గరుడ వాహనంపై చిద్విలాసం
రాపూరు: పెంచలకోనలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి చందనాలంకరణలో కనువిందు చేశారు. సోమవారం స్వాతి నక్షత్రం శ్రీవారి జన్మనరక్షత్రం కావడంతో స్వామివారి మూల మూర్తికి చందనంతో అలంకరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం అభిషేకం, చందనాలంకరణ, పుష్పాలంకరణ, 9 గంటలకు శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో శాంతి హోమం, కల్యాణం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారు బంగారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉభయకర్తలుగా దేవస్థాన ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, రాజ్యలక్ష్మి వ్యవహరించారు.
గరుడ వాహనంపై చిద్విలాసం


