కొనుగోళ్లు సరే.. | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు సరే..

Apr 17 2025 1:17 AM | Updated on Apr 17 2025 1:17 AM

కొనుగ

కొనుగోళ్లు సరే..

టోల్‌గేట్‌లో ఆకస్మిక తనిఖీలు
అలిపిరి టోల్‌గేట్‌లో జిల్లా ఎస్పీ, టీటీడీ ఇన్‌చార్జ్‌ సీవీఎస్వో హర్షవర్ధన్‌రాజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
రుయాలో అరుదైన శస్త్రచికిత్స
వెన్నెముక విరిగి బాధ పడుతున్న రోగికి తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.
గంగ జాతర వేడుకగా నిర్వహిద్దాం
ఇదేం నాటకం నానీ గారు..!
● టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమ్మంటారు.. మీరేమో అడ్డుకుంటారు ● తప్పు జరిగిందనా..? జరిగిన తప్పును కప్పిపుచ్చడానికా..? ● అసలు తిరుపతి గోశాల వద్ద రేపు ఏం జరగబోతోంది..?

గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

8లో

ఆరుగాలం చమటోడ్చి పంట పండించిన అన్నదాతలను ధాన్యలక్ష్మి కరుణించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మద్దతు ధరకు విక్రయించి, అప్పులు తీర్చుకుందామని ఈ కేంద్రాలకు వస్తున్న కర్షకులకు నిరాశే ఎదురవుతోంది. తరుగులు పేరుతో దోపిడీ ఒక ఎత్తైతే.. నగదు రావడం గగనంగా మారింది. ఇదే అదునుగా ధాన్యపు రాశులపై దళారులు వాలేస్తున్నారు. ధాన్యం కళ్లాలను దాటనీయకుండా సన్న, చిన్నకారుల రైతులను దోచేస్తున్నారు.

లారీలో లోడ్‌ చేస్తున్న ధాన్యం (ఫైల్‌)

గిట్టుబాటు ధర లేదు

రైతులను అదుకుంటామని చెప్పి నడ్డి విరిచేస్తున్నారు. ధాన్యం అమ్ముకుందామంటే దళారులు, మిల్లర్లు మోసం చేస్తారు.ఽ ధాన్యం కోనుగోలు కేంద్రాల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోంది. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు జమ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా పెట్టుబడి సాయం ఇవ్వకపోగా అరుగాలం పండించిన ధాన్యానికి కూడా ధరలు లేకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

– మందా దేవేంద్రరెడ్డి, సుగ్గుపల్లి

చేతికందేదీ సున్నా

ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌ రూ. 2320, బీ గ్రేడ్‌ ధాన్యం రూ. 2300 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఏ గ్రేడ్‌ ధాన్యం బస్తాకు 79 నుంచి 82 కిలోలు వరకు తడి, చెత్తా చెదారం పేరుతో లాక్కుంటున్నారు. ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. బ్యాంక్‌ ఖాతాల్లో ఆధార్‌ లింక్‌ లాంటి సాంకేతిక పరమైన కారణాలతో కాలయాపన చేస్తున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. అక్కడ ఇచ్చిన గిట్టుబాటు ధర ఇక్కడ వడ్డీలకు సరిపోతుంది. చేతికి అందేది మాత్రం సున్నానే.

– సీ సుధాకర్‌, సీపీఐ నాయకులు, తడకండ్రిగ

90 శాతం మందికి పేమెంట్‌ చేశాం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటికే 90 శాతం పేమెంట్లు ఇచ్చేశాం. మరో వారం పదిరోజుల్లోనే మిగిలిన 10 శాతం పేమెంట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్లు ఇచ్చాం. – సుమతి,

జిల్లా సివిల్‌ సఫ్లయిస్‌ మేనేజర్‌, తిరుపతి

డిజిటల్‌ సేవలపై

అవగాహన కల్పించండి

తిరుపతి అర్బన్‌: బ్యాంక్‌ డిజిటల్‌ సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నాబార్డు రుణప్రణాళిక పోస్టర్‌ను కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌, జేసీ శుభం బన్సల్‌తో కలిసి బ్యాంక్‌ అధికారులు ఆవిష్కరించారు. రూ.18,032 కోట్లతో నాబార్డు రుణ ప్రణాళికలను శాఖల వారీగా కేటాయింపుల ను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రిజర్వు బ్యాంకు సూచనల మేరకు డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు విస్తృతం చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డిజిటల్‌ లావాదేవీల్లో పిన్‌, పాస్‌వర్డ్‌, సీవీవీ విషయంలో గోప్యత పాటించాలని స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌ యాప్‌ లు, మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంక్‌, డిజిటల్‌ సేవలపై అన్నీ బ్యాంకుల ఆధ్వర్యంలో అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నాబా ర్డు జిల్లా మేనేజర్‌ సునీల్‌, ఎల్డీఎం విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్జిల బదిలీ

