తిరుపతి క్రైమ్: నగరంలో 150 సోలార్ కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రూ.10 లక్షలతో 150 సోలార్ కెమెరాలను కొనుగోలు చేయనున్నట్టు పేర్కొన్నారు. సౌర శక్తి ద్వారా ఇవన్నీ పనిచేస్తాయని, దీని ద్వారా పర్యావరణం కూడా చాలా చక్కగా ఉంటుందన్నారు. ఇవన్నీ కూడా వైర్లెస్ కనెక్టివిటీతో పనిచేస్తాయన్నారు. మొబైల్ సిమ్ కార్డు ఆధారంగా ఇవన్నీ కూడా పనిచేస్తాయని చెప్పారు. తిరుమలలో శాంతిభద్రతల దృష్ట్యా 20 సోలార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతి, చంద్రగిరితో పాటు ముఖ్యమైన ప్రాంతాలలో వీటిని అమర్చేందుకు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ బ్లాక్ స్పాట్స్‌ను కూడా గుర్తించమన్నారు. ఏఎస్పీ రవిమనోహరాచార్య, సిబ్బంది పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవ కమిటీ నియామకం
రాపూరు: పెంచలకోనలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మే 8 నుంచి 14వ తేదీ వరకు జరిగే బ్రహోత్సవాలకు ఫెస్టివల్ కమిటీని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు అందాయి. కమిటీ సభ్యులుగా చెన్ను తిరుపాల్‌రెడ్డి, రంగినేని వెంకటరమణయ్య, పీర్ల సోమయ్య, బోట్ట హజరత్ నాయుడు, తోట కృష్ణయ్య, శ్రీశైలం భార్గవరామ్, కిన్నెర నరసింహారావు, పెమ్మసాయి సుగుణమ్మ, మోమిడి నరసింహులు, బోగులు భాస్కర్‌రెడ్డి, బోట్టల శివనాగేశ్వరావు, దాసరి భాస్కర్‌నాయుడు, ఎం.నవకృష్ణ చౌదరి, ఈ. యోగేశ్వరావును నియమించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దేవస్థానానికి ధర్మకర్తల మండలి లేకపోవడంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 102 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 102 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్‌న్‌రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
పూజల పేరుతో
ఘరానా మోసం
● 52 లక్షల మోసపోయాయని
బాధితుల ఫిర్యాదు
తిరుపతి క్రైమ్: పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించి రరూ.52 లక్షలు మోసం చేసిన ఓ బురిడీ స్వామిపై అలిపిరి పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రుయా ఆస్పత్రిలో రిటైర్డ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ వెంకటరమణకు 2022లో చైన్నెకి చెందిన మథియాలగన్ అలియాస్ మాది స్వామి అనే వ్యక్తి తిరుమలలో పూజలు చేసే అర్చకుడిగా పరిచమయ్యారు. ఈ క్రమంలో వెంకటరమణకు అనారోగ్యం, ప్రమాదాలు వంటి సమస్యలు ఉన్నాయని, రక్షణ కోసం పూజలు, హోమాలు చేయాలని నమ్మించాడు. దీంతో ఆయన మాటలు విని మోసపోయిన వెంకటరమణ రూ.52 లక్షలకుపైగా నగదు ఇచ్చాడు. అయితే పూజలు చేయకుండా పలుమార్లు శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నానని నమ్మించాడు. ఈనెల 16వ తేదీన స్వామి కోసం తన నివాసం వద్దకు వెళ్లగా అప్పటికే ఇల్లు ఖాళీ చేసి పరారైనట్టు గుర్తించారు. మోసపోయానని తెలుసుకొని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సోలార్ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
సోలార్ కెమెరాల ఏర్పాటుకు చర్యలు


