు రాలేదు. అప్పటికిగాని తల్లిదండ్రులు తమ తప్పును తెలుసుకోలేకపోయారు. ● సూళ్లూరుపేటకు చెందిన మనోజ్‌కుమార్ సాధారణ విద్యార్థి. పదోతరగతి పాస్ మార్కులతో గట్టెక్కాడు. గణితం, సైన్సు సబ్జెక్టులపై పట్టు లేదు. అయితే స్నేహితులు ఎంపీసీ, బైపీసీ తీసుకోవడంతో తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎంపీసీని ఎంచుకున్నాడు. సబ్జెక్టులు కష్టం కావడంతో ఇంటర్ తప్పాడు. ఏం చేయాలో తెలియక చదువును పక్కనబెట్టాడు. తిరుపతి ఎడ్యుకేషన్ : విద్యార్థి దశలో ఇంటర్ కీలకం. ఈ దశలో పడిన అడుగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పది పరీక్షలు రాసి ఇంటర్ ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పిల్లల ఆసక్తిని తెలుసుకుని ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలు వారు కలలుగన్న రంగంలో రాణించగలుగుతారు. ఇష్టాన్ని గుర్తించాలి పిల్లల ఇష్టాలను పక్కనబెట్టి డాక్టర్, ఇంజినీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుకంటున్నారు. తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మేము చెప్పే కోర్సులను తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమ కోర్కెలను పక్కనబెట్టి తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి రాణించలేకపోతున్నారు. పిల్లల ఇష్టాన్ని గుర్తించినప్పుడే రాణిస్తారన్న సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు. స్వేచ్ఛనివ్వాలి జిల్లాలో పదోతరగతి పరీక్షలను ఈ ఏడాది 52,065మంది విద్యార్థులు రాశారు. వీరిలో కొందరు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరనున్నారు. మరికొందరు పాలిటెక్నిక్, ఏపీఆర్జేసి వంటి పోటీ పరీక్షల ద్వారా ఆయా కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పాస్ మార్కులతో గట్టెక్కిన విద్యార్థులు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ఇప్పటికే విద్యార్థులు ప్రణాళిక రచించుకున్నారు. ఇలాంటి సమయంలో ఏది ఉత్తమం, ఏ కోర్సులు తీసుకోవాలి వంటి సలహాలు ఇవ్వడం వరకే తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించాలి. అంతేతప్ప ఇష్టాలను రుద్దడం చేయకూడదని, గ్రూపుల ఎంపికలో పిల్లలకే స్వేచ్ఛనివ్వాలని నిపుణులు చెబుతున్నారు. వీరే కాదు.. జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇష్టమైన సబ్జెక్టుపై మక్కువ పెంచుకుని అందులో రాణించాలనుకున్న చాలా మంది విద్యార్థులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆలోచనలు, అభిప్రాయాలతో రాణించలేకపోతున్నారు. ఇంటర్ ప్రవేశం సమయంలో తల్లిదండ్రుల బలవంతంతో కొందరు, గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో మరికొందరు ఇష్టం లేని గ్రూపుల వైపు అడుగులేసి చతికిలపడుతున్నారు. తిరిగి సాధారణ చదువులను కొనసాగిస్తున్నారు. నచ్చిన గ్రూపులోనే చేర్పించాలి పది తరువాత ఇంటర్ ప్రవేశంలో పిల్లలకే స్వేచ్ఛనివ్వాలి. వారికి నచ్చిన గ్రూపులో చేరేందుకు సహకరించాలి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పడం వరకే సరిపెట్టుకోవాలి. అంతేతప్ప ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చుతూ బలవంతం చేయకూడదు. –డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి, విద్యావేత్త, తిరుపతి బలవంతం వద్దు పిల్లల చదువు విషయంలో పెద్దలు బలవంతం చేయకూడదు. మన ఆలోచనలను వాళ్లపై రుద్దకూడదు. సమాజంలో ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాలే కాదు... ఇంకా న్యాయ, విద్య, మేనేజ్మెంట్ వంటి చాలా రంగాలున్నాయి. తగిన కోర్సులకు ప్రాధాన్యత ఇస్తేనే వారు రాణించగలుగుతారు. – శ్రీధర్, కెరీర్ గైడెన్స్ నిపుణులు, తిరుపతి -
దూసుకొచ్చిన మృత్యువు
రాపూరు: కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. ఈ ఘటన రాపూరులో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. రాపూరుకు చెందిన గంధం సరస్వతమ్మ (46) తమ తోట వద్ద వదలాలని గార్లపాటి సురేష్ (26)ను కోరింది. దీంతో ఇద్దరూ మోటారు బైక్‌లో సమీపంలోని తోటవద్దకు వెళ్లారు. అక్కడ బైక్ దిగుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో పారిపోతుండగా స్థానికులు పట్టుకుని అప్పగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. వీరు రాజంపేట విద్యానగర్‌కు చెందిన రామచంద్ర, మల్లికార్జునగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకట్రాజేష్ తెలిపారు. కారు ఢీకొని ఇద్దరి మృతి రాపూరులో విషాదం -
20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
పెళ్లకూరు: 71వ నంబరు జాతీయ రహదారి మార్గంలో దిగువచావలి ఫ్లైఓవర్‌పై శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం లోడ్డుతో వెళ్తున్న వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, అధికారుల సమాచారం మేరకు.. శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనం మార్గమధ్యంలో దిగువచావలి గ్రామం ఫ్లై ఓవర్‌పై టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే బియ్యం వ్యాపారులు వాహనంలోని 20 టన్నుల బియ్యాన్ని గ్రామంలోని రహస్య ప్రదేశానికి తరలించారు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగరాజు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై డీటీ గోపీనాథరెడ్డి, తహసీల్దార్ ద్వారకానాథ్‌రెడ్డికి సమాచారం అందించారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని వీఆర్వోలు రమేష్, వంశి నాయుడుపేట గోదాముకు తరలించి కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ఉమాపతి వరదయ్యపాళెం: సమాచార హక్కుచట్టం సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా సత్యవేడు మండలం, మాదనపాళెం గ్రామానికి చెందిన సూరతిని ఉమాపతి నియమితులయ్యారు. ఆ మేరకు సోమవారం ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ నుంచి ఉత్తర్వులందజేసినట్లు ఆయన వివరించారు. ఉమాపతి మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆ చట్టం విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
పెన్ను పెట్టాలంటే.. పైసలివ్వాల్సిందే
డంపింగ్ కేంద్రంలో మంటలు సూళ్లూరుపేట: పట్టణంలోని కాళంగి నదికి పక్కనే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డులో సోమవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై దట్టమైన పొగ కమ్మేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సూళ్లూరుపేట పట్టణాన్ని 2010లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. కానీ ఇప్పటివరకు సరైన డంపింగ్ యార్డు లేదు. రోజు వారీగా పట్టణం నుంచి 19 టన్నుల చెత్త వస్తోంది. ఈ చెత్త అంతా కాళంగి నదికి పక్కనే ఉన్న పొర్లుకట్టకున్న స్థలంలో డంప్ చేస్తున్నారు. ఆపై తరచూ మంట పెట్టడంతో పట్టణమంతా దట్టమైన పొగ అలముకుంటోంది. వట్రపాళెం, ఇందిరానగర్, మహదేవయ్య నగర్, వనంతోపు, గణపతినగర్, ఝాన్సీనగర్, శ్రీనగర్‌కాలనీ, సూళ్లూరు, నాగరాజుపురం లాంటి ప్రాంతాలతోపాటు సూళ్లూరుపేట పట్టణమంతా పొగ కమ్మేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. చైన్నె–కోల్కత్తా ఏషియన్ రహదారికి పక్కనే డంపింగ్ కేంద్రాన్ని మార్పు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. డక్కిలి : మండలంలో ఓ వీఆర్వో స్టైలే వేరుగా ఉంది. ఆయన పెన్ను పెట్టాలంటే పైసలివ్వాల్సిందే. ఆయన గతంలో రాపూరు, బాలాయపల్లి, మర్రిపాడు, డక్కిలి మండలాల్లో వీర్వోగా పనిచేశారు. ఆయా మండలాల్లో పనిచేస్తున్న సమయంలో విధులకు డుమ్మా కొట్టడం, ఎక్కడో ఓ రూమ్‌లో కూర్చొని రికార్డులు మార్చడం జరుగుతూ వచ్చేది. విషయం తెలుసుకున్న ఆయా మండలాల తహసీల్దార్లు అప్పట్లో ఆయనపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన పలు మార్లు సస్పెండ్‌కు గురయ్యారు. రైతులను పీల్చిపిప్పి చేయడమే పని సదరు వీఆర్వో ఇటీవల మళ్లీ డక్కిలిలో వీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన చేరినప్పుటి నుంచి రైతుల నుంచి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన పనిచేసే నాగవోలు, వడ్లమోపూరు సచివాలయాల పరిధిలోని మోపూరు వెల్లంపల్లి, దందవోలు, చాపలపల్లి, మిట్టపాళెం, చెన్నసముద్రం, తిమ్మనగుంట, వడ్డీపల్లి పెదయాచసముద్రం గ్రామాల్లో ఇటీవల ఫ్రీ హోల్డ్ సర్వే జరిగింది. మోపూరు సచివాలయం పరిధిలో సుమారు 276 సర్వే నెంబర్లలో 252 మంది లబ్ధిదారులు, నాగవోలు సచివాలయం పరిధిలో 101 సర్వే నెంబర్లలో 88 ఎకరాల వరకు ఫ్రీ హోల్డ్‌గా ఉన్నాయని వసూళ్లకు తెరతీశారు. అసైన్మెంట్ పొలాలు ఫ్రీ హోల్డ్ పేరుతో సెటిల్మెంట్గా మారుతున్నాయని రైతులను నమ్మించి దందాకు శ్రీకారం చుట్టారు. ఒక్కో ఎకరాకు రూ.20 వేల చొప్పున వసూలు చేసినట్టు ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. తనను స్థానిక ఎమ్మెల్యే పంపారని, ఏదైనా సమస్య వచ్చి ఎమ్మెల్యే వద్దకు వెళ్తే ఆయన తన వద్దకే పంపుతారని విర్రవీగుతూ ముడుపులకు తెరదీసినట్టు సమాచారం. ఇదిలావుండగా సదరు వీఆర్వో పలు దఫాలు సస్పెండ్‌కు గురికావడంతో ఆయన ఎస్ఆర్ లేకుండానే పనిచేస్తుండడం గమనార్హం. ఓ వీఆర్వో వసూళ్ల దందా భూ రికార్డులు మార్చేసి రైతుల మధ్య తగాదాలు విచారించి చర్యలు తీసుకుంటాం వీఆర్వో అవినీతి, అక్రమాలపై విచారిస్తాం. ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంపై నిగ్గు తేల్చుతాం. ఏదైనా అక్రమాలు జరిగినట్టు తేలితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చస్తాం. – మోపూరు శ్రీనివాసులు, తహసీల్దార్, డక్కిలి -
గరుడ వాహనంపై చిద్విలాసం
రాపూరు: పెంచలకోనలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి చందనాలంకరణలో కనువిందు చేశారు. సోమవారం స్వాతి నక్షత్రం శ్రీవారి జన్మనరక్షత్రం కావడంతో స్వామివారి మూల మూర్తికి చందనంతో అలంకరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం అభిషేకం, చందనాలంకరణ, పుష్పాలంకరణ, 9 గంటలకు శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో శాంతి హోమం, కల్యాణం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారు బంగారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉభయకర్తలుగా దేవస్థాన ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, రాజ్యలక్ష్మి వ్యవహరించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
తడ: జాతీయ రహదారి తడ ఐటీఐ కళాశాల సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ కొండపనాయుడు తెలిపిన వివరాల మేరకు.. బీఏ ఫైనలియర్ చదువుతున్న చైన్నె రాయపేట ప్రాంతానికి చెందిన సయ్యద్ షాహిదీ ఉల్లా(20) అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ పర్వాన్(15)తో కలిసి బైక్‌పై వరదయ్యపాళెం సమీపంలో ఉన్న వాటర్ ఫాల్స్‌కి బయలుదేరారు. తడ ఐటీఐ కళాశాల సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌తోపాటు రోడ్డుపై పడ్డ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షాహిదీ ఉల్లా మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న పర్వాన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చైన్నెకి తీసుకెళ్లారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.గాయపడిన వ్యక్తి మృతిదొరవారిసత్రం : గత నెల 19న దొరవారిసత్రం మండల కార్యాలయాల సమీపంలో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పాళెంపాడు గ్రామానికి చెందిన మల్లాం మనోహర్(53) సొంత పనుల నిమిత్తం బైక్‌లో వచ్చాడు. తిరిగి వెళుతుండగా దొరవారిస త్రం మండల కార్యాలయాల సమీపంలో బైక్ అదు పుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కుటుంబ సభ్యులు నాయుడుపేట ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంబేడ్కర్ స్ఫూర్తికి బీజేపీ తూట్లు
తిరుపతి కల్చరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తికి బీజేపీ తూట్లు పొడుస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో తిరుపతిలోని గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పును బీజేపీ నేతలు బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్టసభలపై కోర్టుల జోక్యం ఎక్కువైందని గవర్నర్లు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. గవర్నర్ తరహా పాలనను రద్దు చేసి చట్టసభలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగాన్ని మతోన్మాదుల నుంచి పరిరక్షించుకోవడానికి పౌరులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీని రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీ వాడకూడదని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ -
ప్రాథమిక వైద్యం..
● చిన్నపాండూరు పీహెచ్సీలో ప్రశ్నార్థకంగా సేవలు ● కనీస భద్రత లేదంటూ చేతులెత్తేసిన సిబ్బంది ● ఆస్పత్రిలో తారస్థాయికి చేరిన అంతర్గత విబేధాలు ● డీడీఓ బాధ్యతల నుంచి తప్పుకున్న వైద్యాధికారి ● వరదయ్యపాళెం పీహెచ్సీ వైద్యాధికారికి డీడీఓ బాధ్యతలు అప్పగింత ● రాత్రిపూట వైద్యమందక అవస్థలు పడుతున్న స్థానికులు ● వితరణగా వచ్చిన ఏసీ కోసం తలెత్తిన వివాదం ఏసీ వివాదంతో.. ఇటీవల శ్రీసిటీకి చెందిన ఓ పరిశ్రమ సీఎస్ఆర్ ద్వారా ఆస్పత్రి అభివృద్ధి కోసం కొన్ని పరికరాలు, ఏసీలు వితరణగా అందజేసింది. అయితే ఆ ఏసీపై తిరుపతి జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వారి కన్నుపడింది. దీంతో ఆస్పత్రికి వితరణగా వచ్చిన ఏసీని జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపాలని ఓ అధికారి చిన్న పాండూరు పీహెచ్సీ డాక్టర్ లావణ్యను కోరారు. అయితే దాతలు వితరణగా అందించిన ఏసీని ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు. రాతపూర్వకంగా ఒక లెటర్‌ను రాసి ఆస్పత్రికి అందజేసి ఏసీని తీసుకోవల్సిందిగా తేల్చి చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఆస్పత్రి అభివృద్ధి కోసం దాతలు వితరణగా ఇచ్చిన ఏసీ కోసం వివాదం తలెత్తింది. అటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం.. ఇటు చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మధ్య విభేదాలకు దారి తీసింది. దీంతో సదరు వైద్యాధికారి ఆగమేఘాలపై ఆస్పత్రి డీడీఓ బాధ్యతల నుంచి తప్పుకుంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా రాత్రిపూట రోగులకు చికిత్స దూరమైంది.చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరదయ్యపాళెం : మండలంలోని చిన్న పాండూరులో రౌండ్ ది క్లాక్ 24 గంటలు స్థాయి కలిగిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ఆస్పత్రికి రూ. 2కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో కూడిన భవనం నిర్మించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇంతటి వసతులు కలిగిన ఆస్పత్రిలో వైద్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి. గ్రామీణ పేద ప్రజల కోసం ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారం రోజుల నుంచి రాత్రిపూట వైద్యసేవలు ఆగిపోయాయి. రాత్రివేళల్లో స్టాఫ్ నర్సు ఒక్కరే విధులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని తమకు భద్రత పూర్తిగా కరువైందని, కనీసం అటెండర్ గానీ సెక్యూరిటీ గానీ లేని కారణంగా రాత్రిపూట వైద్యసేవలు చేపట్టలేకపోతున్నామని ఆస్పత్రికి తాళాలు వేసేస్తున్నారు. దీంతో అత్యవసర వైద్యసేవలకు వచ్చేవారు అర్థరాత్రివేళ ముప్పతిప్పలు పడుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు సైతం వైద్యపరంగా ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అటు శ్రీసిటీ, ఇటు చిన్న పాండూరు ఏపీఐఐసీ పరిధిలోని అపోలో, హీరో, మరికొన్ని ఇతర పరిశ్రమలు ఏర్పాటుతో అటు స్థానికేతరులు, ఇటు స్థానికులతో రోజువారీ 300 మందికి పైగా ఓపీలో వైద్యసేవలు పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఆస్పత్రి స్థాయిని ఇంకొంచెం పెంచాల్సింది పోయి ఉన్న స్థాయిని కాస్త రోజురోజుకు తగ్గించేస్తూ వైద్యసేవలే అందని పరిస్థితులు దాపురిస్తున్నాయి. మనస్తాపానికి గురై.. ఏసీ వివాదంతో మనస్తాపానికి గురైన పీహెచ్సీ వైద్యాధికారి లావణ్య ఏకంగా నాలుగు రోజుల క్రితం డీడీఓ బాధ్యతల నుంచి తప్పుకుంది. తాను కేవలం పీహెచ్సీ సమయానికే విధులకు హాజరవుతానని, ఇతర బాధ్యతలను తాను చేపట్టలేనని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారికి రాతపూర్వకంగా విన్నవించింది. దీంతో డీడీఓ బాధ్యతలను వరదయ్యపాళెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు చెందిన వైద్యాధికారి ద్వైతకు అప్పగిస్తూ డీఎంహెచ్ఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె శనివారం చిన్న పాండూరు పీహెచ్సీలో డీడీఓగా బాధ్యతలు స్వీకరించింది. అత్యవసర పరిస్థితుల్లోనూ అందని సేవలు తాజాగా శుక్రవారం రాత్రి యానాదివెట్టు దళితవాడకు చెందిన మల్లికార్జున (43) రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై చిన్న పాండూరు ఆస్పత్రికి వచ్చాడు. అక్కడ ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో తీవ్రమైన రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇలా అనేక మంది రాత్రివేళల్లో వైద్యం కోసం చిన్న పాండూరు ఆస్పత్రిని ఆశ్రయిస్తుంటారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పీహెచ్సీలో రాత్రివేళ వైద్యసేవలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. చేతులెత్తేసిన సిబ్బంది గత కొద్దిరోజులుగా నడుస్తున్న వివాదం నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన ఆస్పత్రి సిబ్బంది ఏకంగా రాత్రిపూట వైద్యసేవలు తాము నిర్వహించలేమంటూ చేతులెత్తేశారు. చిన్న పాండూరులో 40ఏళ్ల క్రితం 24 గంటలు స్థాయి (రౌండ్ ది క్లాక్) కలిగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా రాత్రిపూట వైద్యసేవలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా స్టాఫ్ నర్సులు తాము ఒంటరిగా విధులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉందని, కనీసం ఒక అటెండర్, సెక్యూరిటీ గార్డ్ ఉంటే గానీ తాము రాత్రివేళల్లో పనిచేయలేమని తేల్చి చెబుతున్నారు. -
రేపటి నుంచి సాగరంలో వేట బంద్
