
పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?
అధిక శాతం బ్యాంకులు ఏటీఎం నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. ఎక్కువ బ్యాంకులు ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ల నిర్వహణను నెట్‌వర్క్ సంస్థలకు అప్పగించాయి. వీటిలో నగదు నింపడం, మరమ్మతులు నెట్‌వర్క్ సంస్థలే చూస్తున్నాయి. ఆ సంస్థలు పట్టించుకోకపోవడంతోపాటు ఏటీఎంలు పని చేయని విషయాన్ని వినియోగదారులు బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లితే.. అధికారులు నెట్ వర్క్ సంస్థలకు సమాచారమందించి మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. ఫలితంగా ఏటీఎంపై బ్యాంకుల పర్యవేక్షణ కొరవడి, వాటి పనితీరు అధ్వాన్నంగా మారుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.