
ముగిసిన పోస్టల్ రాష్ట్ర మహా సభలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వేదికగా గత మూడు రోజులుగా జరిగిన అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్టుమెన్, ఎమ్‌టీఎస్ రాష్ట్ర శాఖ మహాసభలు మంగళవారంతో ముగిశాయి. తపాలా శాఖ ప్రయివేటీ కరణను తిప్పికొట్టడానికి రాష్ట్రంలో ఉన్న తపాలా ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. మేలో జరగనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఆ సంఘం జాతీయ కార్యదర్శి ఆర్.పి.సారంగ్ పిలుపునిచ్చారు. చివరిగా రాబోయే రెండేళ్ల కాలానికి 15 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్టుమెన్ అండ్ ఎమ్‌టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్. విద్యాసాగర్, కే.మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి 300 మంది ఉద్యోగులు డెలిగేట్‌లుగా, పరిశీలకులుగా పాల్గొన్నారు.
నేటి నుంచి ఏఐ స్కిల్స్‌పై శిక్షణ
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో 9 నుంచి 11వ తేదీ వరికు మూడు రోజులపాటు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
నాయకత్వ లక్షణాలపై అవగాహన
నెల్లూరు (పొగతోట): హర్యానా ఐఐఎంలో పంచాయతీలో సమర్థవంతమైన పాలన, నాయకత్వ నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తిరుపతి జిల్లా పెళ్లకూరు జెడ్పీటీసీ ప్రిస్కిల్లా హాజరయ్యారు. ఈ మేరకు పంచాయతీ పాలన, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు. ఈ అవకాశం కల్పించిన జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.