● 61 రోజుల వరకు సముద్రంలో చేపలు పట్టడంపై నిషేధం ● గత ఆరు నెలలుగా కానరాని మత్స్యసంపద ● కష్టతరంగా మారిన గంగపుత్రుల జీవనం ● ఇప్పటికే రెండు పర్యాయాలు అందని ప్రభుత్వ ‘భరోసా’ ● సర్కారు తీరుపై ఆందోళనలో మత్స్యకారులు అందని పరిహారం ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే ఒక్కో మత్స్యకారుడికి వేట విరామ సమయంలో ఏటా రూ. 20 వేలు పరిహారం కింద ఇస్తామని ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు వేట విరామం వచ్చింది. ఈ రెండు దఫాలు ఒక్క సారి కూడా పరిహారం చెల్లించలేదు. గత ఏడాది మత్స్యకారులకు అందాల్సిన వేట విరామ నగదు నేటికీ అందలేదు. ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశంలో కూడా ఈ సారి వేట విరామానికి ముందుగానే మత్స్యకారులకు పరిహారం చెల్లిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అయినా ఇంత వరకు ఆ ఊసేలేదు. ఫలితంగా ఈ ఏడాది కూడా ఆకలి కష్టాలు తప్పవంటూ మత్స్యకారులు వాపోతున్నారు. అసలే గత ఆరు నెలలుగా సముద్రంలో మత్స్య సంపద దొరక్క మత్స్యకారులు అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ రెండు నెలలపాటు జీవనం ఎలా సాగించాలో తెలియక సతమతమవుతున్నారు. ఏడాది కాలంగా వేట సక్రమంగా సాగక గంగపుత్రులు మెతుకు కరువై బతుకు భారమై విలవిలాడుతున్నారు. మరో వైపు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందట్లేదని వాపోతున్నారు. వాకాడు : సముద్రంలో వేట నిషేధ సమయం రానే వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి వేటకు లంగరు పడనుంది. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61 రోజులపాటు వేటకు విరామ సమయంగా ప్రభుత్వం ప్రకటించింది. ఏటా ఇదే షెడ్యూల్లో వేటను నిషేధించి తద్వారా మత్స్య సంపదను పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తుంటాయి. సముద్ర జలాల్లో పడవలు, మెకనైజ్డ్, మోటారు బోట్లు ద్వారా చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లకుండా మత్స్యశాఖ, కోస్టల్ గార్డ్స్, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, నేవీ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం పరిహారం అందించాల్సి ఉంటుంది. ఐతే రెండు దఫాలుగా కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహారం ఒక్క పైసా కూడా చెల్లించకపోవడం గమన్హాం. తీరంలో లంగరు జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో సముద్ర తీరం విస్తరించి ఉంది. వేట నిషేధం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ముందుగానే తమ బోట్లును తీరానికి తీసుకువచ్చి లంగరు వేస్తున్నారు. ఈ క్రమంలో నిఽషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు మర బోట్లు, పడవలతో కళ కళలాడిన సముద్ర తీరం బోసిబోతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.35.5 కోట్లు డాక్టర్ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 2019 నుంచి ఏటా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ముందుగానే రూ. 10 వేలు చొప్పున జీవన భృతిగా అందించారు. అలాగే డీజిల్‌పై సబ్సిడీ, ప్రమాద బీమా, 50 ఏళ్లకే పింఛన్ కింద గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గంగపుత్రులకు రూ.35.5 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేశారు. పస్తులుండాల్సిందే.. ఈ సారైనా వేట విరామం కాలంలో రావాల్సిన పరిహారం అందుతుందా.. లేదా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా కూటమి ప్రభుత్వం పైసా చెల్లించలేదు. దీంతో దాదాపు రూ.40వేల చొప్పన మత్స్యకారులందరం నష్టపోయాం. ఇప్పుడైనా సాయం చేసారో లేదో తెలియని పరిస్థితి. దీనిపై సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చేయూతనందించకుంటే పూట గడవక పస్తులుండాల్సిందే. – పోలయ్య, మత్స్యకారుడు, కొండూరుపాళెం -
విజయవంతంగా 5కే రన్
ఏర్పేడు(రేణిగుంట): ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ సౌత్ క్యాంపస్‌లో ఆదివారం విజయవంతంగా 5కే రన్ నిర్వహించారు. ఐఐటీ విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ ఎన్ఎన్ మూర్తి జెండా ఊపి పరుగును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో సంపూర్ణ ఆరోగ్యానికి మించిన అపార సంపద లేదని తెలిపారు. ఆహారం, పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. నాణ్యమైన సమతుల ఆహారం తీసుకుంటూ, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించాలని కోరారు. ఈ క్రమంలో 5కే రన్ పూర్తి చేసిన మొదటి ఐదుగురికి నగదు బహుమతులు అందించారు. 6 నుంచి 25 స్థానాల్లో నిలిచిన వారికి పతకాలు పంపిణీ చేశారు. రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అడ్వైజర్ ఉదయకుమార్ సుకుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ అయ్యప్పన్, పీటీఐ శ్రీధర్ పాల్గొన్నారు. -
ఈదురుగాలులు.. గాల్లో విమానం చక్కర్లు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఈదురు గాలుల వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో రేణిగుంట విమానాశ్రయంలో దిగాల్సిన ఇండిగో విమానం ల్యాండింగ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆపై చైన్నె విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లింది. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం రాత్రి 8.40కి ఇండిగో విమానం చేరుకోవాలి. అయితే ఈదురు గాలులతో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాశ్రయం నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ రాలేదు. దీంతో విమానం రేణిగుంట–ఏర్పేడు పరిసర ప్రాంతాల్లోనే దాదాపు అరగంట పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఎంతసేపటికీ వాతావరణం సానుకూలంగా లేకపోవడంతో చైన్నె విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. వాతావరణం అనుకూలించిన వెంటనే చైన్నె నుంచి రేణిగుంట విమానాశ్రయానికి విమానం చేరుకుంటుందని అధికారులు తెలిపారు. -
టీటీడీ చైర్మన్‌గా భూమన సేవలు అద్వితీయం
● ఏ తప్పూ చేయలేదని ప్రమాణం చేసిన దమ్మున్న నాయకుడు ● భూమనను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే నానికి లేదు : మోహిత్‌రెడ్డి తిరుపతి రూరల్: హైందవ ధర్మ పరిరక్షణకు టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి చేసిన సేవలు అద్వితీయమని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కొనియాడారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతిలోని ఎస్వీ గోశాలను సందర్శించినప్పుడు భూమనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హైందవ సంస్కృతి, సనాతన ధర్మం గురించి కరుణాకరరెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు. సనాత ధర్మంపై ఎంతో గొప్ప పరిజ్ఞానం కలిగిన ఆయనను, నిత్యం అబద్ధాలతో పబ్బం గడుపుకునే ఎమ్మెల్యే నాని విమర్శిస్తే ప్రజలు నవ్వుతారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో తొలిసారిగా టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమన సనాతన ధర్మ రక్షణకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. అందులో ప్రధానంగా దళిత గోవిందం, మత్స్యగోవిందం, కల్యాణమస్తు, గోవింద కోటి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల ముందుకు తెచ్చారని వివరించారు. స్వామి చెంతకు రాలేని వారందరికోసం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడినే దళితవాడలకు తీసుకువెళ్లి పూజలు చేయించిన గొప్ప మనిషి భూమన అని తెలిపారు. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణ ఇప్పించి, సర్వమానవ సమానత్వాన్ని చాటారన్నారు. కల్యాణమస్తు ద్వారా బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లి సామగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా కల్పించారని వివరించారు. గోవింద కోటి ద్వారా భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించి ప్రజల్లో భక్తి తత్వాన్ని పెంపొందించారని వెల్లడించారు. తిరుమలకు వచ్చి శ్రీవారిని చూడలేని ఎంతో మంది సామాన్య భక్తులకు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, దైనందిన పూజలు, టీటీడీ నిర్వహించే ధార్మిక కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఎస్వీబీసీ చానల్ ప్రారంభించిన ఘనత భూమనకే దక్కుతుందని వెల్లడించారు. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం కలిగిస్తూ నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ‘‘ఓం నమో వేంకటేశాయ’’ అన్న మంత్రాన్ని వినిపించేలా చేశారన్నారు. తిరుమల శ్రీవారి దర్శనంలో తిరుపతి వాసులకు ప్రాధాన్యత కల్పించేలా స్థానికులకు ప్రత్యేకంగా వారంలో ఒక రోజు దర్శనం చేసుకునే అదృష్టం కల్పించారని వివరించారు. శ్రీవారి సేవలో నిత్యం తలమునకలైన టీటీడీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన శక్తి, సామర్థ్యం భూమన కరుణాకరరెడ్డికి మాత్రమే సొంతమని తెలిపారు. ముఖ్యమంత్రులుగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ చైర్మన్‌గా తిరుమల ఆలయ ప్రతిష్టను పెంచేలా గొప్ప సంస్కరణలను తీసుకువచ్చారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రపూరితంగా నింద వేయడంతో ఆయన తిరుమలకు వెళ్లి సాక్షాత్తు ఆ దేవ దేవుని ముందు తడిబట్టలతో నిలబడి తాను తప్పు చేయలేదని ప్రమాణం చేసిన దమ్మున్న నాయకుడని స్పష్టం చేశారు. అలాంటి తమ నాయకుడి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే నానికి లేదని తెలిపారు. -
నేర నియంత్రణకు డ్రోన్ కెమెరాలు
– పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభించిన ఎస్పీ తిరుపతి క్రైమ్ : మ్యాట్రెస్ థర్మల్ డ్రోన్ కెమెరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వాటి పనితీరును పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణకు డ్రోన్ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. బహిరంగ ప్రదేశాలు, అగ్నిప్రమాద స్థలాలు, అటవీ ప్రాంతాల పరిశీలనకు వాడుకోవచ్చని చెప్పారు. ఇందుకోసం మొత్తం నాలుగు డ్రోన్లను తీసుకువచ్చామన్నారు. ఇందులోని ఒక డ్రోన్‌లో అడ్వాన్స్డ్ కెమెరా ఉందని వెల్లడించారు. సుమారు ఒక కిలోమీటర్ ఎత్తు వరకు ఎగిరి పరిసరాల దృశ్యాలను పూర్తిస్థాయిలో అందిస్తాయని తెలిపారు. రాత్రి వేళల్లో కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా పూర్తిస్థాయిలో ఉపయోగపడతాయన్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జనాలను కాపాడేందుకు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. వీటిని వాడేందుకు 40 మంది పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చామన్నారు. ఇందులో 20 మంది సివిల్ కానిస్టేబుళ్లు 20 మంది ఏఆర్ సిబ్బంది ఉన్నారని వివరించారు. ప్రగతి వివరాలు జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది విధులను పెంచి నేరాలను కట్టడి చేసినట్లు జిఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మార్చి నుంచి ఇప్పటివరకు సాధించిన ప్రగతి పురోగతిని తెలిపారు. ఆయన మాటల్లోనే.. ● గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశాం. సుమారు 119.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 11 కేసులు నమోదు చేశాం. ● బహిరంగంగా మద్యం సేవించే 3,145 ప్రదేశాలను గుర్తించాం. వాటిని శుభ్రం చేయించాం. ఈ క్రమంలోనే 32 మంది మందుబాబులకు జరిమానా విధించాం. ● జిల్లావ్యాప్తంగా పోలీసులు ఆధ్వర్యంలో 223 పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టాం. ● రాంగ్ రూట్లో వచ్చే వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకున్నాం. 359 కేసులు నమోదు చేశాం. ఇప్పటివరకు రూ.12.40 లక్షల జరిమానా వసూలు చేశాం. -
ఆకట్టుకుంటున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్పో
తిరుపతి సిటీ: స్థానిక ఆర్టీసీ ఓవర్ బ్రిడ్జి సమీపంలోని చింతలచేను శ్రీరామ తులసి కళ్యాణ మండపం వేదికగా విద్యాస్ఫూర్తి పేరుతో ప్రముఖ యాడ్ 6 అడ్వర్టైజింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రెండు రోజుల మెగా ఎడ్యుకేషన్ ఎక్స్పో – 2025 ప్రారంభమైంది. ఇందులో నగర ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలి రోజు బెంగళూరు మార్తనహల్లిలోని హిందుస్తాన్ ఏవియేషన్ అకాడమీ, జాలహల్లి ఈస్ట్‌లోని సంభ్రమ్ ఇన్స్టిట్యూట్, కృష్ణరాజపురంలోని ఎస్ఈఏ(సీ) ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, విద్యారంగ నిపుణులు పాల్గొని అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజుల వివరాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా అందించే కోర్సులు, అంతర్జాతీయ కోర్సులపై అవగాహన కల్పించారు. నిర్వాహకులు రఘుకిషోర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకు ఊహించని రీతిలో స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. బెంగళూరు లాంటి సిటీలో విద్యనభ్యసించి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలనే విద్యార్థులకు ఇది సరైన వేదికని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు -
ట్రాఫిక్ దిగ్బంధం.. ‘మెట్టు’ మార్గం!
చంద్రగిరి : వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఉదయం ఈ క్రమంలోనే శ్రీవారి మెట్టుకు వెళ్లే మార్గంలోకి పెద్దసంఖ్యలో భక్తులు వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు దగ్గరి దారి కావడంతో ఇటీవల భారీగా భక్తులు ఇక్కడకు వస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం శ్రీవారి మెట్టు నుంచి సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను క్రమబద్ధీకరించేవారు లేకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వారాంతపు రోజుల్లో అయినా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వెళ్లేవారి కోసం టీటీడీ కేవలం 3 వేల టోకెన్లను మాత్రమే జారీ చేస్తోంది. -
రేపటి నుంచి పీజీ పరీక్షలు
తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలోని పీజీ కళాశాలల్లో సైన్స్ గ్రూప్‌ల కోర్సులకు మంగళవారం నుంచి నాలుగో సెమిస్టర్ నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే ఆర్ట్స్, కామర్స్ అండ్ కంప్యూటర్ పీజీ కోర్సుల పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు వివరించారు. కేజీబీవీ విద్యార్థినికి సన్‌షైన్ అవార్డు దొరవారిసత్రం : మండలంలోని కేజీబీవీలో సీనియర్ ఇంటర్ విద్యార్థిని నక్కబోయిన లహరి పీఎస్టీటీ (ఫెసిలిటేషన్ టీచర్ ట్రైనింగ్) గ్రూపులో 969 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి సన్‌షైన్ స్టార్స్ అవార్డుకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ పార్వతి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన మంత్రి చేతుల మీదు అవార్డు అందుకోనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా బీన్ఎన్ కండ్రిగ మండలం పార్లపల్లెకు చెందిన నక్కబోయిన ఆనందయ్య, బుజ్జమ్మ దంపతుల కుమార్తె లహరి సన్‌షైన్ అవార్డుకు ఎంపిక కావడంపై ప్రిన్సిపల్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత ప్రాజెక్టు డైరెక్టర్ వసంత బాయి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఒన్ స్టాప్ సెంటర్ స్కీమ్ ద్వారా పారామెడికల్ సిబ్బంది, మల్టీపర్పస్ స్టాఫ్, కుక్, సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డు తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రూ.13వేల నుంచి రూ.19వేల వరకు వేతనాలు ఉంటాయన్నారు. అలాగే మిషన్ వాత్సల్య స్కీమ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్, డేటా అన్‌లిస్ట్ తదితర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఎంపికై న వారికి వేతనం రూ.7944 నుంటి రూ.18,536 వరకు ఉంటుందని చెప్పారు. ఆసక్తిగలవారు దరఖాస్తును ఈ నెల 15 నుంచి 30వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించారు. 18ఏళ్ల నుంచి 42ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కలెక్టరేట్లోని బి–బ్లాక్ ఐదో అంతస్తులోని ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలోని 506 గదిలో దరఖాస్తులు అందించవచ్చని, లేదా పోస్టు ద్వారా పంపవచ్చని తెలిపారు. ఓసీ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 200 డీడీ కట్టాల్సి ఉంటుందని వివరించారు. వివరాలకు తిరుపతి.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట కడప రైల్వే మార్గంలోని రైల్వే కోడూరు సమీపంలో ఉప్పరపల్లి రైల్వే గేటు వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. అతనికి సుమారు 25 ఏళ్లు ఉంటాయని, మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని రైల్వే పోలీసులు తెలిపారు. ఎవరైనా అతని ఆచూకీ గుర్తిస్తే రేణిగుంట పోలీసులను సంప్రదించాలని సూచించారు. 9885753379, 9963126343 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.కిడ్నాప్ కేసులో కొత్త కోణం!– ఇద్దరు నిందితులకు ముగిసిన కస్టడీతిరుపతి క్రైమ్ : నగరంలో పది రోజులకు ముందు జరిగిన కిడ్నాప్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. రాజేష్ కుటుంబీకులను కిడ్నాప్ చేసిన ఆరుగురు నిందితులను అలిపిరి పోలీసులు నాలుగు రోజులు ముందు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం కోర్టు అనుమతితో వీరిని రెండు రోజులపాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వాస్తవాలను నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ప్రధాన ముద్దాయిలైన అరుణ్ కుమార్, భార్గవ్ తమ పేర్ల పైన కొత్త కంపెనీలు ప్రారంభించారన్నారు. ఇలా కొత్త కంపెనీలు ప్రారంభించి ట్రేడింగ్ చేస్తామని జనాలను నమ్మించినట్లు వెల్లడించారు. చాలమందికి వారి అకౌంట్లోనే పర్సనల్ లోన్లు ఇప్పించారి, ఆ లోన్ డబ్బులను తమ వద్ద ఇన్వెస్ట్ చేస్తే అధిక డబ్బులు వస్తాయని చెప్పారన్నారు. అనంతరం ఆ డబ్బులు ఉపయోగించుకొని జనాలను మోసం చేశారని చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎంతమంది మోసపోయారు అన్నది ఇంకా పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులకు కస్టడీ ముగియడంతో ఆదివారం వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు వెల్లడించారు. మరోసారి కస్టడీకి తీసుకుని పూర్తి విషయాలను రాబడతామన్నారు. అంతేకాకుండా కిడ్నాప్ అయిన వారికి మత్తు ఇంజెక్షన్లు వేసేందుకు కూడా మీరు సిద్ధమైనట్లు వివరించారు. నిందితుల నుంచి ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే అనస్తీషియా మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
నాగలాపురం : ల్యాప్‌టాప్‌ను చోరీ చేసిన కేసులో బైటికొడియంబేడుకు చెందిన నిందితుడు సలీమ్(20)ను శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. 2024 మే 25వ తేదీన చైన్నె నుంచి కర్నూలుకు వెళుతున్న బస్సులో ఓ విద్యార్థి నుంచి నిందితుడు రూ.1.9లక్షల విలువైన ల్యాప్‌టాప్, రూ.25వేల ఆపిల్ ఇయర్‌ఫోన్‌ను అపహరించినట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వివరించారు. తుమ్మలగుంటలో కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంట గ్రామంలో నివాసముంటున్న టీ.భాస్కరయ్య (65) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల సమాచారం మేరకు... మృతుడు తిరుపతి ఎస్వీ గోశాలలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తన ఇంటి మిద్దైపెన మొదటి అంతస్తులో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా కుటుంబీకులు గుర్తించి చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉచిత ఇసుక ఊసే లేదు!
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో దశ ఉచిత ఇసుకపై ఇప్పటికే కలెక్టరేట్లో అధికారులు నాలుగు పర్యాయాలు సమావేశాలు నిర్వహించారు. పది రోజుల్లోనే ఉచిత ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత రెండు వారాల్లో అన్నారు.. మొత్తంగా ఆరు నెలలుగా ఉచిత ఇసుక అందుబాటులోకి వస్తుందని చెబుతూనే ఉన్నారు. ఇదిగో అదిగో అంటూ ఇప్పటికే ఆరుసార్లు వాయిదాలు వేశారు. సమావేశాలు నిర్వహించడం.. ఏదో ఒక తేదీ చెప్పడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిపోయింది. మార్చి 11వ తేదీన కలెక్టరేట్లో మీటింగ్ నిర్వహించారు. అదే నెల 15వ తేదీ నుంచి రెండో దశ ఉచిత ఇసుక అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అయితే మరో నెల గడిచినా ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా సర్కార్ నేతృత్వంలో ఇసుక విక్రయాలు సాగడం లేదు. అంతా ప్రైవేటుగా అక్రమ వ్యాపారాలు మాత్రమే జరుగుతున్నాయి. అయితే వాటిని కట్టడి చేయడానికి మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాయింట్లు కనుమరుగు గత ఏడాది జూలై 8న జిల్లాలో ఇసుక పాలసీని వచ్చింది. అయితే రెండు నెలలకే అది కనుమరుగైంది. ఇసుక లేదంటూ ఆయా అధికారిక రీచ్‌లలో బోర్డులు తిప్పేశారు. ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ నుంచి రెండో దశలో భాగంగా జిల్లాలో గూడూరు వద్ద గూడలి సమీపంలో స్వర్ణముఖి వద్ద ఒక పాయింట్, పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద రెండు ఇసుక పాయింట్లు గుర్తించారు. ఈ మూడు పాయింట్లలో 1,37,686 టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని వాటిని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పిన అధికారులు వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ప్రైవేటుగా కూటమి నేతలు యథేచ్ఛగా ఇసుక వ్యాపారం సాగిస్తూ రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమార్కులను ప్రశ్నించే వారే కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అంతా నిజం..
● కూటమి సర్కారును కుదిపేస్తున్న టీటీడీ గోశాల ఘటన ● గోవుల మృతి నిజమేనని మరోసారి ఒప్పుకున్న టీటీడీ చైర్మన్ ● 20 నుంచి 22 వరకు మరణించాయన్న బీఆర్ నాయుడు ● 40 మృత్యువాత పడినట్లు ఎమ్మెల్యే ఆరణి వెల్లడి ● వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన భూమనకు బెదిరింపులు ● కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతామని హెచ్చరికలు కలియుగ వైకుంఠనాథుని సన్నిధిలోని టీటీడీ గోశాలలో మృత్యుఘోష భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. పరమ పవిత్రంగా పూజించే గోమాత దుస్థితి హృదయాలను కలచివేస్తోంది. పదుల సంఖ్యలో గోవులు మరణించిన ఘటన కూటమి సర్కారును కుదిపేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దలందరూ వేర్వేరుగా ప్రెస్మీట్లు పెట్టేశారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. గోవులు మరణించడం నిజం అంటూనే.. భూమన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఒకరికొకరు పొంతన లేకుండా అలవోకగా అబద్ధాలు వల్లించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పిస్తామని బెదిరింపులకు తెగబడ్డారు.గోశాలను పరిశీలిస్తున్న టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తదితరులుసాక్షి టాస్క్‌ఫోర్స్ : టీటీడీ గోశాలలో గోవుల మృతి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికంగా మారింది. అమరావతి నుంచి వచ్చిన ఆదేశాలతో తిరుపతిలో ఆదివారం కూటమి నేతల హడావుడి కనిపించింది. ఎవరికి వారు విలేకరుల సమావేశం నిర్వహించి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పినవన్నీ అసత్యాలు అంటూనే.. ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గోవులు మృతి చెందడం వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే వందకుపై చిలుకు కాదని, 40 అని ఎమ్మెల్యే, 20 నుంచి 22 వరకు అని టీటీడీ చైర్మన్ వెల్లడించడం గమనార్హం. ఎస్వీ గోశాలలో గోమాతలు మృత్యువాత పడుతున్నాయని టీటీడీ మాజీ చైరర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. దీంతో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. ఏం చేయాలో దిక్కుతోచక.. భూమన ఆరోపణలను టీటీడీ కొట్టిపారేసినా.. నిజం దాగదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రకటనలతో నిరూపితమైంది. వృద్ధాప్యం, వివిధ కారణాలతో గోవులు మృతి చెందడం సర్వసాధారణమని బీఆర్ నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరణి మాత్రం.. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీఎస్వీ గోశాలలో 40 గోవులు మృతి చెందాయని వెల్లడించారు. అయితే అవన్నీ అనారోగ్యంతో మరణించాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం తాజాగా టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యుడితోపాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా 20 నుంచి 22 వరకు మృతి చెంది ఉండొచ్చని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ‘ఇంట్లో మనుషులు చనిపోరా? గోశాలలో ఆవులు వృద్ధాప్యంతో మరణించి ఉంటాయి’అంటూ చెప్పుకొచ్చారు. గోవు కళేబరాల ఫొటోలు చూపిస్తూ ఇవన్నీ మార్ఫింగ్ అని, ఎక్కడో మృతి చెందినవి అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. టీటీడీ గోశాలలో ఉండాల్సిన డాక్టర్ల కంటే తక్కువగా ఉన్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. మామూలుగా ఇక్కడ ఆరుగురు డాక్టర్లు ఉండాలని, ప్రస్తుతం ఒకరు పరారీలో ఉన్నారని, మరొకరు ఏదో కారణంతో రాలేదని టీటీడీ చైర్మన్ మీడియా సమక్షంలోనే ఒప్పుకున్నారు. ప్రశ్నించే గొంతుకను నొక్కేసే కుట్ర టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయని భూమన కరుణాకరరెడ్డి వెల్లడించిన వాస్తవాలపై ఎల్లో మీడియా ప్రతినిధులు శ్రీభూమనపై కేసులు నమోదు చేస్తారా? అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పదే పదే ప్రశ్నించారు. ఎల్లో మీడియా ఒత్తిడి మేరకు భూమన కరుణాకరరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదుచేస్తామని, ఇప్పటికే కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీటీడీపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఈ మేరకు రాబోయే బోర్డు సమావేశంలో తీర్మానం కూడా చేస్తామని భాను ప్రకాష్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీపై ఇష్టారాజ్యంగా అసత్య ప్రచారాలు చేసిన ఇదే నాయకులు నేడు ఇలా మాట్లాడుతుండడంపై తిరుమల, తిరుపతి వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. -
కూలీలుగా వెళ్లాల్సివస్తోంది
గత ఎనిమిది నెలుగా వేట లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్సి ఆదుకోవడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది. వేట విరామ సాయాన్ని రెట్టింపుగా అందిస్తామని నమ్మబలికి ఇంత వరకు పైసా కూడా ఇవ్వలేదు. దీంతో తమ బతుకులు భారంగా మారిపోయాయి. వృత్తిని వదిలిపెట్టి సమీప కంపెనీల్లో కూలీలుగా వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం పరిహారం అందించాలి. – సోమయ్య మత్స్యకారుడు, తూపిలిపాళెం ఎలాంటి ఆదేశాలు రాలేదు మత్స్యకారులకు చెల్లించాల్సిన వేట విరామం నగదు విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే మత్స్యకారుల వేట విరామం సాయంపై వివరాలు అందిస్తాం. అయితే చేపల వేటపై నిషేధం అమలవుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకూడదు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. – రాజేష్, ఏడీ, మత్స్యశాఖ ● -
జిల్లాకు 8, 9 స్థానాలు●
తిరువణ్ణామలై రద్దీ పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైకి వెళ్లేందుకు భక్తులు క్యూ కట్టారు. తిరుపతి బస్టాండ్ కిటకిటలాడింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల విద్యార్థులు సత్తాచాటారు. అత్యుత్తమ మార్కులతో అదరగొట్టారు. రాష్ట్ర స్థాయిలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 71 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 86 శాతం ఉత్తీర్ణతతో 8వ స్థానాన్ని కై వశం చేసుకున్నారు. తల్లిదండ్రులకు, కళాశాల యాజమాన్యాలకు గుర్తింపు తెచ్చారు. ● సీనియర్ ఇంటర్లో 86 శాతం, జూనియర్ ఇంటర్లో 71 శాతం మంది ఉత్తీర్ణత ● మే 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ● మే 28 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ ● రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 13 నుంచి 22వ తేదీల్లోపు ఫీజు చెల్లింపునకు గడువు ● సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు 15 నుంచి 22వ తేదీలోపు ఫీజు చెల్లింపునకు గడువు ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోతిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ ఫలితాలను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తిరుపతి జిల్లా 9, 8 స్థానాలను దక్కించుకున్నట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మార్చి 1నుంచి 20వ తేదీ వరకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 86 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణలో జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 31,479 మంది హాజరయ్యారు. వీరిలో 22,403 (71శాతం) మంది ఉత్తీర్ణత సాధించడంతో జిల్లాకు 9వ స్థానం లభించింది. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 28,4630 మంది హాజరవ్వగా వారిలో 24,581 (86శాతం) మంది ఉత్తీర్ణత సాధించడంతో జిల్లాకు 8వ స్థానం దక్కిందని ఆర్ఐఓ తెలిపారు. జిల్లా నుంచి ప్రథమ, ద్వితీయ జనరల్, ఒకేషనల్‌తో పాటు ప్రైవేటు విద్యార్థులు 61,727మంది హాజరవ్వగా వారిలో 47,898మంది ఉత్తీర్ణత సాధించారు. ఫీజుల వివరాలు.. గడువు తేది రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఈ నెల 13 నుంచి 22వ తేదీ లోపు రీకౌంటింగ్‌కు రూ.1,300, రీ వెరిఫికేషన్‌కు రూ.260 చెల్లించాలని ఆర్ఐఓ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు(మ్యాథ్స్, బైపీసీ విద్యార్థులు) రూ.165, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్ (ద్వితీయ సంవత్సరం)కు రూ.275, బెటర్ పర్ఫార్మెన్స్ (ఇంప్రూవ్మెంట్)కు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350, సైన్స్ వారు రూ.1,600 ఫీజు చెల్లించాలని చెప్పారు. న్యూస్రీల్మే 12 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 12 నుంచి 20వ తేదీ వరకు రోజూ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 4వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 6వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధైర్యపడొద్దు ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిలయ్యామనో విద్యార్థులు అధైర్యం చెందవద్దని, క్షణికావేశపు నిర్ణయాలు తీసుకోవద్దని ఆర్ఐఓ విద్యార్థులకు సూచించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మెరుగైన మార్కులు సాధించడానికి అవకాశం ఉందని తెలిపారు. -
940 హెక్టార్లలో మొక్కల పెంపకం
సైదాపురం: నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 940 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూముల్లో మొక్కలు పెంచనున్నట్టు నెల్లూరు జిల్లా అటవీ అధికారి కదిరి మహబూబ్ బాషా తెలిపారు. సైదాపురం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సైదాపురం సెంట్రల్ నర్సరీని శనివారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పా టు చేసిన ఈ సెంట్రల్ నరసరీలో 16 రకాలకు చెందిన 2 లక్షల మొక్కలను పెంచి.. అందులో 50 వేల మొక్కలను పంపిణీ చేయనున్నట్టు తెలిపా రు. జిల్లాలోని ఇనుకుర్తి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, సైదాపురంలో ఉన్న నర్సరీల్లో ఈ ఏడాది 20 లక్షల మొక్కలను పెంచనున్నట్టు పేర్కొన్నా రు. ఆయన వెంట రేంజర్ మాల్యాద్రి, సెక్షన్ అధి కారి శ్రీనివాసులు, బీఓ రవిశేఖర్ పాల్గొన్నారు. కాళంగి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహంసూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని హోలీక్రాస్ స్కూల్ వెనుక భాగాన ఉన్న కాళంగి నదిలో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన గుర్తుతెలియని మహిళ శవం శనివారం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ బ్రహ్మనాయుడు మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. గంధం కలర్ చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉంది. మన్నారుపోలూరు వీఆర్వో పీ.మాధవయ్య నుంచి రిపోర్టు తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గోవిందా..భద్రత ఉందా?
పవిత్ర క్షేత్రంలో అపవిత్రం ● యథేచ్ఛగా నిషేధిత వస్తువులు ● పాదరక్షకులతో మహద్వారం వరకు వచ్చిన భక్తులు ● తిరుమల భద్రత గాలికి తిరుమల: తిరుమల క్షేత్రంలో భద్రత కరువైంది. కొద్ది రోజులుగా వైకుంఠ వాసుని చెంత జరుగుతున్న వరుస సంఘటనలే దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై నిఘా ఉంచాల్సిన సంబంధిత ఉన్నతాధికారులు పటిష్ట భద్రత ఉందంటూ ఊకదంపుడు ప్రసంగాలకే పరిమితమవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఇవి కనిపించలేదా గోవిందా? ● వారం క్రితం అలిపిరి టోల్గేట్ దాటుకుని ఒక ముస్లిం యువకుడు తనిఖీలు చేసుకోకుండా.. భద్రతా సిబ్బంది ఆపుతున్నా ఆగకుండా.. ముస్లిం వస్త్రాన్ని ధరించి ద్విచక్ర వాహనంపై తిరుమలకు చేరుకున్నాడు. తర్వాత తిరుమలలోని టోల్గేట్ వద్ద ఆ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని టోల్గేట్ వద్దే అదుపు చేయలేకపోవడం అక్కడి భద్రత డొల్లతనం ఎత్తిచూపుతోంది. ● పది రోజుల క్రితం పాపవినాశనం డ్యాంలో అటవీశాఖ అధికారులు బోటింగ్ ప్రక్రియ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. పాపవినాశనానికి బోట్లు వచ్చిన సంగతి మీడియాలో వచ్చేవరకు ఉన్నతాధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ● మద్యం, సిగరెట్, గంజాయి వంటివి గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. వాటిని సేవించిన తర్వాత మందుబాబులు తిరుమలలో హల్చల్ చేస్తున్నారు. మాడ వీధులు మొదలుకుని అధికారులు నివాసం ఉండే ప్రాంతం వరకు కలియతిరుగుతున్నా వారిని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ● శనివారం మహారాష్ట్రకు చెందిన అభిషేక్, ముకేష్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవాణి టికెట్టుపై శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్–1 మీదుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. మహద్వారం వద్ద పనిచేసే టీటీడీ భద్రతా సిబ్బంది వీరిద్దరూ డిస్పోజబుల్ పాదరక్షలను ధరించి వచ్చినట్లు గుర్తించి వాటిని తొలగింపజేశారు. డిస్పోజబుల్ పాదరక్షలతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ క్యూలోకి ప్రవేశించి మహద్వారం వద్దకు వచ్చే వరకు ఎవ్వరూ గుర్తించకపోవడం అక్కడ భద్రత.. తనిఖీలు ఎలా ఉన్నాయో తేటతెల్లమవుతోంది. శాశ్వత సీవీఎస్వో లేకపోవడమే కారణమా? కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను ఇబ్బడిముబ్బడిగా బదిలీ చేశారు. ఇందులో భాగంగా తిరుమలలో పనిచేస్తున్న నరసింహకిషోర్ కొన్ని నెలల క్రితం బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత శాశ్వత సీవీఎస్వోను నియమించలేదు. అప్పటి నుంచి ఇన్చార్జ్ సీవీఎస్వోలతోనే భద్రతను నెట్టుకొస్తున్నారు. దీనికితోడు భద్రతా సిబ్బంది, విజిలెన్స్ అధికారులు సక్రమంగా తనిఖీలు చేయడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికారణంగానే తిరుమలలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. తిరుమలలో ఘోర అపచారాలు పాదరక్షకులతో శ్రీవారి దర్శనానికి భక్తులు టీటీడీలో భద్రత డొల్లతనం బట్టబయలు గోవుల మృతిపై విచారణ జరిపించాలి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర అపచారాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏదో ఒక సంఘటనలతో తిరుమల పవిత్రతను టీటీడీ అధికారులు మంటగలుపుతున్నారన్నారు. సాక్ష్యాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఆలయ మహద్వారం వరకు ముగ్గురు భక్తులు పాదరక్షకులతో రావడమే అందుకు నిదర్శనమన్నారు. తిరుమల మాడవీధుల్లోనే కాళ్లకు పాద రక్షకులు ధరించి తిరగడం నిషేధమన్నారు. అలాంటిది తిరుమల క్యూకాంప్లెక్స్లోకి ఎలా అనుమతించారు? అక్కడ నుంచి శ్రీవారి ఆలయ మహద్వారం వరకు పాదరక్షకులతో వస్తున్నా పట్టించుకోకుండా భద్రతా సిబ్బంది ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే దీనిపై టీటీడీ అధికారులు అవి పాదరక్షకులు కాదు చెవులకు రింగులు అని కూడా బుకాయిస్తారని మండిపడ్డారు. మేజోళ్లకు అనుమతి ఉందని టీటీడీ అధికారులు చెప్పినట్లు తెలిసిందన్నారు. వివరణ ఇచ్చి సరిపెట్టుకోవడం కుదరదు తిరుమలలో వరుసగా జరుగుతున్న ఘోర అపచారాలను తాము ప్రశ్నిస్తే వాటిపై వితండ వాదనలు, వివరణలు ఇచ్చి సరిపెట్టుకోవాలంటే కుదరదని భూమన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు చెప్పినప్పటి నుంచే ఇంతటి ఘోర అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమల పవిత్రతను కాపాడలేని టీటీడీ పాలక మండలి వెంటనే రాజీనామా చేయాలని, తిరుమలలో భద్రతా వైఫల్యాలకు కారకులైన అధికారులు, సిబ్బందిని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదండి.. నిరూపిస్తా గోమాతకు జరుగుతున్న నష్టంపైన మాట్లాడితే తనపై, జగన్మోహన్రెడ్డిపైన వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణరెడ్డితో పాటు చిన్న స్థాయి వ్యక్తులంతా మాట్లాడడం సరికాదన్నారు. గోశాలలో ఆవులు చనిపోయిన మాట నిజమని, అందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. అక్కడికి తనతో పాటు మీడియాను తీసుకెళితే అక్కడ పూడ్చిపెట్టిన ఆవుల కళేబరాలన్నింటినీ వెలికి తీద్దామన్నారు. గోవుల మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, తిరుతపి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, డైరెక్టర్ మహ్మద్ ఖాసిం, ఎస్సీ విభాగం నాయకుడు కల్లూరి చంగయ్య పాల్గొన్నారు. -
ఆటవిక చర్యలు ఆగవా?
శ్రీకాళహస్తి : సమాజంలో ఇంకా నిమ్న కులాలపై అగ్ర కులాల దురహంకార దాడులు చేయడం హేయమైన చర్యగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శి రెడ్డిపల్లి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర కులాల దాడిలో గాయపడి స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విరూపాక్షపురం గిరిజనులను శనివారం కేవీపీఎస్ నాయకులతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గద్దగుంటకు చెందిన చైతన్య విచక్షణా రహితంగా వెంకటేష్ (35), నాగయ్య(60)పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, గురునాథం, సంక్రాంతి వెంకటయ్య పాల్గొన్నారు.ఆటో బోల్తా – మహిళ మృతి బుచ్చినాయుడుకండ్రిగ: ఆటో అదుపు తప్పి గుంతలో బోల్తా పడడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన పదోమైలు గ్రామం కేటీరోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. కేవీబీపురం మండలం, తిమ్మభూపాలపురం గ్రామానికి చెందిన పుల్లారెడ్డి ఆయన భార్య మునెమ్మ (55), కుమారుడు భక్తవత్సలరెడ్డి ఉల్లిపాయలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం వదరయ్యపాళెం గ్రామంలోని సంతకు ఆటోలో ఉల్లిపాయలు తీసుకుని వెళ్తుండగా పదోమైలు గ్రామం వద్ద ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మునెమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పుల్లారెడ్డి, భక్తవత్సలరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మునెమ్మను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విశ్వనాథనాయుడు తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం సాయంత్రం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా పలువురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం, మిర్యాలగూడకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కారులో తిరుమల నుంచి అలిపిరికి మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా 13వ మలుపు వద్ద కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో భక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. అదేవిధంగా తమిళనాడు, చైన్నెకి చెందిన 13 మంది భక్తులు టెంపోట్రావెలర్లో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా మొదటి మలుపు వద్ద కారు అదుపుతప్పి రక్షణ గౌడను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఘాట్‌రోడ్డు భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
శ్రీచైతన్య విద్యార్థుల హవా
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ఈ.గణేష్‌రెడ్డి, జె.సార్విక, ఎస్.ప్రణవి, ఎన్.హారిక 990 మార్కులు, జి.ప్రశాంత్‌రెడ్డి, కె.దివ్యశ్రీ, పి.స్పందన, ఎస్.నవీన్ 989 మార్కులు సాధించగా.. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సి.తన్మయి 466, ఎం.దివ్యశరణ్య, జి.జాహ్నవి, కె.హంసలేఖ, ఎ.రుషివేంద్ర, సి.యశ్వంత్‌కుమార్, బి.దివ్యశ్రీ, ఎ.నాగరిషిక 465 మార్కులు సాధించారు. అలాగే జూనియర్ బైపీసీ విభాగంలో కె.అభిగ్నరెడ్డి, టి.హర్షిత, వై.జోషిత 434 మార్కులు సాధించగా.. వీరిని విద్యాసంస్థల ఏజీఎం బీవీ ప్రసాద్, డీన్లు కెఎల్జీ.ప్రసాద్, రామమోహన్‌రావు, శ్రీనివాసరాజు, భాస్కర్ అభినందించారు. తిరువణ్ణామలై రద్దీ తిరుపతి అర్బన్: పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తమిళనాడులోని తిరువణ్ణామలైకి వెళ్లారు. జిల్లాలోని 10 డిపోల నుంచి 81 సర్వీసులను ఏర్పాటు చేశారు. అందులో తిరుపతి డిపో నుంచి 17 సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే ఒక్క తిరుపతి నగరం నుంచే 10వేల మంది భక్తులు శనివారం తిరువణ్ణామలైకి వెళ్లినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో తొక్కిసలాటలు లేకుండా జిల్లా ప్రజారవాణా అధికారి నరసింహులు, ఏటీఎం రామచంద్రనాయుడు, డీఎం బాలాజీ, టీఐ వీఆర్ కుమార్ చర్యలు చేపట్టారు. -
కర్కశంగా మారిన కన్నతల్లి!
