ఎస్వీబీసీ మాజీ ౖచైర్మన్‌ను కలిసిన ఎంపీ
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి రాజా కుటుంబీకులు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ డాక్టర్ వీబీ.సాయికృష్ణ యాచేంద్రను తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సోమవారం వెంకటగిరిలోని రాజా ప్యాలెస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సాయికృష్ణ యాచేంద్ర ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంఏ నారాయణ, యస్థాని, కే.రమేష్, జలగం కామాక్షి, గురుస్వామినాయుడు ఉన్నారు.
సముద్రంలోకి
440 తాబేళ్ల పిల్లలు
వాకాడు: మండలంలోని నవాబుపేట సముద్ర తీరంలో సోమవారం ఫారెస్టు అధికారుల సమక్షంలో పిల్లలు ఉత్పత్తి చేసే ఆలీవ్‌రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలో విడిచి పెట్టారు. ఈ ఏడాది మూడో దఫా నవాబుపేట వద్ద ఉన్న తాబేళపిల్లల సంరక్షణా కేంద్రం(హేచరీ)లో దాదాపు 475 గుడ్లను సేకరించి పొదిగించారు. అందులో 440 పిల్లలు ఆరోగ్యంగా బయటకు రావడంంతో వాటిని సముద్రంలో విడిచి పెట్టారు. తాబేళ్లను చంపినా, వేటాడినా చట్టరీత్యా నేరమని ఫారెస్టు అధికారులు తెలిపారు.
వేటకు వెళ్లొద్దు
వాకాడు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిసేధించారని, వేటకు ఎవ్వరూ వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యశాఖ నిషేధ ఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎపీ ఎంఆర్‌ఎఫ్ 1994 సెక్షన్(4)ను అనుసరించి శిక్షార్హులు అవుతారని, అలాగే వారి బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని, జరిమానా విధించి, రాయితీలు రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఎస్వీబీసీ మాజీ ౖచైర్మన్‌ను కలిసిన ఎంపీ


