
26,315
ఉపాధికి షార్ట్ కట్
పాలిటెక్నిక్ కోర్సులు ఉపాధికి బాటలు వేస్తున్నాయి. అంతరీక్ష పరిశోధన సంస్థ షార్‌లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
టీటీడీకి పది టన్నుల కూరగాయలు
పలమనేరు మార్కెట్ మండీ యజమాని టీటీడీకి పది టన్నుల కూరగాయలను వితరణగా అందజేశారు.
వైఎస్సార్‌సీపీ పాలనలోనే విద్యకు అధిక ప్రాధాన్యం
సన్‌షైన్ అవార్డులు స్వీకరించిన జిల్లా విద్యార్థులు
శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లో
జిల్లా
సమాచారం
2019–24 మధ్య కాలంలో అప్పటి
ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట
వేశారు. పిల్లలకు విలువలతో కూడిన
విద్యనందించాలని పరితపించారు. ఈ
క్రమంలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. విద్యాభివృద్ధితోనే వ్యక్తిగత, సామాజిక ప్రగతి
సాధ్యమవుతుందని బలంగా విశ్వసించారు. నాటి సంస్కరణల ఫలితంగానే నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటర్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి సన్‌షైన్ అవార్డులకు ఎంపికై న విద్యార్థుల
మనోగతంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
(జనరల్ + ఒకేషనల్)
తండ్రి కష్టాన్ని గుర్తుచేసుకుంటూ..
నారాయణవనంకు చెందిన ఎంపి.మదనాచారి, ఎం.భువనేశ్వరి దంపతుల కుమార్తె కమలశ్రీ. పుత్తూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇం.ఇజినీరింగ్ (సీఎస్‌ఈ) ఒకేషనల్ విద్యనభ్యసించి 987 మార్కులు సాధించి సన్‌షైన్ అవార్డుకు ఎంపికై ంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించింది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదరికం వారిది. తండ్రి కూలి పనిచేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తన తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగిన కమలశ్రీ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. బీకాం కంప్యూటర్స్ లేదా బీసీఏ డిగ్రీ కోర్సు చదివి సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలన్నదే తన ఆకాంక్ష అని చెబుతోంది.
ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం
బుచ్చినాయుడుకండ్రిగ మండలం, పార్లపల్లి గ్రామానికి చెందిన ఎన్.ఆనందయ్య, ఎన్.బుజ్జమ్మ దంపతుల కుమార్తె నక్కబోయిన లహరి దొరవారిసత్రం కేజీబీవీలో ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్ ఒకేషనల్ కోర్సును పూర్తిచేసింది. ఇంటర్‌లో 969 మార్కులు సాధించి, సన్‌షైన్ అవార్డు స్వీకరించింది. తల్లిదండ్రులు కూలినాలి చేసుకుంటూ వచ్చే సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. వీరిలో మొదటి వాడు శ్రీకాళహస్తిలో డిగ్రీ, రెండో అమ్మాయి లహరి ఇంటర్‌లో ప్రతిభ చాటగా, మూడవ అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. బీఏ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌కు సిద్ధమవ్వడమే లక్ష్యమని చెబుతోంది.
20
ఇంటర్‌లో
ప్రతిభ
చాటిన
ప్రభుత్వ
జూనియర్
కళాశాలల విద్యార్థులు
గత ప్రభుత్వ
సంస్కరణలతోనే నేడు
ఉత్తమ
ఫలితాలు
మొత్తం
విద్యార్థులు
u
తిరుపతి ఎడ్యుకేషన్ : గత ఐదేళ్ల పాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఒక్క చదువుతోనే పేదరికాన్ని అధిగమించగలమని బలంగా నమ్మింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ విద్యారంగాన్ని గాడిలో పెట్టింది. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అమ్మఒడి, విద్యాకానుక, నాడు–నేడు పథకాలను అమలుచేసి ఉన్నత చదువులకు బాటలు వేసింది.
నాటి సంస్కరణలతోనే.. వైఎస్సార్‌సీపీ పాలనలో అమలు చేసిన సంస్కరణలే నేడు ఇంటర్మీడియెట్ ఉత్తమ ఫలితాలకు దోహదం చేశాయి. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో 70 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేపట్టారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్లు పరిష్కరించారు. బూజుపట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలను నాడు–నేడు పథకం ద్వారా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.
సన్‌షైన్ అవార్డులు
కోట హైస్కూల్ ప్లస్‌కు చెందిన యనమల శివాని ఎంపీసీలో 978 మార్కులు సాధించింది. పుత్తూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఒకేషనల్ సీఎస్ ఈ చదివిన కమలశ్రీ 987, ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ బాలు ర జూనియర్ కళాశాలలో మెకానికల్ ఆటో మొబైల్ టెక్నీషియన్ (ఎం అండ్ ఏటీ) ఒకేషనల్ కోర్సు చదివిన ఎ.ఎ.ప్రేమ్‌కుమార్ 977, దొరవారిసత్రం కేజీబీవీలో పీఎస్‌టీటీ ఒకేషనల్ కోర్సు చదివిన నక్కబోయిన లహరి 969 మార్కు లు సాధించారు. వీరందరూ ఈ నెల 15న విజయవాడలో మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు అందుకున్నారు.
– 10లో
న్యూస్‌రీల్
తండ్రి కష్టం వృథాపోకూడదని..!
చిత్తూరు జిల్లా, నగరి మండలం, సత్రవాడ గ్రామానికి చెందిన ఎకె.ఆరస్వామి, ఎకె.త్యాగవల్లి కుమారుడు ఎకె.ప్రేమ్‌కుమార్ పూత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మెకానికల్ ఆటో మొబైల్ టెక్నీషియన్ (ఎం అండ్ ఏటీ)లో ఒకేషనల్ విద్యనభ్యసించాడు. ఇంటర్‌లో 977 మార్కులు సాధించి సన్‌షైన్ అవార్డు అందుకున్నాడు. తండ్రి మగ్గం కార్మికుడు. చిన్న పరిశ్రమలో దినసరి కూలీ. వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ తన ముగ్గురు కుమారులను చదివించాడు. చిన్న కుమారుడైన ప్రేమ్‌కుమార్ తండ్రి కష్టం వృథా పోకూడదన్న సంకల్పంతో చదువుకుంటున్నాడు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడి తల్లిదండ్రుల కష్టానికి ఫలితమివ్వాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు.
పేదింట మెరిసిన విద్యాకుసుమం
కోట: కోట మండలం, కేసవరం పంచాయతీ, సిద్ధమ్మకండ్రిగ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, రాధ కుమార్తె శివానీ. కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్లస్ టూలో ఎంపీసీలో చేరింది. వెయ్యి మార్కులకు గాను 978 మార్కులు సాధించి సన్‌షైన్ అవార్డు సొంతం చేసుకుంది. గతంలో చిట్టేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 527 మార్కులు సాధించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 470కి 456 మార్కులు సాధించింది.

26,315

26,315

26,315

26,315

26,315

26,315

26,315

26,315

26,315

26,315