
తుస్సుమంటున్న పోషణ్ వాటిక
పథకం సరే...పర్యవేక్షణ కరువు
తిరుపతి అర్బన్: కేంద్ర సర్కార్ పోషణ్ వా టిక పథకం తుస్సుమంటోంది. ఈ పథకం ద్వారా ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ.10 వేలు కేటాయించారు. ఆ నిధులతో అంగన్‌వాడీ పాఠశాల ప్రాంగణంలో ప్రకృతి సేద్యం ద్వారా ఆకుకూరలు, పలు కూరగాయలు సాగు చేసి, వాటిని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, పిల్లల కు అందిస్తున్న ఆహారంలో వినియోగించా లని సూచించారు. జిల్లాలో 2,492 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అందులో గర్భిణు లు 12,788 మంది, బాలింతలు 11,007 మంది, ఆరునెలలు లోపు పిల్లలు 9,627 మంది, 6 నెలలపైన 3 ఏళ్ల లోపు 65,433 మంది, 3–6 ఏళ్ల లోపు పిల్లలు 47,814 మంది ఉన్నారు. అయితే 2,492 అంగన్‌వా డీ కేంద్రాల ప్రాంగణంలో ఖాళీ స్థలంతో పాటు నీటి సౌకర్యం కేవలం 475 కేంద్రాలను మాత్రమే పోషణ్ వాటిక పథకానికి ఎంపిక చేశారు. ఆ మేరకు మూడు నెలల క్రి తమే ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు వంతున 475 కేంద్రాలకు రూ.47.50 లక్షలు కేటాయించారు. ఆ నిధులతో అంగన్‌వాడీ వర్కర్లు కూరగాయల విత్తనాలు కొనుగో లు చేసి, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ ఎరువుల ద్వారా సాగు చేసి, కూరగాయలు పండించాల్సి ఉంది. అయితే నిధుల కేటాయింపుతో అధికారులు చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో నే పథకం ప్రారంభంలోనే తుస్సుమందని చర్చించుకుంటున్నారు. అధికారులు పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలువురు భావిస్తున్నారు.
పర్యవేక్షిస్తున్నాం
జిల్లాలో పోషణ వాటిక పథకంపై పర్యవేక్షిస్తున్నాం. కొందరు కూరగాయులు పండిస్తున్నారు. కొన్నిచోట్ల నీటి ఇబ్బందులతో సమస్యలున్నాయి. వాటిని అధిగమించి చక్కగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించేలా ఆదేశాలు ఇస్తాం. ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.
–వంసత బాయి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్

తుస్సుమంటున్న పోషణ్ వాటిక