
వెళ్లొస్తాం!
● విదేశీ విహంగాలు తిరుగుముఖం ● సీజన్ పూర్తికావస్తుండడంతో వెలవెలబోతున్న పక్షుల రక్షిత కేంద్రం ● రూ.25 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు
వెలవెలబోతున్న పర్యావరణ కేంద్రం, (ఇన్‌సెట్) తెలుగు గంగ నీళ్లు సులువుగా చేరేలా కాలువ అభివృద్ధి, చెరువులో పక్షులకు ఆటంకం ఏర్పడకుండా గుర్రపు డెక్క చెట్లను తొలగిస్తున్న కూలీలు
దొరవారిసత్రం: నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో విదేశీ విహంగాలు ఆయా దేశాలకు తిరుగుముఖం పట్టాయి. సుమారు ఏడు నెలల పాటు సందర్శకులు, పర్యాటకులు, పక్షి ప్రేమికులతో ఆహ్లాదాన్ని పంచిన పక్షులు ఆయా దేశాలకు తమ పిల్లలతో తిరుగుప్రయాణమయ్యాయి. పర్యాటకులు, పక్షి ప్రేమికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సందడిగా ఉండాల్సిన కేంద్రం నేడు వెలవెలబోతోంది. సీజన్‌లో ఆలస్యంగా ఇక్కడకు విచ్చేసిన గూడబాతులు మాత్రమే సుమారు రెండు వందల వరకు అడుగంటిన చెరువు నీటిలో ఈదుతూ సేద తీరుతున్నాయి.
ఇక్కడే పుట్టి...ఎక్కడో పెరిగి!
విదేశీ వలస విహంగాలు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో వాటి వాటి సంతానాభివృద్ధి చేసుకునేందుకు క్రమంతప్పకుండా సీజన్(అక్టోబర్‌లో మొదలై ఏప్రిల్‌కు పూర్తి)లో వేల సంఖ్యలో విచ్చేస్తాయి. సుమారు ఏడు నెలల పాటు కేంద్రం పరిధిలోని నేరేడు, మారేడు, అత్తిగుంట చెరువుల్లోని కడప చెట్లపై బస చేస్తాయి. సమీపంలోని పులికాట్ సరస్సులో చేపలను వేటాడుతూ జీవనం సాగిస్తాయి. పిల్లలను పొదిగి పెద్దవై ఎగిరే స్థాయికి వచ్చిన తర్వాత ఆయా దేశాలకు తిరిగి వెళ్లిపోతాయి. ఈ సీజన్‌లో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, తెడ్డుముక్కుకొంగలు, నీటి కాకులు, స్వాతికొంగలు, బాతుల జాతికి చెందిన పలు రకాల పక్షుల 1,7500 వరకు విచ్చేశాయి. 2వేలకు పైగా పిల్లలను పొదిగి తిరిగి ఆయా దేశాలకు ఇప్పటికే 75శాతం వరకు వెళ్లిపోయినట్టు స్థానిక వన్యప్రాణి విభాగం అధికారులు తెలిపారు. నైజీరియా, బర్మా, ఆప్ఘనిస్తాన్, సైబీరియా తదితర దేశాల నుంచి పక్షుల కేంద్రానికి ప్రతి ఏడాదీ విచ్చేస్తున్న విషయం తెలిసిందే.
రూ.25లక్షలతో అభివృద్ధి పనులు
నేలపట్టు పక్షుల కేంద్రంలో ఇటు పర్యాటకుల సౌకర్యార్థం, అటు విహంగాల అవాసయ్యోగంగా పలు అభివృద్ధి పనులు రూ.25 లక్షలతో చేపడుతున్నట్టు స్థానిక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలయ్య తెలిపారు.

వెళ్లొస్తాం!

వెళ్లొస్తాం!

వెళ్లొస్తాం!