
ఆకట్టుకుంటున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
తిరుపతి సిటీ: స్థానిక ఆర్టీసీ ఓవర్ బ్రిడ్జి సమీపంలోని చింతలచేను శ్రీరామ తులసి కళ్యాణ మండపం వేదికగా విద్యాస్ఫూర్తి పేరుతో ప్రముఖ యాడ్ 6 అడ్వర్‌టైజింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రెండు రోజుల మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో – 2025 ప్రారంభమైంది. ఇందులో నగర ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలి రోజు బెంగళూరు మార్తనహల్లిలోని హిందుస్తాన్ ఏవియేషన్ అకాడమీ, జాలహల్లి ఈస్ట్‌లోని సంభ్రమ్ ఇన్‌స్టిట్యూట్, కృష్ణరాజపురంలోని ఎస్‌ఈఏ(సీ) ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, విద్యారంగ నిపుణులు పాల్గొని అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజుల వివరాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా అందించే కోర్సులు, అంతర్జాతీయ కోర్సులపై అవగాహన కల్పించారు. నిర్వాహకులు రఘుకిషోర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకు ఊహించని రీతిలో స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. బెంగళూరు లాంటి సిటీలో విద్యనభ్యసించి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలనే విద్యార్థులకు ఇది సరైన వేదికని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ఆకట్టుకుంటున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో

ఆకట్టుకుంటున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో

ఆకట్టుకుంటున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో