శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జిల్లా జడ్జి అరుణ సారిక ఉన్నారు.
స్థానిక వర్సిటీల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం
విదేశీవిద్యకు ఆంక్షలు విధించడంతో స్వదేశంలోనే ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్థు లు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది పీజీ సెట్లకు సైతం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మెరిట్ స్టూడెంట్లు స్వదేశీ విద్యనభ్యసిస్తే విద్యారంగంలో పరిశోధనలు కొత్త పుంతలు తొ క్కే అవకాశం ఉంటుంది. ఎస్వీయూలో కొత్తగా ప్రవేశ పెట్టిన ఎంఎస్ డేటా అనలాసిస్, ఏఐ వంటి కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏలోనూ అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది.
–సీహెచ్ అప్పారావు, వీసీ, ఎస్వీయూ
ఎన్‌ఈపీతో ఉద్యోగావకాశాలు మెండు
నూతన విద్యావిధానంతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. విదేశీ విద్య తో సమానంగా స్వ దేశంలోనూ పలు వర్సిటీల్లో ప్రొఫెషనల్ కోర్సుల్లో అంతర్జాతీయ స్థా యి సిలబస్ అమలులో ఉంది. రూ.లక్షలు ఖ ర్చు పెట్టి విదేశీ విద్య కోసం ప్రయత్నించడం కంటే ఎన్‌ఈపీ విధానం అమలులో ఉన్న వర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసించడం ఎంతో ఉత్తమం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మెరుగుపడడంతో విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎఫ్1 వీసా కఠినతరంతో ఈ ఏడాది వర్సిటీల్లో అన్ని పీజీ కోర్సులకు అడ్మిషన్లు పెరగనున్నాయి. –ప్రొఫెసర్ పద్మావతమ్మ,
ప్రిన్సిపల్, సైన్స్ కళాశాల, ఎస్వీయూ
– 8లో
శ్రీవారి సేవలో ప్రముఖులు


