తేల్చి చెప్పేసిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

తేల్చి చెప్పేసిన అధికారులు

Published Tue, Apr 29 2025 9:49 AM | Last Updated on Tue, Apr 29 2025 9:49 AM

తేల్చ

తేల్చి చెప్పేసిన అధికారులు

● గూడూరు, పెళ్లకూరులోని 1.37,686 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఏమైందో...? ● తొలి దశలో అన్నమయ్య జిల్లా నుంచి ఏజెన్సీలతో ఇసుక పంపిణీ ● రెండో దశలో నెల్లూరు జిల్లా నుంచి ఏజెన్సీలతో.. ● మే 1 వరకు దరఖాస్తులకు ఆహ్వానం ● వెంకటగిరిలో టన్ను ధర రూ.575 ● శ్రీకాళహస్తిలో టన్ను ధర రూ.676?

ఆ ఇసుక ఏమైందో..?

స్వర్ణముఖి నదీ తీరప్రాంతానికి సంబంధించి కోట మండలంలోని గూడలి వద్ద ఒక ఇసుక పాయింట్‌, పెళ్లకూరు మండలంలోని పుల్లూ రు వద్ద రెండు ఇసుక పాయింట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ ఇసుక పాయింట్ల వద్ద 1,37,686 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ లు ఉన్నాయని కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారులు పలు సమావేశాలు నిర్వహించి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో అ ంతా ఆశగా ఎదురుచూస్తూ వచ్చారు. అయితే ఆ ఇసుకను కొందరు టీడీపీ నేతలు తవ్వి వ్యాపారం చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఇక చేసేదేమీ లేక తాజాగా రెండు రోజుల క్రితం ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో ఇసుక లేకపోవడంతో నెల్లూరు జిల్లా నుంచి ఇసుక తెప్పించుకుని మళ్లీ ఏజెన్సీలకు అప్పగించడానికి దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. వెంకటగిరిలో టన్ను రూ.575, శ్రీకాళహస్తిలో రూ.676 చొప్పున విక్రయించడానికి శ్రీకారం చుట్టారు. రెండో దిశగా ఏర్పాటు చేస్తున్న ఏజెన్సీల ఇసుక వ్యవహారం ఎంతకాలం నడుస్తుందో వేచి చూడాల్సి ఉంది.

తిరుపతి అర్బన్‌: తిరుపతి జిల్లాలో ఇసుక లేదంటూ అధికారులు 7నెలలు తర్వాత తేల్చిచెప్పేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు సెమి మెకనైజ్డ్‌ సాండ్‌ రీచ్‌ నుంచి ప్రైవేటు వ్యక్తులు ఏజెన్సీల ఆధ్వర్యంలో ఇసుకను తెప్పించుకుని వెంకటగిరి, శ్రీకాళహస్తిలో ఇసుక స్టాక్‌ యార్డులను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రెండు రోజుల క్రితం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ప్రకటించారు. ఏజెన్సీలకు చెందిన వారు నెల్లూరు నుంచి ఇసుక తెచ్చుకుని వెంకటగిరిలో టన్ను ఇసుక ధర రూ.575 చొప్పున, శ్రీకాళహస్తిలో రూ.676 చొప్పున మాత్రమే విక్రయించాలని, ఇందుకుగాను ఏజెన్సీలు మే 1వ తేదీ నాటికి సొంత భూమి లేదా లీజు భూమికి చెందిన పత్రాలతో సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను కలెక్టరేట్‌లోని మైనింగ్‌ అధికారులకు ఇవ్వాలని ప్రకటించారు. మే 2న సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను పరిశీలించి ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుకు సంబంధించి అదనపు సమాచారం కోసం జిల్లా గనులు భూగర్భశాఖ అధికారులకు చెందిన 9100688839, 9000373069 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

డిసెంబర్‌లో ఏజెన్సీలతో..అన్నమయ్య ఇసుక

సెప్టెంబర్‌ 24 తర్వాత ఇసుక కొరతతో జగనన్న లేఔట్లతోపాటు ప్రజల ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్‌ పడింది. అనంతరం మూడు నెలలు తర్వాత గత ఏడాది డిసెంబర్‌ 20న ప్రైవేటు ఏజెన్సీలు అన్నమయ్య జిల్లా నుంచి ఇసుకను తెచ్చుకుని జిల్లాలో విక్రయించుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఆ మేరకు అన్నమయ్య ఇసుకను గాజులమండ్యం, కాటన్‌మిల్‌, అవిలాల వద్ద మూడు ఇసుక స్టాక్‌ యార్డులను గత ఏడాది డిసెంబర్‌లో ఏర్పాటు చేశారు. టన్ను ఇసుక రూ.600లకు పైగా రేటు పెట్టి మూడు నెలలు పాటు విక్రయించారు. అయితే గిట్టుబాటు కాలేదంటూ మార్చి 20న దీనికి పుల్‌స్టాప్‌ పెట్టారు. ఆ తర్వాత రెండో దశలో ఇసుక పాలసీ తెస్తామని అధికారులు ప్రకటించారు.

ఇష్టారాజ్యంగా జిల్లాలో ఇసుక వ్యాపారం

జిల్లాలో స్వర్ణముఖి నది ఆధారంగానే కాకుండా వాగులు, వంకల్లో నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక వ్యాపారం సాగుతోంది. శ్రీకాళహస్తితోపాటు పలు ప్రాంతాల్లో స్వర్ణముఖి నదిని హిందువులు శ్మశాన వాటిగా వినియోగిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో తమ పెద్దలు, ఆత్మీయుల సమాధులు సైతం పెకలించి వేస్తున్నాఆరని పలువురు లబోదిబోమంటున్నారు. రోజూ జిల్లాలో టన్నుల కొద్దీ ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నా జిల్లాలో ఇసుక లేదని అధికారులు ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి.

జూలై 8న ఉచిత ఇసుక పాలసీ ఇలా..

గత ఏడాది జూలై 8న ఉచిత ఇసుక పాలసీని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం విదితమే. జిల్లాలో నాలుగుచోట్ల మాత్రమే ఇసుక స్టాక్‌ పాయింట్లు అప్పట్లో ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక పాలసీగా పేర్కొన్నప్పటికీ టన్నుల కొద్దీ ఇసుకను విక్రయించారు. వెంకటగిరి మొగళ్లగుంటలో టన్ను ఇసుక రూ.590కి, సూళ్లూరుపేట మావిళ్లపాడులో రూ.465, పిచ్చాటూరు ఏకే బేడులో రూ.200, నాగలాపురంలోని సుబ్బానాయుడు కండ్రిగ వద్ద రూ.200ల చొప్పున విక్రయించారు. అయితే సెప్టెంబర్‌ 24 వరకు మాత్ర మే అరకొరగా ఇసుకను ఇచ్చిన అధికారులు ఆ తర్వాత స్టాక్‌ లేదంటూ వాటిని మూసేశారు.

తేల్చి చెప్పేసిన అధికారులు 
1
1/1

తేల్చి చెప్పేసిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement