
గంగ కాలువలో మహిళ మృతదేహం
డక్కిలి: కండలేరు–పూండి కాలువలో శనివారం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎస్‌ఐ శివశంకర్ కథనం.. డక్కిలి సమీపంలోని తెలుగుగంగ కాలువలో ఓ మహిళ మృతదేహం వెళ్తున్నట్టు స్థానికులు సమాచారం అందించారన్నారు. అయితే ఆ మృతదేహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడంలేదన్నారు. మృతదేహం వెంకటగిరి లేదా బాలాయపల్లి మండలం, ఊట్లపల్లి గేటు దగ్గర లభ్యం కావొచ్చని తెలిపారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
లీగల్ సెల్ కమిటీ చైర్మన్‌గా సునీల్ కుమార్
తిరుపతి లీగల్ : ఇండియన్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ సెల్ అనుబంధ తిరుపతి జిల్లా లీగల్ సెల్ కమిటీ చైర్మన్‌గా న్యాయవాది ఎన్‌ఎన్ సునీల్ కుమార్ ఎంపికయ్యారు. తిరుపతిలోని ఆ సంస్థ కార్యాలయంలో శనివారం కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ చైర్మన్లను ఎంపిక చేశారు. తిరుపతి జిల్లా లీగల్ సెల్ చైర్మన్‌గా ఎన్‌ఎన్ సునీల్ కుమార్, మహిళా లీగల్ సెల్ చైర్మన్‌గా మహిళా న్యాయవాది జి.రమణి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కాణిపాకం మురళీ మాట్లాడుతూ ప్రజల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడానికి తమ సంస్థ న్యాయ సలహాదారులు కృషి చేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ జనరల్ సెక్రటరీ ఎం.హరిబాబు, జిల్లా అధ్యక్షుడు మునిరెడ్డి, నగర అధ్యక్షుడు ఎస్.దేవిప్రసాద్, ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

గంగ కాలువలో మహిళ మృతదేహం