శ్రీచైతన్య విద్యార్థుల హవా
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ఈ.గణేష్‌రెడ్డి, జె.సార్విక, ఎస్.ప్రణవి, ఎన్.హారిక 990 మార్కులు, జి.ప్రశాంత్‌రెడ్డి, కె.దివ్యశ్రీ, పి.స్పందన, ఎస్.నవీన్ 989 మార్కులు సాధించగా.. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సి.తన్మయి 466, ఎం.దివ్యశరణ్య, జి.జాహ్నవి, కె.హంసలేఖ, ఎ.రుషివేంద్ర, సి.యశ్వంత్‌కుమార్, బి.దివ్యశ్రీ, ఎ.నాగరిషిక 465 మార్కులు సాధించారు. అలాగే జూనియర్ బైపీసీ విభాగంలో కె.అభిగ్నరెడ్డి, టి.హర్షిత, వై.జోషిత 434 మార్కులు సాధించగా.. వీరిని విద్యాసంస్థల ఏజీఎం బీవీ ప్రసాద్, డీన్‌లు కెఎల్‌జీ.ప్రసాద్, రామమోహన్‌రావు, శ్రీనివాసరాజు, భాస్కర్ అభినందించారు.
తిరువణ్ణామలై రద్దీ
తిరుపతి అర్బన్: పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తమిళనాడులోని తిరువణ్ణామలైకి వెళ్లారు. జిల్లాలోని 10 డిపోల నుంచి 81 సర్వీసులను ఏర్పాటు చేశారు. అందులో తిరుపతి డిపో నుంచి 17 సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే ఒక్క తిరుపతి నగరం నుంచే 10వేల మంది భక్తులు శనివారం తిరువణ్ణామలైకి వెళ్లినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. రద్దీ నేపథ్యంలో తొక్కిసలాటలు లేకుండా జిల్లా ప్రజారవాణా అధికారి నరసింహులు, ఏటీఎం రామచంద్రనాయుడు, డీఎం బాలాజీ, టీఐ వీఆర్ కుమార్ చర్యలు చేపట్టారు.


