శాంతిభద్రతలను కాపాడండి
పెళ్లకూరు : సంఘ విద్రోహుల నుంచి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాజిక సమతుల్యతను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన తమ పార్టీ నాయకులతో వెళ్లి పెళ్లకూరు ఎస్‌ఐ నాగరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను మార్పింగ్ చేసి బూతు పదజాలంతో దుర్భాషలాడుతూ ‘రావణ్ మహరాజ్’ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం కోసం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం, నాయకులు బాలసుబ్రమణ్యం, మోహన్, జితేంద్ర, వీరకుమార్, హరిబాబురెడ్డి, చక్రపాణి, కృష్ణయ్య, కుమారస్వామి, ప్రశాంత్, తిరుపతయ్య, అశోక్, గురవయ్య పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 62,076 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ధ్యానంపై అవగాహన
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు ధ్యాన శాస్త్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధ్యాన శాస్త్ర నిపుణులు, ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సైన్స్ టీచర్ ఫౌండర్ మాస్టర్ ప్రదీప్ విజయ్ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ధ్యానం జపం కాదు, ప్రార్థన అంతకంటే కాదని, శ్వాస శక్తి మాత్రమేనని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
శాంతిభద్రతలను కాపాడండి


