వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన

Apr 17 2025 1:17 AM | Updated on Apr 17 2025 7:34 PM

తిరుపతి అర్బన్‌: వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజలకు విసృత్తంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌తోపాటు జేసీ శుభం బన్సల్‌, జిల్లా జీఎస్‌డబ్ల్యూఎస్‌ అధికారి జీవీ నారాయణరెడ్డి, డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ పీవీ జగదీశ్‌తో కలిసి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాట్సాప్‌ గవర్నెన్స్‌ వినిగించుకునేలా అవగహన కల్పించాలని తెలిపారు. 

ఈ నెల 15 నుంచి ప్రతి ఇంటికి మన మిత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడి ఫోనులో 9552300009 నంబరు సేవ్‌ చేయించాలని సూచించారు. మనమిత్ర పేరిట వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రభుత్వం 210 సేవలు కల్పిసుందని, మరో వారంలో రోజుల్లో ఈ సంఖ్య 250కి పెంచుతున్నామని, పక్షం రోజుల్లో 350 సేవ లు అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దాదాపు వెయ్యి రకాల సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఆశయంగా పేర్కొన్నారు.

చట్టబద్ధమైన దత్తతను స్వాగతించండి

పిల్లల దత్తతకు సంబంధించి చట్టబద్ధతను స్వాగతించడం ద్వారా భవిష్యత్‌లోను సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంగళ, బుధవారాల్లో ఇద్దరు పిల్లల దత్తత అంశాన్ని గుర్తు చేశారు. పిల్లలు లేని తల్లిదండ్రులు cara.wcd. gov.ivలో నమోదు చేసుకోవడంతోపాటు మహిళా పోలీసు లు, అంగన్‌వాడీలు, బాలల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో దత్తత తీసుకోవడం ద్వారా చట్టబద్ధత ఉంటుందన్నారు.

హోమ్‌స్టేల మూల్యాంకనం సమర్పణ

జిల్లాలోని హోమ్‌స్టేలపై వివరణాత్మక మూల్యాంకన నివేదికను కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు సమర్పించారు. ఈ నివేదికను శ్రీవేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ తిరుపతి నుంచి ఎంబీఏ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ ఎం.నీరజ, ప్రొ ఫెసర్‌ ఎస్‌.గౌతమి తయారు చేసి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీ ప్రాంతీయ డైరెక్టర్‌ ఆర్‌.రమణప్రసాద్‌ వారితో ఉన్నారు. పర్యాటక విధానాన్ని మార్గనిర్దేశం చేయడం, సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం, హోమ్‌స్టేల ద్వారా స్థిరమైన, కమ్యూనిటీ ఆధారిత పర్యాటకాన్ని ప్రో త్సహించడం ఈ నివేదిక లక్ష్యంగా కలెక్టర్‌కు వారు వివరించారు.

వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన1
1/1

వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement