
నేడే అవిశ్వాస తీర్మానం
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం ఉదయం 10.45 గంటలకు గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీనన్ నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్‌తోపాటు గూడూరు డీఎస్పీ గీతాకుమారి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఎలాగైనా ఈ ఎన్నికను వాయిదా వేయించాలని కూటమి నేతలు కుయుక్తులు పన్నుతుండడం విమర్శలకు తావిస్తోంది.
కౌన్సిలర్లకు విప్ జారీ
వెంకటగిరి మున్సిపాలిటీలో 25 మంది మున్సిపల్ కౌన్సిలర్లకు ఆ పార్టీ అధిష్టానం విప్ జారీచేసింది. జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి సూచనల మేరకు విప్‌జారీ చేశారు. విప్ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.
ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసేందుకు పచ్చపన్నాగం
వెంకటగిరిలో 25 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ ప్రతినిధులే