
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
నాగలాపురం : ల్యాప్‌టాప్‌ను చోరీ చేసిన కేసులో బైటికొడియంబేడుకు చెందిన నిందితుడు సలీమ్(20)ను శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు. 2024 మే 25వ తేదీన చైన్నె నుంచి కర్నూలుకు వెళుతున్న బస్సులో ఓ విద్యార్థి నుంచి నిందితుడు రూ.1.9లక్షల విలువైన ల్యాప్‌టాప్, రూ.25వేల ఆపిల్ ఇయర్‌ఫోన్‌ను అపహరించినట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వివరించారు.
తుమ్మలగుంటలో
కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, తుమ్మలగుంట గ్రామంలో నివాసముంటున్న టీ.భాస్కరయ్య (65) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల సమాచారం మేరకు... మృతుడు తిరుపతి ఎస్వీ గోశాలలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తన ఇంటి మిద్దైపెన మొదటి అంతస్తులో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా కుటుంబీకులు గుర్తించి చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్