
అమ్మా..ఊపిరాడలేదు!
కారులో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది.
– 10లో
●
దమ్ముంటే గోశాలకు అనుమతించాలి
టీడీపీ అధ్యక్షుడు ఎక్కడో కూర్చొని సవాల్ విసరడం కాదని, దమ్ముంటే సవాల్‌ను స్వీకరించిన భూమన కరుణాకరెడ్డిని గోశాలకు పిలిపించుకుని నిజాలు నిగ్గుతేల్చాలి. టీటీడీ నిర్లక్ష్యం లేకుంటే మమ్మల్ని ఎందుకు గోశాలకు రానివ్వలేదు. చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్‌కళ్యాన్ కూడా టీటీడీలో జరుగుతున్న అపచారాలను ఎందుకు ప్రశ్నించడం లేదు. తప్పులను సరిదిద్దుకోకుండా తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు జగనన్నపై ఎదురుదాడులకు దిగడం సిగ్గుచేటు.
– ఆర్కే.రోజా, మాజీ మంత్రి
స్వామితోనే రాజకీయమా బాబు?
సాక్ష్యాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చేసిన రాజకీయం కార ణంగానే తిరుమలలో ఇ న్ని అపచారాలు జరగుతున్నాయి. శ్రీవారి లడ్డూ లో ఆవు, పంది కొవ్వు కలిసిందని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టిక్కాయలు వేసింది. అయినప్పటికీ చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఇప్పుడు గోశాలలో గోవులు మృతి చెందితే ఒక్క ఆవు కూడా చనిపోలేదని అబద్ధాలు చెబు తున్నారు.
– కే.నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం
వందకుపైగా గోవులు మృతి
గత పది నెలలుగా టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయి. దీనిపై టీడీపీ అధ్యక్షుడు సవాల్ విసిరి నిజాలు నిగ్గు తేల్చకుండా అడ్డుకోవడం దారుణం. ఆయన సవాల్‌ను తమ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి స్వీకరించి గోశాలకు బయలు దేరితే పోలీసులచేత అడ్డుకోవడం ఏంటి?. సవాల్‌ను ఎదుర్కొనే దమ్ములేదా?. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. తప్పిదాలను సరిదిద్దుకునే పరిస్థితి కనిపించడంలేదు. – భూమన అభినయ్‌రెడ్డి,
తిరుపతి నియోజకవర్గ సమన్వకర్త
హిందువుల మనోభావాలతో ఆటలా?
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం, టీటీడీ వ్యవహరిస్తోంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారు తప్ప వాటిని సరిదిద్దుకోవడంలేదు. గోశాలలో గోవుల మృతిపై సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్, ఈవో, స్థానిక ఎమ్మెల్యేలు వారికి తోచినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాలు మానుకుని గోశాలలో గోవుల మృతిపై నిజాలు అందరికీ తెలియజేయాలి.
– చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి,
చంద్రగిరి నియోజకవర్గ సమన్వకర్త