
ఆడబిడ్డల కష్టాలను చూశా
తిరుపతి అర్బన్: ఆడ బిడ్డల కష్టాలను చూశానని, అందుకే బస్‌పాస్ కేంద్రం మార్పునకు చర్యలు తీసుకున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి నరసింహులు తెలిపారు. ఏడుకొండల బస్టాండ్ వద్ద బస్సుపాస్ కేంద్రాన్ని పునః ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో ఇలా మాట్లాడారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక రోజు ఏడుకొండల బస్టాండ్ వద్ద ఉత్తరం వైపున ఎండలో ఆడబిడ్డలు బస్సుపాస్‌ల కోసం క్యూలో ఉండడాన్ని గుర్తించానన్నారు. ఆ మేరకు మంగళవారం ఏడుకొండల బస్టాండ్‌లోనే దక్షిణం వైపు బస్సుపాస్ కేంద్రాన్ని పునఃప్రారంభించామని వెల్లడించారు. ఈ నెల 30న తాను ఉద్యోగ విరమణ పొందుతున్నామని చెప్పారు. డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథం, ఏటీఎం డీఆర్ నాయుడు, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లాచంద్రయ్య, తిరుపతి డిపో నేత నరసింహులు పాల్గొన్నారు.