
బలవంతపు భూసేకరణ వద్దు
సత్యవేడు: బలవంతపు భూసేకరణ వద్దని, ఏపీఐఐసీ భూసేకరణకు అధికారులు వస్తే అడ్డుకొని తీరుతామని మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటిపాకం, రాళ్లకుప్పం గ్రామాల రైతులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం సత్యవేడు తహసీల్దారు రాజశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రయివేటు సంస్థ వ్యాపారం కోసం తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. 2007లో సత్యవేడు మండలంలో ఏర్పాటు చేసిన శ్రీసిటీకి నాలుగు గ్రామాల పరిధిలోని రైతులు 1000 ఎకరాలుకుపై భూనిచ్చారని, అప్పుడు సేకరించిన భూమిలో ఇంకా 200ల ఎకరాలకు పైగా ఖాళీగా ఉందన్నారు. ఆ స్థలంలో ప్రస్తుతం ఎల్‌జీ కంపెనీకి భూమిని ఇచ్చుకోవాలని సూచించారు. జీఓఎంఎస్ నెం.39ని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కే.విజయశంఖర్ రెడ్డి, కేవీ.నిరంజన్‌రెడ్డి, కే.సుశీల్‌కుమార్‌రెడ్డి, శ్రీరామచంద్రారెడ్డి, జయశంకర్, కే.ప్రతాప్‌రెడ్డి, బీబీఎస్ రెడ్డి, రఘునాథరెడ్డి, రవిరెడ్డి, కే.మురళీనాయుడు, కే.బాలాజీ, రామ్మూర్తిశెట్టి, దయాకర్ రెడ్డి, రజనీకాంత్, కేవీ. రామన్, సరవనన్, పీ.శ్రీనయ్య, జీ.మురళి పాల్గొన్నారు.