ప్రాథమిక వైద్యం.. | - | Sakshi
Sakshi News home page

ప్రాథమిక వైద్యం..

Published Mon, Apr 14 2025 12:19 AM | Last Updated on Mon, Apr 14 2025 12:19 AM

ప్రాథ

ప్రాథమిక వైద్యం..

● చిన్నపాండూరు పీహెచ్‌సీలో ప్రశ్నార్థకంగా సేవలు ● కనీస భద్రత లేదంటూ చేతులెత్తేసిన సిబ్బంది ● ఆస్పత్రిలో తారస్థాయికి చేరిన అంతర్గత విబేధాలు ● డీడీఓ బాధ్యతల నుంచి తప్పుకున్న వైద్యాధికారి ● వరదయ్యపాళెం పీహెచ్‌సీ వైద్యాధికారికి డీడీఓ బాధ్యతలు అప్పగింత ● రాత్రిపూట వైద్యమందక అవస్థలు పడుతున్న స్థానికులు ● వితరణగా వచ్చిన ఏసీ కోసం తలెత్తిన వివాదం

ఏసీ వివాదంతో..

ఇటీవల శ్రీసిటీకి చెందిన ఓ పరిశ్రమ సీఎస్‌ఆర్‌ ద్వారా ఆస్పత్రి అభివృద్ధి కోసం కొన్ని పరికరాలు, ఏసీలు వితరణగా అందజేసింది. అయితే ఆ ఏసీపై తిరుపతి జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వారి కన్నుపడింది. దీంతో ఆస్పత్రికి వితరణగా వచ్చిన ఏసీని జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పంపాలని ఓ అధికారి చిన్న పాండూరు పీహెచ్‌సీ డాక్టర్‌ లావణ్యను కోరారు. అయితే దాతలు వితరణగా అందించిన ఏసీని ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు. రాతపూర్వకంగా ఒక లెటర్‌ను రాసి ఆస్పత్రికి అందజేసి ఏసీని తీసుకోవల్సిందిగా తేల్చి చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వివాదం తారస్థాయికి చేరింది.

ఆస్పత్రి అభివృద్ధి కోసం దాతలు వితరణగా ఇచ్చిన ఏసీ కోసం వివాదం తలెత్తింది. అటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం.. ఇటు చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మధ్య విభేదాలకు దారి తీసింది. దీంతో సదరు వైద్యాధికారి ఆగమేఘాలపై ఆస్పత్రి డీడీఓ బాధ్యతల నుంచి తప్పుకుంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా రాత్రిపూట రోగులకు చికిత్స దూరమైంది.

చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

వరదయ్యపాళెం : మండలంలోని చిన్న పాండూరులో రౌండ్‌ ది క్లాక్‌ 24 గంటలు స్థాయి కలిగిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ ఆస్పత్రికి రూ. 2కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో కూడిన భవనం నిర్మించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇంతటి వసతులు కలిగిన ఆస్పత్రిలో వైద్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి. గ్రామీణ పేద ప్రజల కోసం ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారం రోజుల నుంచి రాత్రిపూట వైద్యసేవలు ఆగిపోయాయి. రాత్రివేళల్లో స్టాఫ్‌ నర్సు ఒక్కరే విధులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని తమకు భద్రత పూర్తిగా కరువైందని, కనీసం అటెండర్‌ గానీ సెక్యూరిటీ గానీ లేని కారణంగా రాత్రిపూట వైద్యసేవలు చేపట్టలేకపోతున్నామని ఆస్పత్రికి తాళాలు వేసేస్తున్నారు. దీంతో అత్యవసర వైద్యసేవలకు వచ్చేవారు అర్థరాత్రివేళ ముప్పతిప్పలు పడుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు సైతం వైద్యపరంగా ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అటు శ్రీసిటీ, ఇటు చిన్న పాండూరు ఏపీఐఐసీ పరిధిలోని అపోలో, హీరో, మరికొన్ని ఇతర పరిశ్రమలు ఏర్పాటుతో అటు స్థానికేతరులు, ఇటు స్థానికులతో రోజువారీ 300 మందికి పైగా ఓపీలో వైద్యసేవలు పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఆస్పత్రి స్థాయిని ఇంకొంచెం పెంచాల్సింది పోయి ఉన్న స్థాయిని కాస్త రోజురోజుకు తగ్గించేస్తూ వైద్యసేవలే అందని పరిస్థితులు దాపురిస్తున్నాయి.

మనస్తాపానికి గురై..

ఏసీ వివాదంతో మనస్తాపానికి గురైన పీహెచ్‌సీ వైద్యాధికారి లావణ్య ఏకంగా నాలుగు రోజుల క్రితం డీడీఓ బాధ్యతల నుంచి తప్పుకుంది. తాను కేవలం పీహెచ్‌సీ సమయానికే విధులకు హాజరవుతానని, ఇతర బాధ్యతలను తాను చేపట్టలేనని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారికి రాతపూర్వకంగా విన్నవించింది. దీంతో డీడీఓ బాధ్యతలను వరదయ్యపాళెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు చెందిన వైద్యాధికారి ద్వైతకు అప్పగిస్తూ డీఎంహెచ్‌ఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె శనివారం చిన్న పాండూరు పీహెచ్‌సీలో డీడీఓగా బాధ్యతలు స్వీకరించింది.

అత్యవసర పరిస్థితుల్లోనూ అందని సేవలు

తాజాగా శుక్రవారం రాత్రి యానాదివెట్టు దళితవాడకు చెందిన మల్లికార్జున (43) రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై చిన్న పాండూరు ఆస్పత్రికి వచ్చాడు. అక్కడ ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో తీవ్రమైన రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇలా అనేక మంది రాత్రివేళల్లో వైద్యం కోసం చిన్న పాండూరు ఆస్పత్రిని ఆశ్రయిస్తుంటారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పీహెచ్‌సీలో రాత్రివేళ వైద్యసేవలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

చేతులెత్తేసిన సిబ్బంది

గత కొద్దిరోజులుగా నడుస్తున్న వివాదం నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన ఆస్పత్రి సిబ్బంది ఏకంగా రాత్రిపూట వైద్యసేవలు తాము నిర్వహించలేమంటూ చేతులెత్తేశారు. చిన్న పాండూరులో 40ఏళ్ల క్రితం 24 గంటలు స్థాయి (రౌండ్‌ ది క్లాక్‌) కలిగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా రాత్రిపూట వైద్యసేవలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా స్టాఫ్‌ నర్సులు తాము ఒంటరిగా విధులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉందని, కనీసం ఒక అటెండర్‌, సెక్యూరిటీ గార్డ్‌ ఉంటే గానీ తాము రాత్రివేళల్లో పనిచేయలేమని తేల్చి చెబుతున్నారు.

ప్రాథమిక వైద్యం.. 1
1/1

ప్రాథమిక వైద్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement