
పారంపర్య వైద్యానికి పెద్దపీట
తిరుపతి మంగళం : వంశపారంపర్యంగా చేస్తున్న వై ద్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహ కారం అందిస్తోందని ఏపీ ఔషధ, సుగుంధ మొక్కల బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి కపిలతీర్థంలోని ప్రధాన ఆటవీశాఖ కార్యాలయంలో మంగళవారం తిరుపతి సర్కిల్ సీఎఫ్ సి.సెల్వంతో కలిసి ఆయన వైద్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఔషధ మొక్కలను ఆధారంగా చేసుకుని వైద్య విధానం కొనసాగుతోందన్నారు. అద్భుతమైన ఫలితాలనిచ్చే మందులు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే అలాంటి ప్రకృతి వైద్యం చేసేవారికి, చేసే వైద్యానికి ఎలాంటి గుర్తింపు లేదని, దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. అలాంటి వైద్యులకు చేయూతనిస్తామని చెప్పారు. ఎస్వీయూ బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జే.కామాక్షమ్మ, రేజర్లు ప్రభాకర్, పారంపర్య వైద్యులు పాల్గొన్నారు.