వెల్ఫేర్‌ అధికారుల బదిలీ | - | Sakshi
Sakshi News home page

వెల్ఫేర్‌ అధికారుల బదిలీ

Apr 9 2025 12:34 AM | Updated on Apr 9 2025 12:36 AM

తిరుపతి అర్బన్‌: బీసీ వెల్ఫేర్‌ అధికారి రాజేంద్రనాథ్‌రెడ్డిని తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ను కలిశారు. ఈయన అనంతపురం జిల్లా నుంచి తిరుపతికి విచ్చేశారు. బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి చంద్రశేఖర్‌ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి జ్యోత్స్నకు జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే మంగళవారం నూతనంగా విచ్చేసిన రాజేంద్రనాథ్‌రెడ్డి జిల్లా పగ్గాలు చేపట్టారు. అలాగే జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిగా పనిచేస్తున్న సూర్యనారాయణను విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న రాజా సోమును తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

శెట్టిపల్లి భూసమస్యకు

పరిష్కారం చూపుతాం

తిరుపతి అర్బన్‌: తిరుపతిలోని శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం చూపుతామని, మోడల్‌ టౌన్షిప్‌గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడుతామని రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, తిరుపతి కమిషనర్‌ నారపురెడ్డి మౌర్యతో కలసి ఆయన అధికారులతో శెట్టిపల్లి భూ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి సూళ్లూరుపేట, చంద్రగిరి ఎమ్మెల్యేలు విజయశ్రీ, పులివర్తి నాని, యాదవ సంఘం నేత నరసింహ యాదవ్‌, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజన్‌ 2020 తరహాలోనే విజన్‌ 2047కు సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. శ్రీ సిటీలో పలు పరిశ్రమల స్థాపనకు రెండో దఫా భూ కేటాయింపుల్లో భాగంగా 2,500 ఎకరాలు అందించనున్నట్టు వెల్లడించారు. తిరుపతిలో ఒబెరాయ్‌ హోటల్‌ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తామన్నారు. అలాగే టీడీఆర్‌ బాండ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పులికాట్‌ ముఖద్వార పూడికతీతకు రూ.100 కోట్లతో పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే లైన్‌, సాగరమాల పనులు త్వరలో పూర్తయ్యేలా చర్యలు చేపడుతామన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పశువుల షెడ్ల పరిశీలన

సత్యవేడు: మండలంలో దాసుకుప్పం పంచాయతీలో ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించిన ఐదు సిమెంట్‌ రోడ్లు, గోకులం షెడ్డును మంగళవారం డ్వామాపీడీ శ్రీనివాస ప్రసాద్‌ పరిశీలించారు. అనంతరం దాసుకుప్పం పంచాయతీలో జరిగిన ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌ తమకు బిల్లులు మంజూరు కాలేదని ఆరోపించారు. పీడీ స్పందిస్తూ త్వరలో బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. ఏపీఓ విజయభాస్కర్‌, ఉపాధి హామీ జేఈ హరి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ మనోహర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

వెల్ఫేర్‌ అధికారుల బదిలీ 
1
1/3

వెల్ఫేర్‌ అధికారుల బదిలీ

వెల్ఫేర్‌ అధికారుల బదిలీ 
2
2/3

వెల్ఫేర్‌ అధికారుల బదిలీ

వెల్ఫేర్‌ అధికారుల బదిలీ 
3
3/3

వెల్ఫేర్‌ అధికారుల బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement