
హంస వాహనంపై లక్ష్మీనరసింహుడు
రాపూరు: వసంతోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఉభయనాంచారులతో కలసి శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి హంస వాహనపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. స్వామి వారి అలంకార మండపంలో నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవీ ఉత్సవ విగ్రహాలను కొలువు దీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మేళతాళాలు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ కోన మాడ వీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం నందనవనంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.