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న ఎస్‌పిడి.వెన్నెలను గుంటూరు జిల్లా రేపల్లెకు, ఈమె స్థానంలో పీలేరులో పనిచేస్తున్న కె.రవిను చిత్తూరుకు బదిలీ చేశారు. మదనపల్లె ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న డి.వెంకటేశ్వర్లును అనంతపురం జిల్లా హిందూపురానికి , ఈయన స్థానంలో కృష్ణా జిల్లా గన్నవరంలో పనిచేస్తున్న కె.జయలక్ష్మిను నియ మిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

డ్రోన్లను సద్వినియోగం చేసుకోండి

తిరుపతి అర్బన్‌: రైతులకు అందిస్తున్న డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్‌రావు వెల్లడించారు. బుధవా రం తిరుపతి రూరల్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో డ్రోన్లకు చెందిన కిసాన్‌ డ్రోన్‌ ఫామ్‌ మిషనరి బ్యాంక్‌ గ్రూపుల కన్వీనర్‌, కో కన్వీనర్లకు వాడకంపై అవగాహన కల్పించారు. జిల్లాకు 36 డ్రోన్‌లు మంజూరైన నేపథ్యంలో వాటిని త్వరలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో డ్రోన్‌ రూ.10 లక్షలు విలువ చేస్తోందని వెల్లడించారు. అందులో 80 శాతం రాయితీ ఉంటుందని స్పష్టం చేశారు. ఓ క్రమపద్ధతిలో డ్రోన్లు వాడుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఈ కార్యక్రమలలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ విశ్వనాథరెడ్డి, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఆర్‌ఏఆర్‌ఎస్‌ సుమతి, ఎస్సీ వెల్పేర్‌ జిల్లా అధికారి విక్రమకుమార్‌రెడ్డి, ఎస్టీ వెల్పేర్‌ జిల్లా అధికారి రాజ్‌సోము తదితరులు పాల్గొన్నారు.

కళ్లాల్లోనే విక్రయం

రైతులు ధాన్యాన్ని కళ్లాల్లో అరబెట్టుకుని స్టాక్‌ చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ, ధరలు తగ్గిపోతాయన్న భయంతో ఎంతోకొంత నష్టపోయినా పరవాలేదని కళ్లాల్లోనే ధాన్యం విక్రయిస్తూ, నష్టాలను మూటగట్టుకుంటున్నారు. యంటీయూ–1010, ఎన్‌ఎల్‌ఆర్‌–145, ఆర్‌ఎన్‌ఆర్‌ఎం–7, ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, బీపీటీ–5240, ఎన్‌ఎల్‌ఆర్‌–33358, ఎన్‌ఎల్‌ఆర్‌ 33057 రకాల ధాన్యం గ్రేడ్‌–ఏ రకంగా గుర్తించి క్వింటాల్‌ రూ.2,320 మద్దతు ధరను అధికారులు ప్రకటించారు. అలాగే యంటీయూ–1001, సీఆర్‌–1009, ఎన్‌ఎల్‌ఆర్‌–34242, ఏడీటీ–37, ఎన్‌ఎల్‌ఆర్‌–286000 రకాలను సాధారణ రకంగా గుర్తించి క్వింటాల్‌ రూ.2,300 మద్దతు ధర ప్రకటించారు. నెమ్ము కింద ఒక కిలో, గోనెసంచె కింద మరో కిలో, తరుగుల కింద మరో రెండు కిలోలు తీసేసి, బస్తాకి 79 కేజీలు ధాన్యం తీసుకుంటామని కొనుగోలు కేంద్రాల్లో చెప్పడంతో అదేదో మిల్లర్లకే ఇచ్చేస్తే అక్కడికక్కడే డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో సన్న, చిన్న కారు రైతులు కళ్లాల్లోనే ధాన్యం అమ్మేశారు. పెద్ద రైతులు సొంత గోదాములు తమ ధాన్యం నిల్వ చేసుకున్నారు. మరికొంతమంది రైతులు ఏఎంసీ గోదాముల్లో అద్దె చెల్లించి ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 34,300 మెట్రిక్‌ టన్నులు ధాన్యం గోదామ్‌ల్లో పూర్తిస్తాయిలో నిల్వ చేసుకున్నారు.