● కన్న కూతుర్ని హతమార్చి సహజ మరణంగా చిత్రీకరణ ● నరసింగాపురంలో పరువు హత్య ● ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే హత్య ● వివరాలను వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్ చంద్రగిరి: కన్నతల్లే.. కూతురి పట్ల కర్కోటకంగా మారి కడతేర్చింది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు తలవంపులు తెస్తోందని పరువు హత్యకు పాల్పడింది. ఇతర కులానికి చెందిన యువకుడిని బాలిక(16) ప్రేమించడమే ఆమె పాలిట శాపంగా మారింది. కూతురుని హత్యచేసిన తల్లి చివరకు కటకటాలపాలైన ఘటన శనివారం చంద్రగిరిలో చోటుచేసుకుంది. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని నరసింగాపురం గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. భర్తతో విభేదాలు రావడంతో 11 ఏళ్లుగా తల్లి అదే గ్రామంలో మరొక ఇంట్లో తన ఇద్దరు కుమార్తెలతో ఉంటోంది. బతుకుదెరువు కోసం తిరుమలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం తన పెద్ద కుమార్తె (16), మిట్టపాళెం గ్రామానికి చెందిన అజయ్‌ని ప్రేమించింది. దీనిపై అప్పట్లో అజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అజయ్‌ను రిమాండ్‌కు తరలించారు. అప్పట్లో బాలిక గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా నాటు వైద్యం ద్వారా గర్భస్రావం చేశారు. అయితే అప్పట్లో బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇదిలా ఉండగా రిమాండ్ ఖైదీగా ఉన్న అజయ్‌ని సబ్‌జైలుకు వెళ్లి తరచూ పరామర్శిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. సబ్‌జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన అజయ్‌తో బాలిక తరచూ సెల్ఫోన్లో చాటింగ్‌లు చేయడం, మాట్లాడడంపై తీవ్రంగా మండిపడ్డారు. తనను చంపేస్తారని ముందే తెలిసి తన కుమార్తె ప్రియుడు అజయ్‌తో చాటింగ్ చేయడం, ఫోన్లో మాట్లాడడాన్ని తల్లి గ్రహించింది. దీంతో కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం బాలికను విషం పెట్టి చంపేసేందుకు తన తల్లి కుట్ర పన్నుతోందంటూ ప్రియుడికి వాట్సప్ ద్వారా మెసేజ్‌లు పెట్టినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆపై కొద్దిరోజుల్లోనే బాలిక మృతి చెందింది. ముక్కు, నోరు మూసివేసి! ఇంట్లో నిద్రస్తున్న బాలికను ఆమె తల్లే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 4వ తేదీన ఇంట్లో ఉన్న బాలిక ముక్కు, నోరు మూసివేసి హత్య చేసినట్లుగా నిందితురాలు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాలిక హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకూడదనే ఉద్దేశంతో గంటల వ్యవధిలో దహనం చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వేరొక కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతోనే తన కుమార్తెను హత్య చేసిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు నిందితురాలిని శనివారం అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన మీడియాకు వివరించారు. కేసు నమోదు చేసిన 72 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన సిబ్బందికి డీఎస్పీ రివార్డులను అందజేశారు. సీఐ సుబ్బరామిరెడ్డి, ఎస్ఐ అనిత ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్య సాధనకు విద్యార్థి దశ కీలకం
తిరుపతి సిటీ: ఉన్నత లక్ష్య సాధనకు విద్యార్థి దశ కీలకమని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్య సాధనకు కృషి చేయా లని రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ జే ప్రకాష్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రిమ్స్‌లో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు వారం రోజులుగా కమ్యూనికేషన్, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌పై జరిగిన శిక్షణ శనివారం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడతూ విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అకడమిక్ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం పలు పోటీలలో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. డైరెక్టర్లు వై.కొండారెడ్డి, ఆనందరెడ్డి, విజయ్‌రెడ్డి, హెచ్ఓడీ మధుర, ఫౌండేషన్‌కు చెందిన గురుస్వామి, వెంకటప్రసాద్, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా
తిరుపతి మంగళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ‘పొలిటికల్ అడ్వైజర్ కమిటీ’ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించి పీఏసీ మెంబర్లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు పీఏపీ మెంబర్లుగా మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజాను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులను జారీచేసింది. 14న గ్రీవెన్స్ రద్దు తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో ఈనెల 14న జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రామాన్ని బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌తోపాటు డివిజన్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. -
హంస వాహనంపై లక్ష్మీనరసింహుడు
రాపూరు: వసంతోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఉభయనాంచారులతో కలసి శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి హంస వాహనపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. స్వామి వారి అలంకార మండపంలో నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవీ ఉత్సవ విగ్రహాలను కొలువు దీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మేళతాళాలు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ కోన మాడ వీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం నందనవనంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
గూడూరు రూరల్: పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందిన ఘటన గూడూరు రైల్వేస్టేషన్లో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం.. గూడూరు రైల్వే స్టేషన్ చివరి భాగంలో రైలు పట్టాలు దాటుతున్న సుమారు 55 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తిని బెంగళ్లూరు నుంచి గౌహతి వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు
తిరుపతి కల్చరల్: శ్రీరామచంద్ర పుష్కరిణిలో గత మూడు రోజులుగా చేపట్టిన శ్రీకోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన శనివారం రాత్రి స్వామి వారు తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం స్వామి,అమ్మవార్లు శ్రీరామచంద్ర పుష్కరిణికి వేంచేశారు. సుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు విహరించి భక్తులను కనువిందు చేశారు. ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో శ్రీధర్స్ ప్రభంజనం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి శ్రీధర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారని కళాశాల చైర్మన్ మద్దినేని శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సి.ఉమామహేశ్వర్ 465, కె.నిత్యశ్రీకల్యాణి 464, వి.శ్రీకర్‌రెడ్డి 463, ఎస్.యామిని, కె.పనుష్య, పి.వాసవి, పి.మానస 462, సి.షామితారెడ్డి, పి.యశ్విత 460 మార్కులు సాధించారన్నారు. జూనియర్ బైపీసీ విభాగంలో సి.జ్యోష్ణ 433, వీఎస్ రక్షిత 426, ఎం.దివ్య 422, సి.ధన్యత, వి.ప్రియదర్శిని 419 మార్కులు సాధించినట్లు చెప్పారు. అలాగే సీనియర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో బి.వన్షిక, మహమ్మద్ ఇమ్రాన్ 987, పి.నిఖిలేశ్వర్ 985, ఆర్.యుక్త 984, మహమ్మద్ తాలిబ్, డి.షోషిత 980 మార్కులు సాధించినట్టు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను అభినందించారు. -
యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ పరీక్షలు రేపు
తిరుపతి అర్బన్: నగరంలో ఆదివారం యూపీఎస్సీ కంబెన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ పరీక్షలు జరగనున్నాయని, వీటికి నిర్వహనకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. తిరుపతిలో 3 చోట్ల పరీక్షలు ఉంటాయన్నారు. యూపీఎస్సీ కంబెన్డ్ డిఫె న్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు ఉంటాయని వెల్లడించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిలాల్లో 3 సెంటర్లు కేటాయించామన్నారు. 973 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఈ పరీక్షలకు డిప్యూటీ తహసీల్దార్ అధి కారి లైజన్ అధికారిగా ఉంటారన్నారు. పరీక్ష కేంద్రంలో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రికల్ వస్తువులకు అనుమతి లేదన్నారు. మరోవైపు బస్టాండ్ నుంచి ఆర్టీసీ వారు పరీక్ష కేంద్రాల వరకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారన్నారు. తిరుపతిలోని బాలాజీ కాలనీ వెస్ట్ చర్చి రోడ్డు మార్గంలోని శ్రీపద్మావతి బాలికల ఉన్నత పాఠశాలతోపాటు శ్రీపద్మావతి అతిథి గృహం వద్ద శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల(వింగ్–ఏ), శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్–బీ)పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయన్నారు. ఆర్డీఓ రామమోహన్, యూపీఎస్సీ డిప్యూటీ సె క్రటరీ ఎన్కే స్వామి పరీక్షలను పర్యవేక్షించనున్నారని చెప్పారు. -
మహిళా వర్సిటీలో ఏడు పరిశోధనలకు ఆమోదం
తిరుపతి సిటీ: అంతర్జాతీయ విద్యా పరిశోధన నిధి ద్వారా ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్(పీఎం ఉష) పథకం కింద ఏడు అంతర్జాతీయ విద్యా పరిశోధన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. ఇందులో ప్రధానంగా యూఎస్ఏ జెనోమిక్స్ బయోటెక్ ఇంక్ వర్సిటీ, మలేషియాలోని టెరెంగాను, యూనివర్సిటీ అటున్ హుస్సేన్ ఓన్, అలాగే యూఎస్‌లోని టెక్సెస్ ఫోర్ట్ వర్త్ వర్సిటీ, కెనడాలోని యార్క్ విశ్వవిద్యాలయం, నేపాల్‌లోని ఖాట్మండు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో బయోటెక్నాలజీ, అఫ్లైడ్ మైక్రోబయాలజీ, హోమ్ సైన్‌న్స్, ఫార్మసీ, కంప్యూటర్ సైనన్స్ ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, లా విభాగాల్లో పరిశోధన ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. ఈ నిధులను మ్యాచింగ్ గ్రాంట్ కింద అధ్యాపకులకు అందిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాజెక్టుల సాధనలో కృషి చేసిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రజిని, డీన్ ప్రొఫెసర్ పి విజయలక్ష్మి, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఆర్ ఉషా పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 57,462 మంది స్వామివారిని దర్శించుకోగా 22,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
హంస వాహనంపై లక్ష్మీనరసింహుడు
రాపూరు: పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక వ సంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు ఉభయనాంచారులతో కలసి హంస వాహనంపై విహరించారు. స్వామి వారి అలంకార మండపంలో నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవమూర్తులను కొలువు దీర్చి, కోన మాఢవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు శ్రీవారి కల్యాణ మండపంలో నిత్యహోమం, 10 గంటలకు స్వామి వారి నందనవనంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలో పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం నివారించి, మెరుగైన సరఫరాకు కృషి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి ఎస్ఈ సురేంద్రనాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్పీడీసీఎల్) తిరుపతి సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. సురేంద్ర నాయుడు శుక్రవారం శ్రీసిటీలో నిర్వహించిన పరిశ్రమల విద్యుత్ వినియోగదారుల సదస్సులో పాల్గొన్నారు. విద్యుత్ వినియోగం, సరఫరా, ఇతర విద్యుత్ సమస్యలపై పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. పరిశ్రమ వర్గాలకు పలు సందేహాలను నివృత్తి చేశారు. తుంబురు తీర్థానికి భారీగా భక్తులు తిరుమల: తుంబురు తీర్థ ముక్కోటికి భారీగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. శుక్రవారం, శనివారం పాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు శేషాచల అడవుల్లోని తుంబూరు తీర్థ ముక్కోటికి వస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు భక్తులను అనుమతించారు. తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి శ్రీ తుంబురుడిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, నీళ్ళు, మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులకు భద్రత, వైద్యసేవలను తితిదే విజిలెన్స్ ఆటవీశాఖ, వైద్యవిభాగం ఏర్పాటు చేశారు. భక్తులను శనివారం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు మాత్రమే తుంబురు తీర్ధంకు అనుమతిస్తారు తితిదే ఏర్పాట్లను వీజీఓ సురేంద్ర, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మధుసూదర్‌రావు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి జీఎల్ఎన్ శాస్త్రి తదితరులు పర్యవేక్షించారు. -
పూలే సేవలు చిరస్మరణీయం
తిరుపతి అర్బన్: మహిళల విద్యకు మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రలకు విద్య అవసరమన్న విషయం గుర్తించి, ఆ దిశగా ఎనలేని సేవలు చేసిన మహా మనిషి జ్యోతిబాపూలే అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు ఘనంగా జ్యోతిరావుపూలే జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించామన్నారు. దేశ చరిత్రలో సామాజిక సంస్కరణలకు జ్యోతిబా పూ లే ఆధ్యుడని తెలిపారు. అనంతరం కార్పొరేషన్ రుణాలకు చెందిన చెక్కును జారీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 600 మంది బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు పలు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాయాదవ్, డీఆర్వో నరసింహులు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈఓ బాబు రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డై రెక్టర్లు మదన్మోహన్, చంద్రన్న, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలాజీకాలనీలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేశా రు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాంగాటి గోపాల్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు, నేతలు యార్లపల్లి గోపి, అశోక్ సామ్రాట్ యాదవ్, మజీద్ పట్టేల్, శివశంకర్ పాల్గొన్నారు. ● కలెక్టరేట్లో పూలే జయంతి వేడుకలు.. -
విరూపాక్షపురంలో కుల దురహంకారం
● బండి నెమ్మదిగా నడపమన్నందుకు గిరిజనులపై అగ్రకులాల మూకుమ్మడి దాడి శ్రీకాళహస్తి: ద్విచక్ర వాహనాన్ని నెమ్మదిగా నడమన్నందుకు అగ్ర కులాలు గిరిజనులపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలం, విరూపాక్షపురం గిరిజన కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత గిరిజనుల కథనం మేరకు.. గద్దగుంట గ్రామానికి చెందిన వన్నెకాపు సుబ్రమణ్యం కుమారుడు చైతన్య శ్రీకాళహస్తి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో విరూపాక్షపురం ఎస్టీ కాలనీ వద్ద బండి వేగంగా నడపడంతో రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని ఢీకొనబోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న నాగయ్య, వెంకటేష్ బండి నెమ్మదిగా నడపొచ్చు కదా..? అంటూ చైతన్యను నిలదీశారు. దీంతో అహం దెబ్బతిన్న చైతన్య రోడ్డుపైనే నాగయ్య, వెంకటేష్‌పై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా గద్దగుంటకు వెళ్లి మరో 20 మందిని వెంట తీసుకొచ్చి ఇంకోసారి నాగయ్య, వెంకటేష్ లపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అగ్రకులస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన నాగయ్య(60), వెంకటేష్(30)ను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తొట్టంబేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గిరిజనులపై అహంకారపూరితంగా దాడికి దిగిన అగ్రకులస్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య డిమాండ్ చేశారు. -
25 మందిపై కేసు నమోదు
ఓజిలి: మండలంలోని అత్తివరం గ్రామంలో పరిశ్రమల విషయంలో చోటు చేసుకున్న వివాదంలో రెండు వర్గాలకు చెందిన 25 మందిపై గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం మేరకు.. అత్తివరం గ్రామంలోని పారిశ్రామిక సెజ్‌లో పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమలలో అధిపత్యం కోసం టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం పరిశ్రమలకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తుండగా పాల్చూరు అమరేంద్ర, ధర్మేంద్ర, పాకనాటి శ్రీనివాసులు మరో 10 మంది కలసి తనపై దాడి చేసి కులంపేరుతో దూషించారని బాధితుడు కుంపటి మహేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలో విచారణ జరిపి, 13 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. అలాగే పరిశ్రమలలో అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చెలరేగిన వివాదంలో ఎల్లు గురుమూర్తి, మహేంద్ర, అనీల్రెడ్డితోపాటు మరో 9 మంది తనపై దాడి చేశారని పాకనాటి లోకేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాదితుడు ఫిర్యాదు మేరకు 12 మందిపై ఎస్ఐ స్వప్న కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును శుక్రవారం నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు విచారణ చేపట్టారు. అత్తివరం గ్రామంలోని పరిశ్రమలు, గ్రామస్తులను విచారణ జరిపి వివరాలు సేకరించారు. ఈ మేరకు రెండు వర్గాలు మధ్య వివాదాలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పంటలపై అడవి పందుల దాడి
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కాంపాళ్లెం, కరకంబట్టు, కుక్కంబాకం, బు చ్చినాయుడుకండ్రిగ, గ్రామాల్లో రైతులు సాగు చేసి న పంటలపై అడవిపందులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నాయి. అటవీ సరిహద్దు గ్రామాల్లో 565 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో అడవి పందులు రాత్రి వేళల్లో పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో పందులు నాశనం చేయటంతో రైతులు దిక్కుతోచక నానా అవస్థలు పడుతున్నారు. కిలాడీ లేడీది కలువాయి మండలమే! కలువాయి(సైదాపురం): ఉద్యోగం కావాలనా నా యనా... అయితే ఎస్బీఐలోనే ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.లక్షల్లో నగ దు తీసుకుని ఒక పోలీసు అధికారి సహకారంతో నెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్‌లో దందా సాగిస్తున్న ఓ కిలాడీ లేడీది శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, కలువాయి మండలంలోని చౌటపల్లిగా పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, కలువా యి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన బత్తుల రజిత (రమ్య) మాదాపూర్ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు అందరినీ నమ్మించింది. స్నేహితుల సహకారంతో ఉద్యోగాలు ఇప్పిస్తా నంటూ నమ్మబలికేది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు నెల్లూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌కు వెళ్లింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న శ్రీదేవి అనే మహిళతో పరిచయం పెంచుకుని, నీకు ఎస్బీఐలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఆమె నుంచి తన తండ్రి వెంకటేశ్వర్లు ఖాతాల్లోకి పలు దఫాలుగా రూ.9.6 లక్షల నగదును వేయించుకుంది. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత 2022లో నకిలీ ఎస్బీఐ అపాయింట్మెంట్ లెటర్‌ను, నకిలీ ఐడీ కార్డును ఇచ్చి హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని మాయమాటలు చెప్పింది. అయితే నెలలు గడుస్తున్నా శ్రీదేవికి ఉద్యోగం రాకపోవడంతో గొడవ పడింది. దీంతో రజిత రూ.70 వేలు నగదును శ్రీదేవికి అందజేసింది. మిగిలిన నగదు ఇవ్వాలని అడగగా శ్రీదేవిపై దౌర్జన్యానికి దిగింది. దీంతో ఆమె నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రజిత, ఆమె తండ్రి వెంకటేశ్వర్లుపై కేసు నమోదైంది. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
తిరుపతి సిటీ: అణగారిన వార్గాల ఆశాజ్యోతి, సీ్త్ర విద్య కోసం ఎనలేని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. శుక్రవారం తిరుపతి వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కుల వివక్ష నిర్మూలన, సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సాంఘిక సంస్కర్త పూలే అన్నారు. నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయ కర్త అభినయ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు లవ్లీ వెంకటేష్, మోహన్, అరుణ్, మురళి, బొగ్గుల వెంకటేష్, కరాటే శీను, గోపాల్‌రెడ్డి, రమణ, సాయికుమారి, పునీత, పుష్పలత, కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛ హరించడం సబబుకాదు
చిత్తూరు అర్బన్: పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జర్నలిస్టులను అణగదొక్కాలని చూ స్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చి త్తూరులో పాత్రికేయలోకం కదం తొక్కింది. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, చి త్తూరు ప్రెస్‌క్లబ్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్‌క్లబ్, తవణంపల్లె ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు నగరంలో విలేకరులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకనాథన్, మురళీకృష్ణ, చిత్తూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి కాలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్‌టౌన్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం, ఆర్డీఓ కార్యాలయం వరకు వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లోకనాథన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల గొంతుపై కేసులు పెట్టి పాత్రికేయులను లోబరచుకోవాలని చూస్తోందన్నారు. పల్నాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్యకు గురైన వార్తలు రాసినందుకు ఆరుగురు పాత్రికేయులతోపాటు, సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి పై క్రిమినల్ కేసులు పెట్టడం ఏమాత్రం ఆమోదయో గ్యం కాదన్నారు. పత్రికలో ప్రచురితమైన వార్తలో అభ్యంతరం ఉంటే ఖండించడం, న్యాయపరంగా ముందుకు వెళ్లడం చేయాలే తప్ప, ఎవరో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ రా జ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ ప్రకటనను హరించడమేనన్నారు. రాష్ట్ర డీజీపీ సైతం కనీస న్యా య సలహా తీసుకోకుండా పాత్రికేయులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడం మంచిది కాదన్నారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులను కలిసి సాక్షి పాత్రికేయులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్, ఉపాధ్యక్షులు శివకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్, వెంకటేష్ , చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, శివకుమార్, కార్యవర్గ సభ్యులు చంద్ర, రాజేష్, బాలసుందరం, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమలయ్య, నరేష్, తేజ, ఎంజీఆర్, తవణంపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జగన్నాథం, శివకుమార్, అనంత్ కుమార్, పాత్రికేయులు హేమంత్ కుమార్, ప్రవీణ్, జయకుమార్, ఐరాల చిన్న, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ● పలమనేరు ఆర్డీఓకు వినతిపత్రం అందజేత పలమనేరు: పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడం సబబుకాదని, పత్రికలను అణగదొక్కాలని గతంలో అనుకున్న పార్టీలు ఆపై కనిపించకుండా పోయాయని పలమనేరు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్, దిలీప్ అన్నా రు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదుకు వ్యతిరేకంగా స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి యా ప్రతినిధులతో కలసి శుక్రవారం నిరసన తెలిపి ఆపై స్థానిక ఆర్డీఓ భవానీకి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికల్లో వెలువడే వార్తలను పార్టీలకు అంటగడుతూ ఎడిటర్లపై కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. పత్రికలో వచ్చిన వార్త తప్పుగా ఇంటే దానిపై ఖండన, రీజయిండర్ ఇవ్వాలి గానీ, ఇలా కేసులు పెట్టడం, దాన్ని పోలీసులు అమలు చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాసామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై కేసులు పెట్టడం భవిష్యత్తులో అనర్థాలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి తప్పుడు కేసులపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఇలాంటి సంస్క్రృతి కొనసాగితే రేపు మరోపార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటివి పునరావృత్తం కావడం ఖాయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇందులో ప్రెస్‌క్లబ్ సభ్యు లు రెడ్డెప్ప, సుబ్రమణ్యం, రంజిత్, సూర్యబాబు, సాక్షి మణి, మోహన్‌మురళి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
