20 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

20 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

Apr 15 2025 1:46 AM | Updated on Apr 15 2025 1:46 AM

20 టన

20 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

పెళ్లకూరు: 71వ నంబరు జాతీయ రహదారి మార్గంలో దిగువచావలి ఫ్లైఓవర్‌పై శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్‌ బియ్యం లోడ్డుతో వెళ్తున్న వాహనం టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి బోల్తాపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, అధికారుల సమాచారం మేరకు.. శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనం మార్గమధ్యంలో దిగువచావలి గ్రామం ఫ్లై ఓవర్‌పై టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే బియ్యం వ్యాపారులు వాహనంలోని 20 టన్నుల బియ్యాన్ని గ్రామంలోని రహస్య ప్రదేశానికి తరలించారు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ నాగరాజు రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్‌ సప్లై డీటీ గోపీనాథరెడ్డి, తహసీల్దార్‌ ద్వారకానాథ్‌రెడ్డికి సమాచారం అందించారు. పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని వీఆర్వోలు రమేష్‌, వంశి నాయుడుపేట గోదాముకు తరలించి కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ఉమాపతి

వరదయ్యపాళెం: సమాచార హక్కుచట్టం సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా సత్యవేడు మండలం, మాదనపాళెం గ్రామానికి చెందిన సూరతిని ఉమాపతి నియమితులయ్యారు. ఆ మేరకు సోమవారం ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ చంటి ముదిరాజ్‌ నుంచి ఉత్తర్వులందజేసినట్లు ఆయన వివరించారు. ఉమాపతి మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆ చట్టం విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

20 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం
1
1/1

20 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement