
విద్యుదాఘాతంలో పాడి పశువు మృతి
నాగలాపురం: విద్యుత్ షాక్‌కు గురై రెండు పాడి ఆవులు మృతి చెందాయి. బాధితుల కథనం మేరకు.. పిచ్చాటూరు మండలంలోని రెప్పాలపట్టు సమీపంలో తెగి కింద పడి ఉన్న అరణియార్ ప్రాజెక్టు విద్యుత్ తీగలు తగిలి ఆ మార్గంలో మేతకు వెళ్లే పాడి పశువు సంఘటన స్థలంలోనే మృతి చెందింది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
నారాయణ స్కూలుకు షోకాజు నోటీసు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి న్యూబాలాజీ కాలనీలోని నారాయణ స్కూలుకు డీవైఈఓ బాలాజీ మంగళవారం షోకాజు నోటీసు ఇచ్చారు. సరైన అనుమతి పత్రాలు లేకుండా పాఠశాలను నడుపుతున్నట్లు విద్యార్థి సంఘాలు డీఈఓ కేవీఎన్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో డీఈఓ ఆదేశాల మేరకు డీవైఈఓ ఆ పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సరైన రికార్డులు లేకపోవడంతో షోకాజు నోటీసు అందించారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లా వ్యాప్తంగా పలు విద్యాసంస్థలు అనుమతు లు లేకుండా పాఠశాలలను నడుపుతున్నాయని ఎన్‌యూఐ, జీఎన్‌ఎస్, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ విద్యాసంఘాల నాయకులు ఆరోపించారు. నారాయణ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో అనేక పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా టెక్నో, ఈటెక్నో, ఒలంపియాడ్, ఐఐటీ ఫౌండేషన్, సీఓ తదితర పేర్లతో పాఠశాలను నిర్వహిస్తూ లక్షలాది రూపాయలను దండుకుంటున్నారని ఆరోపించారు. తిరుపతి నగరంలో నారాయణ విద్యాసంస్థ కమర్షియల్ భవనంలో అనుమతులు లేకుండా గత 6 నెలల నుంచి పాఠశాలను నిర్వహిస్తుండడం దుర్మార్గమన్నారు. సొంతంగా పుస్తకాలను ముద్రించి, వాటిని అధిక ధరలకు అమ్ముకుంటూ తల్లిదండ్రులను దోచు కుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు జెన్నె మల్లికార్జున, సుందరరాజు, బాలాజీ, చంద్రనాయక్, కుమార్, బాలు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంలో పాడి పశువు మృతి