
పంటలపై అడవి పందుల దాడి
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కాంపాళ్లెం, కరకంబట్టు, కుక్కంబాకం, బు చ్చినాయుడుకండ్రిగ, గ్రామాల్లో రైతులు సాగు చేసి న పంటలపై అడవిపందులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నాయి. అటవీ సరిహద్దు గ్రామాల్లో 565 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో అడవి పందులు రాత్రి వేళల్లో పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో పందులు నాశనం చేయటంతో రైతులు దిక్కుతోచక నానా అవస్థలు పడుతున్నారు.
కిలాడీ లేడీది కలువాయి మండలమే!
కలువాయి(సైదాపురం): ఉద్యోగం కావాలనా నా యనా... అయితే ఎస్బీఐలోనే ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.లక్షల్లో నగ దు తీసుకుని ఒక పోలీసు అధికారి సహకారంతో నెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్‌లో దందా సాగిస్తున్న ఓ కిలాడీ లేడీది శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, కలువాయి మండలంలోని చౌటపల్లిగా పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, కలువా యి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన బత్తుల రజిత (రమ్య) మాదాపూర్ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు అందరినీ నమ్మించింది. స్నేహితుల సహకారంతో ఉద్యోగాలు ఇప్పిస్తా నంటూ నమ్మబలికేది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు నెల్లూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌కు వెళ్లింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న శ్రీదేవి అనే మహిళతో పరిచయం పెంచుకుని, నీకు ఎస్బీఐలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఆమె నుంచి తన తండ్రి వెంకటేశ్వర్లు ఖాతాల్లోకి పలు దఫాలుగా రూ.9.6 లక్షల నగదును వేయించుకుంది. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత 2022లో నకిలీ ఎస్బీఐ అపాయింట్‌మెంట్ లెటర్‌ను, నకిలీ ఐడీ కార్డును ఇచ్చి హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని మాయమాటలు చెప్పింది. అయితే నెలలు గడుస్తున్నా శ్రీదేవికి ఉద్యోగం రాకపోవడంతో గొడవ పడింది. దీంతో రజిత రూ.70 వేలు నగదును శ్రీదేవికి అందజేసింది. మిగిలిన నగదు ఇవ్వాలని అడగగా శ్రీదేవిపై దౌర్జన్యానికి దిగింది. దీంతో ఆమె నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రజిత, ఆమె తండ్రి వెంకటేశ్వర్లుపై కేసు నమోదైంది.

పంటలపై అడవి పందుల దాడి