అహంభాను!
అంతేనా..
తిరుపతి మంగళం : ఆధ్యాత్మిక నగరం తిరుపతిని అత్యంత పరిశుభ్రంగా ఉంచేందుకు కాళ్లు పట్టుకున్నా కనికరం లేదా? భానుప్రకాష్‌రెడ్డి అన్నా.. అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్ వద్ద భానుప్రకాష్‌రెడ్డికి పూల బొకేలు ఇచ్చి వైఎస్సార్‌సీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి వందేళ్లు గుర్తుండేలా మాస్టర్‌ప్లాన్ రోడ్లు నిర్మించారని తెలిపారు. ఈ క్రమంలోనే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చొరవతో తిరుపతి నగరపాలక సంస్థకు 1,700మంది పారిశుద్ధ్య కార్మికులను అదనంగా నియమించే దిశగా టీటీడీ నిధులు వెచ్చించేందుకు అభినయ్ శ్రమించారన్నారు. అయితే టీటీడీ నిధులు రాకుండా మీరు కోర్టు కెక్కారని విమర్శించారు. దీంతో తిరుపతి నగరపాలక సంస్థలో ఉన్న కార్మికులు సరిపోక రోడ్లు, కాలువల్లో చెత్త పేరుకుపోతోందని వివరించారు. స్థానికుడిగా మీకు తిరుపతి పరిశుభ్రతపై బాధ్యత లేదా? అని భానుప్రకాష్‌రెడ్డిని ప్రశ్నించారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు టీటీడీ నుంచి రూ. కోటి నిధులు కేటాయించడంలో కీలకపాత్ర పోషించిన మీరు.. పారిశుద్ధ్య కార్మికులకు నుంచి వచ్చే నిధులను అడ్డుకోవడం సమంజసమేనా? ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం అంటారే కానీ కేవలం తిరుమల అని ఎక్కడా పేర్కొనలేదని వెల్లడించారు. తిరుపతిలో టీటీడీకి చెందిన ఆలయాలు, భవనాలు, కళాశాలలు, పాఠశాలలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటప్పుడు టీటీడీలో భాగమైన తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయిస్తే తప్పేంటని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలు, కుట్రలతో నగర అభివృద్ధిని అడ్డుకోవడం సబబుకాదని హితవు పలికారు. ఇప్పటికై నా కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని భానుప్రకాష్‌రెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు నల్లాని బాబు, లవ్లీ వెంకటేష్, గీతాయాదవ్, టౌన్‌బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్, డైరెక్టర్ కడపగుంట అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు మద్దాలి శేఖర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, నేతలు అనిల్‌రెడ్డి, మోహన్‌రాజ్, అరుణ్‌యాదవ్, సాయికుమారి, పద్మజ, రమణారెడ్డి, కోదండ, విజయలక్ష్మి, పుణీత, ఉష, జ్యోతి, చందు, కిషోర్, మల్లం రవి పాల్గొన్నారు.
స్వచ్ఛ తిరుపతికి సహకరించాలని
వైఎస్సార్‌పీపీ నేతల వినతి
టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి
కాళ్లు పట్టుకుని వేడుకోలు
ససేమిరా అంటూ తిరస్కరించడంపై ఆవేదన
తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి వ్యవహారశైలిని వైఎస్సార్‌సీపీ నేతలు ఆక్షేపించారు. తిరునగరి పరిశుభ్రతకు సహకరించకపోవడంపై మండిపడ్డారు. కాళ్లు పట్టుకుని వేడుకున్నప్పటికీ కనికరించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో పారిశుద్ధ్య పనులకు టీటీడీ నిధులు మంజూరు కాకుండా అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. కోర్టు కేసును వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక క్షేత్రం అభివృద్ధికి కలసిరావాలని కోరితే అహంభావంతో తిరస్కరించడం దారుణమని విమర్శించారు.
కనికరించే ప్రసక్తే లేదు
తిరుపతిలో టీటీడీ నిధులు ఖర్చు చేయడం కుదరదని, పారిశుద్ధ్య కార్మికుల కోసం నిధులు రాకుండా కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోనని భానుప్రకాష్‌రెడ్డి తేల్చి చెప్పారు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశారు. తిరుపతి అభివృద్ధికి స్మార్ట్‌సిటీ నిధులు వస్తున్నాయన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తిరుపతి అభివృద్ధికి ఏదో ఒక మార్గంలో నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చిలక పలుకులు వల్లించారు. అంతే కానీ, తిరుపతి పరిశుభ్రతకు టీటీడీ నిధులు రాకుండా కోర్టులో వేసిన కేసును ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకోనని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా..ససేమిరా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అహంభాను!
అహంభాను!