తిరుపతి సిటీ: నూతన ఆవిష్కరణలపై యువత దృష్టి సారించి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జేఎన్టీయూ వీసీ సుదర్శన్‌రావు పిలుపునిచ్చారు. స్థానక కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో తరంగ్–2025 పేరుతో గురువారం జరిగిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రామన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌లోనూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలోనూ పట్టు సాధించాలన్నారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఉపయుక్తమైన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారిస్తే చిరస్థాయి గుర్తింపుతోపాటు పది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంటారన్నారు. వార్షికోత్సవం సందర్భంగా అకడమిక్ విద్యలోనూ, క్రీడల్లోనూ ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు జ్ఞాపికలు, ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం విద్యార్థుల ఫ్లాష్ మాబ్, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాయలసీమ విద్యాసంస్థల డైరెక్టర్ మన్నెం వెంకటరామిరెడ్డి, కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్‌కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, కన్వీనర్ మునిశంకర్ పాల్గొన్నారు. -
జాతీయ స్థాయికి ‘మినీ ఫాస్ట్ కంపోస్టర్ ప్రాజెక్టు’
తిరుపతి ఎడ్యుకేషన్ : కేంద్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ సెల్ మంత్రిత్వ శాఖ, అటల్ టింకరింగ్ ల్యాబ్, నీతి ఆయోగ్, జాతీయ సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా 2024–25 విద్యాసంవత్సరంలో స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది. గత ఏడాది జూలై 29 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాల నుంచి దాదాపు లక్షకు పైగా మోడల్స్‌ను విద్యార్థులు పంపించారు. వీటి నుంచి 1,731 ప్రాజెక్టులు మొదటి దశలో ఎంపికవగా, మన రాష్ట్రం నుంచి 76 ప్రాజెక్టులున్నాయి. అందులో నుంచి తిరుపతి, విజయనగరానికి చెందిన రెండు ప్రాజెక్టులు మాత్రమే ఆర్థిక సాయానికి ఎంపికయ్యాయి. తిరుపతి జిల్లా, వడమాలపేట మండలం, తడుకు ఆర్ఎస్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు హేమశ్రీ, గీతిక, వినయ్‌కుమార్ జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్ మార్గనిర్దేశంలో రూపొందించిన మినీ ఫాస్ట్ కంపోస్టర్ ప్రాజెక్టుకు అభివృద్ధికి రూ.90వేలు ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో ప్రాజెక్టు రూపకర్తలను, సైన్స్ ఆఫీసర్, డీఈఓ కేవీఎన్.కుమార్‌లను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ అభినందించారు. ఈ ప్రాజెక్టు పనితీరు, ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధికి అవసరమయ్యే ఆవిష్కరణలు చేయాలని జేసీ పిలుపునిచ్చారు. విద్యార్థులను అభినందించిన జేసీ, డీఈఓ -
బాలిక మృతి కేసులో విచారణ వేగవంతం
● దహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్, రెవన్యూ అధికారులు ● ల్యాబ్ పరీక్షల కోసం అస్తికలు సేకరించిన క్లూస్ టీం చంద్రగిరి: బాలిక అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నరసింగాపురం సమీపంలోని స్వర్ణముఖి వాగులో బాలికను దహనం చేసిన ప్రాంతాన్ని గురువారం సీఐ సుబ్బరామిరెడ్డి, తహసీల్దార్ శివరామసుబ్బయ్యలతో కలసి క్లూస్ టీం అధికారులు పరిశీలించారు. అనంతరం బాలిక అస్తికలను సేకరించారు. ఆ తర్వాత పోలీసు, రెవెన్యూ అధికారులు నరసింగాపురంలోని మృతురాలి ఇంటి వద్దకు వెళ్లి బాలిక తండ్రితో పాటు చుట్టుపక్కల వారిని విచారణ చేశారు. తన కుమార్తెను తల్లే పొట్టన పెట్టుకుందని మృతురాలి తండ్రి పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉంచితే, మైనర్ బాలిక తల్లిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తిరుమలకు వెళ్లిన పోలీసులు బాలిక మృతి చెందిన రోజు తాను ఇక్కడ లేనని, తిరుమలలో విధుల్లో ఉన్నట్లు ఆమె తల్లి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు గురువారం మధ్యాహ్నం తిరుమలకు వెళ్లినట్లు తెలిసింది. బాలిక తల్లి పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ఆమె సహద్యోగులను విచారణ చేసినట్లు సమాచారం. -
విద్యుత్ షాక్‌తో ఎలుగుబంటు మృతి
సాక్షిటాస్క్పోర్స్: చామలా అటవీ వన్యప్రాణుల అభయారణ్యం (భాకరాపేట అడువులు)లో విద్యుత్ తీగలు తగిలి ఎలుగుబంటు మృతి చెందింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేకేతించింది. వివరాలు.. చిన్నగొట్టిగల్లు మండలం, చిట్టేచెర్ల పంచాయతీ, తుమ్మచేనుపల్లె అటవీ సరిహద్దు ప్రాంతమైన ఎర్రగొండ పెద్దాయన చెరువు సమీపంలో వేటగాళ్లు తీసిన విద్యుత్ తీగలకు ఎలుగుబంటు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు వేటగాళ్లు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై భాకరాపేట అటవీ అధికారులను వివరణ కోరడానికి ప్రయత్నించగా వారు స్పందించలేదు. -
నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం
రాపూరు: వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా పెంచలకోనలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామికి గురువారం స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీవారికి గ్రీష్మ తాపాన్ని చల్లార్చేందుకు పెంచలకోనలో వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు శ్రీవారికల్యాణ మండలపంలో నిత్యహోమం, 10 గంటలకు స్వామి వారి నందనవనంలో శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను ఉంచి విశేషంగా అభిషేకించారు. ఉభయకర్తలుగా బండి తిరుపాల్‌రెడ్డి, తేజ దంపతులు వ్యవహరించారు. శేష వాహనంపై ఊరేగిన నృసింహుడు గురువారం రాత్రి శేష వాహనంపై నరసింహస్వామి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. -
ట్రాఫిక్‌కు అంతరాయం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రేణిగుంట– కడప రహదారి కరకంబాడి వద్ద కడప వైపు వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపేసి ట్రాఫిక్‌ను తిరుపతి వైపు మళ్లించారు. కరకంబాడి వద్ద వాహనాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. రేపు జరిగే సీఎం కార్యక్రమానికి ఇప్పటి నుంచే వాహనాలను నిలిపివేయడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. అయితే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ వల్లే వాహనాలను ఆపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాల్మీకి చరిత్ర పుస్తకావిష్కరణ తిరుపతి సిటీ: ఎస్వీయూ ప్రాచ్య పరిశోధన సంస్థ ముద్రించిన ‘వాల్మీకి చరిత్ర’ పుస్తకాన్ని గురువారం వీసీ ఆచార్య చిప్పాడ అప్పారావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నిధులతో ప్రాచ్య పరిశోధన సంస్థ రఘునాథ నాయకుడు రాసిన ‘వాల్మీకి చరిత్ర’ను ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ గ్రంథాన్ని సంస్థ సంచాలకులు ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు వచనంలో భావానువాదం చేశారని తెలిపారు. వాల్మీకి మహర్షిగా మారకముందు ఆయన జీవన సరళిని విపులంగా ఇందులో వివరించారన్నారు. కిరాతకుడిగా జీవించిన వ్యక్తి సప్తర్షుల ప్రభావంతో మహర్షిగా మారి సంస్కృత ఆదికావ్యం రామాయణం నిర్మించిన చరిత్ర ఈ గ్రంథంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్వీయూ సెంట్రల్ లైబ్రరీ డైరెక్టర్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. ముమ్మాటికీ అది దుర్మార్గం తిరుపతి కల్చరల్: అడవుల్లో నక్సల్ ఏరివేత ముమ్మాటికి దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. గురువారం తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 కల్లా నక్సల్‌ను తుదముట్టిస్తామన్న కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలు గిరిజన ప్రాంత వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. అటవీ ప్రాంతాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలన్న వైఖరితో కేంద్రం కుట్రచేస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఉభయసభల్లో వక్ఫ్ బిల్లుపై బుల్డోజ్ చేసి బిల్లు పాస్ చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు తిరువనంతపురంలో జాతీయ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆక్వా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. -
భారతమ్మపై అనుచిత వ్యాఖ్యలు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు ● చేబ్రోలు కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్బుచ్చినాయుడుకండ్రిగ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై బుచ్చినాయుడుకండ్రిగ పోలీస్ స్టేషన్లో గురువారం వైఎస్సార్సీపీ మండల కన్వీనరు కొణతనేని మణినాయుడు, చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనరు వేలూరు రాకేష్ ఫిర్యాదు చేశారు. యూట్యూబర్ చేబ్రోలు కిరణ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై టీడీపీ ఆధ్వర్యంలో పనిచేసే ఐటీడీపీ వంటి సంస్థలు అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టాయని ఆరోపించారు. కొన్నింటిని మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడం వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతోందన్నారు. పాయింట్ బ్లాక్ అనే యూట్యూబ్‌లో చేబ్రోలు కిరణ్ అభ్యంతకరమైన ఆరోపణలు చేశారని, కిరణ్‌తోపాటు ఇంటర్వ్యూ చేసిన వారిపై కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వారి వెంట వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, రవిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గురునాథం, వైస్ ఎంపీపీ మునికృష్ణారెడ్డి, నాయకులు గురవయ్య, ప్రసాద్‌పాల్, కిరణ్‌యాదవ్, ప్రసాద్, అమరలింగయ్య, వెంకటేష్, రాజశేఖర్, దయాకర్‌రెడ్డి ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
తడ: జాతీయ రహదారిపై కారూరు పంచాయతీ, కారూరుమిట్ట గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడులోని రెడ్ హిల్స్‌కి చెందిన సుబ్రమణి(50) మృతి చెందాడు. ఎస్ఐ కొడపనాయుడు కథనం.. కారూరు పంచాయతీ, ఖాశింగాడు కుప్పం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వద్ద సుబ్రమణి రైల్వే కూలి పనులకోసం వచ్చి అదే గ్రామంలో ఉంటున్నాడు. బుధవారం రాత్రి సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతుండగా చైన్నె నుంచి సూళ్లూరుపేట వైపు వెళుతున్న టెంపో ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రమణి అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పలు కోర్సులకు మంగళం
● ఎస్వీయూలో పలు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు ఇక కనబడవు ● పీజీ సెట్లో కానరాని ఆరు ప్రధాన కోర్సులు ● ఆవేదన చెందుతున్న విద్యార్థులు తిరుపతి సిటీ: అనుకున్నట్టే జరిగింది. ఎస్వీయూలో నూతన కోర్సులు దేవుడెరుగు.. ఉన్న కోర్సులకు మంగళం పాడేస్తున్నారు. ఏపీ పీజీ సెట్లో పలు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులను తీసేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆ కోర్సులకు ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏపీ పీజీ సెట్ నుంచి ఎస్వీయూలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను 2025–26 విద్యాసంవత్సరం నుంచి తొలగించినట్లు వీసీ అధికారికంగా ప్రకటించారు. అధ్యాపకులు రోడ్డు పాలు! కోర్సుల నిర్వహణ వర్సిటీకి భారంగా మారిందని అధికారులు చెబుతున్న కుంటి సాకులను విద్యార్థి సంఘాల నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు పీజీ సెట్లో అనుకున్న కోర్సులో సీటు సాధించలేని పక్షంలో సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. అటువంటి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడం దారుణమని మండిపడుతున్నారు. కోర్సుల్లో ప్రవేశాలను పెంచేందుకు అధికారులు కృషి చేయాలి తప్ప పేదలు ఎక్కువగా చదివే పీజీ కోర్సులను తొలగించడం సమంజసం కాదనిఅంటున్నారు. వర్సిటీలో పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్లను వర్సిటీ నుంచి గెంటివేసి రోడ్డు పాలు చేసేందుకు అధికారులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఏఐఎస్ఎప్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఏ, పీడీఎస్ఓ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎస్వీయూ పరిపాలనా భవనం తొలగించిన పీజీ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు 1. ఎంకామ్ (ఎఫ్ఎమ్) 2. ఎంఏ ఎకనామిక్స్ 3. ఏంఏ తెలుగు 4.ఏంఏ సోషియల్ వర్క్ 5. ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ 6. ఎమ్మెస్సీ అనిమల్ బయోటెక్నాలజీ ఆదరణ లేక ఆపేస్తున్నాం ఎస్వీయూలో ఆదరణలేని పలు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులను ఏపీ పీజీసెట్–2025 నుంచి తొలగించాం. ఏపీ పీజీసెట్–2025కు దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 2 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే 3,373 దరఖాస్తులు అందాయి. మే 5వ తేదీ వరకు తుది గడువు ఉంది. ఎస్వీయూలో గత కొన్నేళ్లుగా 30శాతం లోపు అడ్మిషన్లు ఉన్న పలు కోర్సులను గుర్తించాం. ఇందులో ఆరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో విద్యార్థులు చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆదరణ లేని ఆ కోర్సులను ఈ ఏడాది పీజీసెట్ నుంచి తొలగించాం. – సీహెచ్ అప్పారావు, వీసీ -
శాంతిభద్రతలను కాపాడండి
పెళ్లకూరు : సంఘ విద్రోహుల నుంచి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాజిక సమతుల్యతను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన తమ పార్టీ నాయకులతో వెళ్లి పెళ్లకూరు ఎస్ఐ నాగరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను మార్పింగ్ చేసి బూతు పదజాలంతో దుర్భాషలాడుతూ ‘రావణ్ మహరాజ్’ ఫేస్బుక్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం కోసం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం, నాయకులు బాలసుబ్రమణ్యం, మోహన్, జితేంద్ర, వీరకుమార్, హరిబాబురెడ్డి, చక్రపాణి, కృష్ణయ్య, కుమారస్వామి, ప్రశాంత్, తిరుపతయ్య, అశోక్, గురవయ్య పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 62,076 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ధ్యానంపై అవగాహన తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు ధ్యాన శాస్త్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధ్యాన శాస్త్ర నిపుణులు, ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సైన్స్ టీచర్ ఫౌండర్ మాస్టర్ ప్రదీప్ విజయ్ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ధ్యానం జపం కాదు, ప్రార్థన అంతకంటే కాదని, శ్వాస శక్తి మాత్రమేనని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ట్రాఫిక్‌కు అంతరాయం
ఒంటిమిట్టలో శుక్రవారం సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ట్రయల్‌రన్ నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. ● వసంత వైభవం! నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం రాపూరులోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామికి గురువారం స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. – 8లోతిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు నివేదించారు. అనంతరం శ్రీవారు తమ దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. – తిరుమల – 8లో– 8లో -
గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్ కోసం కృషి
● కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి జువల్ ఓరంతిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి జువల్ ఓరం హామీ ఇచ్చారు. గురువారం ఆయన జాతీయ సంస్కృత వర్సిటీలో పర్యటించి అధికారులు, గిరిజన విద్యార్థులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సంస్కృత భాషా వ్యాప్తికి వర్సిటీ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వర్సిటీ పరిశోధనలు, విద్యాభివృద్ధిలోనూ అగ్రస్థానంలో కొనసాగుతుండటం ప్రశంసనీయమన్నారు. భారతీ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. అనంతరం ఆయన వర్సిటీలోని శ్రీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఒడిశా చైర్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన్ పాండా, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు
తిరుపతి అర్బన్: వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ అధికారులతో మేథోమథన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ వచ్చే ఏడాది పంచాయతీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంల వినియోగంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో గూడూరు ఆర్డీవో రాఘవేంద్రమీనా, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ అమరయ్య పాల్గొన్నారు. -
కంగ్రాట్స్ రామ్
● వెంకటగిరి మున్సిపాలిటీ విజయంపై నేదురుమల్లికి జగన్ అభినందన వెంకటగిరి(సైదాపురం): ‘కంగ్రాట్స్ రామ్.. వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నీ పాత్ర కీలకం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కలిశారు. బుధవారం వెంకటగిరిలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన విశేషాలను జగన్‌కు వివరించారు. టీడీపీ కుట్రలను ఎదుర్కొని అవిశ్వాస తీర్మానంలో నెగ్గడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆయన కొనియాడారు. త్వరలోనే మున్సిపల్ చైర్మన్‌తోపాటు 18 మంది కౌన్సిలర్లతో ప్రత్యేక అభినంద సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వెంటగిరి మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతికిగా అందించినట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి సలహాలివ్వండి తిరుపతి అర్బన్: జిల్లాలో రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సీసీఎల్ ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, గూడూరు ఆర్డీవో రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో వర్క్‌షాపు నిర్వహించారు. జిల్లాలో పది నెలల కాలంలో 37వేల అర్జీలు వచ్చాయి. అందులో 25వేల అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు నిపుణుల నుంచి సలహాలు స్వీకరించనున్నట్టు తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్‌మాండ్, సుధారాణి, తిరుపతి ఆర్డీవో రామమోహన్, శ్రీకాళహస్తి ఆర్డీవో పాల్గొన్నారు. -
● మామిడి ఎగుమతులపై 26 శాతం పన్ను విధించిన అమెరికా ● భారీగా తగ్గనున్న మామిడి ఎగుమతులు ● ఫలితంగా ఢీలా పడనున్న మామిడి ధరలు ● నేడు చిత్తూరులో మామిడి వ్యాపారులు, రైతులతో హార్టికల్చర్ కాన్క్లేవ్
మామిడి.. పండ్లలో రారాజు. మాధుర్యం..చక్కటి రుచి, సువాసనలో సాటిలేనిది చిత్తూరు మామిడి. జిల్లాలో పండే ఈ పంట ప్రపంచంలోనే పేరుగాంచింది. అందుకే ఇక్కడి మామిడి పలు విదేశాలకు ఎగుమతి.. కర్షకులకు బహుమతిగా ప్రసిద్ధి చెందింది. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి పన్నుల విధానం.. స్థానిక పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకులు సిండికేట్‌తో ధరలు పతనం తప్పదా? అన్న సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో మన మామిడి వి‘ఫల’రాజుగా మిగిలేనా? లేక రాణించేనా? అన్న మీమాంస రైతుల్లో నెలకొంది. శుక్రవారం జరగనున్న ఉద్యానవన సదస్సులో ఏ మి జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.పలమనేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైతులకు ప్రధాన ఆధారం మామిడి. ఇక్కడ 70 శాతం తోతాపురి తోటలున్నాయి. జిల్లాలోని మామిడి ఉత్పత్తుల్లో 60 శాతం మ్యాంగో పల్ప్ పరిశ్రమలకు వెళ్లగా 20 శాతం దాకా టేబుల్ వైరెటీలు విదేశాలకు ఏటా ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతులపై గతంలో మామిడిపై కేవలం 5 శాతం మాత్రమే పన్నులుండేవి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న అధిక పన్నుల కారణంగా చిత్తూరు జిల్లా నుంచి ఎగుమతి అయ్యే మామిడిపై 26 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే 2.50 లక్షల టన్నుల మామిడిపై అధిక పన్ను ప్రభావం పడనుంది. గతేడాది సీజన్లో టన్ను రూ.28 వేలు వరకు ఉన్న ధరలు అమాంతం తగ్గుముఖం పట్టి టన్ను రూ.21 వేలకు చేరింది. దీంతో మామిడి రైతులకు గతేడాది నష్టాలు తప్ప లేదు. ఏటా సీజన్లో పల్ప్ యాజమాన్యాలు సిండికేట్ అయి ధరలను నియంత్రిస్తున్నట్లు మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో అమెరికా పన్ను కేవలం 5 శాతమే.. జిల్లా నుంచి టేబుల్ రకాల మామిడి అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బెహరైన్, నేపాల్, యూఏఈ దేశాలకు ఎగుమతులు జరిగేవి. ఎక్కువ శాతం యూఎస్ఏకు వెళ్లేది. గతంలో మామిడిపై పన్ను కేవలం 5 శాతం మాత్రమే ఉండేది. కానీ ట్రంప్ గద్దెనెక్కాక పన్నులను 26 శాతానికి పెంచేశారు. భారీగా పెరిగిన పన్నులు మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగుమతి పన్ను పెరిగినందున ఇక్కడి వ్యాపారులు స్థానిక మామిడి తక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. దీంతో మామిడి రైతులకు నష్టాలు తప్పేలాలేవు. ఇతర దేశాలపై దృష్టి సారించాలి ఏటా ఇక్కడి నుంచి మామిడిని ఎగుమతి చేసే పలు దేశాల్లో పన్నులు తక్కువగా ఉన్న దేశాలకు ఎగుమతులను పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారుతుంది. పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ దెబ్బ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల్లో 30 దాకా మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. ఇక్కడ పండిన పంటలో 50 శాతం జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని జ్యూస్ ఫ్యాక్టరీలకు చేరుతుంది. మామిడి కాయలను పల్ప్ (మామిడి గుజ్జు) తయారు చేసి, ఇతర రాష్ట్రాలకే కాక విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తుంటారు. ఏటా జూన్ తొలివారం నుంచి జులై తొలి వారం వరకు తోతాపురి సీజన్ ముగుస్తుంది. ఆపై ఆగస్టు తొలివారం వరకు నీలం లాంటి టేబుల్ రకాలతో ఇక్కడి సీజన్ అయిపోతుంది. అయితే ఏటా జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల పల్ప్ పరిశ్రమలు సైతం సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తున్న విషయం ఏటా జరుగుతూనే ఉంది. దీంతో తోతాపురి రైతులకు ఏటా పండించిన మామిడికి గిట్టుబాటు దక్కకుండా పోతోంది. నేడు చిత్తూరులో ఉద్యానవన సదస్సు అమెరికా పన్నులు పెంచిన నేపథ్యం, స్థానికంగా పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ వ్యవహారంపై నేడు జిల్లా కేంద్రంలో జరగనున్న ఉద్యానవన సదస్సుకు కలెక్టర్ , హార్టికల్చర్ శాఖ , చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్‌తో పాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మామిడి రైతులు, వ్యాపారులు, పల్ప్ పరిశ్రమల నిర్వాహకులు హాజరు కానున్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మామిడి రైతుకు గిట్టుబాటు ధర టన్ను రూ.30 వేల దాకా ఉండాలి. ఏటా గుజ్జు పరిశ్రమల సిండికేట్‌తో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తోతాపురి కాయలు కోతల కొచ్చే సమయంలో ఉన్నట్టుండి ధరలు తగ్గుముఖం పడితే రైతులకు తీవ్ర నష్టం వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు పల్ఫ్ పరిశ్రమ నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. – సుబ్రహ్మణ్యంనాయుడు, రామాపురం, పలమనేరు మండలం -
● ఫలించిన ఎంపీ గురుమూర్తి కృషి
రైల్వే డబ్లింగ్ పనులకు ఆమోదం తిరుపతి మంగళం: ఎంపీ గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతి–పాకాల–కాట్పా డి రైలు మార్గం డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమో దం తెలిపింది. దాదాపు రూ.1332 కోట్ల అంచనా వ్యయంతో 104 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లో ఈ లైన్ విస్తరించబడి ఉంది. ఈ లైన్ నిర్మాణంతో తిరుపతి, శ్రీకాళహ స్తి పుణ్యక్షేత్రాలకి ప్రయాణ సమయం తగ్గి, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకువచ్చేందుకు ఎంపీ గురుమూర్తి ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించారు. రైల్వే శాఖకు సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓలతో సమావేశమై ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఎట్టకేలకు డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు తిరుమల : తిరుమలలో గురువారం నుంచి శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు కనులపండువగా వేడుకలు జరిపించనున్నారు. వసంత్సోవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ మేరకు తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేయనున్నారు. స్నపన తిరుమంజనసేవలో సేదతీరనున్నారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశించనున్నారు. ఈ క్రమంలోనే రెండో రోజు సర్వాలంకారభూషితులైన దేవదేవేరులు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. మూడోరోజు మలయప్పతోపాటు రుక్మిణీ సమేత కృష్ణస్వామి, సీతారామలక్ష్మణులు వేర్వేరు పల్లకీల్లో ఊరేగనున్నారు. వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వసంతోత్సవంలో పాల్గొనే భక్తులకు ఇప్పటికే ఆన్లైన్లో రూ.150 చొప్పున 450 టికెట్లను విక్రయించింది. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 65,201 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,040 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.93 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగి న భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వచ్చిన భక్తుల ను క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
అహంభాను!
