ఉన్నత లక్ష్య సాధనకు విద్యార్థి దశ కీలకం
తిరుపతి సిటీ: ఉన్నత లక్ష్య సాధనకు విద్యార్థి దశ కీలకమని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్య సాధనకు కృషి చేయా లని రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ జే ప్రకాష్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రిమ్స్‌లో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు వారం రోజులుగా కమ్యూనికేషన్, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌పై జరిగిన శిక్షణ శనివారం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడతూ విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అకడమిక్ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం పలు పోటీలలో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. డైరెక్టర్లు వై.కొండారెడ్డి, ఆనందరెడ్డి, విజయ్‌రెడ్డి, హెచ్‌ఓడీ మధుర, ఫౌండేషన్‌కు చెందిన గురుస్వామి, వెంకటప్రసాద్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.


