
రైలు ఢీకొని వ్యక్తి మృతి
గూడూరు రూరల్: పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందిన ఘటన గూడూరు రైల్వేస్టేషన్‌లో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం.. గూడూరు రైల్వే స్టేషన్ చివరి భాగంలో రైలు పట్టాలు దాటుతున్న సుమారు 55 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తిని బెంగళ్లూరు నుంచి గౌహతి వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.