తిరుపతిలో స్పోక్స్‌ మోడల్‌ హబ్‌ | - | Sakshi
Sakshi News home page

తిరుపతిలో స్పోక్స్‌ మోడల్‌ హబ్‌

Apr 16 2025 12:23 AM | Updated on Apr 16 2025 12:23 AM

తిరుపతిలో స్పోక్స్‌ మోడల్‌ హబ్‌

తిరుపతిలో స్పోక్స్‌ మోడల్‌ హబ్‌

● ఏర్పాటుకు ఐఐటీ, ఏపీఐఐసీ భవనాల పరిశీలన

తిరుపతి అర్బన్‌: నగరంలో స్పోక్స్‌ మోడల్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. తాత్కాలిక భవనాల కోసం కలెక్టర్‌తోపాటు పలు విభాగాలకు చెందిన అధికారులు మంగళవారం తిరుపతిలో పలు ప్రాంతాలను పరిశీలించారు. తిరుపతిలోని ఐఐటీ, ఏపీఐఐసీకి చెందిన పలు భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు అనుసంధానంగా స్పోక్స్‌ మోడల్‌ హబ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో ఐదు హబ్‌లను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. అందులో తిరుపతి ఒకటని పేర్కొన్నారు. స్పోక్స్‌ మోడల్‌ హబ్‌ విద్యార్థుల నూతన అలోచనలకు దోహదపడుతుందని తెలిపారు. ఆదానీ, అమరరాజా, నవయుగ పరిశ్రమల సహకారంతో ఐఐటీ తిరుపతి సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలతో స్పోక్స్‌ మోడల్‌ హబ్‌ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీఈసీఓఎస్‌డీ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా దీప్తి, ఐఐటీ ఏర్పేడు డైరెక్టర్‌ సత్యనారాయణ, అమరాజా ఆదోని కంపెనీ ప్రతినిధులు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌ రెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ విజయ్‌ భరత్‌ రెడ్డి, చీఫ్‌ ఆర్కిటెక్చర్‌ మణి సందీప్‌, సిఓఓ ఆదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్‌ రాజన్‌బాబు, నవయుగ సీఈఓ సుబ్బారావు, పీడీలు డీఆర్‌డీఏ, మెప్మాలకు చెందిన శోభన్‌ బాబు, రవీంద్ర, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సుధాకర్‌ రావు, ఏర్పేడు తహసీల్దార్‌ భార్గవి, డీటీ మాధురి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement