
మార్క్‌శంకర్ త్వరగా కోలుకోవాలి
తిరుపతి మంగళం: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో ప్రమాదానికి గురికావడం బాధాకరమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందన్నారు. శ్రీ కలియుగ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మార్క్‌శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గ్రీవెన్స్‌కు ప్రాధాన్యం
తిరుపతి అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పరిధిలో పెండింగ్‌లోని అర్జీలకు పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చేపట్టాల్సిన అంశాలను వివరించారు. వేసవిలో లక్ష మందికి కూలి పనులు కల్పించాలని చెప్పారు. డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
పింఛన్ సొమ్ము అందజేత
సత్యవేడు: స్థానిక పంచాయతీలోని 1వ సచివాలయం వీఆర్‌ఓ చిట్టిబాబు రూ. 63 వేల పింఛన్ సొమ్మును సత్యవేడు సెక్రటరీ మునిరవికుమార్‌కు మంగళవారం అందజేశారు. ఏప్రిల్‌కు సంబంధించి 64 మందికి పింఛన్లను వీఆర్వో పంపిణీ చేయాల్సి ఉండగా అందులో 48 మందికే అందజేశారు. మిగిలిన 16 మందికి సంబంధించిన పింఛన్ డబ్బు రూ.63 వేలు తన వద్దనే ఉంచుకున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో వైద్యశాలలో ఉండడంతో కార్యాలయానికి రాలేకపోయానని, అధికారులకు అందుబాటులో లేనని వివరణ ఇచ్చారు.
15న శ్రీకాళహస్తిలో
మెగా జాబ్‌మేళా
● 30 బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు
● పోస్టర్ల ఆవిష్కరణలో కలెక్టర్ వెల్లడి
తిరుపతి అర్బన్: ఈ నెల 15న శ్రీకాళహస్తిలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, విజయశ్రీతోపాటు నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు లోకనాధం,గణేష్‌తో కలసి జాబ్‌మేళా పోస్టర్లను తన కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మెగా జాబ్‌మేళాకు 30 బహుళజాతి కంపెనీలు హాజరు కానున్నాయని, 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. 5వ తరగతి నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వారందరూ అర్హులేనని, దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 13లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అదనపు సమాచారం కోసం 7989509540, 8919889609 (వినయ్) సెల్ నంబర్లను సంప్రదించాలని నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలియజేశారు. తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు హైదరాబాద్, చైన్నె తదితరప్రాంతాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయని, విద్యార్హతలను బట్టి వేతనం ఉంటుందని తెలియజేశారు.

మార్క్‌శంకర్ త్వరగా కోలుకోవాలి

మార్క్‌శంకర్ త్వరగా కోలుకోవాలి