మహిళా వర్సిటీలో ఏడు పరిశోధనలకు ఆమోదం
తిరుపతి సిటీ: అంతర్జాతీయ విద్యా పరిశోధన నిధి ద్వారా ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్(పీఎం ఉష) పథకం కింద ఏడు అంతర్జాతీయ విద్యా పరిశోధన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. ఇందులో ప్రధానంగా యూఎస్‌ఏ జెనోమిక్స్ బయోటెక్ ఇంక్ వర్సిటీ, మలేషియాలోని టెరెంగాను, యూనివర్సిటీ అటున్ హుస్సేన్ ఓన్, అలాగే యూఎస్‌లోని టెక్సెస్ ఫోర్ట్ వర్త్ వర్సిటీ, కెనడాలోని యార్క్ విశ్వవిద్యాలయం, నేపాల్‌లోని ఖాట్మండు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో బయోటెక్నాలజీ, అఫ్‌లైడ్ మైక్రోబయాలజీ, హోమ్ సైన్‌న్స్, ఫార్మసీ, కంప్యూటర్ సైనన్స్ ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, లా విభాగాల్లో పరిశోధన ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. ఈ నిధులను మ్యాచింగ్ గ్రాంట్ కింద అధ్యాపకులకు అందిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాజెక్టుల సాధనలో కృషి చేసిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రజిని, డీన్ ప్రొఫెసర్ పి విజయలక్ష్మి, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఆర్ ఉషా పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 57,462 మంది స్వామివారిని దర్శించుకోగా 22,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.