అంతేనా.. తిరుపతి మంగళం : ఆధ్యాత్మిక నగరం తిరుపతిని అత్యంత పరిశుభ్రంగా ఉంచేందుకు కాళ్లు పట్టుకున్నా కనికరం లేదా? భానుప్రకాష్‌రెడ్డి అన్నా.. అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్ వద్ద భానుప్రకాష్‌రెడ్డికి పూల బొకేలు ఇచ్చి వైఎస్సార్సీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి వందేళ్లు గుర్తుండేలా మాస్టర్‌ప్లాన్ రోడ్లు నిర్మించారని తెలిపారు. ఈ క్రమంలోనే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చొరవతో తిరుపతి నగరపాలక సంస్థకు 1,700మంది పారిశుద్ధ్య కార్మికులను అదనంగా నియమించే దిశగా టీటీడీ నిధులు వెచ్చించేందుకు అభినయ్ శ్రమించారన్నారు. అయితే టీటీడీ నిధులు రాకుండా మీరు కోర్టు కెక్కారని విమర్శించారు. దీంతో తిరుపతి నగరపాలక సంస్థలో ఉన్న కార్మికులు సరిపోక రోడ్లు, కాలువల్లో చెత్త పేరుకుపోతోందని వివరించారు. స్థానికుడిగా మీకు తిరుపతి పరిశుభ్రతపై బాధ్యత లేదా? అని భానుప్రకాష్‌రెడ్డిని ప్రశ్నించారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు టీటీడీ నుంచి రూ. కోటి నిధులు కేటాయించడంలో కీలకపాత్ర పోషించిన మీరు.. పారిశుద్ధ్య కార్మికులకు నుంచి వచ్చే నిధులను అడ్డుకోవడం సమంజసమేనా? ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం అంటారే కానీ కేవలం తిరుమల అని ఎక్కడా పేర్కొనలేదని వెల్లడించారు. తిరుపతిలో టీటీడీకి చెందిన ఆలయాలు, భవనాలు, కళాశాలలు, పాఠశాలలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటప్పుడు టీటీడీలో భాగమైన తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయిస్తే తప్పేంటని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలు, కుట్రలతో నగర అభివృద్ధిని అడ్డుకోవడం సబబుకాదని హితవు పలికారు. ఇప్పటికై నా కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని భానుప్రకాష్‌రెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నల్లాని బాబు, లవ్లీ వెంకటేష్, గీతాయాదవ్, టౌన్‌బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్, డైరెక్టర్ కడపగుంట అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు మద్దాలి శేఖర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, నేతలు అనిల్‌రెడ్డి, మోహన్‌రాజ్, అరుణ్‌యాదవ్, సాయికుమారి, పద్మజ, రమణారెడ్డి, కోదండ, విజయలక్ష్మి, పుణీత, ఉష, జ్యోతి, చందు, కిషోర్, మల్లం రవి పాల్గొన్నారు. స్వచ్ఛ తిరుపతికి సహకరించాలని వైఎస్సార్పీపీ నేతల వినతి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకోలు ససేమిరా అంటూ తిరస్కరించడంపై ఆవేదన తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి వ్యవహారశైలిని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు. తిరునగరి పరిశుభ్రతకు సహకరించకపోవడంపై మండిపడ్డారు. కాళ్లు పట్టుకుని వేడుకున్నప్పటికీ కనికరించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో పారిశుద్ధ్య పనులకు టీటీడీ నిధులు మంజూరు కాకుండా అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. కోర్టు కేసును వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక క్షేత్రం అభివృద్ధికి కలసిరావాలని కోరితే అహంభావంతో తిరస్కరించడం దారుణమని విమర్శించారు.కనికరించే ప్రసక్తే లేదు తిరుపతిలో టీటీడీ నిధులు ఖర్చు చేయడం కుదరదని, పారిశుద్ధ్య కార్మికుల కోసం నిధులు రాకుండా కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోనని భానుప్రకాష్‌రెడ్డి తేల్చి చెప్పారు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశారు. తిరుపతి అభివృద్ధికి స్మార్ట్‌సిటీ నిధులు వస్తున్నాయన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తిరుపతి అభివృద్ధికి ఏదో ఒక మార్గంలో నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చిలక పలుకులు వల్లించారు. అంతే కానీ, తిరుపతి పరిశుభ్రతకు టీటీడీ నిధులు రాకుండా కోర్టులో వేసిన కేసును ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకోనని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా..ససేమిరా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
వెంకటగిరి పురపీఠం వైఎస్సార్సీపీదే..
● మున్సిపల్ చైర్మన్‌పై వీగిన అవిశ్వాస తీర్మానం ● కూటమి కుతంత్రాలకు తలొగ్గని 19 మంది కౌన్సిలర్లు ● గైర్హాజరైన ఆరుగురు ఫిరాయింపుదార్లు ● పురపాలక సంఘం చైర్మన్‌గా నక్కా భానుప్రియ ● టీడీపీ పతనానికి ఇదే నాంది : నేదురుమల్లి న్యాయమే గెలిచింది వెంకటగిరిలో న్యాయమే గెలిచిందని, మళ్లీ వైఎస్సార్సీపీ జెండానే ఎగుర వేశామని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎన్‌జేఆర్ భవనంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, కౌన్సిలర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దొడ్డిదారిన పురపాలక పీఠం కాజేయాలని చూసిన కూటమి కుతంత్రాలను సమష్టిగా తిప్పికొట్టామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ గుర్తుపై 25 మంది కౌన్సిలర్లు గెలిస్తే, ప్రలోభపెట్టి ఆరుగురిని లాక్కున్నారని విమర్శించారు. వెంకటగిరి నుంచే టీడీపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ఇక్కడ పనిచేయదని, జగన్ రూలింగ్ మాత్రమే నడుస్తుందని వెల్లడించారు. నిజాయితీగా పార్టీకి కట్టుబడిన కౌన్సిలర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. వెంకటగిరి(సైదాపురం) : వెంకటగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. కూటమి నేతలు అధికారం అండతో ప్రలోభాలకు పాల్పడినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిజాయితీగా నిలబడ్డారు. వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో 19 మంది కౌన్సిలర్లు కట్టుగా సత్తా చాటారు. ప్రతిపాదించి.. గైర్హాజరు వెంకటగిరి మున్సిపాల్టీలో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. అన్నింట్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరుగురు కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించారు. అయినప్పటికీ పురపాలక సంఘంలో వైఎస్సార్సీపీకి 19 మంది కౌన్సిలర్ల బలం ఉంది. అయితే కూటమి నేతలు కుట్రపూరితంగా వ్యవహరించి మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా ప్రిసైడింగ్ అధికారిగా అవిశ్వాస తీర్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఫిరాయింపు కౌన్సిలర్లు మాత్రం గైర్హాజరయ్యారు. దీంతో తీర్మానం వీగిపోయినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. ఈ మేరకు ధ్రువీకరణపత్రం అందించారు. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మళ్లీ నక్కా భానుప్రియ పీఠం అధిరోహించారు. -
వెటర్నరీ వర్సిటీలో మధ్యప్రదేశ్ మంత్రి
తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో బుధవారం మధ్యప్రదేశ్ మంత్రి లకన్ పాటిల్ పర్యటించారు. ఈ సందర్భంగా వీసీ రమణ, డీన్ వీరబ్రహ్మయ్య, ఇన్చార్జి రిజిస్ట్రార్ శ్రీలతతో సమావేశమయ్యారు. వర్సిటీలో చేపట్టిన పరిశోధనలు, పశువైద్య విద్య, పలు విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశువైద్య శాలను పరిశీలించారు. సజావుగా దూరవిద్య పరీక్షలు తిరుపతి సిటీ : ఎస్వీయూ దూరవిద్య విభాగం ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న యూజీ, పీజీ పరీక్షలు సజావుగా సాగుతున్నట్లు డైరెక్టర్ వూకా రమేష్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ దాదాపు 32 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. ప్రధాన కోర్సుల పరీక్షలు ముగిశాయని, యూజీకి చెందిన కొన్ని ప్రత్యేక పరీక్షలు మరో వారంలో ముగియనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు పరీక్షలను పారదర్శకంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేసినట్లు వెల్లడించారు. సహకరిస్తున్న పోలీస్‌శాఖతోపాటు ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థిని సృజనకు అభినందన తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీలో బీఫార్మసీ విద్యార్థిని వైష్ణవీ హరీష్ తన సృజనాత్మకతను ఆవిష్కరించారు. స్మార్ట్ డిజిటల్ స్టెతస్కోప్‌ను రూపొందించారు. యూఎస్ ఎంబసీ సహకారంతో ఉకాన్ గ్లోబల్ సంస్థ భాగస్వామ్యంతో ఢిల్లీలోని అమెరికన్ సెంటర్లో నిర్వహించిన స్టార్టప్ నెక్సస్ కోహోర్ట్–20 ప్రొగ్రామ్‌లో ఈ పరికరం ప్రదర్శించి సర్టిఫికెట్ అందుకున్నారు. బుధవారం ఈ మేరకు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ, విభాగాధిపతి ప్రొఫెసర్ జోత్స్నారాణి అభినందనలు తెలిపారు. తీరంలో కట్టుదిట్టంగా నిఘా వాకాడు : సముద్ర మార్గం నుంచి అసాంఘిక శక్తులు చొరబడకుండా మైరెన్ పోలీసులు తీరంలో కట్టుదిట్టంగా నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం ఈ మేరకు సాగర్ కా వాచ్ కార్యక్రమం చేపట్టారు. దుగరాజపట్నం మైరెన్ సీఐ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సముద్ర తీరంలో నిఘా పరిశీలించేందుకు తమ సిబ్బంది రెండు గ్రూపులుగా సముద్రంలోకి వెళ్లారని చెప్పారు. ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, కృష్ణపట్నం, చిల్లకూరు, కోట, వాకాడు మండలాలలోని సముద్ర తీరంలో 120 మంది పోలీస్ సిబ్బందితో సాగర్ కా వాచ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందులో నాయుడుపేట, గూడూరు డీఎస్పీలు, వాకాడు, గూడూరు, మనుబోలు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 120 మంది పోలీసులు పాల్గొన్నారని వెల్లడించారు. -
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
తిరుపతి అర్బన్ : తిరుచానూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో ముగిసింది. శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, అనంతపురం, అనకాపల్లి, పల్నాడు, కోనసీమ జిల్లాలకు చెందినన విద్యార్థుల జవాబు పత్రాలను తిరుపతిలో మూల్యాంకనం చేశారు. జిల్లాకు చెందిన వివిధ సబ్జెక్టుల టీచర్లను నియమించి మూల్యాంకనం ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశారు. ప్రతిరోజూ ఓఎంఆర్ షీట్లను సీల్ చేసి, పటిష్ట భద్రత నడుమ విజయవాడకు తరలించారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ డీవైఈఓ బాలాజీ, ఎంఈఓ భాస్కర్, ఏఈ గురవారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ బి.శిరీష్ కుమార్ ఆధ్వర్యంలో పకడ్బందీగా పర్యవేక్షించినట్లు వివరించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆర్జేడీ శామ్యూల్ స్పాట్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు. -
సినీ నటుడు సప్తగిరికి మాతృవియోగం
● తిరుపతి గోవిందధామంలో ముగిసిన అంత్యక్రియలు తిరుపతి రూరల్ : సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టెమ్మ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీలోని నివాసానికి చిట్టెమ్మ భౌతికకాయం తీసుకువచ్చారు. కన్నతల్లి మరణంతో కన్నీటిపర్యంతమైన సప్తగిరి ప్రసాద్‌ను బంధుమిత్రులు ఓదార్చారు. చిట్టెమ్మ మరణంతో సప్తగిరి గుండెలవిసేలా విలపించడం చూపరులను కదలించింది. ఈ క్రమంలో సప్తగిరి మిత్రులు, పరిచయం ఉన్న వ్యాపారులు, రాజకీయ నేతలు, సినీ రంగంలో సన్నిహితంగా ఉండేవారు, అభిమానులు పెద్ద సంభ్యలో తరలివచ్చి చిట్టెమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిరుపతి నగరంలోని గోవింద దామంలో అంత్యక్రియలను పూర్తి చేశారు. -
చికిత్స పొందుతూ కూలీ మృతి
తిరుపతి క్రైమ్ : అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం వద్ద ఈ నెల 7వ తేదీన ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిపోయి గాయపడిన కూలీ చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌కి చెందిన విజయ్(29) భవన నిర్మాణ పనులు చేస్తూ కిందపడ్డాడు. తోటి స్నేహితులు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. మృతుడి అన్న మనీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
బాధ్యతగా తాబేళ్ల సంరక్షణ
చిల్లకూరు : అంతరించిపోతున్న ఆలివ్ రెడ్లీ తాబేళ్ల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం చిల్లకూరు మండలం గమ్మళ్లదిబ్బ బీచ్ వద్ద అటవీశాఖ, జిందాల్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఆలివ్ రెడ్లీ తాబేళ్లను సముద్రంలోకి వదిలిపెట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ సముద్రం పరిశుభ్రతకు తాబేళ్లు దోహదపడతాయన్నారు. వాటి పరిరక్షణకు మత్స్యకారులు సైతం కృషి చేయాలని కోరారు. ఇటీవల ఆలివ్ రెడ్లీ తాబేళ్లు పలు ప్రాంతాల్లో మృత్యువాత పడినట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. దీంతో సముద్రంలో కాలుష్యం పెరిగిపోయే ప్రమాదముందని, అందుకే కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా తాబేళ్ల రక్షణ బాధ్యతను స్థానిక పరిశ్రమల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే గమ్మళ్లదిబ్బతోపాటు కోట మండలం శ్రీనివాససత్రం బీచ్‌లలో తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదులుతున్నామన్నారు. దీంతో సముద్రంలో ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తాబేళ్లు ఈ బీచ్‌లకే వచ్చి గుడ్లు పెడతాయని వివరించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ గుడ్లను సేకరించి హేచరీల్లో పొదిగిస్తారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి సముద్రంలో చేపల వేట కూడా ఉన్నందున, ఈ సందర్భంలో పిల్లలు కూడా పెరిగే అవకాశముంటుందని వివరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు వివేక్, ఆఫ్జల్, రవీంద్ర, ధనలక్ష్మి, గాయం శ్రీనివాసులు, గోపి, తహసీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్ నెల్లిపూడి సుబ్రమణ్యం, జిందాల్ ప్లాంట్ హెడ్ శ్రీనివాస్‌రావ్, స్థానిక నేతలు వెంకటేశ్వర్లు రెడ్డి, సతీష్‌యాదవ్ పాల్గొన్నారు. కోట మండలంలో ... కోట మండలం శ్రీనివాససత్రం బీచ్ వద్ద కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆలివ్రెడ్లీ తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. కలెక్టర్ మాట్లాడుతూ సమత్స్యకారులు వేట సాగించే సమయంలో తాబేళ్లు వలలకు చిక్కినా వాటిని తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టాలని సూచించారు. -
పాత బస్సులకు..
