
● అమెరికా సుంకాలు వెనక్కి తీసుకున్నా పెరగని రొయ్య ధరలు
చిల్లకూరు: రొయ్య ధరలు రోజురోజుకీ పతనమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అమెరికా సుంకాల పేరుతో రొయ్య ధరలు తగ్గించిన దళారులు.. ఇప్పుడు సుంకాలు వెనక్కి తీసుకున్నా రొయ్య ధరలు పెరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనికితోడు విద్యుత్ బిల్లులు, మేత ఖర్చు పెరిగిపోవడం, దళారులు కుమ్మకై ్క ధరలను శాశిస్తుండడం అన్నదాతకు శాపంగా మారింది. సాగు విస్తీర్ణం సైతం సగానికి పైగా పడిపోయింది.
అమెరికా సుంకాల పేరుతో తగ్గిన ధరలు
ఇటీవల అమెరికా రొయ్యల ఎగుమతులపై సుంకాలు విధించింది. దీంతో ఒక్కసారిగా రొయ్య ధరలు పతనమయ్యాయి. ఆ తర్వాత అమెరికా వెనక్కి తగ్గడంతో యథావిధిగా ధరలు వస్తాయని ఆక్వా రైతులు ఆశించారు. కానీ ఇక్కడ ఉన్న దళారులు దీనిని ఆసరాగా తీసుకుని రోజుకు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గిచేస్తున్నారు. బయట నుంచి కొనుగోలుదారులు రాకుండా ఫీడ్ షాపుల యజమానుల నుంచి ఒత్తిడి తెస్తున్నారు. తమకే రొయ్యలు విక్రయించాలని పట్టుబడుతున్నారు. దీంతో సాగుదారులు నష్టాలను చవిచూస్తున్నారు.
జిల్లాలో సగానికి పడిపోయిన రొయ్యల సాగు
తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో మాత్రమే రొయ్యల సాగు చేపడుతున్నారు. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎక్కువగా రొయ్యలు సాగుచేస్తున్నారు. చిల్లకూరు మండలంలో కండలేరు క్రీక్ వెంబడి టైగర్, వెనామీ రొయ్యలు సాగుచేస్తున్నారు. ధరలు పతనమవుతుండడంతో రైతులు ఈ ఏడాది సాగును సగానికి తగ్గించేశారు.
భారంగా విద్యుత్ చార్జీలు
ఆక్వా జోన్‌లు ఏర్పాటు చేసి గత ప్రభుత్వం విద్యుత్ రాయితీలు ఇచ్చేలా ప్రోత్సహించింది. దీనిని కొనసాగించేలా కూటమి ప్రభుత్వం ఇంకా విద్యుత్ చార్జీలు తగ్గించేలా ఆదేశాలిచ్చింది. అయితే విద్యుత్ శాఖ మాత్రం గతంలో రాయితీ ఇచ్చిన సొమ్మును తిరిగి కట్టించుకునేలా వ్యవహరిస్తోంది. టారిఫ్‌ల పేరుతో ప్రతి బిల్లులో ట్రూ ఆఫ్ చార్జీలను వసూలు చేస్తోంది.
జిల్లా సమాచారం
వెనామీ ధరలు
కౌంట్ గత వారం ప్రస్తుతం
100 కౌంట్ రూ.245 రూ.225
90 కౌంట్ రూ.240 రూ.230
80 కౌంట్ రూ.255 రూ.240
70 కౌంట్ రూ.280 రూ.270
60 కౌంట్ రూ.300 రూ.285
50 కౌంట్ రూ.320 రూ.300
మండలం గత ఏడాది ప్రస్తుతం
ఆక్వా సాగు ఆక్వా సాగు
(ఎకరాలలో)
చిల్లకూరు 4,850 2,444
కోట 2,875 1,230
వాకాడు 1,280 280
చిట్టమూరు 3,200 2,941
సాగు కష్టంగా ఉంది
గతంలో ఆక్వా సాగుకు ప్రోత్సహం ఉండేది. నేడు రాయితీలు లేవు. ధరలు కూడా నిలకడగా లేక పోవడంతో సాగు చేయలేక పోతున్నాం. ఒక వైపు వైరస్‌లు, మరో వైపు మేత ధరలు అధికం కావడం, విద్యుత్ చార్జీల భారంతో నలిగిపోతున్నాం. అమెరికా సుంకాల పేరుతో ధరలు తగ్గించేస్తున్నారు.
– మదన్‌కుమార్‌రెడ్డి, తిక్కవరం, ఆక్వా సాగుదారుడు, చిల్లకూరు మండలం
సాగు ఆపేశా
ఆక్వా సాగు చేసుకుని ఆదాయం పొందుదామని చిట్టమూరు మండలం, పిట్టువాని పల్లి వద్ద ఏడు ఎకరాలు లీజుకు తీసుకున్నా. గత ఏడాది పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది కూడా సాగు చేద్దామంటే ధరలు నిలకడలేవు. వైరస్ తెగుళ్లు ఎక్కువ. చేసేది లేక సాగుకు పూర్తిగా దూరమైనా. చిన్న పాటి వ్యాపారం చేసుకుంటున్నా.
– పాకం చెంగయ్య, కల్లూరుపల్లిపాళెం

● అమెరికా సుంకాలు వెనక్కి తీసుకున్నా పెరగని రొయ్య ధరలు

● అమెరికా సుంకాలు వెనక్కి తీసుకున్నా పెరగని రొయ్య ధరలు