940 హెక్టార్లలో మొక్కల పెంపకం
సైదాపురం: నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 940 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూముల్లో మొక్కలు పెంచనున్నట్టు నెల్లూరు జిల్లా అటవీ అధికారి కదిరి మహబూబ్ బాషా తెలిపారు. సైదాపురం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సైదాపురం సెంట్రల్ నర్సరీని శనివారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పా టు చేసిన ఈ సెంట్రల్ నరసరీలో 16 రకాలకు చెందిన 2 లక్షల మొక్కలను పెంచి.. అందులో 50 వేల మొక్కలను పంపిణీ చేయనున్నట్టు తెలిపా రు. జిల్లాలోని ఇనుకుర్తి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, సైదాపురంలో ఉన్న నర్సరీల్లో ఈ ఏడాది 20 లక్షల మొక్కలను పెంచనున్నట్టు పేర్కొన్నా రు. ఆయన వెంట రేంజర్ మాల్యాద్రి, సెక్షన్ అధి కారి శ్రీనివాసులు, బీఓ రవిశేఖర్ పాల్గొన్నారు.
కాళంగి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం
సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని హోలీక్రాస్ స్కూల్ వెనుక భాగాన ఉన్న కాళంగి నదిలో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన గుర్తుతెలియని మహిళ శవం శనివారం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ బ్రహ్మనాయుడు మృతదేహాన్ని బయటకు తీశారు. ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. గంధం కలర్ చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉంది. మన్నారుపోలూరు వీఆర్వో పీ.మాధవయ్య నుంచి రిపోర్టు తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