సూళ్లూరుపేట: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు నామామాత్రంగా మారాయి. కర్షకులు పండించిన ధాన్యం కొండంత కాగా ఈ కేంద్రాల్లో కొనుగోలు చేసింది గోరంత మాత్రమే. గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి, రైతులకు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు నగదు ఇవ్వకపోగా ఈ ఏడాది జనవరి చివరి వారం నుంచి వరి కోతల సీజన్‌ ప్రారంభమైనప్పటికీ మార్చి మొదటి వారం వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేసిన ధాఖలాల్లేవు. దీంతో మిల్లర్లు దళారులను రైతుల వద్దకు పంపి, తక్కువ ధరలకు ధాన్యం కోనుగోలు చేస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

అందని ధాన్యం నగదు?

పలువురు రైతులకు ఇంకా గత ఏడాది విక్రయించిన ధాన్యానికి సంబంధించి నగదు అందలేదు. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో 16 మార్కెటింగ్‌ కమిటీల పరిధిలో 213 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 774 పంచాయతీల్లో ఈ ఏడాది జిల్లాలో 2.07 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఎకరానికి సరాసరిన 30 బస్తాల దిగుబడిని వచ్చినా 4.90 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. అయితే మండలానికి రెండు వేల నుంచి 2,500 టన్నుల ధాన్యం మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేశారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లోని 7,384 మంది రైతుల నుంచి 78 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంఽధించి రైతుల నుంచి రూ.152 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 6,368 మంది రైతులకు రూ.120.52 కోట్లు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. మరో 634 మంది రైతులకు రూ.12.76 కోట్లు బిల్లులు ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా 832 మంది రైతులకు రూ.18.72 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన మొత్తం విడుదల వారీగా జమ చేస్తున్నారు. ఇందులో చాలామంది రైతులకు బ్యాంకుల్లో జీరో ఖాతాలు అయినందున వాటి పరిమితి రూ.2 లక్షల వరకే ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం విక్రయించిన రైతులు బ్యాంక్‌ ఖాతాలు తెరవడంలో ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని వివరాలు సక్రమంగా ఉంటే నగదు జమ అవుతోందని, బ్యాంక్‌ ఖాతాల్లో ఏవైనా సాంకేతిక పరమైన సమస్యలున్న వారికి ఇంకా డబ్బులు పడలేదని వ్యవసాయాఽధికారులు చెబుతున్నారు.

కళ్లాల్లోనే ఆరబెట్టిన ధాన్యం(ఫైల్‌)

తిరుపతి అర్బన్‌: తాతయ్యగుంట గంగమ్మ జాతరను వేడుకగా నిర్వహిద్దామని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం తిరుపతి కమిషనర్‌ నారపురెడ్డి మౌర్య, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలసి అధికారులతో సమావేశం అయ్యా రు. మాట్లాడుతూ తిరుపతి గంగమ్మజాతర రాష్ట్ర పండుగ అయిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించడానికి అధికారులు అంతా సమష్టిగా ఓ ప్రణాళికాబద్దంగా పనిచేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మే 6 నుంచి 14వ తేదీ వరకు జాతర జరుగుతుందని చెప్పారు. భకు లు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో తాగునీటి వసతి, క్యూలైన్‌ నియంత్రణ, కంట్రోల్‌ రూం ఏర్పాటు, పా ర్కింగ్‌, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ, పోలీస్‌ బందోబస్తు, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు, అంబులెన్స్‌లు, విద్యుత్తు సరఫరా, ఫైర్‌ సే ఫ్టీ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం కార్పొరేషన్‌ కమిషనర్‌ నారపురెడ్డి మౌర్య మా ట్లాడుతూ ఇప్పటి నుంచే పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. అడిషనల్‌ ఎస్పీ లా అండ్‌ ఆర్డర్‌ రవిమనోహరాచారి, ఆర్డీఓ రామమోహన్‌,గంగమ్మ ఆలయ ఈఓ జయకుమార్‌, జిల్లా దేవాదాయశాఖ అధికారి వెంకటకృష్ణారెడ్డి, అగ్నిమాపక అధికారి రమణయ్య, సెట్విన్‌ సీఈఓ వె ూహన్‌కుమార్‌, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ యువ అన్వే ష్‌, ట్రాన్స్‌కో ఈఈ చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

నిబంధనల మేరకే ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ

ప్రభుత్వ భూములైనప్పటికీ జీఓ నంబర్‌ 30 ప్రకా రం పేదల ఆధీనంలో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ నిబంధనల మేరకే చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన జేసీ శుభం బన్సల్‌తో కలసి ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మాట్లాడారు. జీఓ నంబర్‌ 30 నిబంధనలు అమలు చేయాలని తహసీల్దార్లకు ఇ ప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చామని చెప్పారు. 2019 అక్టోబర్‌ 15వ తేదీకి ముందు తమ అధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలను పేదలకు అందించడానికి నామమాత్రపు ధరలు కట్టించుకుని, వారికి శాశ్వతంగా అప్పగిస్తామన్నారు. ఆమేరకు వారు ఆ స్థలాలను రిజిస్ట్రేషన్లు సైతం చేయించుకోవచ్చని చెప్పారు. రిజిస్ట్రేషన్ల చేయించుకున్న రెండేళ్ల తర్వాత ఆ స్థలాలు విక్రయించుకునే హక్కు వారికి వస్తుందన్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఓ పక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ఏమో గోశాల సందర్శనకు రండి అంటూ భూమన కరుణాకరరెడ్డికి ఛాలెంజ్‌ విసిరారు.. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన భూమన రేపు వారు కోరిన విధంగా ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాల వద్దకు వస్తానని అంగీకరించారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో.. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గోశాల వద్ద నిరసన చేపట్టడానికి పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఉదయం 9 గంటలకు గోశాల వద్దకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇదేం నాటకం నానీ గారు.. మీ అధ్యక్షుడు రమ్మంటారు..? మీరేమో అడ్డంకులు సృష్టిస్తారు..? ఇంకో పక్క తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరులతో వైఎస్సార్‌ సీపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఉదయం 8 గంటలకు తమ కార్యకర్తలను గోశాల వద్ద మోహరింపజేసి అక్కడ అడ్డుకుని రసాభాస చేయాలని పక్కా ప్లాన్‌ కూడా వేసుకున్నట్టు తెలుస్తోంది. నిజం మీ వైపు ఉంటే భయమెందుకు..? ఇన్ని కుట్రలు ఎందుకు..? కూటమి నాయకులారా చెప్పండి..? కూటమి పార్టీల కుటిల రాజకీయం చూస్తున్న ఎవరికై నా నిజం ఎవరివైపు ఉందో అర్థమైపోతుంది. మీలో నిజాయితీ ఉంటే నిజాన్ని నిర్భయంగా భూమన కరుణాకరరెడ్డితో చర్చించడానికి ఎందుకు జంకుతున్నారు? ఎందుకు గురువారం రసాబాసా చేయాలని మీ కార్యకర్తలను పోగేస్తున్నారు..? ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే అసలు గోశాలలో రేపు ఏం జరగబోతుందోనన్న భయం పోలీసులను వెంటాడుతోంది.

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

కొనుగోలు కేంద్రాలున్నా ప్రయోజనమేదన్నా..

నామమాత్రంగా ధాన్యం కొనుగోలు

రైతులకు ఇంకా అందని నగదు

దళారులు, మిల్లర్లకు ప్రయోజనం చేకూర్చిన కూటమి ప్రభుత్వం

ఇబ్బందుల్లో అన్నదాతలు

కొనుగోళ్లు సరే..1
1/9

కొనుగోళ్లు సరే..

కొనుగోళ్లు సరే..2
2/9

కొనుగోళ్లు సరే..

కొనుగోళ్లు సరే..3
3/9

కొనుగోళ్లు సరే..

కొనుగోళ్లు సరే..4
4/9

కొనుగోళ్లు సరే..

కొనుగోళ్లు సరే..5
5/9

కొనుగోళ్లు సరే..

కొనుగోళ్లు సరే..6
6/9

కొనుగోళ్లు సరే..

కొనుగోళ్లు సరే..7
7/9

కొనుగోళ్లు సరే..

కొనుగోళ్లు సరే..8
8/9

కొనుగోళ్లు సరే..

కొనుగోళ్లు సరే..9
9/9

కొనుగోళ్లు సరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement