
తిరుమలకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు
● జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ● కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు ● ఐదుగురు మృతి ● ఘటనా స్థలిని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
కారు నుంచి బయటకు తీసిన మృతదేహాలు
సూదరం ప్రాంతం నుంచి వచ్చి తిరుమలేశుని దర్శించి పునీతమయ్యారు. ఆఽ ద్యాత్మిక వాతావరణాన్ని మనసారా ఆ శ్వాదించి పులకించిపోయారు. వెంకన్న క్షేత్రంలో గ్రూప్ ఫొటోలు తీసుకుని ము రిసిపోయారు. దేవదేవుడి కొలువులో గడిపిన మధుర క్షణాలను నెమరు వేసు కుంటూ తిరుగు ప్రయాణమయ్యారు. మరో మూడు గంటల్లో గమ్యం చేరుకోవచ్చని భావించారు. ఇంతలో మృత్యువు కంటైనర్ రూపంలో దూసుకొచ్చింది. నిర్ధాక్షిణ్యంగా ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరిని రక్తగాయాలతో ఆస్పత్రి పాలుచేసింది. ఈ విషాద ఘటన చంద్రగిరి నియోజకవర్గంలో సోమవారం తీవ్ర విషాదాన్ని నింపింది.
తిరుపతి రూరల్/ పాకాల: చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.. తమిళనాడు రాష్ట్రం, క్రిష్ణగిరి జిల్లా, హోసూరు వద్దనున్న జీఆర్‌బీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీలో ఎస్‌ఆర్ రజని, త్యాగరాజన్ పనిచేస్తున్నారు. వీరిద్దరూ మంచి మిత్రులయ్యారు. ఆ రెండు కుటుంబాలు తరచూ విహార యాత్రలు, ఆధ్యాత్మిక పర్యటనలకు వెళుతుంటాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లాలనున్నారు. ఈ క్రమంలో త్యాగరాజన్, ఎస్.ఆర్.రజని తమ కంపెనీలో పనిచేస్తున్న మరొక ఉద్యోగి కనకరాజ్ కారును ఈనెల 25వ తేదీ రాత్రి తీసుకున్నారు. ఎస్.ఆర్ రజని తన భార్య సహాన, కుమారుడు లేఖన్ గౌడ్, తల్లి గీతమ్మ, అత్త విజయలక్ష్మితో పాటు త్యాగరాజన్, అతని కుమారుడు క్రిస్‌విన్‌తో కలసి హోసూరు నుంచి బయలుదేరి శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అనంతరం ఆదివారం శ్రీవారిని దర్శించుకుని ఆ రాత్రి అక్కడే బసచేసి సోమవారం ఉదయం తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి హోసూరు వెళ్లేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. గత రెండు రోజులుగా నిరాటంకంగా కారు నడపడం, తిరుమలలో స్వామివారి దర్శనానికి గంటల తరబడి నిరీక్షించడం, ఎండ తీవ్రతకు బాగా అలసి పోవడంతో కారులో నుంచి వచ్చే ఏసీ గాలికి అందరూ నిద్రలోకి జారుకున్నారు. మరో మూడు గంటల్లో గమ్యస్థానానికి చేరుతామనగా మృత్యుదేవత కబలించింది.
మృత్యు కంటైనర్
అమ్మవారి ఆలయం నుంచి ఇంటికి బయలుదేరిన వారిని కంటైనర్ రూపంలో మృత్యువు కడతేర్చింది. అతివేగంగా కారు నడపడం వల్లనే ముందు వెళుతున్న కంటైనర్‌ను అధిగమించబోయి ఢీ కొట్టినట్టుగా పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. పట్టపగలు జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంతో వాహనాలు కొంత మేరకు స్తంభించాయి.
ఘటనా స్థలిని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, డీఎస్పీ ప్రసాద్ పరిశీలించారు. కంటైనర్ డ్రైవర్‌తో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుపతి రుయాకు చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. గీతమ్మకు రుయాలో చికిత్స అందిస్తుండగా క్రిస్‌విన్ పరిస్థితి విషమంగా ఉండడంతో స్విమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.
క్రేన్ సాయంతో కారును బయటకు తీస్తున్న పోలీసులు
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పరామర్శించారు. సీఎంఓ ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు.

తిరుమలకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

తిరుమలకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

తిరుమలకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

తిరుమలకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

తిరుమలకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు