
పాతభవనం ఉన్న చోటే వనరుచి క్యాంటీన్
తిరుపతి మంగళం : పాత భవనం ఉన్నచోటే వనరుచి క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) పీవీ.చలపతిరావు తెలిపారు. పర్యావరణానికి నష్టం కలిగించేలా చెట్లను నరికి ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్నారు. తిరుపతి నగరవనంలో వనరుచి పేరుతో చెట్లను నరికివేతపై ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై రాష్ట్ర అటవీశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్ సోమవారం తిరుపతి నగరవనంలో చెట్ల నరికివేత, వనరుచి క్యాంటీన్ ఏర్పాటుపై విచారణ చేపట్టారు. అలాగే నగరవనంలో కొత్తగా నిర్మించిన వాకింగ్ ట్రాక్‌లు, పాత వాకింగ్ ట్రాక్లను పరిశీలించారు. వాకర్స్, సందర్శకులతో మాట్లా డి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరవనంలో కేఫ్ (వనరుచి) నిర్మాణం జరుపుకుంటున్న ప్రదేశం ఒకప్పుడు దివ్యారామం పార్కు కోసం నిర్మించిన భవన శిథిలాలు ఉన్నచోటుగా గుర్తించినట్టు తెలిపారు. అయితే పాతభవనం ఉన్న ప్రదేశం కంటే కొద్దిగా ఎక్కువ స్థలాన్ని సేకరించారన్నారు. వనరుచిని కూడా గతంలో పాతభవనం ఉన్న చోటే నిర్మించి ఉంటే బాగుండేదన్నారు. కానీ విస్తరణలో భాగంగా తురాయి, పచ్చతురాయి చెట్లతోపాటు ఒక రావి, చిన్న వేపచెట్లను తొలగించినట్టు గుర్తించామన్నారు. అనంతరం ఆయన జీవకోన, ఐయోట్రిమ్, ఎరచ్రందనం గోదాముల వరిధిలోని దెబ్బతిన్న ఇనుప కంచెను పరిశీలించారు. వన్యమృగాలు వస్తున్నాయన్న ఫిర్యాదుల మేరకు తగు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.