వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా
తిరుపతి మంగళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ‘పొలిటికల్ అడ్వైజర్ కమిటీ’ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించి పీఏసీ మెంబర్లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు పీఏపీ మెంబర్లుగా మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్‌కే రోజాను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులను జారీచేసింది.
14న గ్రీవెన్స్ రద్దు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో ఈనెల 14న జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రామాన్ని బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌తోపాటు డివిజన్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్లుగా నారాయణస్వామి, రోజా


