పరిశుభ్రతకు ప్రాధాన్యం
గూడూరు రూరల్: జిల్లాలో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శనివారం గూడూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అర్ధంతరంగా ఆగి పోయిన ఆర్‌ఓబీని రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు. గూడూరు చెరువు మీద ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. తెలుగు గంగ నీటిని అన్ని చెరువులకు అందించేలా మంత్రితో చర్చించి చర్యలు చేపడుతామన్నారు. అనంతరం టవర క్లాక్ వద్ద నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సబ్ కలెక్టర రాఘవేంద్ర మీన, డీఎస్పీ గీతాకుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఎవరు తవ్వుకుంటున్నారో తెలియదు
కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తెల్లరాయి, సిలికా, ఇసుక పుష్కలంగా దొరకడంతో నిధులు కూడా పుష్కలంగా ఉంటాయనుకుంటారని, అయితే ఈ ఖనిజ సందపను ఎవరు తవ్వుకుంటునారో మాత్రం తెలిదని చెప్పారు. నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్‌ను కోరారు.


