
● అలంకారప్రాయంగా 80 శాతం ఏటీఎంలు ● డిపాజిట్ మిషన్లూ పన
శ్రీనివాసపురంలో పనిచేయని ఏటీఎం
ఆర్టీసీ బస్టాండ్‌లో ఏటీఎం వద్ద నో క్యాష్ బోర్డు
తిరుపతి అర్బన్: ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం తప్పనిసరయ్యాయి. ఉద్యోగులు, వ్యాపారులు, పెన్షనర్లు, విద్యార్థులు ఇలా అందరూ నేడు బ్యాంకులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో అన్ని వేళలా ఉపయోగపడాల్సిన ఏటీఎంల సేవలు మృగ్యమయ్యాయి. ఎక్కడ ఏటీఎంకు వెళ్లినా ‘అవుట్ ఆఫ్ సర్వీస్’ అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నారు.
పనితీరు అధ్వాన్నం
జిల్లాలో ఏటీఎంల పనితీరు అధ్వాన్నంగా ఉంది. నిత్యం బ్యాంకుల్లో రద్దీ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఖాతాదారుడికి ఏటీఎంతోపాటు చెక్‌బుక్‌లు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల యుగంలో ఏటీఎంల వాడకం ఎంతో సౌలభ్యమే. తిరుపతి నగరంలోనే 200కు పైగా ఏటీఎంలున్నాయి. అయితే అందులో 80 శాతం ఏటీఎంలు సక్రమంగా పనిచేయడం లేదు. గుర్తింపు పొందిన బ్యాంకుల ఏటీఎంలు సైతం అలంకారప్రాయంగా మిగిలిపోతున్నయనే చర్చసాగుతోంది. ఈ ఏటీఎంల కన్నా బ్యాంకులే నయమంటూ పలువురు ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో 20 వరకు ఏటీఎం నగదు డిపాజిట్ మిషన్లు ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారిందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా వరుసగా సెలవుదినాలు వచ్చి సందర్భంగా ఓ వైపు బ్యాంక్‌లు లేక...మరోవైపు ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఖాతాదారులు తిప్పులు పడుతున్నారు. ప్రధానంగా డిపాజిట్ మిషన్లు పనిచేయకపోవడంతో తంటాలు తప్పడం లేదు.
జిల్లా సమాచారం
జిల్లాలో బ్యాంకులు 521
జిల్లాలో ఏటీఎంలు 318
జిల్లాలో పనిచేయని ఏటీఎంలు 80 శాతం
ఎప్పుడూ నగదులేని ఏటీఎం 20 శాతం
సమర్థవంతంగా పనిచేయలేదు
ఏటీఎంలు సమర్థవంతంగా పనిచేయడం లేదు. ఒక రోజు పనిచేస్తే నాలుగు రోజులు పనిచేయడం లేదు. పనిచేసేనా నగ దు ఉండడం లేదు. ఒక్కొక్కసా రి నగదు కోసం పది ఏటీఎంలకు తిరిగిన సందర్భాలున్నాయి. అయినా ప్రయోజనం ఉండడం లేదు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎంలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఖాతాదారుల కష్టాలను గుర్తించాల్సి ఉంది.
– నరేంద్రయాదవ్, బ్యాంక్ ఖాతాదారుడు, రేణిగుంట
గూడూరులోనూ అలంకారప్రాయమే
గూడూరులోనూ ఏటీఎంలు అ లంకారప్రాయంగానే మారా యి. నగదు ఉండడం లేదు. ఓ ప్లానింగ్ ప్రకారం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగదును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే కొందరు పట్టించుకోవడం లేదు. ఖా తాదారులను అవసరాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. బ్యాంక్ వద్దకు వెళ్లి నగదు డ్రా చేస్తున్నారు. డిపాజిట్ చేయాలన్నా బ్యాంక్‌కు వెళ్లుతున్నారు.
–హేమంత్ కుమార్, బ్యాంక్ ఖాతాదారుడు, గూడూరు
ఎక్కడికెళ్లినా నోక్యాష్
ఏ ఏటీఎంకు వెళ్లినా నోక్యాస్ బోర్డులు పెట్టి ఉన్నారు. తిరుపతిలో మంగళవారం పలు ఏటీఎంలకు వెళ్లాం. అయితే పలు ఏటీఎంలు పనిచేయడం లేదు. కొన్ని ఏటీఎంలు నగదు లేదు. దీంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. కనీసం తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఏటీఎంల్లోనూ నగదు ఉండడం లేదు. – జనార్థన్‌రెడ్డి,
బ్యాంక్ ఖాతాదాడురు, తిరుపతి

● అలంకారప్రాయంగా 80 శాతం ఏటీఎంలు ● డిపాజిట్ మిషన్లూ పన

● అలంకారప్రాయంగా 80 శాతం ఏటీఎంలు ● డిపాజిట్ మిషన్లూ పన

● అలంకారప్రాయంగా 80 శాతం ఏటీఎంలు ● డిపాజిట్ మిషన్లూ పన

● అలంకారప్రాయంగా 80 శాతం ఏటీఎంలు ● డిపాజిట్ మిషన్లూ పన