
సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి!
ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 8 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 66,503మంది స్వామివారిని దర్శించుకోగా 23,941 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక, సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని మంగళవారం సినీనటి రంభ, ప్రముఖ మాజీ క్రికెటర్ రవి శాస్త్రి, డైమండ్స్ గ్రూప్ ఆఫ్ అధినేత గౌతమ్ సింఘానియా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
– 8లో

సిబ్బందిపై అడ్మిషన్ల కత్తి!