
ముక్కంటి సేవలో సినీనటి సమంత
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శనివారం ప్రముఖ సినీ నటి సమంత దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు దక్షి ణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తదనంతరం ఆమె ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. తాను నిర్మాతగా మారి తీసిన శుభం సినిమా విజయవంతం కావాలని స్వామి, అమ్మవార్లను ప్రార్థించినట్టు తెలిపారు.