● ఆర్టీసీ సర్వీసుల బాడీ కన్వర్షన్ ● తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీకారం ● ఇప్పటికే 9 బస్సుల రీ మోడల్ ● అదేబాటలో పలు సర్వీసులు‘మేమొస్తే ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపిస్తాం. కొత్త బస్సులు తీసుకువస్తాం. ముఖ్యంగా తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌కు 50 నుంచి 100 కొత్త సర్వీసులు మంజూరు చేస్తాం.. ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం అదనంగా సర్వీసులు ఏర్పాటు చేస్తాం’ అని ఎన్నికల ముందు కూటమి నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా..తిరుపతి బస్టాండ్‌కు ఒక్క కొత్త బస్సు కూడా అందించలేదు. చివరకు చేసేది లేక ఆర్టీసీ అధికారులు పాత బస్సులనే రీమోడల్ చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. ముందుగా తిరుపతి డిపో నుంచే కాలం చెల్లిన వాహనాలకు సరికొత్త రూపం తీసువచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రీమోడల్ చేస్తున్న దృశ్యంతిరుపతి అర్బన్ : ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలోని సెంట్రల్ బస్టాండ్ ప్రాంగణంలో శ్రీహరి, శ్రీనివాస, ఏడుకొండలు, పల్లెవెలుగు బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుపతి, మంగళం డిపోలతోపాటు ఇతర డిపోలకు చెందిన సర్వీసులు నడుస్తున్నాయి. తిరుపతి జిల్లాలోని 11 బస్టాండ్ల నుంచి ప్రతి రోజూ 2.70 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా తిరుపతి బస్టాండ్ నుంచే 1.60 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యకు తగినట్టు బస్సులు లేవు. ఈ క్రమంలో కాలం చెల్లిన బస్సులను రీ మోడల్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరుపతి ఆర్టీసీ డిపోలో పనులు మొదలు పెట్టారు. 15 ఏళ్లు దాటిన ప్రతి సర్వీసునూ రీమోడల్ చేయడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒక్కొక్కటిగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతిలో బాడీ కన్వర్షన్ బస్సుల కొరత కారణంగా తిరుపతి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులకు తగినన్ని సర్వీసులను నడపలేకపోతున్నారు. ఈ క్రమంలో డీపీటీవో నరసింహులు, డీఎం బాలాజీ ఉన్నతాధికారుల అనుమతుల మేరకు గ్యారేజీ సిబ్బందితో చర్చించి తిరుపతిలో బస్సు బాడీ కన్వర్షన్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొమ్మిది సర్వీసులకు మార్పులు చేశారు. పనికొచ్చే పరికరాలు మినహా పాడైన వాటిని తొలగించి స్క్రాప్‌కు వేశారు. రేకులు, చక్కటి సీట్లు, పిల్లర్స్, టైర్లు, లైటింగ్, బ్రేకులు, గేర్ బాక్సు, ఎయిర్ ఫిల్టర్లు, ఇతర సాంకేతిక పరమైన వాటిని కొత్తగా ఆమర్చుతున్నారు. వీటికి సుమారు రూ.2 లక్షల మేరకు ఖర్చు పెట్టి 52 సీట్ల సామర్థ్యంతో పల్లె వెలుగు బస్సుగా మార్చుతున్నారు. రూట్‌పై వెళ్లిన తర్వాత సమస్యలు వస్తున్నాయా అనే అంశాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గత ఏడాది ఒక డీజిల్ బస్సును విద్యుత్ బస్సుగా మార్పు చేసిన విషయం తెలిసిందే. మెరుగైన సౌకర్యాలు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చిపోతున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. బస్సుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాత బస్సులకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి కొత్త రూపాన్ని ఇస్తున్నాం. మెకానిక్స్ ఆర్టీసీ వాళ్లు కావడంతో ఖర్చులు తగ్గుతున్నాయి. రీ మోడల్ తర్వాత నిత్యం వాటిపై నిఘా పెడుతున్నాం. – బాలాజీ, తిరుపతి ఆర్టీసీ డిపో మేనేజర్ -
నోటీసుల జారీకి ఆదేశం
తిరుపతి రూరల్: మదర్ డెయిరీ యాజమాన్యానికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, వ్యర్థాలను బయటకు వదిలితే చర్యలు తప్పవని హెచ్చరించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశించారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలోని మదర్ డెయిరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. దీనిపై ఈనెల7వ తేదీన ‘కలుషితం.. భూగర్భ జలం..’ శీర్షికతో సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మదర్ డెయిరీ నుంచి అవిలాల చెరువులోకి వ్యర్థాలు రాకుండా చూడాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు కూడా లేఖ పంపించాలని ఎంపీడీఓ రామచంద్రను ఆదేశించారు. పాల పదార్థాలతో రూ.కోట్ల వ్యాపారం సాగించే డెయిరీ యాజమాన్యానికి ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. కలెక్టర్‌తో ఐఐటీ డైరెక్టర్ భేటీ తిరుపతి అర్బన్ : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుతో సరికొత్త ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహించవచ్చని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్క వెంకటేశ్వర్‌ను కలిసి చర్చించారు. తిరుపతి ఐఐటీ స్పోక్ హబ్‌గా సేవలందిస్తుందని వెల్లడించారు. అటవీశాఖ అధికారికి జైలు సూళ్లూరుపేట రూరల్ : మహిళా ఉద్యోగిని వేధించిన కేసులో అటవీశాఖ అధికారి వరప్రసాద్‌రావుకు మూడు నెలలు జైలు శిక్ష, 5వేలు జరిమానా విధిస్తూ సూళ్లూరుపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.అనిల్‌కుమార్ బుధవారం తీర్పునిచ్చారు. వివరాలు.. 2023లో దొరవారిసత్రం మండలం నెలపట్టు పక్షుల కేంద్రంలో ఎస్కే అస్మతున్నీసా అనే అటవీశాఖ మహిళా ఉద్యోగినితో వరప్రసాద్‌రావు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రవర్తించడంతో దొరవారిసత్రం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయమూర్తి విచారణ చేపట్టి నిందితుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున కేసును అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ వాదనలు వినిపించారు. నేడు, రేపు ఏఎన్ఎంల ఉద్యోగోన్నతికి కౌన్సెలింగ్ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గ్రేడ్–3 ఏఎన్ఎం ఉద్యోగోన్నతికి సంబంధించిన తుది జాబితా ఎట్టకేలకు పూర్తయింది. గతేడాది ప్రారంభమైన జాబితా తయారీ ప్రక్రియ...పలు ఆరోపణల నడుమ బుధవారం సాయంత్రానికి పూర్తి చేశారు. 1000 మందిపైగా గ్రేడ్–3 ఏఎన్ఎం ఉంటే 307 మందితో ఈ జాబితా సిద్ధం చేశారు. గురు, శుక్రవారాల్లో ఉద్యోగోన్నతికి సంబంధించి కౌన్సెలింగ్ చిత్తూరు నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. డీఆర్ఓ సమక్షంలో కౌన్సెలింగ్ జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిపై కొంతమంది మళ్లీ అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని అంటున్నారు. దీనిపై అధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి వరదయ్యపాళెం : తడ– వరదయ్యపాళెం రహదారిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు.. బుచ్చినాయుడు కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరుకు చెందిన డి.విజయ్(17), గురువర్ధన్ అనే ఇద్దరు విద్యార్థులు ద్విచక్రవాహనంపై తడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉండగా రాచకండ్రిగ వద్ద ఆగి ఉన్న బస్సును ఢీకొన్నారు. దీంతో విజయ్ అక్కడికక్కడే మరణించాడు. గురువర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీసిటీ హైటెక్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
39 రోజులు.. జరిమానా రూ.22.8లక్షలు!
● జాతీయ రహదారిపై పోలీసుల నిరంతర తనిఖీలు ● రాంగ్రూట్లో వెళుతున్న 912 మందిపై కేసులుతిరుపతి రూరల్ : పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా రాంగ్రూట్లో వాహనం నడిపేవారికి జరిమానా విధిస్తున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యం తిరుచానూరు వద్ద కలెక్టరేట్ నుంచి సి.మల్లవరం జంక్షన్ వరకు జాతీయ రహదారి సమీపంలోని ప్రధాన కూడళ్ల నుంచి ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు యథేచ్ఛగా రాంగ్ రూట్లో వస్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారిపై నిరంతరం వాహన తనిఖీలు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచారి, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. రాంగ్ రూట్లో వస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించేస్తున్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. వాహనం పట్టుకున్న తర్వాత ఎవరి సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వందల సంఖ్యలో కేసులు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వచ్చే వాహనాలకు జరిమానాలు విధించే ప్రక్రియను మార్చి 1వ తేదీ నుంచి పోలీసులు చేపట్టారు. ఇప్పటి వరకు కేవలం 39 రోజుల్లో 912 వాహనాలను సీజ్ చేసి 186 కేసులను నమోదు చేశారు. ఈ మేరకు నిందితులు జరిమానా కింద రూ.22.80 లక్షలు కోర్టుకు చెల్లించినట్టు సమాచారం. ఈ మేరకు వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని, రాంగ్ రూట్లో రావడం మానుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి రూరల్ మండలంలోని సి.మల్లవరం క్రాస్, రామానుజపల్లి క్రాస్, ఆర్సీపురం క్రాస్, తనపల్లె క్రాస్, నారాయణాద్రి ఆస్పత్రి క్రాస్ వద్ద రాంగ్‌రూట్ ప్రయాణం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. -
ఫలించిన చర్చలు.. దీక్ష విరమణ
తిరుపతి రూరల్ : ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట సుమారు 16 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేపట్టిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో ఉన్నతాధికారుల చర్చలు బుధవారం ఫలించాయి. సీఎండీ సమక్షంలో జరిగిన చర్చల వివరాలను మినిట్స్ రూపంలో రాత పూర్వకంగా హెచ్ఆర్ డైరెక్టర్ లక్ష్మీనరసయ్య, డీజీఎంలు మూర్తి, సురేంద్ర, ప్రసాద్ తదితరుల దీక్షా శిబిరం వద్ద కార్మికులకు అందించారు. అనంతరం కార్మిక సంఘం నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. హెచ్ఆర్ డైరెక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, ఇతర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వేతనాల పెంపు, పీఆర్ అరియర్స్ తదితర అంశాలను హెచ్ఆర్ కమిటీలో అజెండాగా చేరుస్తామని తెలిపారు. సీపీఎం నేత కందారపు మురళి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేత శివప్రసాద్ రెడ్డి, కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షుడు కొండయ్య, అనంతపురం జిల్లా నేతలు నూర్ బాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవికుమార్, పుత్తూరు కార్యదర్శి మురళి పాల్గొన్నారు. -
సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి!
● అడ్మిషన్లు చేయకుంటే జీతాలు కట్ ● టార్గెట్ పూర్తయితేనే ఉద్యోగం పదిలం ● మండుటెండల్లో ఇంటింటికీ క్యాంపెయిన్ ● ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందికి తప్పని తిప్పలు తిరుపతి ఎడ్యుకేషన్: ప్రస్తుతం విద్య వ్యాపారంగా మారింది. విద్యాసంస్థలు వాణిజ్య సంస్థలుగా మారాయి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. వీధికొకటి ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. కార్పొరేట్ హంగులతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్లు పెంచుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయి. ఉపాధ్యాయులు, అధ్యాపకులకే కాకుండా చిన్నాచితక బోధనేతర సిబ్బందికి టార్గెట్లు విధిస్తున్నాయి. అడ్మిషన్లు చేస్తే జీతాలు ఇస్తామని, ఉద్యోగం సైతం పదిలంగా ఉంటుందని తెగేసి చెబుతున్నాయి. ఈ క్రమంలో అందులో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది టార్గెట్ పూర్తిచేసే పనిలో పడ్డారు. మండుటెండల్లో ఇంటింటికీ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ‘మీ పిల్లలను మా విద్యాసంస్థలో చేర్పించండి’ అంటూ ప్రాధేయపడుతున్నారు. ఆగస్టు నుంచే అడ్మిషన్ల వేట ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల సిబ్బంది ఆగస్టు నుంచే అడ్మిషన్ల వేట మొదలు పెడుతున్నారు. పీఆర్వోల పేరుతో సిబ్బందిని నియమించుకుని ఆగస్టులో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల అడ్రెస్‌లను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ల ఇళ్లకు వెళ్లి తమ కళాశాలలో చేర్పించాలంటూ తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఇప్పుడే అడ్మిషన్ చేయించుకుంటే ఫీజులో రాయితీ ఇస్తామని చెప్పి నమ్మబలుకుతున్నారు. మోసపోతున్న తల్లిదండ్రులు ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రత్యేకతలను గ్రాఫిక్స్‌లో చూపించడంతో తల్లిదండ్రులు ఆకర్షణలో పడి మోసపోతున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు పాఠశాలలు మించి తమ విద్యాసంస్థలో ఉన్న సౌకర్యాలను వివరిస్తున్నారు. రోజువారీ టెస్ట్‌లు, ప్రతి రోజూ స్టడీ అవర్స్, కంప్యూటర్, లైబ్రరీ, ల్యాబ్, ప్రతి పండుగ సెలబ్రేషన్, ఆటపాటలతో పాటు కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులు బదిలీ అయితే అదేచోట బ్రాంచ్‌కు విద్యార్థుల బదిలీ సౌకర్యం కల్పిస్తామని కార్పొరేట్ స్కూల్ సిబ్బంది వివరిస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని అడ్మిషన్ ఫీజు కట్టించుకునే వరకూ పాఠశాల ఫీజు మాత్రమే చెబుతారు. ఫీజు చెల్లించిన తరువాత బస్సు ఫీజు, యూనిఫామ్, బుక్స్ ఫీజు అంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్లో ఫిక్స్ చేసిన ఫీజులని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు నిలువునా మోసపోతున్నారు. వేధిస్తూ..టార్గెట్లు విధిస్తూ జిల్లాలో దాదాపు 2వేలకుపైగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపుగా 40 వేల మంది వరకూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఆయా పాఠశాలల నిర్వాహకులు ప్రస్తుత విద్యాసంవత్సరానికి గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే అడ్మిషన్ల టార్గెట్ విధిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలవ్వగానే పూర్తి స్థాయిలో టార్గెట్‌ను రీచ్ అవ్వాలంటూ ఆదేశిస్తున్నారు. టార్గెట్ చేస్తేనే జీతం, ఉద్యోగం రెండూ పదిలమంటూ హుకుం జారీచేస్తున్నారు. ఈ నిబంధనలకు పనిచేయాలో.. లేక బయటకు రావాలో.. తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
పారంపర్య వైద్యానికి పెద్దపీట
తిరుపతి మంగళం : వంశపారంపర్యంగా చేస్తున్న వై ద్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహ కారం అందిస్తోందని ఏపీ ఔషధ, సుగుంధ మొక్కల బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి కపిలతీర్థంలోని ప్రధాన ఆటవీశాఖ కార్యాలయంలో మంగళవారం తిరుపతి సర్కిల్ సీఎఫ్ సి.సెల్వంతో కలిసి ఆయన వైద్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఔషధ మొక్కలను ఆధారంగా చేసుకుని వైద్య విధానం కొనసాగుతోందన్నారు. అద్భుతమైన ఫలితాలనిచ్చే మందులు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే అలాంటి ప్రకృతి వైద్యం చేసేవారికి, చేసే వైద్యానికి ఎలాంటి గుర్తింపు లేదని, దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. అలాంటి వైద్యులకు చేయూతనిస్తామని చెప్పారు. ఎస్వీయూ బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జే.కామాక్షమ్మ, రేజర్లు ప్రభాకర్, పారంపర్య వైద్యులు పాల్గొన్నారు. -
వెల్ఫేర్ అధికారుల బదిలీ
తిరుపతి అర్బన్: బీసీ వెల్ఫేర్ అధికారి రాజేంద్రనాథ్‌రెడ్డిని తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిశారు. ఈయన అనంతపురం జిల్లా నుంచి తిరుపతికి విచ్చేశారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి చంద్రశేఖర్ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జ్యోత్స్నకు జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే మంగళవారం నూతనంగా విచ్చేసిన రాజేంద్రనాథ్‌రెడ్డి జిల్లా పగ్గాలు చేపట్టారు. అలాగే జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిగా పనిచేస్తున్న సూర్యనారాయణను విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న రాజా సోమును తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శెట్టిపల్లి భూసమస్యకు పరిష్కారం చూపుతాం తిరుపతి అర్బన్: తిరుపతిలోని శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపుతామని, మోడల్ టౌన్‌షిప్‌గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడుతామని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలసి ఆయన అధికారులతో శెట్టిపల్లి భూ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి సూళ్లూరుపేట, చంద్రగిరి ఎమ్మెల్యేలు విజయశ్రీ, పులివర్తి నాని, యాదవ సంఘం నేత నరసింహ యాదవ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజన్ 2020 తరహాలోనే విజన్ 2047కు సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. శ్రీ సిటీలో పలు పరిశ్రమల స్థాపనకు రెండో దఫా భూ కేటాయింపుల్లో భాగంగా 2,500 ఎకరాలు అందించనున్నట్టు వెల్లడించారు. తిరుపతిలో ఒబెరాయ్ హోటల్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తామన్నారు. అలాగే టీడీఆర్ బాండ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పులికాట్ ముఖద్వార పూడికతీతకు రూ.100 కోట్లతో పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే లైన్, సాగరమాల పనులు త్వరలో పూర్తయ్యేలా చర్యలు చేపడుతామన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువుల షెడ్ల పరిశీలన సత్యవేడు: మండలంలో దాసుకుప్పం పంచాయతీలో ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించిన ఐదు సిమెంట్ రోడ్లు, గోకులం షెడ్డును మంగళవారం డ్వామాపీడీ శ్రీనివాస ప్రసాద్ పరిశీలించారు. అనంతరం దాసుకుప్పం పంచాయతీలో జరిగిన ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ తమకు బిల్లులు మంజూరు కాలేదని ఆరోపించారు. పీడీ స్పందిస్తూ త్వరలో బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. ఏపీఓ విజయభాస్కర్, ఉపాధి హామీ జేఈ హరి, టెక్నికల్ అసిస్టెంట్ మనోహర్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రెడ్‌బుక్ పాలనలో పచ్చనేతలకే పనిముట్లు
● తమ్ముళ్లకే సబ్సిడీ యంత్రాలు ● కూటమి నేతల లెటర్లే అర్హత ● మండల నేతలు ఇచ్చిన జాబితా ప్రకారమే మంజూరు ● పేద రైతులకు మొండిచెయ్యి జిల్లాలో వ్యవసాయ పనిముట్ల మంజూరు విషయంలో అధికారులు, నేతలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రైతులకే సబ్సిడీ పనిముట్లు మంజూరు చేస్తున్నారు. అర్హత కలిగిన పేద రైతులను పక్కన పెట్టేస్తున్నారు. ఇదేమని అడిగితే నేతల నుంచి సిఫార్సు లేఖ తెమ్మంటున్నారు. లేకుంటే వారి నుంచి తమకు ఫోన్ చేయించాలని సూచిస్తున్నారు. కూటమి నేతల చుట్టూ తిరగలేక చాలామంది కర్షకులు మిన్నకుండిపోతున్నారు. ఇదే అదునుగా అధికారులు అధికార పార్టీ నేతల సిఫార్సులనే అర్హతగా భావించి పరికరాలు మంజూరు చేస్తున్నారు. దీనిపై అన్నదాతలు రగిలిపోతున్నారు. తిరుపతి అర్బన్: జిల్లాలో రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. కక్ష్యలు, కుట్రలు, దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ఇవి చాలదన్నట్టు ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ వ్యవసాయ పరికరాలూ కూటమి నేతలకే చెందుతున్నాయి. అధికారులు సైతం అధికార పార్టీ అధినాయకుల లెటర్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటి వరకు 1,069 దరఖాస్తులు జిల్లాలో ఇప్పటివరకు రాయితీ వ్యవసాయ పనిముట్ల కోసం 1,069 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిని అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కూటమి నేతల నుంచి సిఫార్సు లెటర్లు ఇస్తేనే ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. లేదంటే మీ ప్రాంతంలోని అధికార పార్టీకి చెందిన నేత దగ్గర నుంచి ఫోన్ చేయించాలని వ్యవసాయశాఖ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. చేసేది లేక పలువురు పేద రైతులు రాయితీ పనిముట్లపై ఆశలు వదులుకుంటున్నారు. అధికార పార్టీ నేతల అండదండలున్నవారు మాత్రం దర్జాగా పనిముట్లకు పట్టుకుపోతున్నారు. 50శాతం రాయితీ జిల్లాకు పురుగు మందుల స్ప్రేయర్లు 609, ట్రాక్టర్లకు చెందిన పలు విడిభాగాలు 745, పలు రకాల కట్టర్లు 50 జిల్లాకు వచ్చాయి. మొత్తంగా 1,404 పనిముట్లకు ఇప్పటి వరకు 1,069 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 650 మందికి జిల్లా వ్యాప్తంగా కూటమి నేతల నుంచి లెటర్లు, ఫోన్లు చేయించిన వారికి సిఫార్స్ జాబితాలో రాయితీ పనిముట్లను అప్పగించారు. మిగిలిన వారికి ఈ నెల 15వ తేదీ అందించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. డ్రోన్ స్ప్రేయర్లలోనూ సిఫార్సుల జోరు జిల్లాకు తాజాగా 36 డ్రోన్ యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ ధర రూ.10 లక్షలు. రైతులకు 80శాతం సబ్సిడీతో వీటిని అందించనున్నారు. ఆ మేరకు రెండు రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శిక్షణ లేకుండానే.. గత ప్రభుత్వంలో డ్రోన్ల వినియోగంపై గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీలో రెండు వారాలపాటు కొందరు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులకు డ్రోన్ యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పట్లో శిక్షణ పొందిన విద్యార్థులతో సంబంధం లేకుండా.. పచ్చ నేతలకు శిక్షణ లేకుండా రాయితీ డ్రోన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పారదర్శకంగా పంపిణీ వ్యవసాయ పనిముట్లు రైతులకు పారదర్శకంగా అందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 50 శాతం రాయితీతో వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నాం. అంతేతప్ప మాకు సిఫార్సు లెటర్లు ఎవ్వరూ ఇవ్వలేదు. డ్రోన్ విషయంలోనూ అదేమాదిరిగా పాటిస్తున్నాం. –ప్రసాద్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారికూటమి నేతల చేతుల మీదుగా వ్యవసాయ పనిముట్లు అందిస్తున్న అధికారులువ్యవసాయ పనిముట్లు -
సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి!
ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 8 కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 66,503మంది స్వామివారిని దర్శించుకోగా 23,941 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక, సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుమల: తిరుమల శ్రీవారిని మంగళవారం సినీనటి రంభ, ప్రముఖ మాజీ క్రికెటర్ రవి శాస్త్రి, డైమండ్స్ గ్రూప్ ఆఫ్ అధినేత గౌతమ్ సింఘానియా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. – 8లో -
ముగిసిన పోస్టల్ రాష్ట్ర మహా సభలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వేదికగా గత మూడు రోజులుగా జరిగిన అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్టుమెన్, ఎమ్‌టీఎస్ రాష్ట్ర శాఖ మహాసభలు మంగళవారంతో ముగిశాయి. తపాలా శాఖ ప్రయివేటీ కరణను తిప్పికొట్టడానికి రాష్ట్రంలో ఉన్న తపాలా ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. మేలో జరగనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఆ సంఘం జాతీయ కార్యదర్శి ఆర్.పి.సారంగ్ పిలుపునిచ్చారు. చివరిగా రాబోయే రెండేళ్ల కాలానికి 15 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్టుమెన్ అండ్ ఎమ్‌టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్. విద్యాసాగర్, కే.మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి 300 మంది ఉద్యోగులు డెలిగేట్లుగా, పరిశీలకులుగా పాల్గొన్నారు. నేటి నుంచి ఏఐ స్కిల్స్‌పై శిక్షణ తిరుపతి సిటీ: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో 9 నుంచి 11వ తేదీ వరికు మూడు రోజులపాటు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాయకత్వ లక్షణాలపై అవగాహన నెల్లూరు (పొగతోట): హర్యానా ఐఐఎంలో పంచాయతీలో సమర్థవంతమైన పాలన, నాయకత్వ నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తిరుపతి జిల్లా పెళ్లకూరు జెడ్పీటీసీ ప్రిస్కిల్లా హాజరయ్యారు. ఈ మేరకు పంచాయతీ పాలన, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు. ఈ అవకాశం కల్పించిన జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
వెళ్లొస్తాం!
● విదేశీ విహంగాలు తిరుగుముఖం ● సీజన్ పూర్తికావస్తుండడంతో వెలవెలబోతున్న పక్షుల రక్షిత కేంద్రం ● రూ.25 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు వెలవెలబోతున్న పర్యావరణ కేంద్రం, (ఇన్సెట్) తెలుగు గంగ నీళ్లు సులువుగా చేరేలా కాలువ అభివృద్ధి, చెరువులో పక్షులకు ఆటంకం ఏర్పడకుండా గుర్రపు డెక్క చెట్లను తొలగిస్తున్న కూలీలుదొరవారిసత్రం: నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో విదేశీ విహంగాలు ఆయా దేశాలకు తిరుగుముఖం పట్టాయి. సుమారు ఏడు నెలల పాటు సందర్శకులు, పర్యాటకులు, పక్షి ప్రేమికులతో ఆహ్లాదాన్ని పంచిన పక్షులు ఆయా దేశాలకు తమ పిల్లలతో తిరుగుప్రయాణమయ్యాయి. పర్యాటకులు, పక్షి ప్రేమికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సందడిగా ఉండాల్సిన కేంద్రం నేడు వెలవెలబోతోంది. సీజన్లో ఆలస్యంగా ఇక్కడకు విచ్చేసిన గూడబాతులు మాత్రమే సుమారు రెండు వందల వరకు అడుగంటిన చెరువు నీటిలో ఈదుతూ సేద తీరుతున్నాయి. ఇక్కడే పుట్టి...ఎక్కడో పెరిగి! విదేశీ వలస విహంగాలు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో వాటి వాటి సంతానాభివృద్ధి చేసుకునేందుకు క్రమంతప్పకుండా సీజన్(అక్టోబర్‌లో మొదలై ఏప్రిల్‌కు పూర్తి)లో వేల సంఖ్యలో విచ్చేస్తాయి. సుమారు ఏడు నెలల పాటు కేంద్రం పరిధిలోని నేరేడు, మారేడు, అత్తిగుంట చెరువుల్లోని కడప చెట్లపై బస చేస్తాయి. సమీపంలోని పులికాట్ సరస్సులో చేపలను వేటాడుతూ జీవనం సాగిస్తాయి. పిల్లలను పొదిగి పెద్దవై ఎగిరే స్థాయికి వచ్చిన తర్వాత ఆయా దేశాలకు తిరిగి వెళ్లిపోతాయి. ఈ సీజన్లో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, తెడ్డుముక్కుకొంగలు, నీటి కాకులు, స్వాతికొంగలు, బాతుల జాతికి చెందిన పలు రకాల పక్షుల 1,7500 వరకు విచ్చేశాయి. 2వేలకు పైగా పిల్లలను పొదిగి తిరిగి ఆయా దేశాలకు ఇప్పటికే 75శాతం వరకు వెళ్లిపోయినట్టు స్థానిక వన్యప్రాణి విభాగం అధికారులు తెలిపారు. నైజీరియా, బర్మా, ఆప్ఘనిస్తాన్, సైబీరియా తదితర దేశాల నుంచి పక్షుల కేంద్రానికి ప్రతి ఏడాదీ విచ్చేస్తున్న విషయం తెలిసిందే. రూ.25లక్షలతో అభివృద్ధి పనులు నేలపట్టు పక్షుల కేంద్రంలో ఇటు పర్యాటకుల సౌకర్యార్థం, అటు విహంగాల అవాసయ్యోగంగా పలు అభివృద్ధి పనులు రూ.25 లక్షలతో చేపడుతున్నట్టు స్థానిక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలయ్య తెలిపారు. -
తవ్వేస్తూ.. తరలిస్తూ!
● నాయుడుపేట చుట్టుపక్కల యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ● స్వర్ణముఖి వంతెనల వద్ద అడ్డూఅదుపూ లేకుండా తరలింపు ● చెలరేగిపోతున్న కూటమి నేతలు నాయుడుపేటటౌన్: స్వర్ణముఖి నదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో రాత్రీపగలు తేడాలేకుండా తవ్వేస్తున్నారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరు స్వర్ణముఖి నది వద్ద రెండు రైల్వే బ్రిడ్జీల సమీపంలో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇసుక తవ్వేది ఇక్కడే మండల పరిధిలోని భీమవరం, చిగురుపాడు, అయ్యప్పరెడ్డిపాళెం, కల్లిపేడు, మూర్తిరెడ్డిపాళెం, మర్లపల్లి తదితర ప్రాంతాల్లో స్వర్ణముఖి నది నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇసుకాసులు ధన దాహానికి గిరిజనుడు బలి స్వర్ణముఖి నది నుంచి రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తు ట్రాక్టర్ అతి వేగానికి రెండు రోజుల కిందట లో గిరిజనుడు బలయ్యాడు. ఇసుక లోడ్డుతో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్‌ను తుమ్మూరు వద్ద బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాళెం మీక్సిడ్ కాలనీకి చెందిన ఈగ పులయ్య(26) మృతి చెందాడు. ప్రమాదంలో రైల్వే బ్రిడ్జీలు స్వర్ణముఖి నదిపై బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జీల సమీపంలో భారీగా ఇసుక తవ్వేస్తుండడంతో వాటికి ప్రమాదం పొంచి ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. రైల్వే అధికారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు ఇసుకను తమిళనాడుకు తరలించేందుకు డంపింగ్ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం స్వర్ణముఖి నదిలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే మండల పరిధిలోని పలు చోట్ల స్వర్ణముఖి నది వద్ద అడ్డుగా గోతులు తీశాం. మళ్లీ వీఆర్వోలను పంపించి పరిశీలిస్తాం. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. – మాగర్ల రాజేంద్ర, తహసీల్దార్, నాయుడుపేట ఇసుక తవ్వకాలతో ప్రమాదం స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్మంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కావడంలేదు. పట్టణ పరిధిలోని తుమ్మూరుతో పాటు పలు చోట్ల నదిలో భారీగా ఇసుక ఆగాధాలు ఏర్పడ్డాయి. పిల్లలు సరదాగా ఈతకెళ్తే అంతే. – శివకవి ముకుందా, సీపీఎం పార్టీ నాయకులు, నాయుడుపేట -
పరిహారం ఇప్పించండయ్యా !
తిరుపతి అర్బన్: ‘రైల్వే లైన్ వేయాలంటూ మా ఇళ్లు తీసుకున్నారు. రెండు నెలల క్రితమే కొట్టేశారు. ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. దూర ప్రాంతంలో ఇంటి పట్టాలు చూపించారు. ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకోవడానికి సాయం చేయలేదు. వీధుల్లో నివాసం ఉంటున్నాం. మేము కూడా మనషులమే సర్’ అంటూ పలువురు సుగాలీలు తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమాచారం అందుకున్న రేణిగుంట మండలం, తూకివాకం పంచాయతీకి చెందిన 26 సుగాలీల కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ మంత్రి చాంబర్ ముందు ఆందోళనకు దిగారు. కొత్త రైల్వే లైన్ వేస్తున్నామంటూ 26 ఇళ్లు కూల్చివేశారని వాపోయారు. అయితే 21 మందికి మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చారని ఆవేదన చెందారు. ఐదు పట్టాలను ఎవరు నొక్కేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని తెలిపారు. న్యాయం కోసం మంత్రిని కలిసి తమ బాధను తెలియజేస్తామంటూ భీష్మించారు. సమాచారాన్ని తెలుసుకున్న తిరుచానూరు పోలీసులు ఎస్ఐ జగన్నాథంరెడ్డి నేతృత్వంలో సుగాలీలకు సర్ది చెప్పారు. ఆందోళన వద్దని, తర్వాత జిల్లా అధికారులను కలసి సమస్యను చెప్పుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో వారంతా తిరిగి తూకివాకం వెళ్లిపోయారు. -
నేడే అవిశ్వాస తీర్మానం
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం ఉదయం 10.45 గంటలకు గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీనన్ నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్‌తోపాటు గూడూరు డీఎస్పీ గీతాకుమారి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఎలాగైనా ఈ ఎన్నికను వాయిదా వేయించాలని కూటమి నేతలు కుయుక్తులు పన్నుతుండడం విమర్శలకు తావిస్తోంది. కౌన్సిలర్లకు విప్ జారీ వెంకటగిరి మున్సిపాలిటీలో 25 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు ఆ పార్టీ అధిష్టానం విప్ జారీచేసింది. జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి సూచనల మేరకు విప్‌జారీ చేశారు. విప్ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసేందుకు పచ్చపన్నాగం వెంకటగిరిలో 25 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ ప్రతినిధులే -
అంగన్వాడీ చిన్నారులకు అస్వస్థత
పెళ్లకూరు: మండలంలోని కానూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోని ఆరుగురు చిన్నారులకు మంగళవారం ఫుడ్‌పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. అంగన్వాడీ కేంద్రంలో ఏనిమిది మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఆరుగురికి మంగళవారం మధ్యాహ్నం పులిహోర వడ్డించారు. మిగిలిన ఇద్దరు చిన్నారులు ఇంటికి వెళ్లారు. పులిహోరా తిన్న చిన్నారులు గురువర్షిత్, జోషన్, జశ్వన్, నాని, గురవయ్య, శాన్విక గంట వ్యవధిలో వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం నాయుడుపేటకు తరలించారు. సీడీపీవో ఉమామహేశ్వరి, నాయుడుపేట సీఐ సంఘమేశ్వరరావు, ఎస్ఐలు నాగరాజు, ఆదిలక్ష్మి, సూపర్వైజర్ సాయిలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీశారు. విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం పులిహోర తినడం వల్ల వాంతులయ్యాయని, ఎలాంటి అందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడి వైద్యులు వెల్లడించారు. చిన్నారులను రాత్రికి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరివెంట అంగన్వాడీ వర్కర్ శ్రీదేవి, చిన్నారుల తల్లిండ్రులు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): శ్రీకాళహస్తి మండలంలోని రామాపురం రిజర్వాయర్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. రామాపురం డ్యాం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన విషయాన్ని స్థానికులు గుర్తించి శ్రీకాళహస్తి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమితం శ్రీకాళహిస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద రెండు సెల్ఫోన్లు, రూ.10 వేల నగదు ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన ఆధారాలు ఏమీ లేకపోవడంతో గుర్తితెలియని మృతదేహంగా కేసు నమోదుచేశారు. -
మార్క్‌శంకర్ త్వరగా కోలుకోవాలి
తిరుపతి మంగళం: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో ప్రమాదానికి గురికావడం బాధాకరమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందన్నారు. శ్రీ కలియుగ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మార్క్‌శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గ్రీవెన్స్‌కు ప్రాధాన్యం తిరుపతి అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పరిధిలో పెండింగ్‌లోని అర్జీలకు పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చేపట్టాల్సిన అంశాలను వివరించారు. వేసవిలో లక్ష మందికి కూలి పనులు కల్పించాలని చెప్పారు. డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పింఛన్ సొమ్ము అందజేత సత్యవేడు: స్థానిక పంచాయతీలోని 1వ సచివాలయం వీఆర్ఓ చిట్టిబాబు రూ. 63 వేల పింఛన్ సొమ్మును సత్యవేడు సెక్రటరీ మునిరవికుమార్కు మంగళవారం అందజేశారు. ఏప్రిల్‌కు సంబంధించి 64 మందికి పింఛన్లను వీఆర్వో పంపిణీ చేయాల్సి ఉండగా అందులో 48 మందికే అందజేశారు. మిగిలిన 16 మందికి సంబంధించిన పింఛన్ డబ్బు రూ.63 వేలు తన వద్దనే ఉంచుకున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో వైద్యశాలలో ఉండడంతో కార్యాలయానికి రాలేకపోయానని, అధికారులకు అందుబాటులో లేనని వివరణ ఇచ్చారు. 15న శ్రీకాళహస్తిలో మెగా జాబ్‌మేళా ● 30 బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ● పోస్టర్ల ఆవిష్కరణలో కలెక్టర్ వెల్లడి తిరుపతి అర్బన్: ఈ నెల 15న శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, విజయశ్రీతోపాటు నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు లోకనాధం,గణేష్‌తో కలసి జాబ్‌మేళా పోస్టర్లను తన కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మెగా జాబ్‌మేళాకు 30 బహుళజాతి కంపెనీలు హాజరు కానున్నాయని, 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. 5వ తరగతి నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వారందరూ అర్హులేనని, దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 13లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అదనపు సమాచారం కోసం 7989509540, 8919889609 (వినయ్) సెల్ నంబర్లను సంప్రదించాలని నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలియజేశారు. తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు హైదరాబాద్, చైన్నె తదితరప్రాంతాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయని, విద్యార్హతలను బట్టి వేతనం ఉంటుందని తెలియజేశారు. -
అక్రమాస్తుల కేసులో మళ్లీ సోదాలు
● గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన చంద్రగిరి పంచాయతీ ఈవో ● సదరు ఈవోను సస్పెండ్ చేసిన జిల్లా ఉన్నతాధికారులు ● సస్పెన్షన్‌లో ఉండగానే మరోసారి సోదాలు సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య లంచం తీసుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఏసీబీకి చిక్కారు. అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. అయితే సరిగ్గా నెల రోజుల తర్వాత ఆయన ఇంటిపై మరోసారి ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇంట్లోని పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు తిరుపతి రూరల్ మండలం, పేరూరు పంచాయతీ సమీపంలోని ఏకదంతా అపార్ట్మెంట్లో ఉన్న మహేశ్వరయ్య ప్లాటుకు మంగళవారం ఉదయమే ఏసీబీ అధికారులు చేరుకున్నారు. అతని కుటుంబీకులకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బంగారం, వెండికి సంబంధించిన బిల్లులు, స్థిరాస్తులకు సంబంధించిన దస్తావేజులను పరిశీలించి.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కన మహేశ్వరయ్యను జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేయగా మరోసారి ఆయన ఇంట్లో సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. మహేశ్వరయ్య ఇంటితో పాటు కారు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో సుమారుగా మార్కెట్ విలువ ప్రకారం రూ.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా ఏసీబీ అధికారులు సోదాలు పూర్తయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. -
పది టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీకాళహస్తి: పది టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం శ్రీకాళహిస్త మండలంలో చోటు చేసుకుంది. తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదేశాల మేరకు సీఐ వెంకటరవి, ఎస్ఐ రామకృష్ణ నాయక్, సీఎస్‌డీటీ రవిచంద్రబాబు, హెడ్ కానిస్టేబుల్ వెంకటాద్రి, కానిస్టేబుల్ అయ్యప్ప నేతృత్వంలో దాడులు చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ముసలిపేడు మార్గంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్టు సమాచారం రావడంతో రామాపురం జలాశయం వద్ద బియ్యంతో వెళుతున్న వాహనాన్ని అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.3.51 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేవీబీపురం మండలం, కోవనూరు గ్రామానికి చెందిన వెంకటయ్య కుమారుడు కే.రాజేష్ (25)ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అనంతరం బియ్యా న్ని శ్రీకాళహస్తి ఎంఎల్ఎస్ కేంద్రానికి తరలించామని, నిందితునితోపాటు వాహనాన్ని శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. గోవింద ధామానికి భూమిపూజ చంద్రగిరి: స్థానిక శ్రీనివాసమంగాపురం మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న గోవింద ధామంకు మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే పులివర్తినాని హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ చంద్రగిరి మండల ప్రజలకు ఇబ్బంది కలగకుండా హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా వారి సౌకర్యార్థం ‘గోవింద ధామం’ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ గోవింద ధామం ఏర్పాటుతో చంద్రగిరి ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. సర్పంచ్‌లు రేవతి, ముదికుప్పం రూపరామ్మూర్తి, జెడ్పీటీసీ చిల్లకూరి యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.